Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మొక్కలు నాటటానికి తెలివిగల వృక్షసంవర్థకులు అవసరం

    రాచమార్గాలోకి కంచెల్లోకి వెళ్లటానికి పనివారికి శిక్షణ ఇవ్వండి. మొక్కల్ని వేర్వేరు స్థలాలకి తీసుకువెళ్లి నాటటానికి అవి పెరిగేందుకు పోషణ ఇవ్వటానికి జ్ఞానం గల వృక్ష సంవర్ధకులు అవసరం. దైవ ప్రజలు తమ ప్రాంతాలు దాటి వెళ్లి సేవ చెయ్యటం వారి విధి. ఎక్కడ అవకాశం అభిస్తుందో అక్కడ స్థలం సిద్దపర్చి నూతన కేంద్రాల్ని స్థాపించటానికి పనివారిని ఏర్పాటుచెయ్యాలి. మిషనెరీ ఉత్సాహం గల పనివారిని పోగుపర్చి సువార్త వెలుగుని జ్ఞానాన్ని వెదజల్లటానికి వారిని అన్నిచోట్లకూ పంపాలి. టెస్టిమొనీస్, సం.9. పు. 118. ChSTel 214.4

    మన పెద్ద సంఘాలు, అనేకమైన వాటి సభ్యులు తులనాత్మకంగా ఏమి చెయ్యటంలేదు. వారందరూ ఒకేచోట నివసించేకన్నా సత్యం ఇంకా ప్రవేశించని స్థలాల్లోకి చెదిరి నివసిస్తే వారు మంచి సేవ చెయ్యగలుగుతారు. దగ్గర దగ్గరగా నాటిన చెట్లు పెరగవు. అవి విస్తరించటానికి చాలినంత స్థలముండేందుకు, తెగులుకి గురి అయి అణగారిపోకుండేందుకు, తోటమాలి వాటిని తిరిగి నాటుతాడు. పెద్ద సంఘాల విషయంలో కూడ ఇదే నిబంధన పనిచేస్తుంది. ఈపని జరగనందువల్ల అనేకమంది సభ్యులు ఆధ్యాత్మికంగా మరణిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు, ఉదాసీనులు అవుతున్నారు. వారిని మరో స్థలంలో నాటితే పెరగటానికి ఎక్కువ స్థలముండి వారు బలంగా పెరుగుతారు. టెస్టిమొనీస్, సం. 8, పు. 244.ChSTel 215.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents