Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సేవకు సిద్ధపాటు

    యేసు అనుచరులు ఆయన వాక్యం విషయంలో అజ్ఞానులుగా ఉండటంతో తృప్తిపడుతుంటే దేవుడు సంతోషించడు. అందరూ బైబిలు విద్యార్థులవ్వాలి. తన అనుచరుల్ని క్రీస్తు ఇలా ఆదేశించాడు: “లేఖనములయందు మికు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యముమిచ్చుచున్నవి.” పేతురు ఇలా ఉపదేశిస్తున్నాడు. “మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్దముగా” ఉండండి. టెస్టిమొనీస్, సం. 2, పులు. 633, 634.ChSTel 166.4

    చీకటిలో ఉండి తమ పాపాల్లో మరణిస్తున్న వారితో వెలుగును రక్షణను గూర్చిన మాటలు మాట్లాడేందుకు నిజంగా మారుమనసు పొందినవారు లేఖనాల్ని అవగాహన చేసుకోటంలో మరింత వివేకవంతులవ్వాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 121.ChSTel 167.1

    దేవుని హెచ్చరికను మనం ప్రజలకి అందించాలి. అందుచేత మనం బైబిలుని ఎంత శ్రద్దగా అధ్యయనం చెయ్యాలి! వెలుగును వెదజల్లటానికి ఎంత ఉత్సాహంతో పనిచెయ్యాలి! దేవుని వెలుగు పొందిన ప్రతీవ్యక్తి దాన్ని ఇతరులికి ఇవ్వటానికి ప్రయత్నించాలి. పనివారు ఇంటింటికీ వెళ్లి, ఆ ఇంటివారితో బైబిలు పఠించి, మన ప్రచురణల్ని పరిచయం చేసి, తమ ఆత్మలకు ఎంతో దీవెనకరంగా ఉన్న వెలుగును గూర్చి వారికి చెప్పాలి. గాస్ఫుల్ వర్కర్స్, పు. 353. ChSTel 167.2

    బైబిలు పనివారికి శిక్షణ పాఠశాల జరుగుతున్న కాలంలో సమతులమైన సేవ చెయ్యవచ్చు. శిక్షణ పాఠశాల కార్యక్రమానికి లేక ఆ నగర సువార్త సేవకు అనుబంధంగా బహిరంగ సువార్త సమావేశాలు జరి పేటప్పుడు, బైబిలు పనివారికి ప్రతీదినం ఉపదేశం ఇస్తూ, జరుగుతున్న బహిరంగ సువార్త సమావేశ నిర్వాహకులతో కలిసి హృదయపూర్వకంగా పనిచెయ్యగల అనుభవ శాలురైన, లోతైన ఆధ్యాత్మిక అవగాహన గల దైవ సేవకులు అనుసంధానపడి పనిచెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 111.ChSTel 167.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents