Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సామాన్య జీవన వృత్తుల నుంచి పిలుపు

    సామాన్య ప్రజలు పనివారుగా తమ స్థానాల్ని ఆక్రమించాలి. రక్షకుడు మానవాళి దుఃఖాల్లో పాలుపంచుకున్నలాగ సాటి మనుషుల దుఃఖాల్లో పాలు పంచుకుంటూ తమతో ఆయన పనిచేయ్యటం వారు విశ్వాసమూలంగా చూస్తారు. గాసిపుల్ వర్కర్స్, పు. 38.ChSTel 21.2

    సమీపప్రాంతాలు దూరప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో నాగలి పట్టేవారు వ్యాపారం మొదలైన వృత్తులు చేసేవారు అనుభవజ్ఞులైన సువార్త సేవకులవద్ద శిక్షణ పొందుతారు. సమసర్థంగా పనిచెయ్యటం నేర్చుకుని సత్యాన్ని శక్తితో ప్రకటిస్తారు. దైవశక్తి అద్భుత రీతిగా పనిచెయ్యటం ద్వారా పర్వతాల్లాంటి సమస్యలు తొలగిపోతాయి. లోకనివాసులికి ఎంతో అవసరమైన వర్తమానాన్ని విని ప్రజలు అవగాహన చేసుకుంటారు. ప్రజలు సత్యమేంటో తెలుసుకుంటారు. హెచ్చరిక భూమండలమంతా వినిపించే వరకు దేవుని సేవ ముందికి మరింత ముందుకి సాగుతుంది. అప్పుడు అంతం వస్తుంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 96. ChSTel 21.3

    మనుషుల పాఠశాలల్లో పెద్ద చదువులు చదవని వారిని దేవుడు ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకుంటాడుకూడా. ఆయనలోని ఈ శక్తిని సందేహించటం ఖచ్చితంగా అపనమ్మకమే. ఎవరికి ఏదీ అసాధ్యం కాదో సర్వశక్తుడైన ఆ ప్రభువుని అది పరిమితం చెయ్యటమౌతుంది. ఈ సందేహం ఈ అపనమ్మకం అనవసరం! ఇది సంఘంలోని అనేక వరాల్ని వినియోగించకుండా విడిచి పెట్టటానికి దారితీస్తుంది. పరిశుద్దాత్మ మనుషుల్ని ఉపయోగించుకునే మార్గాన్ని అది మూసివేస్తుంది. క్రీస్తు సేవా శాఖల్లో పనిచెయ్యటానికి సంసిద్ధంగాను ఆతురతగాను ఉన్నవారిని అది సోమరులుగా ఉంచుతుంది. అవకాశం ఇస్తే దేవుని జత పనివారిగా సమర్థులయ్యే అనేకులు సేవలో ప్రవేశించకుండా అది నిరుత్సాహ పర్చుతుంది. గాసిపుల్ వర్కర్స్, పు.లు 488, 489.ChSTel 22.1

    వృద్ధి గాంచటం ప్రతీ ఆత్మకూ ఉన్న హక్కు. క్రీస్తుతో సంబంధం ఉన్నవారు దైవకుమారుని కృపలోను జ్ఞానంలోను పెరిగి పరిపూర్ణ పురుషులు స్త్రీలు అవుతారు. సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పేవారందరూ తెలుసుకోటానికి ఆచరించటానికి తమకున్న సామర్థ్యాల్ని తరుణాల్ని సద్వినియోగపర్చుకుని ఉంటే, వారు క్రీస్తులో బలో పేతులయ్యేవారు. వారి వృత్తి ఏదైనా వ్యవసాయదారులు, మెకానిక్కులు, ఉపాధ్యాయులు లేక పాదుర్లు, వారెవరైనా - వారు తమను తాము దేవునికి సంపూర్తిగా అంకితం చేసుకుంటే, పరలోక ప్రభువుకి వారు సమర్థమైన పనివారవుతారు. టెస్టిమొనీస్, సం. 6, పు. 423. విద్యాబోధన, భవన నిర్మాణం, ఉత్పత్తి చేసేపని, వ్యవసాయం వంటి వృత్తులు నిర్వహించే నిపుణత ఉన్న సంఘస్థులు కమిటీల్లో సభ్యులుగా, లేక సబ్బాతు బడిలో ఉపాధ్యాయులుగా మిషనెరీలుగా సేవ చెయ్యటం ద్వారా లేక సంఘానికి సంబంధించిన ఆయా పదవులు నిర్వహించటం ద్వారా సంఘాభివృద్ధికి పాటుపడటానికి సంసిద్ధంగా ఉండాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర 15, 1887.ChSTel 22.2

    తన సేవను కొనసాగించటానికి యూదుల సెన్ హెడ్రిన్ సభ్యుల పాండిత్యాన్ని గాని వాగ్దాటినిగాని రోము శక్తినిగాని క్రీస్తు ఎంపిక చేసుకోలేదు. లోకాన్ని కదిలించనున్న సత్యాల్ని ప్రకటించటానికి స్వనీతిపరులైన యూదునాయకుల్ని పక్కన పెట్టి, ఆ అపూర్వ కార్యకర్త దీనులు పామరులు అయిన మనుషుల్ని ఎంచుకున్నాడు. ఈ మనుషుల్ని తన సంఘ నాయకులుగా తర్బీతు చెయ్యాలని ఉద్దేశించాడు. వారు తిరిగి ఇతరులికి శిక్షణనిచ్చి సువార్త వర్తమానంతో వారిని ప్రజల మద్యకు పంపాల్సి ఉంది. తమ సేవలో సఫలులయ్యేందుకు వారు పరిశుద్దాత్మ శక్తిని పొందాల్సి ఉంది. మానవ శక్తివలనగాని మానవ వివేకం వలనగాని కాక దేవుని శక్తి వలన సువార్త ప్రకటన జరగాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది ఆపాజల్స్, పు. 17. ChSTel 22.3

    “కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి.” అన్న ఆదేశం రక్షకుడు ఎవరికి ఇచ్చాడో వారిలో చాలామంది దీనులు, సామాన్యులు ప్రభువుని ప్రేమించి ఆయన స్వార్థరహిత సేవాదర్శాన్ని అనుసరించటానికి కృతనిశ్చయులైన పురుషులు స్త్రీలు. ఈ దీనులు సామాన్యులికి, రక్షకుని భూలోక సేవలో ఆయనతో ఉన్న శిష్యులికి, క్రీస్తు ద్వారా రక్షణ అన్నశుభవార్త లోకానికి అందించటమన్న ప్రశస్తమైన ట్రస్టు ఇవ్వబడింది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు 105, 106.ChSTel 23.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents