Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దైవాదర్శం

    అపూర్వ వైద్య మిషనెరీ అయిన క్రీస్తు మన ఆదర్శం.... ఆయన వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చి, సువార్త ప్రకటించాడు. ఆయన సేవలో స్వస్తపర్చటం బోధించటం కలిసి ఉన్నాయి. ఇప్పుడు వాటిని విడదియ్యకూడదు. టెస్టిమోనీస్, సం. 9, పులు. 170, 171.ChSTel 154.3

    క్రీస్తు సేవకులు ఆయన ఆదర్శాన్ని అనుసరించాలి. ఆయన ఒక స్థలం నుంచి మరో స్థలానికి వెళ్లేటప్పుడు, బాధలో ఉన్నవారిని ఓదార్చి వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చాడు. అప్పుడు తన రాజ్యాన్ని గూర్చిన సత్యాల్ని వారిముందు పెట్టాడు. ఇదే ఆయన అనుచరులు చేయాల్సిన సేవ. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 233, 234. ChSTel 154.4

    ఆయన బిడ్డలమని చెప్పుకునే వారు ఆయన ఆదర్శాన్ని అనుసరించాలి. మీ తోటి మనుషుల బాధల్ని నివారించండి. అప్పుడు వారి కృతజ్ఞత అడ్డుగోడల్ని కూలగొట్టి, తమ హృదయాల్లో స్థానం సంపాదించటానికి మీకు తోడ్పడుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిగణించండి. టెస్టిమోనీస్, సం. 9, పు. 127.ChSTel 154.5

    ముఖ్యంగా వైద్య మిషనెరీలు వైద్య మిషనెరీ సేవకు మాదిరి అయిన యేసు క్రీస్తుకి తాము అనుచరులమని తమ స్వభావంలోను, మాటలోను, ప్రవర్తనలోను కనపర్చాలి. టెస్టిమొనీస్, సం. 7, పు. 127.ChSTel 154.6

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents