Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రతీ మతోద్యమంలో ప్రతికూల ప్రభావాలు

    ఇశ్రాయేలులోని యజమానులు, అధికారుల్లో ఎక్కువమంది తమ విధిని నిర్వహించటానికి వచ్చారు. కాని కొందరు తెకోనీయ యజమానులు “తమ ప్రభువు పని చేయనొప్పుకొనపోయిరి.” నమ్మకమైన పనివారు దేవుని గ్రంథంలో గౌరవనీయులుగా పేర్కోబడగా సోమరులైన సేవకుల జ్ఞాపకం సిగ్గుతో నిండి ముందు తరాల వారికి హెచ్చరికగా వస్తుంది.ChSTel 206.2

    ప్రతీ మతోద్యమంలో, అది దేవుని సేవ కాదనలేకపోయినా, దానికి దూరంగా ఉండేవారు, దాని ప్రగతికి ఎలాంటి కృషీ చెయ్యటానికి నిరాకరించేవారు, కొందరుంటారు. కాని తమ స్వార్థ ప్రయోజనాల్ని వృద్ధి పర్చే కర్యాకలాపాల్లో ఈ వ్యక్తులు చురుకుగా ఉద్రేకం ఉత్సాహంతో పని చేస్తారు. పరలోకంలో దేవుని గ్రంథంలో రికార్డు ఉంటుందని, అందులో మన ఉద్దేశాలు, మన క్రియలు దాఖలవుతాయని జ్ఞాపకముంచుకోటం మంచిది. ఆ గ్రంథంలో లోపాలు, పొరపాట్లు ఉండవు. వాటి ఆధారంగానే మనకు తీర్పు జరుగనుంది. దేవుని సేవ చెయ్యటానికి నిర్లక్ష్యం చేసిన ప్రతీ తరుణం నమ్మకంగా నివేదించబడుతుంది. ప్రతీ విశ్వాసక్రియ ప్రతీ ప్రేమా కార్యం అది ఎంత సామాన్యమైందైనా నిత్య జ్ఞాపకార్థం భద్రపర్చబడుంది. సదర్న్ వాచ్ మేన్, ఏప్రిల్ 5, 1904. ChSTel 206.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents