Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    శ్రమలో త్యాగంలో అగ్రగాములు

    మన యువకుల పై మనం నమ్మకం కనపర్చాలి. అధికంగా శ్రమించి సేవ చేసిన క్రీస్తు సేవకులు, ప్రస్తుతం దేవుని కోసం తీవ్ర పోరాటం సాగించే వారిని ప్రోత్సహిస్తూ, ఆశీర్వదిస్తూ, వారికి సలహాదారులుగా ఉండాల్సి ఉండగా, శ్రమ, త్యాగం అవసరమయ్యే ప్రతి పనిలోను మన యువకులు అగ్రగాములు కావాలి. కౌన్సిల్సు టు టీచర్స్, పేరెంట్స్, అండ్ స్టూడెంట్స్, పులు. 516, 517.ChSTel 31.1

    యువకులు కావాలి. మిషనెరీ సేవా క్షేత్రాలకి దేవుడు వారిని పిలుస్తున్నాడు. తులనాత్మకంగా, చింతలు, బాధ్యతలు లేని యువకులు, పెద్ద కుటుంబ భార బాధ్యతలు వహించాల్సినవారికన్నా ఈ సేవచెయ్యటానికి ఎక్కువ అనుకూల పరిస్థితిలో ఉంటారు. చెప్పాలంటే, యువకులు నూతన శీతోష్ణస్థిలకు నూతన సమాజాలకు త్వరగా అలవాటుపడి అసౌకర్యాల్ని మెరుగుగా సహించగలగుతారు. నేర్పుతోను పట్టుదలతోను వారు ప్రజల్ని తామున్న చోటే చేరవచ్చు. కౌన్సేల్స్ టు టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, పు. 577.ChSTel 31.2

    ఇంటివద్ద సరియైన విద్యను పొందిన అనేకమంది యువకులికి సేవకు శిక్షణ నిచ్చి నూతన స్థలాల్లో నమ్మకమైన సేవద్వారా సత్య ప్రమాణాన్ని పైకెత్తటానికి ప్రోత్సహించాలి. మన వాక్యసేవకులతోను, పట్టణాలు నగరాల్లో సేవ చెయ్యటంలో అనుభవంగల పనివారితోను కలిసి పని చెయ్యటం ద్వారా వారు ఉత్తమ శిక్షణను పొందగలుగుతారు. దేవుని నడుపుదల కింద, ఎక్కువ అనుభవంగల తోటి పనివారి ప్రార్థనల మద్దతుతో పని చేస్తూ, వారు మంచి సేవ చెయ్యవచ్చు. తమ యౌవన శక్తుల్ని ఉత్తమ రీతిగా వినియోగిస్తూ, వయసులో పెద్ద వారు, అనుభవాశాలురు అయిన పనివారితో కలిసి పని చేయటం ద్వారా వారికి పరలోక దూతల సహవాసం లభిస్తుంది. దేవుని జత పనివారుగా, పాడటం. ప్రార్థన చెయ్యటం, నమ్మటం, దైర్యంగా, స్వేచ్చగా పని చెయ్యటం వారికి గొప్ప ఆధిక్యతగా ఉంటుంది. పరలోక దూతల సముఖం వారికి వారితోటి పనివారికి కలిగించే విశ్వాసం, నమ్మకం ప్రార్థించటానికి, స్తుతించటానికి, యధార్థమైన విశ్వాసానికి వారిని నడిపిస్తుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 119.ChSTel 31.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents