Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    27—“నీకిష్టమైతే నన్ను శుద్ధుని చేయగలవు”

    తూర్పు దేశాల్లోని వ్యాధులన్నిటిలో మిక్కిలి భయంకరమైనది కుష్టువ్యాధి. ది నివారణ లేని అంటువ్యాధి కావడం, దాని పర్యవసానాలు శరీరంపై యంకర రూపం దాల్చడం మిక్కిలి ధైర్యవంతులకు సైతం అదంటే గుండెల్లో బులుపుట్టేది. యూదులు ఆ వ్యాధిని పాప పర్యవసానంగా దేవుని తీర్పుగా రిగణించేవారు. అందుచేత దాన్ని “దెబ్బ” అని “దేవుని వేలు” అని ్యవహరించేవారు. అది మొండివ్యాధి, స్వస్తత లేని మరణాంతక వ్యాధి అవడంతో దాన్ని పాపానికి చిహ్నంగా పరిగణించడం జరిగేది. ఆచార ర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగిని అపవిత్రుడుగా పరిగణించేవారు. అప్పుడే ఎరణించిన వాడి మల్లే అతణ్ని మనుషుల నివాసాల నుంచి హిష్కరించేవారు. అతడు ఏది ముట్టుకుంటే అది అపవిత్రమనేవారు. అతడి స్వసవల్ల గాలి కలుషితమయ్యిందని భావించేవారు. ఒకడికి ఆ వ్యాధి న్నదన్న అనుమానం కలిగినప్పుడు అతడు యాజకుల వద్దకు వెళ్ళి వేదించుకోవాలి. వారు అతణ్ని పరీక్షచేసి అతడి సంగతి నిర్ధారించాల్సి ండేది. కుష్టురోగిగా తీర్మానమైతే అతణ్ని తన కుటుంబం నుంచి, శ్రాయేలు సమాజం నుంచి వేర్పాటుగా దూరంగా ఉంచేవారు. తనలా ఆ ్యధికి గురి అయిన వారితో మాత్రమే అతడు కలిసి ఉండాల్సివచ్చేది. ఈ షయంలో చట్టం కఠినంగా అమలయ్యేది. రాజులకు ఉన్నతాధికారులకు తం మినహయింపులుండేవి కావు. ఈ భయంకర వ్యాధికి ఒక రాజు రి అయితే అతడు తన రాజదండం విడిచి పెట్టి సమాజాన్ని విడిచి పెట్టి కారంగా వెళ్లిపోవాలిసిందే!DATel 272.1

    స్నేహితుల్ని బంధువుల్ని విడిచి పెట్టి కుష్టురోగి ఆ వ్యాధి తాలూకు శాపాన్ని భరించాల్సి ఉండేది. తన వ్యాధిని గురించి తానే చాటుకోడం, తన వస్త్రాలు చింపుకోడం తన అపవిత్ర సముఖం నుంచి తప్పుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ, శబ్దం చెయ్యడం కుష్టురోగి బాధ్యత. ” అపవిత్రుణ్ని అపవిత్రుణ్ని” అంటూ ఆ బహిష్కృతుడి వద్ద నుంచి వచ్చే కేక అందరిలోను భయాన్ని ద్వేషాన్ని పుట్టించే హెచ్చరిక.DATel 273.1

    క్రీస్తు సేవా పరిధిలో ఇలాంటి వ్యాధి బాధితులు చాలామంది ఉన్నారు. ఆయన పరిచర్యను గూర్చిన వార్త వారికందింది. అది వారి మనసులో నిరీక్షణను రగుల్కొలిపింది. ఈ భయంకర వ్యాధి గలవాణ్ని ఎలీషా బాగుచేసిన నాటి నుంచి మళ్లీ అలాంటి క్రియ జరిగిన దాఖలాలు లేవు. ఆయన ఎన్నడూ ఎవరికీ చేయని కార్యాన్ని తమకు చేయాలని వారు ఎదురు చూడలేదు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి హృదయంలో విశ్వాసం జనించింది. తోటి పౌరులతో సహవాసానికి నోచుకోని అతడు స్వస్తతకూర్చే ప్రభువుని కలవడం ఎలా? యేసును గూర్చి తాను విన్న సంగతుల్ని మననం చేసుకున్నాడు. సహాయం అర్ధించిన ఏ ఒక్కణ్ని ఆయన నిరాకరించలేదు. ఆ అభాగ్యుడు రక్షకుణ్ని కలవాలని నిశ్చయించుకున్నాడు. పట్టణాల నుంచి బహిష్కృతుడైనా ఏకొండ మార్గంలోనో లేదా పట్టణాల వెలపల బోధించే తరుణంలోనో ఆయన్ని కలువవచ్చునని భావించాడు. తనకు ఎదురుకానున్న కష్టాలు ఎన్నో అయినా అదే అతడి చివరి ఆశాకిరణం.DATel 273.2

    కుష్టురోగిని రక్షకుని వద్దకు నడిపించారు. యేసు సరస్సు పక్క బోధిస్తోన్నాడు. ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు. అల్లంత దూరాన నిలబడి ఆ కుషురోగి రక్షకుడు పలికిన కొన్ని మాటల్ని విన్నాడు. ఆయన వ్యాధిగ్రస్తుల పై తన చేతులుంచడం చూశాడు. అతడి విశ్వాసం బలో పేతమయ్యింది. సమావేశమై ఉన్న ఆ ప్రజలకు కొంచెం దగ్గరగా ఇంకా కొంచెం దగ్గరగా రావడం మొదలు పెట్టాడు. తనమీద ఉన్న ఆంక్షలు, ప్రజల క్షేమం తన విషయంలో ప్రజలకున్న భయాందోళనలు - వీటన్నిటినీ మర్చిపోయాడు. స్వస్తత ధన్యతను గూర్చి మాత్రమే అతడు ఆలోచిస్తోన్నాడు.DATel 273.3

    అతడు చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. వ్యాధి అతడి శరీరాన్ని తీవ్రంగా ధ్వంసం చేసింది. కుళ్లిపోతున్న అతడి శరీరం చూడడానికి భయంకరంగా ఉంది. అతణ్ని చూస్తుండగానే ప్రజలు భయంతో వెనక్కుతగ్గారు. అతణ్ని ముట్టుకోకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఒకరి మిద ఒకరు పడ్డారు. యేసు వద్దకు వెళ్లకుండా అతణ్ని నిలువరించడానికి కొందరు విఫలయత్నం చేశారు. అతడు వాళ్లవంక చూడడంలేదు వాళ్లు చెప్పింది వినిపించుకోడం లేదు. తనను అసహ్యించుకుంటూ వారంటోన్న మాటల్ని అతడు లెక్కచెయ్యడం లేదు. మరణిస్తోన్న వారికి ప్రాణం పోస్తూ ఆయన పలుకుతోన్న మాటల్నే అతడు వింటోన్నాడు. యేసు వద్దకు వెళ్లి ఆయన పాదాల మీదపడి “ప్రభువా నీ కిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు” అన్నాడు.DATel 273.4

    యేసు ఇలా బదులు పలికాడు, “నాకిష్టమే నీవు శుద్ధుడవుకమ్ము” అంటూ అతని మీద చెయ్యి వేశాడు . మత్తయి 8:3;DATel 274.1

    వెంటనే ఆ కుష్ఠురోగిలో మార్పు చోటుచేసుకుంది. అతడి శరీరంలోని మాంసం ఆరోగ్యవంతమయ్యింది. అతడి నరాలు చురుకయ్యాయి. కండరాలు దృఢమయ్యాయి. కుష్టువ్యాధిలో ఏర్పడే గరుకు చర్మం మాయమై దాని స్థానంలో చిన్న బిడ్డ శరీరంలాంటి ఆరోగ్యవంతమైన చర్మం వచ్చింది.DATel 274.2

    తనకు జరిగిన కార్యం గురించి ఎవరికీ చెప్పవద్దని అయితే ఒక అర్పణ తీసుకుని తిన్నగా దేవాలయానికి వెళ్లమని యేసు అతణ్ని ఆదేశించాడు. యాజకులు పరీక్షించి అతనికి ఆ వ్యాధి లేదని ప్రకటించే వరకు అలాంటి అర్పణను అంగీకరించడం జరిగేది కాదు. ఈ సేవ చెయ్యడానికి ఎంత అయిష్టంగా ఉన్నా పరీక్షించడం ఆ కేసుపై తీర్మానాన్ని వెలిబుచ్చడం వారికి తప్పేదికాదు.DATel 274.3

    అతడు మౌనంగా ఉండి సత్వర చర్య తీసుకోడం ఎంత అవసరమని క్రీస్తు పరిగణించాడో ఈ లేఖన వాక్కులు వ్యక్తం చేస్తోన్నాయి. “నీవు ఎవనితోను చెప్పక వెళ్లి వారికి సాక్షార్హమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను అర్పించుమని ఆజ్ఞాపించెను.” కుష్టురోగిని స్వస్తపర్చడాన్ని గురించి యాజకులకి వాస్తవాలు తెలిసి ఉన్నట్లయితే క్రీస్తు పట్ల తమకున్న విద్వేషం ఆయనపై అతిఘోరమైన తప్పును వెలువరించడానికి వారిని నడిపించేది. ఆ అద్భుతకార్యం గురించి పుకార్లు యాజకుల చెవిని పడకముందు దేవాయంలో తన్ను తాను కనపర్చుకోవాలని అతణ్ని యేసు కోరాడు. ఈ రకంగా నిష్పాక్షిక తీర్మానం పొందడానికి, స్వస్తత పొందిన కుష్ఠురోగి తన కుటుంబంతోను మిత్రులతోను మళ్లీ కలిసి ఉండడానికి మార్గం సుగమం కావాల్సి ఉంది.DATel 274.4

    అతడు మౌనంగా ఉండాలని ఆదేశించడంలో క్రీస్తుకి ఇంకో ఉద్దేశ్యం ఉంది. తన శత్రువులు తన పనిని పరిమితం చెయ్యడానికి ప్రజల్ని తనకు దూరం చెయ్యడానికి నిరంతరం కృషిచేస్తోన్నారని రక్షకునికి తెలుసు. కుష్ఠురోగి స్వస్తత పెద్దగా ప్రచారమైతే ఇతర కుష్ఠురోగులు తన చూట్టూ మూగుతారని వారి మూలంగా తక్కిన ప్రజలు కలుషితులవుతారన్న గగ్గోలు పుడుతుందని ఆయనకు తెలుసు. అనేక మంది కుష్ఠురోగులు తమకు కలిగిన ఆరోగ్యమనే వరాన్ని తమకూ ఇతరులకూ మేలుకరంగా ఉపయోగించరని ఆయనకు తెలుసు. కనుక కుష్టురోగుల్ని తనచుట్టూ చేరనియ్యడం ద్వారా ఆచారధర్మశాస్త్రం విధించిన ఆంక్షల్ని ఆయన అతిక్రమిస్తోన్నాడన్న ఆరోపణకు తావిచ్చేవాడు. ఈ రీతిగా ఆయన సువార్త ప్రకటన పరిచర్యకు అంతరాయం కలిగేది.DATel 275.1

    ఆ ఘటన క్రీస్తు హెచ్చరికను ధ్రువపర్చింది. క్రీస్తు కుష్టురోగిని స్వస్తతపర్చడాన్ని కొంతమంది చూశారు. అతడు తన స్నేహితుల వద్దకు తిరిగి వచ్చినప్పుడు వారిలో ఉత్సాహం వెల్లివిరిసింది. యేసు హెచ్చరించినప్పటికీ తన స్వస్తతను గూర్చిన సమాచారాన్ని దాచడానికి అతడు ఇక ప్రయత్నించలేదు. నిజానికి దాన్ని దాచడం అసాధ్యం. అయితే ఆ కుష్టురోగి ఆ విషయాన్ని అన్నిచోట్లా చాటి చెప్పాడు. తన నమ్రత మూలంగానే యేసు తనపై ఆ నిషేధం విధించాడని ఊహించి అతడు స్వస్తత కూర్చే ప్రభువు శక్తిని ప్రచురిస్తూ సంచరించాడు. పెద్దలు యాజకులు యేసుని నాశనం చెయ్యడానికి అలాంటి ప్రతీ ప్రదర్శన మరింత కృతనిశ్చయుల్ని చేస్తాదని అతడు గ్రహించలేదు. స్వస్తపడ్డ కుష్టురోగి ఆరోగ్యం విలువైన వరం అని గుర్తించాడు. తాను పొందిన బలం గురించి తన కుటుంబంతోను సమాజంలోను నివసించి ఆనందించే తరుణం పునరుద్దరణ గురించి ఉత్సహిస్తూ తనకు స్వస్తత కూర్చిన పరమవైద్యుణ్ని మహిమ పర్చకుండా ఊరకుండడం అసాధ్యమని భావించాడు. అయితే ఆ విషయాన్ని ప్రచారం చెయ్యడం రక్షకుని పరిచర్యకు అంతరాయంగా పరిణమించింది. దాని పర్యవసానంగా జనులు తండోపతండాలుగా వచ్చి ఆయన చుట్టూ మూగడంతో కొంతకాలం ఆయన తన పరిచర్యను ఆపాల్సివచ్చింది. .DATel 275.2

    క్రీస్తు పరిచర్యలోని ప్రతీకార్యం దాని ఉద్దేశం సందర్భంగా దీర్ఘకాలికమైంది. ఆ కార్యమే గాక దానిలో ఇంకా ఎంతో ఇమిడి ఉంది. కుష్టురోగి విషయంలో కూడా ఇది నిజం. క్రీస్తు తన వద్దకు వచ్చిన వారందరికీ పరిచర్యచేస్తుండగా తన వద్దకు రాని వారిని కూడా దీవించాలని ఆశించాడు. సుంకరుల్ని అన్యజనుల్ని సమరయుల్ని ఆకట్టుకుంటోన్నప్పుడు దురభిమానం సంప్రదాయం సంకెళ్ళలో మగ్గుతోన్న యాజకుల్ని బోధకుల్ని చేరాలని ఆయన ఎంతో ఆశించాడు. వారిని చేరగల మార్గాల్లో దేన్నీ ప్రయత్నించకుండా విడిచి పెట్టలేదు. బాగుపడ్డ కుష్టురోగిని యాజకుల వద్దకు పంపడంలో వారి దురభిమానాన్ని తొలగించడానికి ఉద్దేశించిన సాక్ష్యాన్ని వారికనుగ్రహించాడు.DATel 276.1

    క్రీస్తు బోధ మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి విరుద్దంగా ఉందని పరిసయ్యులు విమర్శించారు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం కానుక సమర్పించమని యేసు కుష్ఠురోగికిచ్చిన ఆదేశం ఇది తప్పుడు ఆరోపణని నిరూపిస్తోంది. నమ్మడానికి సంసిద్ధంగా ఉన్న వారందరికీ ఇది చాలినంత సాక్ష్యం . .DATel 276.2

    యెరూషలేములోని నాయకులు యేసును చంపడానికి ఏదో సాకు సృష్టించమని గూఢచారుల్ని పంపారు. మానవాళి పట్ల తన ప్రేమను గూర్చి ధర్మశాస్త్రం పట్ల తన గౌరవాభిమానాల్ని గూర్చి పాపం నుంచి మరణం నుంచి విమోచించడానికి తన శక్తిని గూర్చి నిదర్శనాలివ్వడం ద్వారా ఆయన ప్రతిస్పందించాడు. వారికి ఇలా సాక్ష్యమిచ్చాడు. “నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేషమముంచుచున్నారు.” కీర్తనలు 109:5. కొండమీద “మీ శత్రువులను ప్రేమించుడి” అని హితవుపలికి “కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణయైనను చేయక” దీవించిన ఆ ప్రభువు ఈ నియమానికి సాదృశ్యంగా నిలిచాడు. ” మత్తయి 5:44; 1 పేతురు 3:9.DATel 276.3

    ఏ యాజకులు కుష్టురోగిని సమాజం నుంచి బహిష్కరించారో వారే అతడి స్వస్తతను ధ్రువీకరించారు. బహిరంగంగా చెప్పగా నమోదైన ఈ వాక్యం క్రీస్తుకి నిత్యసాక్ష్యంగా నిలిచింది. ఆ వ్యాధికి సబంధించిన ఏ కళంకం అతడి దేహం మిద లేదని యాజకుల హామి మిద ఆ వ్యక్తి ఇశ్రాయేలు సమాజంలోకి పునరుద్దారణ పొందినందువల్ల అతడే తన ఉపకారదాతకు సజీవ సాక్షి. తన కానుకను అతడు ఆనందంగా సమర్పించాడు. యేసు నామాన్ని ఘనపర్చాడు. రక్షకుని దైవశక్తిని యాజకులు గుర్తించారు. సత్యాన్ని తెలుసుకుని ఆ వెలుగు పలన ప్రయోజనం పొందడానికి వారికి అవకాశం లభించింది. పలువురు ఆ వెలుగును విసర్జించారు. అయినా దేవుడు దాన్ని వ్యర్ధంగా ఇవ్వలేదు. అనేక హృదయాలు చలించాయి. కొద్దికాలం ఎలాంటి సూచన లేదు. రక్షకుని పరిచర్య కాలంలో ఆయన సేవ విషయంలో యాజకులు బోధకుల నుంచి స్పందన రాలేదు. అయితే ఆయన ఆరోహణం తర్వాత “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ... బహుగా విస్తరించెను” అ.కా 6: 7.DATel 277.1

    కుష్టురోగిని తన భయంకర వ్యాధి నుంచి శుద్ధిచెయ్యడంలో క్రీస్తు చేసిన పరిచర్య పాపరోగం నుంచి ఆత్మను క్రీస్తు శుద్ది చెయ్యడానికి సాదృశ్యం. యేసు వద్దకు వచ్చిన మనిషి కుష్టురోగంతో నిండిన వాడు. ఆ వ్యాధి విషం శరీరమంతా వ్యాపించింది. అతణ్ని ముట్టుకోకుండా తమ ప్రభువుని ఆపడానికి శిష్యులు ప్రయత్నించారు. ఎందుకంటే కుష్ఠురోగిని తాకినవాడు అపవిత్రుడయ్యేవాడు. కాగా అతడి మీద చెయ్యి వేయడం ద్వారాయేసుకి అపవిత్రత అంటలేదు. ఆయన స్పర్శ జీవ శక్తిని బదిలీ చేసింది. కుష్టువ్యాధి నుంచి శుద్ధి లభించింది. పాపమనే కుష్టు విషయంలోనూ ఇలాగే వుంటుంది. అది లోతుగా వేళ్లూనిన ప్రాణాంతక వ్యాధి. అది మానవశక్తి వల్ల శుద్ధి పొందడం అసాధ్యం “ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు.” యెషయా 1:5, 6. కాని మానవుడుగా నివసించడానికి వచ్చిన యేసుకు కాలుష్యం అంటలేదు. ఆయన సన్నిధి పాపికి స్వస్తతను ప్రసాదిస్తుంది. “ప్రభువా నీ కిష్టమైతే నన్ను శుద్ధుని చేయగలవు” అని విశ్వాసంతో ఎవరు అంటారో వారు “నాకిష్టమే” నీవు శుద్ధుడవుకమ్ము” అన్న జవాబును వింటారు. మత్తయి 8:2,3.DATel 277.2

    వ్యాధిగ్రస్తుల్ని స్వస్తతపర్చే సందర్భాల్లో యేసు ఆ మనవిని వెంటనే చెల్లించలేదు. కాని కుష్టువ్యాధి సందర్భంగా మనవి చేసిన వెంటనే ప్రభువు దాన్ని మంజూరు చేశాడు. మన లోకసంబంధమైన మేళ్లకోసం ప్రార్ధన చేసినప్పుడు దానికి జవాబు ఆలస్యంగా రావచ్చు, లేదా మనం అడిగింది కాకుండా వేరేదాన్ని దేవుడు మనకియ్యవచ్చును. అయినా పాపం నుంచి విముక్తి కోసం మనం చేసే మనవి విషయంలో ఇలా జరగదు. మనల్ని పాపం నుంచి శుద్ధిచేయ్యడం, మనల్ని తన పిల్లలుగా స్వీకరించడం పరిశుద్ధంగా నివసించడానికి మనకు శక్తి నియ్యడం ఆయన చిత్తం. “మన తండ్రియైన దేవుని చిత్తము ప్రకారము క్రీస్తు ‘ మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను. ” గలతీ 1:4. “ఆనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది ఆడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనునవి మనకు కలిగినవని యెరుగుదుము.” 1 యోహాను 5:14, 15. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయును.” 1 యోహాను 1:9.DATel 278.1

    కపెర్నహోములో పక్షవాత గలవాణ్ని బాగుచెయ్యడంలో ఈ సత్యాన్ని క్రీస్తు బోధించాడు. పాపాన్ని క్షమించడానికి తన శక్తిని ప్రదర్శించడానికే క్రీస్తు ఆ సూచక క్రియను చేశాడు. పక్షవాతం గలవాణ్ని స్వస్తపర్చడం విలువైన ఇతర సత్యాల్ని కూడా ఉదాహరిస్తోంది. అది నిరీక్షణతోను ఉద్రేకంతోను నిండింది. విమర్శించే పరిసయ్యులతో దాని సంబంధం నుంచి ఓ హెచ్చరికా పాఠం కూడా ఉంది.DATel 278.2

    ఆ కుష్టురోగిలాగే ఈ పక్షవాతం రోగికూడా బాగుపడ్డానన్న ఆశలు వదులుకున్నాడు. అతడి వ్యాధి తన పాపజీవిత పర్యవసానమే. పశ్చాత్తాపం అతడి బాధల్ని తీవ్రం చేసింది. చాలాకాలం క్రితం అతడు పరిసయ్యులికి, వైద్యులకి మనవి చేసుకున్నాడు. తన మానసిక వేదనకు శారీరక బాధకు ఉపశమనం కలుగుతుందని ఆశించాడు. కాని అది నయంకాని వ్యాధి అని వారు లాంఛనంగా ప్రకటించి అతణ్ని దేవుని ఆగ్రహానికి విడిచి పెట్టేశారు. శ్రమలు దైవాగ్రహానికి నిదర్శనాలుగా పరిసయ్యులు పరిగణించారు. అందువల్ల వారు వ్యాధిగ్రస్తులికి అవసరాల్లో ఉన్న వారికీ దూరంగా ఉండేవారు. చెప్పాలంటే తమ్ముతాము పరిశుద్ధులుగా హెచ్చించుకునే వీరే తాము విమర్శించే బాధితులకన్నా తీవ్రమైన అపరాధులు.DATel 278.3

    పక్షవాతరోగి పూర్తిగా నిస్సహాయుడు. ఏ పక్కనుంచీ సహాయం వచ్చే అవకాశం కనిపించకపోవడంలో నిరాశ చెందాడు. తనలాంటి పాపులు తనలాంటి నిస్సహాయులు స్వస్తత పొందారని అతడికి చెప్పారు. కుష్ఠురోగులు సైతం బాగుపడ్డారని చెప్పారు. ఈ సంగతులు చెప్పిన మిత్రులు తనను గనుక క్రీస్తు వద్దకు మోసుకెళ్తే తానుకూడా బాగుపడ్డానని విశ్వసించడానికి అతణ్ని ప్రోత్సాహించారు. అయితే ఆ వ్యాధి తనకు ఎలా వచ్చిందో గుర్తు చేసుకున్నప్పుడు అతడి నిరీక్షణ ఓ అడుగు వెనక్కి వేసింది. ఆ పరిశుద్ధ వైద్యుడు తనను ఆయన సముఖంలో సహించడని భయపడ్డాడు.DATel 279.1

    అయినా అతడు కోరుకున్నది శారీరక పునరుద్ధరణ కాదు. దాని కన్నా ఎక్కువగా కోరుకున్నది పాపభారం నుంచి విడుదల. యేసును కలుసుకుని ఆయన నుంచి క్షమాపణ హామిని దేవునితో సమాధానాన్ని పొందగలిగితే దేవుని చిత్తప్రకారం జీవించడానికైనా మరణించడారికైనా అతడు సిద్ధమే. మరణానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ఆవేదన - నేను ఆయన సన్నిధిలోకి రాగలిగితే ఎంత బాగుంటుంది అన్నది. ఇక సమయం లేదు. తన శరీరం కుళ్లిపోతున్న సూచనలు కనిపిస్తోన్నాయి. యేసు వద్దకు తనను మంచం మిద మోసుకు వెళ్లమని తన మిత్రుల్ని అర్థించాడు. వారు ఆపని సంతోషంగా చెయ్యడానికి పూనుకున్నారు. కాని రక్షకుడున్న గృహం లోపల బయట జనులు గుమిగూడడం మూలాన ఆయన్ని చేరడానికి రోగికి గాని అతడి మిత్రులికి గాని వల్లపడలేదు. వారు ఆయన మాటలు వినగలినంత దగ్గరలో కూడా లేరు.DATel 279.2

    యేసు పేతురు గృహాంలో బోధిస్తోన్నాడు. తమ ఆచారం ప్రకారం శిష్యులు ఆయన చుట్టూ కూర్చున్నారు. “గలిలయ యూదయ దేశముల ప్రతీ గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్తోపదేశకులును” కూర్చున్నారు. వీరు గూఢచారులుగా వచ్చారు. క్రీస్తు మీద ఆరోపణలు సంధించడానికి వచ్చారు. బయట జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు. వారు ఆత్రుతగా మర్యాదగా ఔత్సుకతతో అపనమ్మకంతో వేచి ఉన్నారు. ఆయా జాతులవారు, సమాజంలో అన్ని వర్గాలవారు ఉన్నారు. “స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను” దేవుని ఆత్మ ఆ సమావేశం పై ఉన్నది గాని పరిసయ్యులు శాస్త్రులు ఆ సన్నిధిని గ్రహించలేకపోయారు. “ఆకలి గొనిని వారిని పదార్ధములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను.” లూకా 1:53.DATel 279.3

    పక్షవాత రోగిని మోసుకు వెళ్లేవారు మనుషుల్ని పదేపదే గెంటుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు గాని విఫలులయ్యారు. తీవ్ర ఆందోళనతో రోగి తన చుట్టూ చూశాడు. ఆశించిన సహాయం అంత దగ్గరలో ఉండగా ఆశాభావాన్ని ఎలా విడిచి పెట్టుకుంటాడు? అతడి సలహామేరకు స్నేహితులు అతణ్ని ఇంటి పై కప్పు మీదికి మోసుకు వెళ్లి కప్పు పగులగొట్టి అతణ్ని యేసు పాదాల వద్దకు దింపారు. ఆయన బోధకు ఆటంకం ఏర్పడింది. రక్షకుడు దుఃఖంతో నిండిన అతడి ముఖం చుశాడు. బతిమాలుతున్న అతడి కళ్ళు తన పైనే కేంద్రీకృతమై ఉండడం చూశాడు. పరిస్థితిని గ్రహించాడు. గందరగోళం సందేహంతో సతమతమౌతున్న ఆత్మను ఆయన తన చెంతకు ఆకర్షించుకున్నాడు. పక్షవాతరోగి ఇంటి వద్ద ఉన్నప్పుడే రక్షకుడు అతడి అంతరాత్మలో నమ్మకం పుట్టించాడు. అతడు తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొంది తనను స్వస్తపర్చడానికి యేసుకి శక్తి ఉన్నదని విశ్వసించినప్పుడు అతడి అంతరాత్మలో నమ్మకం పుట్టించాడు. అతడు తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొంది తనను స్వస్తపర్చడానికి యేసుకి శక్తి ఉన్నదని విశ్వసించినప్పుడు రక్షకుని జీవప్రదాయక కృపలు ప్రథమంగా ఆశతో నిండిన అతడి హృదయాన్ని ఆశీర్వదించాయి. యేసే పాపికి ఏకైక సహాయకుడన్న విశ్వాసం తొలికిరణం నమ్మకంగా వృద్ధి చెందడం ఆయన పరిశీలించాడు. తన సన్నిధిలోకి రావడానికి జరిగే ప్రతీ ప్రయత్నంతో అది మరింత బలపడడం చుశాడు.DATel 280.1

    బాధితుడి చెవులకు సంగీతంలా వినిపించే ఈ మాటల్ని రక్షకుడు పలికాడు, “కుమారుడా ధైర్యముగా ఉండుము; నీ పాపములు క్షమింపబడియున్నవి.”DATel 280.2

    బరువెక్కిన నిస్పృహ ఆ వ్యాధిగ్రస్తుడి ఆత్మ నుంచి తొలిగిపోయింది. అతడి ఆత్మలో క్షమాపణ సమాధానం నెలకొని అతడి ముఖం పై ప్రకాశించింది. అతడి శారీరక బాధ ఇకలేదు. అతడి వ్యక్తిత్వం మారిపోయింది. ఆ నిస్సహాయ పక్షవాత రోగి స్వస్తత పొందాడు! అపరాధి క్షమాపణ పొందాడు!DATel 281.1

    అతడు యేసు మాటల్ని విశ్వాసంతో నూతన జీవిత వరంగా అంగీకరించాడు. మళ్ళీమళ్లీ విజాపన చెయ్యలేదు. సంతోషంతో అవాక్కయ్యాడు. పరలోక కాంతితో అతడి ముఖం వికసించింది. ప్రజలు ఆ సన్నివేశాన్ని భయభక్తులతో వీక్షించారు.DATel 281.2

    ఈ విషయాన్ని క్రీస్తు ఎలా సంబాళించుకుంటాడో చూడడానికి రబ్బీలు ఆత్రుతగా ఉన్నారు. సహాయాన్ని అర్ధిస్తూ తమను ఎలా బతిమాలాడో అతడి పట్ల సానుభూతి చూపకుండా తాము ఎలా అతడికి చెయ్యూత నిరాకరించారో గుర్తు చేసుకున్నారు. అంతేగాక తన పాపాల పర్యవసానంగా దేవుని శాపాన్ని అనుభవిస్తోన్నాడని విమర్శించారు. తమముందున్న వ్యాధిగ్రస్తుణ్ని చూసినప్పుడు ఈ విషయాలు వారి మనసుల్లోకి తాజాగా వచ్చాయి. ఆ సన్నివేశాన్ని అందరూ ఆసక్తిగా పరిశీలించడం గమనించారు. ప్రజల మధ్య తమ పలుకుబడి దిగజారిపోతుందని భయపడ్డారు.DATel 281.3

    ఆ ఉన్నతాధికారులు ఒకరితో ఒకరు సంప్రదించుకోలేదు గాని ఒకరి వంక ఒకరు చూసుకుంటూ తను భావాలు ఒకే రకంగా ఉండడంతో వరదలా విస్తరిస్తోన్న క్రీస్తు భావజాలానికి అడ్డుకట్ట వెయ్యడానికి చర్య తీసుకోవాలని భావించారు. పక్షవాత రోగి పాపాలు క్షమించబడ్డాయని యేసు చెప్పాడు. పరిసయ్యులు ఈ మాటల్ని పట్టుకుని క్రీస్తు దేవదూషణకు పాల్పడ్డాడని ఆరోపించారు. దాన్ని మరణదండనకు అర్హమైన పాపంగా సమర్పించవచ్చునని భావించారు. తమ మనసుల్లో ఇలా ఆలోచించారు, “ఇతడు .... దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడు?” మార్కు 2:7;DATel 281.4

    ఆయన తన దృష్టిని సారించినప్పుడు వారు భయపడూ తలలు దించుకుని వెనక్కి తగ్గారు. యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపముల క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదు.” పక్షవాత రోగి తట్టు తిరిగి నీవు లేచి నీ మంచమెత్తి కొని నీ యింటికి వెళ్లుము” అన్నాడు.DATel 282.1

    అంతట ఆ పక్షవాత బాధితుడు యువకుడి బలంతోను చురుకుతనంతోను లేచి నిలబడ్డాడు. ప్రాణాధారమైన రక్తం అతడి రక్తనాళాల్లో ప్రవహించింది. అతడి దేహంలోని ప్రతి అవయవం హఠాత్తుగా చురుకయ్యింది. మరణ ఛాయలు పోయి ఆరోగ్యం వెల్లివిరిసింది. “తక్షణమే వాడు లేచి పరుపెత్తికొని వారందరి యెదుట నడిచిపోయెను గనుక వారందరు విభ్రాంతి నొంది మనమిలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుచు దేవుని మహిమ పరిచిరి.”DATel 282.2

    క్రీస్తు ప్రేమ అద్భుతమైనది. అది అపరాధుల్ని బాధితుల్ని ఆదుకోడానికి దిగివచ్చే ప్రేమ! ఈ తీరుగా మానవ సంతతికి ప్రదర్శితమైన ప్రేమ ఎంత అద్భుతమైనది! రక్షణ వర్తమానాన్ని ఎవరు సందేహించగలరు? కారుణ్యమూర్తి యేసు కృపలను ఎవరు కించపర్చగలరు?DATel 282.3

    కుళ్లిపోతున్న శరీరానికి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి సృజన శక్తి అవసరం. భూమిలోని మట్టి నుంచి చేసిన మనిషికి జీవాన్నిచ్చిన శక్తే హృదయాన్ని నూతనం చేసింది. సృష్టి కార్యం జరిగినప్పుడు ఎవరు “మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెనో” ఎవరు “ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపడెనో” (కీర్తన 33:9). ఆ ప్రభువే అతిక్రమాలు పాపాల వలన మరణించిన ఆత్మకు మాట సెలవియ్యడం ద్వారా ప్రాణమిచ్చాడు. శారీరక స్వస్తత హృదయ నవీకరణ శక్తికి నిదర్శనం. “పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యుకుమారునికి అధికారము కలదని వారు తెలిసికొనవలెనని వారితో చెప్పి” లేచి నడుపు అని పక్షవాత రోగిని క్రీస్తు ఆదేశించాడు.DATel 282.4

    క్రీస్తులో పక్షవాత రోగి శరీరాత్మకు స్వస్తత కనుగొన్నాడు. శారీరక పునరుద్ధరణ అనంతరం ఆధ్యాత్మిక స్వస్తత కలిగింది. ఈ పాఠాన్ని మర్చిపోకూడదు. నేడు శారీరక వ్యాధులతో బాధ పడ్తోన్న వారు అనేకులున్నారు. ఈ పక్షవాత బాధితుడి లాగే “నీ పాపములు క్షమింపబడియున్నవి” అన్న వర్తమానం వినడానికి వారు ఆశతో కని పెడుతున్నారు. పాప భారం దాని వలన కలిగే అశాంతి తీరని కోరికలు - ఇదే వారి రుగ్మతలకు పునాది. ఆత్మకు స్వస్తత కూర్చే ప్రభువు వద్దకు వచ్చే వరకూ వారికి శాంతి ఉండదు. ఆయన మాత్రమే ప్రసాదించగల శాంతి మనసుకు శక్తిని దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది.DATel 282.5

    “అపవాది యొక్క క్రియలను లయపర్చుటకే” యేసు వచ్చాడు. “ఆయనలో జీవముండెను” “జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” అని ఆయన అంటోన్నాడు. ఆయన ఆత్మ “జీవింపజేయు ఆత్మ.” 1 యోహా 3:8; యోహా 1:4;10:10; 1 కొరింథి 15:45; ఈ కాలంలో ఉన్న కాలంలో రోగుల్ని స్వస్తపర్చినప్పుడు పాపికి క్షమాపణను అనుగ్రహించినప్పుడు ఆయనకు ఏ జీవింపజేసే శక్తి ఉన్నదో అదేశక్తి ఆయనకు ఇప్పుడూ ఉంది. ఆయన “నీ దోషములన్నిటిని క్షమించువాడు,” ఆయన “నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు” కీర్తన 103:3.DATel 283.1

    - పక్షవాత బాధితుడి స్వస్తత ప్రజలపై ప్రసరించిన ప్రభావం పరలోక ద్వారాలు తెరుచుకుని దివ్య ప్రపంచం తాలూకు మహిమల్ని ప్రదర్శిస్తే ఎలాగుంటుందో అలాగుంది. స్వస్తత పొందిన వ్యక్తి దేవున్ని కీర్తిస్తూ తన పడక మోసుకుంటూ వెళ్లినప్పుడు ప్రజలు అతడు వెళ్లేందుకు చోటిచ్చి ఆశ్చర్యంతో అతడి వంక తేరిచూస్తూ “నేడు గొప్ప వింతలు చూచితిమి” అంటూ గుసగుసలాడుకున్నారు.DATel 283.2

    పరిసయ్యులు పరాజయంతో దిమ్మెరపోయారు. జనుల్ని రెచ్చగొట్టడానికి వారికి ఇక్కడ అవకాశం దొరకలేదు. ఆ వ్యక్తి విషయంలో జరిగిన మహత్కార్యం ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోడంతో వారు రబ్బీల్ని తాత్కాలికంగా మర్చిపోయారు. దేవునికి మాత్రమే ఉన్న శక్తి క్రీస్తుకి ఉన్నట్లు వారు చూశారు. అయినా ఆయన మృదువైఖరి వారి అహాంకారపూరిత వర్తనకు భిన్నంగా ఉంది. ఉన్నత లోకానికి చెందిన వ్యక్తిని గుర్తించి కూడా ఒప్పుకోని వారు సిగ్గుపడ్డారు. పాపాలు క్షమించడానికి భూమిపై యేసుకి అధికారం ఉందనడానికి ఎంత బలమైన నిదర్శనం ఉంటే అంత లోతుగా వారు అవిశ్వాసంలో కూరుకుపోయారు. పక్షవాత రోగి ఆయన మాట మేరకు స్వస్తత పొందడం ఏ గృహంలో చూశారో ఆ పేతురు గృహం నుంచి వారు వెళ్లిపోయారు. దైవ కుమారుణ్ని మట్టు పెట్టడానికి నూతన పథకాల్ని వ్యూహాల్ని తయారు చేసుకోడానికి వెళ్లిపోయారు.DATel 283.3

    శారీరక వ్యాధి ఎంత తీవ్రమైంది ఎంత దీర్ఘకాలం నుంచి ఉంటున్నది అయినా క్రీస్తు దాన్ని స్వస్తపర్చాడు. కాగా ఆత్మను పట్టి పీడించే రుగ్మత వెలుగును చూడకుండా కళ్లు మూసుకున్న వారిపై గట్టి పట్టు సాధించింది. కుష్టువ్యాధి పక్షవాతం మత దురభిమానం అపనమ్మకమంత భయంకరమైనవి కావు.DATel 284.1

    బాగుపడ్డ పక్షవాత రోగి తన పడకను ఎత్తుకొని తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు అతడి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కుటుంబ సభ్యులు అతడి చుట్టూ చేరి ఆనంద బాష్పాలు విడిచారు. వారు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. అతడు నవయౌవనంతో వారి ముందు నిలబడ్డాడు. చచ్చుపడినట్లు తమకు తెలిసిన అతడి చేతులు అతడి చిత్తం నెరవేర్చడానికి త్వరపడుతోన్నాయి. ఎండి తెల్లబడిన అతడి మాంసం ఇప్పుడు రక్తంపట్టి తాజాగా వుంది. అతడు బలంగా అడుగులు వేస్తూ నడిచాడు. అతడి ముఖం ఆనందోత్సాహాల్ని ప్రతిబింబించింది. పాపం బాధ గుర్తుల స్థానంలో పవిత్రత శాంతి నెలకొన్నాయి. ఆ గృహంలో నుంచి సంతోష గానం కృతజ్ఞతార్పణం వినిపించాయి. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ బలహీనులకి బలం పునరుద్ధరించిన దైవ కుమారుని ద్వారా వారు దేవుని మహిమపర్చారు. ఇతడు ఇతడి కుటుంబీకులు తమ జీవితాల్ని యేసు నిమిత్తం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సందేహం వారి విశ్వాసాన్ని మసకబార్చలేదు. తమ చీకటి గృహంలోకి వెలుగును ప్రవేశపెట్టిన ప్రభువుపట్ల వారి స్వామి భక్తిని అపనమ్మకం హరించలేదు.DATel 284.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents