Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మితానుభవ సంస్కరణ

    మితానుభవ వాదులమని చెప్పుకునేవారందరిలోను సెవెంతుడే ఎడ్వెంటిస్టులు ముందు వరసలో ఉండాలి. గాస్పుల్ వర్కర్స్, పు. 384.ChSTel 255.2

    మితానుభవ అంశం పై ఊగిసలాడకుండా స్థిరంగా నిలబడండి. గాస్ఫుల్ వర్కర్స్, పు. 394.ChSTel 255.3

    బహిరంగంగా ప్రసంగించటం గాక మితానుభవం పరంగా మనం చెయ్యాల్సిన పని ఉంది. మన నియమాల్ని కరపత్రాల్లోను మన పత్రికల్లోను ప్రచురించాలి. సత్యం తెలియని వారిని తస్యంతో కలవటమన్న తమ విధిని నిర్వర్తించటానికి మన ప్రజల్ని మేల్కొల్పటానికి సాధ్యమైన ప్రతీసాధనాన్ని మనం ఉపయోగించుకోవాలి. మిషనెరీ సేవలో మనం సాధిస్తున్న విజయం మనం చేస్తున్న త్యాగం నిష్పత్తిలో ఉంటుంది. ఓ ప్రజగా మనం ప్రభువు ముందు దీన హృదయులమై మితానుభవ వర్తమానాన్ని స్పష్టంగా, ముక్కుసూటిగా ప్రకటించిఉంటే ఎంత ప్రగతి సాధించి ఉందుమో ప్రభువుకి మాత్రమే తెలుసు. గాస్పుల్ వర్కర్స్, పు. 385.ChSTel 255.4

    మితానుభవాంశానికి దైవ ప్రజలు నిర్ణయాత్మక మద్దతు ఇవ్వాలి. మితరాహిత్యం రాజ్యమేలుతున్నది. శరీరాశల్ని తృప్తి పర్చుకోటం ఎక్కువవుతున్నవి. ఆరోగ్య సంస్కరణను గూర్చిన ప్రచురణలు ఎంతో అవసరం. ఈ అంశం పై సాహిత్యం సువార్తకు సహాయం చేస్తుంది. ఈ సాహిత్యం ఈ సత్యాన్ని బాగా అవగాహన చేసుకోటానికి బైబిలు పరిశోధనకు ఆత్మల్ని నడిపిస్తుంది. మితిమీరిన ఆహారపానాల వల్ల కలిగే గొప్ప హాని గురించి ప్రజల్ని హెచ్చరించాలి. ఇది చెయ్యటానికి సబ్బాతును ఆచరించేవారు మన ఆరోగ్య పత్రికల్లోను ఆరోగ్య పుస్తకాల్లోను ఉన్న ఉపదేశాన్ని చదివి ఆచరణలో పెట్టాలి. వారు దీనికన్నా ఎక్కువే చెయ్యాలి. ఈ ప్రచురణల్ని తమ ఇరుగు పొరుగు వారికి అందించాలి. సదర్న్ వాచ్ మేన్, నవ. 20, 1902.ChSTel 256.1

    పూర్తి విసర్జన ప్రమాణాన్ని సమర్పించి, సారా, పొగాకు వంటి వ్యసనాల పై వ్రయమయ్యే ద్రవ్యాన్ని వ్యాధిగ్రస్తులికి, బీదలకు ఆర్ధిక సహాయం కోసం లేక లోకంలో ప్రయోజకులయ్యేందుకు పిల్లలు బాలల శిక్షణ కోసం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చెయ్యాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 211.ChSTel 256.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents