Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 17
    క్రైస్తవ సహాయక సేవ

    దేవుని అడుగుజాడల్నికనుక్కోటం

    భూమిపై క్రీస్తు జీవిత దృశ్యాల్ని సందర్శించటం, ఆయన నడిచిన చోట నడవటం, ఏ సరస్సు పక్క బోధించటానికి ఆయన ఇష్టపడేవాడో దాన్ని, ఏ కొండల పై ఏ లోయల పై ఆయన దృష్టి తరచుగా పడుతుండేదో వాటిని వీక్షించటం గొప్ప భాగ్యంగా చాలామంది భావిస్తారు. అయితే యేసు అడుగు జాడల్లో నడవటానికి మనం నజరేతుకి, కపెర్నహోముకి లేక బేతనియకి వెళ్లనవసరం లేదు. ఆయన అడుగు జాడలు జబ్బుగా ఉన్నవారి మంచం పక్క, పేదల మురికి వాడల్లో, మహా నగరంలో నజనంతో కిటకిటలాడే చిన్న చిన్న వీధుల్లో, లేమిలో ఉండి ఓదార్పు అవసరమైన మానవ హృదయాలు ఎక్కడుంటే అక్కడ మనకు కనిపిస్తాయి. యేసు లోకంలో ఉన్నప్పుడు ఏ సేవ చేశాడో అది చెయ్యటం ద్వారా మనం ఆయన అడుగు జాడల్లో నడుస్తాం. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 640. ChSTel 217.1

    తన దృష్టికి వచ్చిన ప్రతీ వ్యక్తి బాధను తొలగించటానికి క్రీస్తు కృషి చేశాడు. ఇవ్వటానికి ఆయనకు డబ్బులేదు. కాని తన కన్నా ఎక్కువ ఆకలిగా ఉన్న ఇంకో వ్యక్తికిచ్చేందుకు ఆయన తరచు ఆకలితో ఉన్నాడు. ఆయన ప్రభావం తన సోదరుల ప్రభాంకన్నా ఎంతో బలీయంగా ఉందని వారు భావించేవారు. ఆయనకున్న నేర్పువారిలో ఎవరికీ లేదు. వారు పేద ప్రజలతో కఠినంగా మాట్లాడినప్పుడు, క్రీస్తు వారిని వెతుక్కుంటూ వెళ్లి వారిని తన మాటలతో ధైర్యపర్చాడు. దప్పికగా ఉన్న వారికి గిన్నెడు చల్లని నీళ్లు ఇచ్చి తన భోజనాన్ని వారికందించాడు. వారి బాధను నివారిస్తున్నప్పుడు ఆయన బోధించిన సత్యాలు తన కృపాకార్యాలతో జతపడి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు 86, 87.ChSTel 217.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents