Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    21—బేతెస్ధ, సన్ హెడ్రిన్

    “యెరూషలేములో గొట్టెల ద్వారము దగ్గర హెబ్రీ బాషలో బేతెస్ధ అనబడిన యొక కోనేరు కలదు. దానికి అయిదు మంటపములు కలవు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటి వారు, ఊచకాలు చేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.”DATel 202.1

    ఈ కోనేరులోని నీళ్ళని కొన్ని కాలాల్లో కదిలించడం జరిగేది. ఇది ఓ మానవాతీత శక్తి వలనే జరుగుతోందన్నది, కదిలింపు అనంతరం ఎవరైతే మొదట ఆ నీటి లోకి దిగుతారో అతడికి ఏ వ్యాధి ఉన్నా అది నయమౌతుందన్నది ప్రజల నమ్మకం. వందల బాధితులు అక్కడికి వెళ్ళేవారు. నీళ్ళు కదిలించడం జరిగినప్పుడు గుమికూడిన ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించి అందులో చాలామంది స్త్రీలు, పిల్లలు దుర్బలులూ మరణించేవారు. కొందరైతే కొనేరు దగ్గరకు కూడా వెళ్ళలేకపోయేవారు. కనాకష్టంగా చేరుకోగలిగిన అనేకులు ఆగట్టు మిదే ప్రాణాలు విడిచేవారు. వ్యాధిగ్రస్తుల్ని ఎండనుంచి చలినుంచి కాపాడేందుకు కొనేటి చుట్టూ ఆశ్రయాలు నిర్మించారు. కొందరు రాత్రంతా ఈ మంటపాల్లోనే ఉండిపోయి స్వస్థత పొందాలన్న కోరికతో ప్రతీదినం కోనేరు అంచువరకూ వెళ్లేవారు. పాపం వారి ప్రయత్నాలు వ్యర్ధమయ్యేవి.DATel 202.2

    యేసు మళ్లీ యెరుషలేమును సందర్శించాడు. ధ్యానిస్తూ, ప్రార్ధిస్తూ, ఒంటరిగా నడుస్తూ కోనేరు వద్దకు వచ్చాడు. స్వస్తత పొందడానికి తమకున్న ఒకే ఒక అవకాశంగా భావించి ఎదురుచూస్తున్న ఘటన కోసం వేచి ఉన్న బాధితుల్ని ఆయన వీక్షించాడు. స్వస్తత చేకూర్చే తన శక్తిని వినియోగించి ప్రతీ వ్యాధి బాధితుణ్ని స్వస్తపర్చాలని ఆకాంక్షించాడు. అయితే అది సబ్బాతుదినం. దేవున్ని ఆరాంధించేందుకు జనాలు గుంపులు గుంపులుగా దేవాలయానికి వెళ్తున్నారు. స్వస్తపర్చడం వంటి కార్యం యూదుల దురభిమానాన్ని రెచ్చగొట్టి తద్వారా తన పరిచర్యకు ప్రతిబంధకం కలిగిస్తుందని ఆయనకు తెలుసు.DATel 202.3

    అయితే అతి దీన పరిస్థితిలో ఉన్న ఓ బాధితుణ్ని రక్షకుడు చూశాడు. కుంటివాడు ముప్పయి ఎనిమిది సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడై నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యుడతడు. అతడి వ్యాధికి అతడి పాపమే చాలామట్టుకి కారణం. అతడి వ్యాధి దేవుడు విధించిన శిక్షగా అనేకులు పరిగణించారు. అతడు నా అన్నవాళ్ళు లేకుండా ఒంటిరిగా జీవిస్తున్నాడు. తాను దేవుని కృపకు దూరమయ్యానని భావించాడు. ఈ దుర్భర స్థితిలో ఆ బాధితుడు అనేక సంవత్సరాలు గడిపాడు. నీళ్లకదలింపు జరుగుతుందని ప్రజలు కనిపెట్టినప్పుడు ఆ అభాగ్యుడి పట్ల దయగొన్నవారు అతణ్ని మంటపాల్లోకి మోసుకొని వెళ్లేవారు. కాని అవసర తరుణంలో కోనేరులో దిగడానికి అతడికి చేయూత నిచ్చేవారుండేవారు కాదు. అతడు నీళ్లు గలగల కదలడం చూసేవాడు గాని కోనేటి అంచును మించి ముందుకి సాగలేకపోయేవాడు. తనకన్నా బలమైన వారు తనకన్నా ముందు కోనేరులో దిగేవారు. తోసుకుంటూ ముందుకు వెళ్తున్న స్వార్థ ప్రజలతో పెనుగులాడలేకపోయాడు. తన లక్ష్యసాధనకు అతడి నిరంతరకృషి, అతడి ఆందోళన, ప్రతినిత్యం ఎదురవుతున్న నిరాశ అతడిలో ఇంకా మిగిలి ఉన్న శక్తిని హరించివేస్తున్నాయి.DATel 203.1

    ఆ రోగి చాపమీద పడుకుని అప్పుడప్పుడు తల పైకెత్తి కోనేటి వంక చూస్తున్న సమయంలో, దయ కనికరాలు ఉట్టిపడుతున్న ఓ ముఖం వంగి “స్వస్థపడగోరుచున్నావా?” అనడంతో అతడిలో ఆశ మొగ్గతొడిగింది. నిరీక్షణ వెల్లువెత్తింది. అతడు ఏదో రకంగా తనకు సహాయం అవసరమని గుర్తించాడు. కాని చిగురించిన ఆశ త్వరలోనే వాడిపోయింది. కోనేటిలో దిగడానికి తను ఎన్నిసార్లు ప్రయత్నించాడో గుర్తుచేసుకున్నాడు. నీళ్ల కదలింపు మళ్లీ చోటుచేసుకునే వరకూ బతికి ఉంటానన్న నమ్మకం అతడికి లేదు. బరువుగా ఆ పక్కకు తిరుగుతూ, “అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగును” అన్నాడు.DATel 203.2

    తన మీద విశ్వాసం ప్రకటించమని యేసు ఈ బాధితుణ్ని కోరలేదు. “నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుము.” అని మాత్రమే అన్నాడు. ఆ మాటను అతడి విశ్వాసం గట్టిగా పట్టుకుంది. ప్రతీ నాడిలో ప్రతీ కండరంలో జీవం ప్రవహించింది. చచ్చుపడిన అతడి అవయవాలు ఆరోగ్యం పుంజుకుని పనిచేశాయి. తటపటాయించకుండా క్రీస్తు ఆజ్ఞను శిరసావహించడానికి పూనుకున్నాడు. అతడి కండరాలన్నీ అతడి పూనికను సాకారం చేశాయి. లేచి నిలబడ్డాడు. మళ్ళీ చైతన్యవంతుడయ్యాడు.DATel 204.1

    యేసు అతడికి దేవుని సహాయాన్ని వాగ్దానం చెయ్యలేదు. అతడు ఆయన్ని శంకించేవాడు. బాగుపడడానికి తనకున్న ఒకేఒక అవకాశాన్ని పోగొట్టుకునేవాడు. అయితే అతడు క్రీస్తు మాటను విశ్వసించాడు. ఆ మాట ప్రకారం నడుచుకోడం ద్వారా శక్తిని పొందాడు.DATel 204.2

    అదే విశ్వాసం ద్వారా మనం ఆధ్యాత్మిక స్వస్తతను పొందవచ్చు. పాపం వలన మనం దైవ సంబంధమైన జీవితానికి దూరమయ్యాం . మన ఆత్మలు వ్యాధి గ్రస్తమయ్యాయి. ఆ వ్యాధిగ్రస్తుడు నడవలేని స్థితిలో ఉన్నట్లే మనం మన సొంత శక్తితో పరిశుద్ధ జీవితం జీవించడం అసాధ్యం. తాము నిస్సహాయులమనీ, దేవునితో సామరస్యం ఏర్పర్చే ఆధ్యాత్మిక జీవితం తమకు అవసరమని గుర్తించేవారు, దాన్ని సాధించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేసేవారు ఎందరో ఉన్నారు. వారు నిస్సృహచెంది ఇలా వాపోతారు, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?” రోమా 7:24. నిస్పృహతో నిరాశతో సతమతమవుతున్న వీరు తమ దృష్టిని పైకి సారించాలి. స్వీయ రక్తంతో కొన్న ప్రజల ముఖాల్లోకి దయ కనికరాల్తో చూస్తూ, “స్వస్థపడగోరుచున్నావా?” అంటున్నాడు రక్షకుడు. ఆరోగ్యం సమాధానం కలిగి పైకి లేవమని ఆదేశిస్తున్నాడు. స్వస్తపడ్డాను అన్న మనోభావం కలిగే వరకు వేచి ఉండకండి. ఆయన మాటను నమ్మండి. అప్పుడు ఆ మాట నెరవేరుతుంది. ఈ చిత్రాన్ని క్రీస్తుకి అంకితం చెయ్యండి. ఆయన సేవ చెయ్యడానికి, ఆయన ఆజ్ఞను గైకోడానికి ఇచ్చయించండి. అప్పుడు నాకు శక్తి లభిస్తుంది. దురభ్యాసం ఎలాంటిదైనా, అది ఎంతోకాలంగా అలవాటు పడినందువల్ల ఆత్మను శరీరాన్ని బంధించే వ్యసనమైనా దాన్నుంచి విముక్తి కలిగించడానికి క్రీస్తు సమర్ధుడు. ఆ విముక్తి నివ్వడానికి ఆయన ఆకాంక్షిస్తున్నాడు. “పాపముల చేత... చచ్చిన” ఆత్మకు ఆయన జీవాన్నిస్తాడు. ఎఫెసీ 2:1. బలహీనతకు దురదృష్టానికి పాపానికి బందీలైన వారికి ఆయన విముక్తి కలిగిస్తాడు.DATel 204.3

    స్వస్తపడ్డ పక్షవాత బాధితుడు తన పడకను తీసుకోడానికి వంగాడు. అతడు పడక ఓ చాప ఓ దుప్పటి మాత్రమే. వాటిని చుట్టుకుని పైకి లేచి ఆనందంతో తన విమోచకుడి కోసం తన చుట్టూ చూశాడు. అయితే యేసు ఆ జనసమూహంలో లేడు. ఆయన తనకు మళ్లీ కనిపించినా ఆయన్ని గుర్తుపట్టలేనని అతడు భయపడ్డాడు. తనకు నూతనంగా లభించిన శక్తితో దేవుని స్తూతిస్తూ సంతోషానందాల్తో ఉప్పొంగుతూ బలంగా అడుగులు వేసుకుంటూ తన మార్గాన వెళ్తున్న తరుణంలో అతడు అనేకమంది పరిసయుల్ని కలుసుకుని తనకు కలిగిన స్వస్తతను గురించి చెప్పాడు. వారు తన కధనాన్ని నిరాసక్తంగా వినడం అతణ్ని ఆశ్చర్యపర్చింది.DATel 205.1

    గుడ్డెర్రజేసి విశ్రాంతి దినాన పడక ఎందుకు మోసుకువెళ్తున్నావని ప్రశ్నిస్తూ అతడి కధనానికి అడ్డుకట్టవేశారు. ప్రభువు దినాన బరువులు మోయడం ధర్మశాస్త్ర సమ్మతం కాదని కఠిన పదజాలంతో గుర్తుచేశారు. అయినా అలాంటి దైవశక్తిగల మహానుభావుని ఆజ్ఞను శిరసావహించడానికి అతడు వెనుదీయలేదు సరిగదా “నన్ను స్వస్తపరచినవాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పెను” అని ధైర్యంగా బదులు పలికాడు. తనను స్వస్థపర్చిన వారెవరని నిగ్గదీశారు. ఆయనెవరో అతడు చెప్పలేకపోయాడు. ఈ అద్భుతకార్యాన్ని చేయగలిగినవాడు ఒక్కడే అని ఈ అధికారులకు తెలుసు. కాని అది యేసే అనడానికి వారు ప్రత్యక్ష నిదర్శనం కోరారు. సబ్బాతు రోజున స్వస్తపర్చడంలో ఆయన ధర్మశాస్త్రాన్ని మారడమేగాక రోగిని తన పడక ఎత్తుకుని వెళ్ళమనడంలో దేవదూషణకు కూడా పాల్పడ్డాడన్నది వారి అభిప్రాయం.DATel 205.2

    యూదులు ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి దాన్ని ప్రజల మెడలపై భారమైన కాడిగా మార్చారు. అర్ధం పర్ధం లేని వారి నిబంధనలు ఇతర జాతులవారికి సామెతగా మారాయి. ప్రత్యేకించి వారు సబ్బాతు చుట్టూ అర్ధరహిత నిషేధాల కంచెను నిర్మించారు. అది వారికి మనోహర దినం కాదు, యెహోవాకు పరిశుద్ధమైన ఘనమైన దినం కాదు. శాస్త్రులు పరిసయ్యులు విశ్రాంతి దినాచారాన్ని మోయలేని భారంగా రూపొందించారు. యూదుడు సబ్బాతు రోజున పొయ్యి వెలిగించడంగాని దీపం వెలిగించడంగాని నిషిద్ధం. పర్యవసానంగా తాము చేసుకోకూడని అనేకమైన పనులకు ప్రజలు అన్యజనుల మీద ఆధారపడాల్సివచ్చేది. ఈ పనులు చెయ్యడం పాపమైతే అవి చేయడానికి ఇతరుల్ని నియమించడం ద్వారా ఆ పనిని తామే చేస్తున్నామని ఆ పాపాన్ని తాము ఒడిగట్టుకుంటున్నామని వారికి తట్టలేదు. రక్షణ యూదులకే పరిమితమయ్యిందని, ఇతరులు నిరీక్షణ లేనివారు గనుక వారి పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా ఉండదని వారి భావన. అందరికీ ఆచరణ సాధ్యమైన ఆజ్ఞల్నే దేవుడిచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం హేతుబద్ధం కాని స్వారపూరితమైన ఏ ఆంక్షల్నీ అనుమతించదు.DATel 205.3

    తాను స్వస్తపర్చిన వ్యక్తిని యేసు దేవాలయంలో కలుసుకున్నాడు. తాను పొందిన కృప నిమిత్తం పాప పరిహారార్ధ అర్పణ కృతజ్ఞతార్పణ చెల్లించడానికి అతడు దేవాలయానికి వచ్చాడు. ఆరాధకుల్లో అతణ్ని చూసి యేసు తన్నుతాను అతనికి బయలుపర్చుకుని, “ఇదిగో స్వస్థత నొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయకుము” అని హెచ్చరించాడు.DATel 206.1

    స్వస్తత పొందిన అతడు తన విమోచకుణ్ని కలుసుకున్నప్పుడు అమితానంద భరితుడయ్యాడు. క్రీస్తు పట్ల శతృత్వాన్ని ఎరుగని అతడు తనను స్వస్తపర్చినవాడు ఈయనే అని పరిసయ్యులతో అన్నాడు. “ఈ కార్యమును విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి”DATel 206.2

    సబ్బాతును అతిక్రమించాడన్న ఆరోపణతో యేసును సన్ హెడ్రిన్ ముందు నిలబెట్టారు. ఈ సమయంలో యూదులు స్వతంత్ర రాజ్యం అయిఉంటే ఆయన్ని మట్టుపెట్టడమన్న తమ ఉద్దేశం నెరవేర్పుకు ఈ నేరారోపణ దోహదపడేది. వారు రోమియులు పాలనాధికారం కింద ఉన్నందువల్ల ఇది సాధ్యపడలేదు. మరణదండన విధించే అధికారం యూదులకు లేదు. క్రీస్తుపై మోపిన నేరం రోమా న్యాయపాలిక కొట్టివేయడం తధ్యం. వారు సాధించడానికి ఆత్రపడే కార్యాలు కొన్ని ఉన్నాయి. తన పరిచర్యకు మోకాలడ్డడానికి వారు ఆపసోపాలు పడుతున్నా యెరూషలేములో సయితం క్రీస్తుదే పైచేయి అవుతుంది. ప్రజలపై ఆయన ప్రభావమే బలంగా ఉంది. రబ్బీల దీర్బోపన్యాసాలు రుచించని జనసముహాలు యేసు బోధలకు ఆకర్షితులవుతున్నారు. ఆయన మాటలు వారికి అవగతమౌతున్నాయి. అవి వారికి ప్రేమ ఆదరణ అందిస్తోన్నాయి. కక్ష సాధించే న్యాయాధిపతిగా గాక ప్రేమాప్యాయతలు గల తండ్రిగా దేవుని గురించి ఆయన మాట్లాడాడు. దేవుని స్వరూపాన్ని తనలో ప్రతిబింబించాడు. గాయపడ్డ ఆత్మకు తైలం ఎలాగో ఆయన మాటలు అలాగుండేవి. తన మాటల ద్వారా, తన కృపా పరిచర్య ద్వారా ఆయన సనాతన సంప్రదాయాల్ని, మానవ కల్పిత ఆల హింసాత్మక శక్తిని నాశనం చేసి దేవుని అనంత ప్రేమను సమర్పిస్తోన్నాడు.DATel 206.3

    క్రీస్తును గూర్చిన ప్రవచనాల్లో ఒకటి ఇలా వివరిస్తోంది, “షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి రాజ దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైయుందురు.” ఆది 49:10. ప్రజలు క్రీస్తు వద్దకు వస్తోన్నారు. జనసమూహాల్లో సానుభూతి హృదయాలు గలవారు యాజకులు కోరే కఠిన ఆచారాల బదులు ప్రేమ కనికరాల్ని గూర్చిన బోధల్ని అంగీకరించారు. యాజకులు రబ్బీలు అడ్డుకోకపోతే ఆయన బోధ ఫలితంగా ఈ లోకం కని విని ఎరగని దిద్దుబాటు చోటుచేసుకుని ఉండేది. కాని తమ అధికారాన్ని నిలుపుకునేందుకు ఈ నాయకులు యేసు ప్రభావాన్ని నాశనం చెయ్యడానికి కృతనిశ్చయులయ్యారు. సన్ హెడ్రిన్ ముందు ఆయనపై నేరారోపణ చెయ్యడం, ఆయన బోధనల్ని బాహాటంగా ఖండించడం వారి లక్ష్యసాధనకు తోడ్పడతాయి. ఎందుకంటే ప్రజలకు తమ మత నాయకుల పట్ల ఇంకా గౌరవాభిమానాలున్నాయి. రబ్బీల న్యాయవిధుల్ని ఖండించడానికి సాహసించడం గాని లేక వారు ప్రజలకు విధించిన ఆచారాలను తేలిక చెయ్యడానికి ప్రయత్నించడం గాని ఎవరైనా చేస్తే వారు దేవదూషణ చేసినట్లే గాక దేశద్రోహానికి పాల్పడినట్లు పరిగణన పొందేవారు. క్రీస్తుపై ఈ రకంగా అనుమానం పుట్టించాలని రబ్బీలు ఉద్దేశించారు. సనాతన ఆచారాలను ధర్మాలను కూలదోసి, ప్రజల ప్రతినిధులకు దానికి వ్యూహాల ప్రపంచంలో తరం పట్టించేందుకూర్చి తమ మధ్య విభేదాలు సృష్టించి తద్వారా రోమియులు ఆధిపత్యానికి మార్గం సుగమం చేస్తున్నాడని ఆయనపై నిందలు మోపారు.DATel 207.1

    కాకపోతే రబ్బీలు అమలుపర్చాలని ఉత్సాహపడ్తోన్న ఈ ప్రణాళికలు స హెడ్రిన్ సభలోగాక వేరే సభలో ప్రారంభమయ్యాయి. అరణ్యంలో క్రీస్తుపై విజయం సాధించడంలో విఫలమవ్వడంతో సాతాను తన సేనల్ని సమీకరించి తన పరిచర్యలో క్రీస్తుని వ్యతిరేకించాలని సాధ్యపడినంత మేరకు దానిని అడ్డుకోవాలని నిశ్చయించుకున్నాడు. ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా ఏదైతే సాధించలేకపోయాడో దాన్ని కుతంత్రం ద్వారా సాధించడానికి సమకట్టాడు. అరణ్యంలోని సంఘర్షణ నుంచి నిష్క్రమించిన వెంటనే అతడు తన సహచర దుష్టదూతలతో సమావేషమై యూదు ప్రజల మనసుల్ని మసకబార్చి తమ విమోచకుణ్ని గుర్తించకుండా వారిని అపమార్గం పట్టించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచించాడు. మత ప్రపంచంలో తన మానవ ప్రతినిధుల ద్వారా పని చెయ్యడానికి ప్యూహాలు తయారు చేసుకున్నాడు. తన మానవ ప్రతినిధులకు ఈ సత్యశూరునిపట్ల తన ప్రాతికూల్యాన్ని నూరిపోసే వారి ద్వారా పనిచేశాడు. క్రీస్తును నిరాకరించడానికి, తన కార్యాచరణ క్రమంలో ఆయన్ని నిరుత్సాహపర్చే ఉద్దేశంతో ఆయన్ని నిరాకరించడానికి, ఆయన బతుకు దుర్భరం చెయ్యడానికి వారిని సాధనాలుగా ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలు నాయకులు రక్షకునికి వ్యతిరేకంగా సమరం సాగించడానికి సాతాను చేతిలో ఆయుధాలయ్యారు.DATel 208.1

    యేసు “ఉపదేశ క్రమమొకటి ఘనపరచి గొప్ప” చేయడానికి వచ్చాడు. ఆయన దాని గౌరవాన్ని తగ్గించడం కాదు సమున్నతపరచాల్సి ఉన్నాడు. “భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు” అంటోంది లేఖనం. యెషయా 42:21,4. దీవెనగా ఉండాల్సిన సబ్బాతును శాపంగా మార్చిన భారమైన విధుల్ని తొలగించి దాని ఆచరణను సులభతరం చెయ్యడానికి ఆయన వచ్చాడు.DATel 208.2

    ఈ కారణం వల్లనే బేతెస్ధ కోనేటి వద్ద స్వస్తపర్చే కార్యాన్ని నిర్వహించడానికి ఆయన సబ్బాతు దినాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యాధిగ్రస్తుణ్ని స్వస్తపర్చడాన్ని వారంలో ఏ రోజునైనా ఎంచుకునేవాడే. లేదా తన పడక ఎత్తుకొని వెళ్లమని ఆదేశించకుండ బాగుచేసేవాడే. ఇలా చేస్తే తాను వాంఛించిన అవకాశం లభించేది కాదు. ఈ లోకంలో క్రీస్తు జీవితంలోని ప్రతీకార్యం వెనక ఒక మంచి ఉద్దేశం ఉండేది. ఆయన ఏ పనిచేసినా అది ప్రాముఖ్యమైంది అది బోధించిన పాఠం ప్రాముఖ్యమైంది. కోనేటి వద్ద పడి ఉన్న రోగుల్లో అతి దయనీయమైన రోగిని తన స్వస్తత శక్తిని వినియోగించేందుకు ఎంపిక చేసుకుని అతణ్ని తన పడకనెత్తుకుని పట్టణమంతా నడవవలసిందిగా ఆదేశించాడు. అతడి విషయంలో జరిగిన మహత్కార్యాన్ని వెల్లడి చేసేందుకు ఇలా అదేశించాడు. ఇది సబ్బాతు దినాన ఏ పని చెయ్యడం ధర్మసమ్మతం అన్న ప్రశ్నను లేవదీసి, ప్రభువు దినం సందర్భంగా యూదులు విధించిన ఆంక్షల్ని ఖండించడానికి, వారి సంప్రదాయాలు వ్యర్ధమైనవని ప్రకటించడానికి ఆయనకు మార్గం తెరవాల్సి ఉంది.DATel 208.3

    బాధలో ఉన్నవారికి సహాయం చేయడం సబ్బాతు నియమానికి అనుకూలమే గాని ప్రతికూలం కాదని యేసు వారికి తెలిపాడు. బాధల్లో ఉన్న మానవాళికి పరిచర్య చెయ్యడానికి నిత్యం పరలోకం నుంచి భూలోకానికి దిగుతూ ఎక్కుతూ ఉండే దేవదూతల సేవకు ఇది అనుబంధమైన సేవ. “నా తండ్రి యిది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను” అని యేసు అన్నాడు. మానవుల పట్ల తన ప్రణాళికల్ని అమలు చేయడానికి వారంలోని దినాలన్నీ దేవునివే. ధర్మశాస్త్రానికి యూదులు చెప్పే భాష్యం నిజమైందైతే, జగత్పునాది వేసినప్పటి నుంచి ప్రతీ ప్రాణి జీవం కలిగి కొనసాగేందుకు యెహోవా చేస్తోన్న పని నిమిత్తం ఆయన కూడా తప్పు చేస్తున్నవాడే! కనుక తాను చేసిన పనిని మంచిదిగా ప్రకటించి, సృష్టికార్యం పూర్తికి జ్ఞాపకార్థంగా సబ్బాతును ఎవరు స్థాపించారో ఆ ప్రభువు తన పనికి సమాప్తి పలికి నిరంతరం కొనసాగాల్సిన విశ్వనిర్వహణకార్యాన్ని ఆపాల్సి ఉంటుంది.DATel 209.1

    సబ్బాతునాడు సూర్యుడు తన విధుల నిర్వహణను ఆపాల్సిందని, నేలకు వెచ్చదనాన్నిచ్చే, మొక్కలకు పోషణనిచ్చే తన కిరణాల్ని ఉపసంహరించుకోమని దేవుడు ఆదేశించాలా? పొలాల్ని అడవుల్ని తడపవద్దని నదుల్ని తరంగాల్ని ఆగిపోవాల్సిందని ఆదేశించాలా? గోధుమ వరి పెరగడం ఆగిపోవాలా? చెట్లు పూసి మొగ్గలు పిందులు రావడం సబ్బాతునాడు నిలిచిపోవాలా?DATel 209.2

    అలా జరిగితే మానవులికి భూఫలాలుండవు. జీవితాన్ని ఆనందమయం వాంఛనీయం చేసే మంచివేవీ లోకంలో ఉండవు. ప్రకృతి మార్పులేకుండా నిరంతరం తన పనిని సాగించాల్సిందే. ఒక్కక్షణం కూడా దేవుడు తన పనిని ఆపడు. ఆపితే మనిషి మరణిస్తాడు. ఈ దినాన మనిషి చేయాల్సిన పని కూడా ఒకటుంది. జీవించేందుకు అగత్యమైన పనులు చెయ్యాలి. రోగులికి పరిచర్యచెయ్యాలి. అవసరంలో ఉన్నవారి అవసరాల్ని తీర్చాలి. సబ్బాతురోజున బాధలో ఉన్నవాడి బాధను నివారించని వ్యక్తిని దేవుడు నిరపరాధిగా ఎంచడు. దేవుని పరిశుద్ద విశ్రాంతి దినం మనుషుడికోసం ఏర్పాటయ్యింది. దయతో కృపతో కూడిన కార్యాలు సబ్బాతు స్ఫూర్తికి అనుగుణమైన కార్యాలు. సబ్బాతునాడుగాని మరేయితర దినాన గాని నివారించగల బాధను ఒక్కగంట కూడా తన బిడ్డలు భరించడం దేవునికి ఇష్టం ఉండదు.DATel 210.1

    తక్కిన రోజులకన్నా సబ్బాతు రోజున దేవునికి ఎక్కువ ఒత్తిడిలుంటాయి. ఆయన ప్రజలు తమ సాధారణ విధుల్ని విడిచి పెట్టి తమ సమయాన్ని ధ్యానంలోను దైవరాధనలోను గడుపుతారు. ఇతర దినాలకన్నా సబ్బాతు దినాన ఆయన ఉపకారాల్ని ఎక్కువ యాచిస్తారు. ఆయన ప్రత్యేక గమనాన్ని ఎక్కువ కోరారు. ఆయన విశిష్ఠ దీవెనల్ని కోరారు. ఈ కోరికలన్నింటినీ తీర్చడానికి దేవుడు సబ్బాతు గడిచే వరకు ఆగడు. దేవుడు చేసే పనికి అంతమంటూ ఉండదు. మనుషులు ఇతరులకు మేలు చేయడాన్ని ఎన్నడూ ఆపకూడదు. సబ్బాతు ప్రయోజనంలేని విరామకాలంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ప్రభువు విశ్రాంతిదినాన లోక సంబంధమైన పనిని ధర్మశాస్త్రం నిషేధిస్తోంది. ఉపాధి సంబంధిత శ్రమను మానాలి. వినోదం కోసం లాభం కోసం ఆ దినాన చేసే శ్రమ ధర్మశాస్త్రానికి విరుద్ధం. దేవుడు సృజించే పనిని ఆపి విశ్రాంతి దినాన విశ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధ పర్చిన రీతిగా మానవుడు తన జీవనోపాధికి చేసే పనులు ఆపి సబ్బాతు పరిశుద్ధ ఘడియల్ని ఆరోగ్యదాయక విశ్రాంతికి, దైవారాధనకు పరిశుద్ద కార్యాలకు వినియోగించాలి. వ్యాధిగ్రస్తుల్ని బాగు చెయ్యడంలో క్రీస్తు చేసిన పని ధర్మశాస్త్రానికి అనుగుణమైన పరిచర్య. అది సబ్బాతును ఘనపర్చిన సేవ.DATel 210.2

    తండ్రి పరలోకంలో నిమగ్నమై ఉన్న పరిశుద్ధమైన పనితో సమానమైన పరిశుద్ధ పరిచర్య చేస్తూ, యేసు దేవునితో సమాన హక్కులు గలవాణ్ని అన్నాడు. పరిసయ్యులికి మరింత అగ్రహం పుట్టింది. తమ అవగాహన ప్రకారం ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమేగాక దేవున్ని “తన సొంత తండ్రి” ఆనడంలో తాను దేవునితో సమానుణ్నని ప్రకటించాడు. యోహాను 5:18.DATel 210.3

    యూదు జాతి ప్రజలందరూ దేవున్ని తమ తండ్రి అని పిలిచారు. కనుక దేవునితో అదే విధమైన సంబంధంలో క్రీస్తు తన్నుతాను చూపించుకుని ఉంటే వారికి అంత కోపం వచ్చేది కాదు. కాని ఆయన దేవదూషణకు పాల్పడ్డాడన్నది వారి . ఆరోపణని, అత్యున్నత భావంతోనే ఆయన ఇలా ప్రకటించాడన్నది వారి అవగాహనని ఇది సూచిస్తోంది.DATel 211.1

    తమ మనస్సాక్షికి క్రీస్తు సమర్పిస్తున్న సత్యాల్ని ఎదుర్కోడానికి ఆయన ప్రత్యర్థుల వద్ద ఎలాంటి వాదనలూ లేవు. వారు చూపించగలిగిందల్లా తమ ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే. దైవవాక్యం అనంత ప్రకృతి ఆధారంగా యేసు సమర్పిస్తోన్న వాదనలతో పోల్చినప్పుడు ఇవి బలహీనంగా నిస్సారంగా ఉన్నా రబ్బీలకు సత్యం తెలుసుకోవాలన్న ఆశ ఏకోశాన ఉన్నా యేసు సత్యాన్ని వచించాడన్న నమ్మకం వారికి కలిగేది. కాని సబ్బాతును గురించి ఆయన లేవదీసిన అంశాల్ని దాటవేసి, తాను దేవునితో సమానుణ్ణన్న అంశంపై ఆగ్రహావేశాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అధికారుల ఆగ్రహావేశాలకు హద్దులు లేవు. ప్రజలకు భయపడి ఉండకపోతే యాజకులు రబ్బీలు యేసుని అక్కడికక్కడే చంపి ఉండేవారు. ఆయనకు గొప్ప ప్రజాదరణ ఉండడంతో వారు వెనకంజవేశారు. అనేకులు యేసుని తమను స్వస్తపర్చిన మిత్రుడుగా, దుఃఖాల్లో తమను ఓదార్చిన నేస్తంగా గుర్తించారు. బేతెస్ధ వద్ద ఆ వ్యాధిగ్రస్తుణ్ని ఆయన స్వస్తపర్చడాన్ని వారు సమర్ధించారు. అందుచేత ఆ నాయకులు తమ ద్వేషాన్ని అణచి ఉంచుకోక తప్పలేదు.DATel 211.2

    దేవదూషణ ఆరోపణను యేసు తిప్పికొట్టాడు. ఏ పని చేస్తున్నందుకు మీరు నన్ను నిందిస్తోన్నారో ఆ పని చెయ్యడానికి నాకున్న అధికారమేంటంటే నేను దేవుని కుమారుణ్ణి, స్వభావం చిత్తం, సంకల్పం విషయాల్లో ఆయన నేను ఒకటే అన్నాడు. సృష్టి కార్యాల్లోను ఆలోచనల్లోను దేవునికి సహకరిస్తాను. “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు” దైవ కుమారుడు ఏ కర్తవ్య సాధనకు ఈ లోకానికి వచ్చాడో అది చేస్తున్నందుకు యాజకులు రబ్బీలు ఆయన్ని నిందిస్తోన్నారు. వారు తమ పాపాల వల్ల దేవునికి దూరమయ్యారు. అహంకార పూరితులై ఆయనతో సంబంధం లేకుండా తిరుగుతున్నారు. అన్ని విషయాల్లో తాము సమృద్ధులమని భావించారు. తమ కార్యాల విషయంలో ఉన్నత జ్ఞాన దిశానిర్దేశం అవసరం లేదని భావించారు. దైవకుమారుడైతే తన్నుతాను దేవుని చిత్తానికి అప్పగించుకుని ఆయన శక్తి మీద ఆధారపడ్డాడు. క్రీస్తులో స్వార్థం ఎంత సంపూర్తిగా లోపించిందంటే తన్ను గూర్చి దేవుని ప్రణాళికల్నే ఆయన అంగీకరించాడు. తండ్రి తన ప్రణాళికల్ని ఆయనకు రోజువారీగా వెల్లడిచేశాడు. ఆ రీతిగా మనం దేవునిమీద ఆధారపడాలి. అప్పుడు మన జీవితాలు క్రియారూపంలో ఉన్న దేవుని చిత్తం అవుతాయి.DATel 211.3

    దేవునికి నివాస స్థలంగా గుడారాన్ని నిర్మించడానికి మోషే సిద్ధపడున్నప్పుడు, కొండ పై తనకు చూపించిన మాదిరి ప్రకారం నిర్మించాల్సిందిగా ఆదేశం పొందాడు. దైవకార్యాన్ని నిర్వర్తించడానికి మోషే ఉత్సాహంతో నిండి ఉన్నాడు. అతడి సూచనల్ని అమలుపర్చడానికి ప్రతిభ నైపుణ్యాలు గల పనివారు అందుబాటులో ఉన్నారు. అయినా ఆ మాదిరి ప్రకారమే తప్ప తన సొంతంగా ఒక గంటను గాని, దానిమ్మ పండునుగాని, కుచ్చుగాని, పట్టికగాని, తెరగాని చేయడానికి లేదు. దేవుడు అతణ్ని కొండపైకి పిలిచి అతడికి పరలోక విషయాలు ప్రత్యక్షపర్చాడు. అతడు ఆ మాదిరిని చూసేందుకోసం దేవుడు తన మహిమతో అతణ్ని కప్పాడు. ఆ మాదిరి ప్రకారం మోషే గుడారాన్ని, సంబంధిత ఉపకరణాల్ని చేశాడు.DATel 212.1

    అలాగే దేవుడు తన నివాసస్థలం చేసుకోవడానికి ఎంపిక చేసుకున్న ఇశ్రాయేలుకు తన మహిమకరమైన ప్రవర్తన మాదిరిని బయలుపర్చాడు. సీనాయికొండ మీద నుంచి ధర్మశాస్త్రాన్ని ప్రకటించినప్పుడు, మోషేని దాటివెళ్తూ “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల. దేవుడైన యెహోవా ఆయన వేయి వేల మందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును” (నిర్గ 34:6, 7) అని ప్రకటించినప్పుడు ఆ మాదిరిని వారికి బయలుపర్చాడు.DATel 212.2

    ఇశ్రాయేలు ప్రజలు తమ సొంతమార్గాన్ని ఎన్నుకున్నారు. వారు ఆ మాదిరిననుసరించి నిర్మించలేదు. కాని దేవుడు నివసించేందుకు నిజమైన ఆలయమైన క్రీస్తు తన భూలోక జీవితంలోని ప్రతివిషయాన్ని దేవుని ఆదర్శాన్ననుసరించి నిర్మించుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. ” కీర్తనలు 40:8. కనుక మన ప్రవర్తనలు “ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు” నిర్మితమవ్వాల్సి ఉన్నాయి. ఎఫె 2:22. మనం “చూపబడిన మాదిరి చొప్పున సమస్తము” చెయ్యాలి. “మీ కొరకు బాధపడి, మిరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి” పోయాడు ఆయన. హెబ్రీ 8:5; 1 పేతు 2:21.DATel 212.3

    పరలోకమందున్న తండ్రితో మనకు వీడని అనుబంధమున్నట్లు మనం పరిగణించాలని క్రీస్తు మాటలు బోధిస్తోన్నాయి. మన స్థితి ఏమైనా భవిష్యత్తును తన చేతిలో ఉంచుకున్న దేవునిమీద మనం ఆధారపడి ఉన్నాం. మనకు మన పనిని ఆయన నియమించాడు. ఆ పనిని చేసేందుకు జ్ఞానాన్ని సాధన సంపత్తిని మనకిచ్చాడు. మనం మన చిత్రాన్ని దేవునికి సమర్పించి ఆయన శక్తి మీద, వివేకం మీద నమ్మకముంచినంత కాలం తన బృహత్ ప్రణాళికలో మనకు నియమితమైనవి నెరవేర్చడంలో మనల్ని సురక్షిత మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. కాని తన సొంత వివేకాన్ని శక్తిని నమ్ముకుని పనిచేసే వ్యక్తి దేవుని నుంచి వేరైపోతాడు. క్రీస్తుతో కలిసి పనిచేసే బదులు దేవునికి మానవుడికి శత్రువు అయిన సాతాను ఉద్దేశాల్ని నెరవేర్చుతున్నవాడవుతాడు.DATel 213.1

    రక్షకుడింకా ఇలా అన్నాడు: “ఆయన (తండ్రి) వేటిని చేయునో వాటినే కుమారుడును ఆలాగే చేయును... తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తన కిష్టము వచ్చిన వారిని బ్రతికించును.” శరీరానికి పునరుత్థానం లేదని సదూకయ్యులు ప్రబోధించారు. అయితే తన తండ్రి చేసే మహోత్తమ కార్యాల్లో ఒకటి మృతుల్ని లేపడమని, తనకు కూడా మృతుల్ని.. లే.పే శక్తి ఉందని యేసు వారికి విశదీకరించాడు. “మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురు.” పరిసయ్యులు మృతుల పునరుత్థానాన్ని విశ్వసించారు. మరణించిన వారిని బతికించే శక్తి ఇప్పుడు సయితం తమ మధ్య ఉందని, వారు ఆ ప్రదర్శనను కన్నులెత్తి వీక్షించాల్సి ఉందని క్రీస్తు వెల్లడించాడు. ఇదే పునరుత్థాన శక్తి “అపరాధముల చేతను పాపముల చేతను... చచ్చిన” ఆత్మకు జీవాన్నిస్తుంది. ఎఫె 2:1. క్రీస్తు యేసులోని ఆ జీవం అనగా “ఆయన పునరుత్థాన బలము” మనషుల్ని “పాపమరణముల నియమము నుండి” విడిపిస్తుంది. ఫిలిప్పీ3:10; రోమా 8:2. పాపం ప్రాబల్యం అంతమయ్యింది. విశ్వాసం ద్వారా ఆత్మ పాపానికి దూరంగా ఉంటుంది. ఎవరైతే తమ హృదయాల్ని క్రీస్తు ఆత్మకు తెరుస్తారో అతడు ఈ మహత్తర శక్తిలో పాలిభాగస్తుడవుతాడు. ఆ శక్తి అతడి శరీరాన్ని సమాధిలో నుంచి లేపి బయటికి తెస్తుంది.DATel 213.2

    ఈ దీన నజరేయుడు తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. మానవాళికి పైగా లేచాడు. సిగ్గుతో కూడిన పాపస్వరూపాన్ని విడిచి పెట్టాడు. లేచి తన్నుతాను సాక్షాత్కరించుకున్నాడు. ఆయన దూతల గౌరవం అభివందనం అందుకునేవాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన విశ్వసృష్టికర్తతో సమాన ప్రతిపత్తి గలవాడు. ఆయన శ్రోతలు నిశ్శబ్దంగా వింటున్నారు. ఆయనలా ఎవరూ ఎన్నడూ మాట్లాడలేదు. ఆయనలాంటి రాజఠీవి ఎవరూ ప్రదర్శించలేదు. ఆయన మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మాటలు ఆయన కర్తవ్యాన్ని విస్పష్టంగా సంపూర్ణంగా వెల్లడించాయి. లోకం చేయాల్సిందేంటో వివరించాయి. “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపర్చునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు... తండ్రి యేలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్యకుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను.”DATel 214.1

    క్రీస్తు పరిచర్యను ఖండించడానికి యాజకులు ప్రధానులు తమ్మును తామే న్యాయాధిపతులుగా నియమించుకున్నారు. కాని తమకూ తమకు మాత్రమే కాక భూమిపై ఉన్న జనులందరికీ తానే న్యాయాధిపతినని ఆయన ప్రకటించాడు. లోకాన్ని క్రీస్తుకి అప్పగించాడు దేవుడు. ప్రతీ ఆశీర్వాదం క్రీస్తు ద్వారా దేవుని వద్ద నుంచి పాపమానవులకు వస్తోంది. నరావతారం తర్వాత విమోచకుడైన ఆయన దానికి ముందు కూడా విమోచకుడే. పాపం చోటుచేసుకున్న వెంటనే రక్షకుడు లేచాడు. ఆయన అందరికీ వెలుగును జీవాన్ని ఇస్తున్నాడు. తమకు అందిన వెలుగు ప్రకారం ప్రతీవారు తీర్పు పొందాల్సి ఉన్నది. వెలుగునిచ్చేవాడు, ఆత్మను పాపం నుంచి పరిశుద్ధతకు నడిపించడానికి ప్రేమతో విజ్ఞాపన చేస్తూ దాన్ని వెంబడిస్తున్నవాడు అయిన ప్రభువే న్యాయాధిపతి ఉత్తరవాది కూడా. పరలోకంలో మహాసంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి సాతాను పథకాల్ని వ్యూహల్ని బైటపెట్టి అతణ్ని నిర్వీర్యం చెయ్యడానికి క్రీస్తు పనిచేస్తోన్నాడు. వంచకుణ్ని ఎదుర్కొంటున్నవాడు, అతడి చెరనుంచి బందీలను విడిపించడానికి యుగాల పొడవునా పోరాడుతున్న వాడు ఆయనే. ప్రతీవారికి తీర్పు తీర్చేవాడు ఆయనే.DATel 214.2

    “ఆయన మనుష్యకుమారుడు తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను.” ఆయన మానవ శ్రమలను శోధనలను అనుభవించి మనుషుల బలహీనతలను పాపాలను అవగాహన చేసుకున్నాడు. గనుక ఆయన మన పక్షంగా సాతాను శోధనల్ని జయప్రదంగా ఎదుర్కొన్నందువల్ల తాను ఎవరికోసం తన రక్తాన్ని చిందించాడో ఆ ఆత్మల పట్ల ఆయన న్యాయంగా దయగా వ్యవహరిస్తాడు గనుక -ఈ హేతువు చేత మనకు తీర్పు తీర్చడానికి మనుష కుమారుడు నియమితుడయ్యాడు.DATel 215.1

    కాగా క్రీస్తు కర్తవ్యం తీర్పు తీర్చడం కాదు. రక్షించడం. “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.” యోహాను 3:17.DATel 215.2

    ఆశ్చర్యపడవద్దంటూ తన శ్రోతలకు హితవు పలుకుతూ, భవిష్యత్తును గూర్చి వారికి మరిన్ని మర్మాలు క్రీస్తు వివరించాడు. “ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవపునరుత్థానముకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అన్నాడు. యోహాను 5:28, 29.DATel 215.3

    భావి జీవితాన్ని గూర్చిన ఈ నిశ్చయత కోసం ఇశ్రాయేలు ప్రజలు అంతకాలం ఎదురుచూశారు. మెస్సీయా వచ్చినప్పుడు దాన్ని పొందగలమని ఆశించారు. సమాధిని ముసురుతున్న చీకటిని పటాపంచలు చేయగల వెలుగు వారి మీద ప్రకాశిస్తోంది. అయితే అహంకారం గుడ్డిది. యేసు రబ్బీల సంప్రదాయాల్ని అతిక్రమించాడు. రబ్బీల అధికారాన్ని తోసిపుచ్చాడు. అందుకు వారు ఆయన్ని విశ్వసించలేదు.DATel 215.4

    సమయం, స్థలం, సందర్భం, సభలోని వారి భావోద్వేగాల ఉదృతి ఇవన్నీ కలిసి, సన్ హెడ్రి లో యేసు పలికిన మాటలకు ప్రాధాన్యాన్ని చేకూర్చాయి. ఇశ్రాయేలు పునరుద్దారకుడుగా తన్నుతాను ప్రకటించుకున్న ఆయనను ఆ జాతి అత్యున్నత మతాధికారం మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తోంది. సబ్బాతుకు ప్రభువు సబ్బాతు ఉల్లంఘన ఆరోపణపై ఓ భూలోక న్యాయస్థానంలో తీర్పుకోసం నిలబడ్డాడు. ఆయన తన కర్తవ్యాన్ని నిర్భయంగా వ్యక్తం చేసినప్పుడు ఆ న్యాయాధిపతులకి ఆయనపట్ల విస్మయం కలిగింది కోపం కూడా వచ్చింది. అయినా ఆయన మాటలకి వారి వద్ద సమాధానాలు లేవు. ఆయన్ని ఖండించలేకపోయారు. తనను ప్రశ్నించడానికి గాని తన పనితో జోక్యం చేసుకోడానికి గాని వారికి హక్కులేదని కుండబద్దలు కొట్టాడు. వారికి ఆ అధికారం దఖలు పడలేదు. తమకున్నదంటూ వారు ఊరేగుతున్న హక్కులు వారి గర్వం మిద వారి దురహంకారం మీద ఆధారితమై ఉన్నాయి. వారు మోపిన నేరాల్ని అంగీకరించి అపరాధినంటూ విజ్ఞాపన చెయ్యలేదు. వారి ప్రశ్నలకు సంజాయిషీ చెప్పలేదు.DATel 216.1

    తాను చేశాడని వారు ఫిర్యాదు చేసిన కార్యానికి క్షమాపణ చెప్పే బదులు లేదా దాన్ని చేయడంలో తన ఉద్దేశాన్ని కార్యానికి క్షమాపణ్ని చెప్పే బదులు లేదా దాన్ని చేయడంలో తన ఉద్దేశాన్ని వివరించే బదులు యేసు ఆ ఆధికారుల మీద విరుచుకుపడ్డాడు. నిందితుడు నిందారోపకుడయ్యాడు. తమ హృదయ కాఠిన్యానికి, తమ లేఖన అజ్ఞానానికీ వారిని మందలించాడు. దేవుడు పంపిన తనను నిరాకిరించినందున దైవ వాక్యాన్ని నిరాకరించారని ప్రకటించాడు. “లేఖనముల యందు నాకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” యోహాను 5:39.DATel 216.2

    పాత నిబంధన లేఖనాల్లోని చరిత్ర గాని నీతి సూత్రాలు గాని ప్రవచనం • గాని ఏది తీసుకున్నా ప్రతీ పుటా దైవ కుమారుని మహిమతో ప్రజ్వలిస్తోంది. దైవ స్థాపితమైనంతమేరకు ఆయూదు మత వ్యవస్థ మొత్తం సువార్త తాలుకు సంక్షిప్త ప్రవచనం అనవచ్చు. క్రీస్తును గూర్చి “ప్రవక్తలందరు... సాక్ష్యమిచ్చుచున్నారు.” అ.కా. 10:43. ఆదాముకిచ్చిన వాగ్దానం లగాయతు పితరుల వంశావళీ, ధర్మశాస్త్ర కాలం వరకూ పరలోకం నుంచి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చిన వెలుగులో విమోచకుని అడుగుజాడలూ స్పష్టంగా కనిపించాయి. భవిష్యత్తును గూర్చిన సంగతులు అద్భుత రీతిగా తమ ముందు నుంచి వెళ్తుండగా దీర్ఘదర్శులు బేల్లెహేము నక్షత్రాన్ని అనగా రానున్న షిలో హును చూశారు. ప్రతీ బలి అర్చణ క్రీస్తు మరణాన్ని సూచించింది. మేఘంలా పైకి లేచిన ప్రతీ ధూపంలో ఆయననీతి పైకి ఎగసింది. సునాద సంవత్సరంలోని ప్రతీ శృంగనాదం ఆయన పేరును పలికింది. మర్మపూరితమైన అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మహిమ నిలిచి ఉంటుంది.DATel 216.3

    యూదులకు లేఖనాలున్నాయి. కేవలం వాక్యజ్ఞానం ఉంటే సరిపోతుంది. అది తమకు నిత్య జీవనాన్నిస్తుందని వారు భావించారు. “మీలో ఆయన వాక్యము నిలిచి యుండలేదు.” అని యేసు అన్నాడు. క్రీస్తు వాక్యాన్ని విసర్జించిన వారు ఆయనను వ్యక్తిగతంగా తిరస్కరించారు. ఆయన ఇలా అన్నాడు, “నాకు జీవము కలుగునట్లు వారు నాయొద్దకు రండి”DATel 217.1

    మెస్సీయా రాజ్యం గురించి యూదు నాయకులు ప్రవక్తల బోధనల్ని పఠించారు. సత్యం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వారాపని చెయ్యలేదు. తమ స్వార్ధ ప్రయోజనాలతో కూడిన తమ ఉద్దేశాలు ఆశాభావాలకు నిదర్శనం కనుగొనాలన్న కోరికతో పఠించారు. తాము ఎదురుచూసిన దానికి విరుద్ధమైన రీతిలో క్రీస్తు వచ్చినప్పుడు వారు ఆయన్ని అంగీకరించలేదు. తమ్మును తాము సమర్ధించుకునే ప్రయత్నంలో ఆయన వంచకుడని నిరూపించడానికి ప్రయత్నించారు. వారు ఒక్కసారి ఈ మార్గంలో కాలు మోపిన తర్వాత, క్రీస్తు పట్ల వారి శత్రుత్వాన్ని పటిష్ఠపర్చడం సాతానుకి నల్లేరు పై బండినడక అయ్యింది. ఆయన దేవత్వానికి నిదర్శనంగా అంగీకరించాల్సిన మాటల్ని ఆయనకు వ్యతిరేకంగా భాష్యం చెప్పడానికి వినియోగించారు. దైవ సత్యాన్ని ఇలా అబద్ధంగా మార్చారు. తన కృపాకార్యాల ద్వారా రక్షకుడు వారితో ఎంత ప్రత్యక్షంగా మాట్లాడితే సత్యాన్ని ప్రతిఘటించడానికి వారు అంత కృతనిశ్చయులయ్యారు.DATel 217.2

    “నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను” అని యేసు అన్నాడు. ఆయన సన్ హెడ్రిన్ ప్రాపకాన్ని గాని అంగీకారాన్ని గాని కోరలేదు. ఆ సభ ప్రశంసల వల్ల ఆయన పొందగల గౌరవం ఏదీలేదు. ఆయనకు గౌరవం అధికారం నేరుగా దేవుని వద్ద నుంచే వచ్చాయి. ఆయన ఊ అంటే దేవదూతలే దిగివచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేవారు. ఆయన దేవత్వాన్ని స్వయంగా తండ్రి ధ్రువీకరించే వాడు. కాని వారి నిమిత్తం, వారు ఏ జాతికి నాయకులో ఆ జాతి నిమిత్తం, యూదు ప్రధానులు తన నడవడిని గ్రహించి తాను వారికి ఒనగూర్చడానికి వచ్చిన మేళ్లను వారు పొందాలని ఆయన ఆకాంక్షించాడు.DATel 218.1

    “నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను; మీరు నన్ను అంగీకరింపరు. మరియొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు” యేసు తండ్రి రూపం ధరించి, ఆయన మాటను నెరవేర్చుతూ, ఆయన మహిమను వెదకుతూ, ఆయన ఆధికారంతో వచ్చాడు. అయినా ఇశ్రాయేలు నేతలు ఆయన్ని అంగీకరించలేదు. కాని క్రీస్తు ప్రవర్తనను ధరించి, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ స్వీయ ప్రాభవాన్ని కోరుకుంటూ ఇతరులు వచ్చినప్పుడు వారిని ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించారు. ఎందుచేత? ఎందుకంటే సొంత ప్రతిష్ఠను ఆశించే వ్యక్తి ఇతరుల్లో అదే కోరికను ప్రోత్సహించడానికి సాధనమౌతాడు. అలాంటి ప్రోత్సాహాలకు యూదులు స్పందించారు. వారు అబద్ధ బోధకుడికి ఆహ్వానం పలికారు. ఎందుకంటే అతడు వారి అహంభావం పై ఆమోద ముద్రవేసి వారి అభిప్రాయాల్ని సంప్రదాయాల్ని గౌరవించాడు. ఇక క్రీస్తు మాటకొస్తే, ఆయన బోధ వారి అభిప్రాయలతో ఏకీభవించలేదు. అది ఆధ్యాత్మికం. అది ఆత్మత్యాగాన్ని కోరింది. అందువలన వారు ఆ బోధను అంగీకరించలేదు. వారికి దేవునితో పరిచయం లేదు. అందుకే క్రీస్తు ద్వారా మాట్లాడిన ఆయన స్వరం వారికి ఓ అపరిచిత స్వరంలా ఉంది.DATel 218.2

    ఇదే మన రోజుల్లోనూ పునరుక్తి అవ్వడం లేదా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తమ హృదయాల్ని కఠినపర్చుకుంటున్నవారు ఆ విధంగా దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం అసాధ్యపర్చుకుంటున్నవారు మతనాయకులు సహా అనేకమంది లేరా? తమ సంప్రదాయాల్ని భద్రపర్చుకునే ప్రయత్నంలో వారు దేవుని వాక్యాన్ని విసర్జించడం లేదా?DATel 218.3

    యేసు ఇలా అన్నాడు, “మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురు?” మోషే ద్వారా క్రీస్తే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. తమ మహానాయకుడు మోషే ద్వారా వచ్చిన దైవ స్వరాన్ని వారు విన్నట్లయితే దానిలోని క్రీస్తు బోధనల్ని వారు గుర్తించి ఉండేవారు. వారు మోషేని నమ్మినట్లయితే మోషే ఎవర్ని గురించి రాశాడో ఆయనను వారు నమ్మేవారు.DATel 219.1

    యాజకులు రబ్బీలు తన్ను చంపడానికి కృతనిశ్చయంతో ఉన్నారని యేసు ఎరుగును. అయినా తండ్రితో తన ఏకత్వాన్ని గురించి, లోకంతో తన సంబంధాన్ని గురించి ఆయన వారికి స్పష్టంగా వివరించాడు. ఆయనతో తమ శత్రుత్వం కారణరహితమని వారు గ్రహించారు. అయినా వారి క్రూరమైన ద్వేషం చల్లారలేదు. ఆయన పరిచర్యలో ప్రదర్శితమైన శక్తిని కళ్లారా చూసినప్పుడు వారు భయంతో వణికారు. అయినా ఆయన విజ్ఞాపనల్ని విసర్జించి చీకటిలో మిగిలిపోయారు.DATel 219.2

    యేసు అధికారాన్ని దొంగదెబ్బ తియ్యడంలో గాని లేక ప్రజల గౌరవాభిమానాల్ని గమనాన్ని ఆయనకు దక్కకుండా చెయ్యడంలో గాని వారు ఘోర పరాజయం పొందారు. ప్రజల్లో చాలామందిని ఆయన బోధలు ఆకర్షించాయి. ప్రధానుల పాపాల నిమిత్తం వారి మనస్సాక్షుల్ని ఆయన మేలుకొల్పడంతో వారు తమ దోషిత్వం గురించి తీవ్ర ఆత్మ ఖండనకు గురి అయ్యారు. ఇది వారిని మరింత ద్వేషంతో నింపింది. ఆయన ప్రాణం తియ్యడానికి వారు నిశ్చయించుకున్నారు. యేసు మారువేషం ధరించిన మోసగాడని ప్రజల్ని హెచ్చరించడానికి దేశం నలుదిశలకీ దూతల్ని పంపించారు. ఆయన కదలికల్ని గమనించడానికీ ఆయన మాటల్ని పనుల్ని నిషేదించడానికీ గూఢచారుల్ని నియమించారు. నిస్సందేహంగా, రక్షకుడు ఇప్పుడు సిలువ క్రీనీడలో నిలిచి ఉన్నాడు.DATel 219.3