Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నేర్పు

    తమను తాము దేవునికి పూర్తిగా సమర్పించుకునేవారు తమ ఆలోచనను, ప్రార్ధనను, నేర్పును తమ సేవలో వినియోగిస్తారు. సైన్స్ ఆఫ్ ది టైమ్స్, మే 29, 1891..ChSTel 270.3

    ఓ వ్యక్తికి నేర్పు, పరిశ్రమ, ఉత్సాహం ఉంటే అతడు ఐహికమైన వ్యాపారంలో జయం సాధిస్తాడు. అవే గుణలక్షణాలు దైవ సేవకు ప్రతిష్ఠితమైతే రెండురెట్లు సమర్థవంతమౌతాయి. ఎందుచేతనంటే దైవ శక్తి మానవ శక్తితో సంయుక్తమౌతుంది. టెస్టిమొనీస్, సం.5, పు. 276. ఆత్మల రక్షణ పరిచర్యలో నేర్పు, వివేకం అసవరం. రక్షకుడు ఎన్నడూ సత్యాన్ని అణచివెయ్యలేదు. ఆయన ఎప్పుడూ సత్యాన్ని ప్రేమతో పలికాడు. ఇతరులతో తన సంబంధాల్లో ఆయన గొప్ప నేర్పు ప్రదర్శించాడు. ఆయన ఎప్పుడూ దయగాను, ఆలోచనాపూర్వంగాను వ్యవహరించాడు. ఆయన ఎన్నడూ అసభ్యంగా మాట్లాడలేదు. కఠినమైన మాట అనవసరంగా ఎన్నడూ ఉచ్చరించలేదు. నొచ్చుకునే ఆత్మకు ఎన్నడూ నొప్పి కలిగించలేదు. మానవ బలహీనతను మందలించలేదు. ఆయన నయవంచనను, అవిశ్వాసాన్ని, దుర్మార్గతను, నిర్భయంగా ఖండించాడు. తీవ్ర మందలింపుల్ని ఉచ్చరించేటప్పుడు ఆయన స్వరం కన్నీటితో బొంగురుపోయేది. ఆయన సత్యాన్ని క్రూరపర్చలేదు. కాని మానవాళి పట్ల సున్నితమైన ప్రేమను ప్రదర్శించాడు. ఆయన దృష్టిలో ప్రతీ ఆత్మ ప్రశస్తమైనది. ఆయన చుట్టూ దైవికమైన ఠీవి ఉండేది. అయినా దేవుని కుటుంబంలోని ప్రతీ సభ్యుడి పట్ల ఆయన దయాళుత్వాన్ని మర్యాదను కనపర్చాడు. ఆయన అందరిలోను తాను రక్షించటానికి వచ్చిన ఆత్మల్ని చూశాడు. గాస్ పుల్ వర్కర్స్, పు. 117.ChSTel 270.4

    దుందుడుకుగా ప్రవర్తించే వారు, అవేశపరులూ, అయినా నమ్మకమైన కొందరు ఓ ప్రసంగం అయిన తర్వాత మన విశ్వాసానికి చెందనివారిని అకస్మాత్తుగా సంభోదించి, మనం వారికి ఏ సత్యాల్ని బోధించాలని ప్రయత్నిస్తామో వాటిని వారికి హేయం చేస్తారు. “వెలుగు సంబంధులకంటే ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు.” వ్యాపారులు రాజకీయ వ్యక్తులు మర్యాదను అధ్యయనం చేస్తారు. ప్రజల్ని తమకు ఆకర్షితులయ్యేటట్లు చేసుకోటం వారి విధానం. తమ చుట్టూ ఉన్నవారి మనసుల్ని ప్రభావితం చేసి వారిని ఆకట్టుకోటానికి తమ మాటల్లోను మర్యాదల్లోను జాగ్రత్తగా ఉంటారు. తమ ధ్యేయాన్ని సాధించటానికి తమ జ్ఞానాన్ని సమర్థతల్ని నిపుణంగా ఉపయోగిస్తారు. టెస్టిమొనీస్, సం.4, పు. 68.ChSTel 271.1

    వర్తమానాన్ని అందించాలి. అయితే అందించేటప్పుడు దాన్ని బలవంతంగా రుద్దటానికి, ఎక్కువ ఇవ్వటానికి, మనకున్న వెలుగు లేని వారిని ఖండించటానికి ప్రయత్నించకుండా జాగ్రత్తపడాలి. కథోలిక్కుల్ని కఠినంగా విమర్శించటానికి మనం తొందరపడకూడదు. మనస్సాక్షి గల క్రైస్తవులు, తమకు వచ్చిన వెలుగు ప్రకారం నడిచేవారు కథోలిక్కుల్లో చాలామంది ఉన్నారు. దేవుడు వారిపక్షంగా పనిచేస్తాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 243.ChSTel 271.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents