Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వర్తింపజేసిన ఉపమానం

    దైవ ధర్మశాస్త్రం తాలూకు రెండు గొప్ప నియమాలు దేవుని పట్ల సర్వోన్నత ప్రేమ, మన పొరుగువాడిపట్ల స్వార్థరహిత ప్రేమ అన్నవి. మొదటి నాలుగు ఆజ్ఞలూ చివరి ఆరు ఆజ్ఞలూ ఈ రెండు ఆజ్ఞల మీద ఆధారపడి ఉన్నాయి. లేదా ఈ రెండు ఆజ్ఞల నుంచి పెరిగాయి. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తూ దొంగలకు చిక్కి, దోచబడి, గాయపర్చబడి, కొరప్రాణంతో విడవబడ్డ వ్యక్తి ఉదాహరణలో తన పొరుగు వాడెవరో ధర్మశాస్త్ర ఉపదేశకుడికి క్రీస్తు విశదం చేశాడు. బాధపడుతున్న ఈ మనిషిని యాజకుడు లేవీయుడు చూశారు గాని వారి హృదయాలు అతడి అవసరాలికి స్పందించలేదు. అతణ్ని తప్పించుకుని పక్కకు చూసుకుంటూ వెళ్లిపోయారు. సమరయుడు ఆ దారిని వచ్చాడు. ఆ అపరిచితుడికి సహాయం అవసరమని చూసినప్పుడు, అతడు తన బంధువా కాడా అని తన ప్రాంతీయుడా కాదా అని ప్రశ్నించలేదు. కాని బాధలో ఉన్న ఆ మనుషుడికి చేయాల్సి ఉన్న సహాయం చెయ్యటానికి పూనుకున్నాడు. అతడి బాధ ఉపశమనానికి తాను చెయ్యగలిగిందిచేసి, అతణ్ని తన సొంత గాడిద మీద పెట్టి ఓ పూటకూళ్ల నివాసానికి తీసుకు వెళ్లి తన ఖర్చుతో అతడికి వసతి ఏర్పాటు చేశాడు.ChSTel 224.2

    దొంగల చేతజిక్కిన మనుషుడికి ఆ సమరయుడు పొరుగువాడు అన్నాడు క్రీస్తు. లేవీయుడు, యాజకుడు సంఘంలోని ఓ తరగతి ప్రజల్ని సూచిస్తున్నారు. వారు తమ సానుభూతి సహాయం ఎవరికి అవసరమో వారిపట్ల ఉదాసీనత ప్రదర్శిస్తారు. ఈ తరగతికి చెందినవారు సంఘంలో తమ స్థానం ఎంతటిదైనప్పటికీ ఆజ్ఞల్ని అతిక్రమించే ప్రజలు. క్రీస్తుకి యధార్ధమైన సహాయకుల్ని, మేలు చెయ్యటంలో ఆయన ఆదర్శాన్ని అనుకరిస్తున్న వారిని సమరయుడు సూచిస్తున్నాడు.ChSTel 225.1

    దిక్కులేని వారికి, గుడ్డి వారికి, కుంటి వారికి, బాధ అనుభవిస్తున్న వారికి, విధవరాండ్రకి, అనాధలకు, లేమి ననుభవిస్తున్న వారికి దయ కనికరాలు చూపించే వారిని ఆజ్ఞలు ఆచరించే వారిగా నిత్యజీవం పొందే వారిగా క్రీస్తు సూచిస్తున్నాడు... దిక్కులేని వారికి, గుడ్డివారికి, కుంటివారికి, వ్యాధిగ్రస్తులికి, విధవరాండ్రకు, అనాధలకు చూపిన కృపను, దయను, వారికి చేసిన మేళ్లను ఉపకారాల్ని క్రీస్తు తనకు చేసినట్లుగా పరిగణిస్తాడు. దేవుడు ఈ పనుల్ని పరలోక గ్రంథాల్లో లిఖించి వాటికి ప్రతిఫలాన్నిస్తాడు. కాగా యాజకుడు లేవీయుడు ప్రదర్శించిన ఉదాసీనతను దిక్కులేని వారి పట్ల ప్రదర్శించేవారిని గూర్చి, ఇతరుల దురదృష్టాల్ని ఆసరా చేసుకుని లాభం పొందటానికి వారి శ్రమల్ని అధికం చేసేవారిని గూర్చి ఆ గ్రంథంలో ఓ రికార్డు రాయటం జరుగుతుంది. ప్రతీ అన్యాయపు చర్యకు, మన మధ్య శ్రమలనుభవిస్తున్న వారిపట్ల ప్రదర్శితమయ్యే ప్రతీ నిర్లక్ష్యానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. టెస్టిమొనీస్, సం. 3, పులు.511-513.ChSTel 225.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents