Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నిష్పాక్షికత

    మానవుల మధ్య నివసించినంత కాలం మన రక్షకుడు పేదల్లో ఒకడుగా నివసించాడు. వారి చింతలు కష్టాలు ఆయనకు అనుభవ పూర్వకంగా తెలుసు. సామాన్య కార్మికులందరినీ ఆయన ఓదార్చి ఉత్సాహపర్చాడు. ఆయన జీవితం బోధించే బోధనను సరిగా గ్రహించినవారు ఆయా తరగతుల ప్రజల మధ్య వివక్ష ఉండాలని గొప్ప వారిని పేద వారి కన్నా ఎక్కువ గౌరవించాలని భావించరు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 73.ChSTel 283.2

    అభివృద్ధికి వచ్చే సూచనలు లేనట్లు, ఆకర్షణ ఏమిలేనట్లు కనిపించే వారిని మీరు విడిచి పెట్టి వెళ్తున్నప్పుడు, క్రీస్తు ఎవరికోసం వెతుకుతున్నాడో ఆ ఆత్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తిస్తున్నారా? వారిని మీరు విడిచి పెట్టి వెళ్లే సమయంలోనే మి కనికరం వారికి ఎంతో అవసరమై ఉండవచ్చు. ఆరాధనకు జరిగే ప్రతీ సమావేశంలోను విశ్రాంతిని సమాధానాన్ని ఆశిస్తున్న ఆత్మలుంటాయి. వారు అజాగ్రత్తగా నివసిస్తున్నట్లు కనిపించవచ్చు. కాని వారు పరిశుద్దాత్మ ప్రభావానికి స్పందించని వారు కారు. వారిలో అనేకులు క్రీస్తుని రక్షకుడుగా స్వీకరించవచ్చు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 191.ChSTel 283.3

    సువార్త ఆహ్వానాన్ని ఎవరు దాన్ని అంగీకరించటం ద్వారా మనకు గౌరవం తెస్తారో వారికి పరిమితం చేసి ఎంపిక చేసుకుని ఆ కొద్ది మందికే ఇవ్వకూడదు. వర్తమానాన్ని అందరికీ ఇవ్వాలి. సత్యాన్ని అంగీకరించటానికి ఎక్కడ ఆత్మలు సిద్ధంగా ఉంటే అక్కడ వారికి బోధించటానికి క్రీస్తు సిద్ధంగా ఉంటాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 194.ChSTel 284.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents