Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నిలకడ

    యధార్ద క్రైస్తవుడు దేవుని పనిచేస్తాడు. దానికి ప్రాతిపదిక ఉద్వేగం కాదు, నియమం. ఒకరోజు లేక ఒక నెల కాదు జీవితకాలమంతా. కౌనిసిల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 518.ChSTel 272.1

    రక్షకుడు అలు పెరగని శ్రామికుడు. పనిని ఆయన గంటల్లో కొలవలేదు. తన సమయాన్ని, తన హృదయాన్ని మానవకోటి కోసం శ్రమించటానికి ధారపోశాడు. జిత్తుమారి వైరిని తన మోసకార్యాలన్నిటిలో ఎదుర్కోటానికి పటిష్టపడేందుకు, మానవాళిని పైకిలేపి, పునరుద్దరించే తన సేవకు శక్తిని పొందేందుకు ఎన్నో రోజులు దినమంతా పనిచేసి, ఎన్నో రాత్రులు రాత్రంతా ప్రార్ధన చేశాడు. దేవుని ప్రేమించే మనిషి తన పనిని ఎనిమిది గంటల కాలచట్రంలో పరిగణించడు. అతడు అన్ని గంటలూ పని చేస్తాడు. పని విరమణ అతడికుండదు. అవకాశం కలిగినప్పుడు మేలు చేస్తాడు. అన్నిచోట్ల, అన్ని వేళల్లో, అన్ని స్థలాల్లో దేవునికి పని చెయ్యటానికి అవకాశం దొరకబుచ్చుకుంటాడు. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిమళాన్ని తీసుకువెళ్లాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 45.ChSTel 272.2

    ఓ అజాగ్రత్త కార్యం వల్ల దేవుని సేవకు నిందతెచ్చే వ్యక్తి లేక తోటి పనివారి చేతుల్ని బలహీనపర్చే వ్యక్తి సులభంగా వదలని మరకను తన ప్రవర్తన మీదికి తెచ్చుకుని, తన భావి ప్రయోజకత్వానికి తీవ్ర ప్రతిబంధకం సృష్టించకుంటాడు. ప్రోపెట్స్ అండ్ కింగ్స్, పు. 659.ChSTel 272.3

    “మి మీద నా కాడి ఎత్తికొను” డి అంటున్నాడు యేసు. కాడి సేవ సాధనం. పనిచెయ్యటానికి పశువులికి కాడి కడ్డాం. ఎడ్లు సమర్థంగా పని చెయ్యటానికి కాడి అత్యసవరం. మనం జీవించినంత కాలం సేవ చెయ్యాలని ఈ ఉదాహరణ ద్వారా క్రీస్తు మనకు బోధిస్తున్నాడు. ఆయన జత పనివారమయ్యేందుకు మనం ఆయన కాడిని ఎత్తుకోవాలి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 324.ChSTel 272.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents