Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్పూర్తిదాయక దృశ్యాలు

    కుటుంబాల్ని దర్శించి వారికి దైవవాక్యాన్ని తెరిచి విశదం చేస్తున్న వందలు వేల ప్రజల్ని చూశాను. పరిశుద్ధాత్మ శక్తివల్ల హృదయాలు మార్పు చెందాయి. నిజమైన మారుమనసు ప్రదర్శితమయ్యింది. టెస్టిమొనీస్, సం. 9, పు. 126. ChSTel 166.1

    ఇద్దరు బైబిలు పనివారు ఓ కుటుంబంలో కూర్చున్నారు. బైబిలు తెరిచి యేసుక్రీస్తును పాపం క్షమించే రక్షకుడుగా వారికి సమర్పించారు. విశ్వాసంతో దేవునికి ప్రార్ధించారు. పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల హృదయాలు మెత్తబడి విధేయమయ్యాయి. వారి ప్రార్ధనలు తాజాగా శక్తిమంతంగా ఉన్నాయి. వారు దైవ వాక్యాన్ని విశదపర్చుతుండగా లేఖనాల పై మృదువైన, ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశిస్తున్నట్లు నేను చూశాను. నేను నెమ్మదిగా ఇలా అన్నాను, “నాయిల్లు నిండునట్లు నీవు రాజ మార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము.” టెస్టిమొనీస్, సం. 9, పు. 35. ChSTel 166.2

    లేఖనాల్ని పఠిస్తున్నవారు, వాటి యధార్ధ భావాన్ని గ్రహించలేనివారు అనేకులున్నారు. లోకమంతటా ప్రజలు ఆకాశం వంక ఆశగా చూస్తున్నారు. వెలుగుకోసం, కృపకోసం, పరిశుద్ధాత్మకోసం కని పెడ్తున్న ఆత్మల నుంచి ప్రార్ధనలు, కన్నీరు, విచారణలు పైకి వెళ్తున్నాయి. అనేకులు పరలోకం అంచున ఉన్నారు. పరలోక ప్రవేశానికి సిద్దంగా ఉన్నారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 109.ChSTel 166.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents