Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 11
    వైద్యమిషనైరీ సేవ

    ప్రథమ ప్రాధాన్యం గల సేవ

    తన పరిచర్య కాలంలో బోధించటంలో కన్నా రోగుల్ని స్వస్తి పర్చటంలో యేసు ఎక్కువ సమయం గడిపాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 19.ChSTel 153.1

    నిజమైన సంస్కర్తముందు వైద్య మిషనెరీ సేవ అనేకమైన ద్వారాలు తెరుస్తుంది. టెస్టిమొనీస్, సం. 7, పు. 62.ChSTel 153.2

    యధార్ధ మిషనెరీ సేవ ఆచరణాత్మక సువార్త. టెస్టిమొనీస్, సం. 8, పు. 168.ChSTel 153.3

    వైద్య మిషనెరీ సేవ సువార్తకు నాంది. వాక్య పరిచర్యలోను, వైద్య మిషనెరీ సేవలోను సువార్తను ప్రకటించి ఆచరించాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 144.ChSTel 153.4

    లోక రక్షకుడు బోధించటానికన్నా వ్యాధుల నివారణకు ఎక్కువ సమయం పెట్టాడు. లోకంలో తన ప్రతినిధులైన తన అపొస్తలులికి ఆయన చివరి ఆదేశం రోగులు స్వస్తపడేందుకు వారి పై తమ చేతులుంచటమన్నది. జబ్బుగా ఉన్నవారిని పరామర్శించిన వారిని, లేమిలో ఉన్నవారి అవసరాల్ని తీర్చిన వారిని ప్రభువు వచ్చినప్పుడు అభిందిస్తాడు. టెస్టిమొనీస్, సం. 4, పు. 225.ChSTel 153.5

    ఈ కాలానికి ఉద్దేశించిన రక్షణ సత్య సమర్పణకు, అంటే మూడోదూత వర్తమాన ప్రకటనకు, వైద్య మిషనెరీ సేవ మార్గం సుగమం చెయ్యటం దైవ సంకల్పం. ఈ సంకల్పం నెరవేరితే ఈ వర్తమానానికి అంతరాయం ఉండదు. దీని ప్రగతికి అడ్డు ఆపు ఉండదు. టెస్టిమొనీస్, సం. 6, పు. 293.ChSTel 153.6

    మొదట లేమిలో ఉన్నవారి లౌకికావసరాల్ని, శారీరకావసరాల్ని, బాధల్ని నివారించండి. అప్పుడు మీకు వారి హృదయంలోకి మార్గం ఏర్పడుతుంది. అందులో సద్గుణం, మతం అనే మంచి విత్తనాల్ని మీరు నాటవచ్చును. టెస్టిమొనీస్, సం. 4, పు. 227.ChSTel 154.1

    వ్యాధిగ్రస్తుల్ని నిరాశ నిస్పృహలకు లోనైన వారిని సందర్శించి, వారికి సేవచేసి, వెలుగు చూడటానికి, యేసుని విశ్వసించటానికి వారికి తోడ్పాటునివ్వటం కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక శక్తిని, ఎక్కువ యధార్థమైన, గాఢమైన మనోభావాన్ని ఇచ్చేది మరేది లేదు. టెస్టిమొనీస్, సం. 4, పులు. 25,76.ChSTel 154.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents