Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  20—“సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే...”

  పస్కాపండుగ చేసుకుని తిరిగివచ్చిన గలిలయులు యేసు అద్భుతకార్యాల్ని గూర్చిన నివేదికను తీసుకువచ్చారు. యెరుషలేములోని అధికారులు ఆయన కార్యాల్ని గురించి వెలిబుచ్చిన తీర్పు ఆయనకు గలిలయలోకి మార్గాన్ని తెరిచింది. అనేకులు ఆలయ దుర్వినియోగాన్ని యాజకుల దురాశను అహంకారాన్ని గర్జించారు. పాలకులను తరిమివేసిన ఈ వ్యక్తి తాము ఎదురుచూస్తున్న విమోచకుడు కావచ్చునన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన వార్తలు తాము ఎదురుచూసిన దాన్ని ధ్రువపర్చుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రవక్త తానే మెస్సీయానని ప్రకటించుకున్నాడని కూడా ప్రజలు చెప్పుకోడం జరుగుతోంది.DATel 196.1

  ఇకపోతే నజరేతులోని ప్రజలు ఆయన్ని విశ్వసించలేదు. అందుకే యేసు కానాకు వెళ్ళేటప్పుడు నజరేతుని సందర్శించలేదు. ప్రవక్తకు తన స్వస్థలంలో మన్నన ఉండదని రక్షకుడు తన దగ్గరున్న శిష్యులతో అన్నాడు. మనుషులు తాము దేన్ని అభినందించగలుగుతారో దాన్ని బట్టి ప్రవర్తనను అంచనా వేస్తారు. సంకుచిత, లౌకిక భావాలు గలవారు క్రీస్తును దీన జన్మను బట్టి ఆయన సామాన్య వస్త్రధారణను బట్టి ఆయన దినదిన శ్రమజీవితాన్ని బట్టి క్రీస్తు విషయమై అభిప్రాయాలు ఏర్పర్చుకున్నారు. పాప కళంకంలేని ఆయన పరిశుద్ధ స్వభావాన్ని వారు అభినందించ లేకపోయారు.DATel 196.2

  క్రీస్తు కానాకు తిరిగివచ్చాడన్న వార్త గలిలయ అంతటా వ్యాపించింది. బాధలు దుఃఖాలు అనుభవిస్తున్న వారిలో ఆ వార్త ఆశలు రేపింది. కపెర్నహోములో ఆ వార్త రాజు వద్ద పనిచేస్తున్న వారిని ఆకర్షించింది. ఆ ప్రధాని కుమారుడొకడు నయంకాని వ్యాధితో బాధపడ్తున్నాడు. వైద్యులు అతణ్ని మరణించడానికి విడిచిపెట్టేశారు. కాని అతడి తండ్రి క్రీస్తును గురించి విని ఆయన్ని ఆశ్రయించాలనుకున్నాడు. ఆ బాలుడు క్లిష్టపరిస్థితిలో ఉన్నాడు. తండ్రి తిరిగివచ్చే వరకు బతికి ఉంటాడన్న భరోసాలేదు. అయినా తన కుమారుడి సంగతిని ప్రభువుకి వ్యక్తిగతంగా చెప్పుకోవాలని ఆ ప్రధాని ఉద్దేశించాడు. ఆందోళనతో నిండిన హృదయంతో అతడు రక్షకుని వద్దకు వెళ్లాడు. ఉన్న, ప్రయాణంవల్ల దుమ్ముతో నిండిన దుస్తులు ధరించిన సాదాసీదా వ్యక్తిని చూసినప్పుడు అతడి విశ్వాసం కొంచెం సడలింది. తాను ఆశించిన కార్యాన్ని ఈ వ్యక్తి చేయగలడా అన్న సందేహం అతడికి కలిగింది. అయినా యేసుతో సమావేశం లభించింది. తాను వచ్చిన పని ఏంటో ఆయనికి చెప్పాడు. తన ఇంటికి రావలసిందిగా రక్షకుణ్ని ప్రాధేయపడ్డాడు. అయితే అప్పటికే యేసు అతడి ఆవేదనను గ్రహించాడు. ఆ ప్రధాని తన ఇంటి నుంచి బయలుదేరకముందే అతడి బాధను రక్షకుడు వీక్షించాడు. తనను విశ్వసించడం విషయంలో ఆ తండ్రి మనసులో కొన్ని షరతులున్నట్లు యేసుకు తెలుసు. అతడు కోరింది నెరవేరితేనే తప్ప ఆయన్ని మెస్సీయాగా అతడు స్వీకరించడు. ఆ ప్రధాని తీవ్ర అందోళనతో ఉత్కంఠతో వేచి ఉండగా యేసు “సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత చూత్రము నమ్మరు” అన్నాడు.DATel 197.1

  యేసే మెస్సీయా అనడానికి కోకొల్లలుగా నిదర్శనం ఉన్నప్పటికీ, తాను కోరింది సాకారం కావడాన్నే ఆ ప్రధాని తన విశ్వాసానికి షరతుగా పెట్టుకున్నాడు. సందేహం అపనమ్మకంతో కూడిన ఈ వైఖరికీ సూచకక్రియను గాని గుర్తునుగాని అడగని సమరయుల సరళ విశ్వాసానికీ మధ్య ఉన్న భేదాన్ని రక్షకుడు గుర్తించాడు. ఆయన మాటే ఆయన దేవత్వానికి నిత్య నిదర్శనం. వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయి విశ్వసింపజేసే శక్తి ఆ మాటకుంది. దేవుడు పరిశుద్ధ లేఖనాల్ని ఎవరికి దఖలు పర్చాడో అట్టి తన ప్రజలే ఆయన తన కుమారునిద్వారా తమతో మాట్లాడుంటే వినకపోవడం క్రీస్తుకి హృదయవేదన కలిగించింది.DATel 197.2

  ఈ ప్రధాని కొంత మేరకు విశ్వాసం కలవాడే, ఎందుకంటే అతడు తన దృష్టికి మిక్కిలి ప్రశస్తమైనదిగా కనిపించిన దీవెనను ఆశించి వచ్చాడు. యేసు వద్ద అంతకన్నా ప్రశస్తమైన దీవెన ఉంది. అతడికివ్వడానికి అతడి కుమారుణ్ని బాగుపర్చడమే కాదు, రక్షణ దీవెనను పంచడంలోను త్వరలో తన సేవాప్రాంగణం కానున్న క పెర్నహోములో సత్యజ్యోతిని వెలిగించడంలోను ఆ ప్రధానిని అతడి కుటుంబాన్ని భాగస్వాములు చెయ్యాలని ప్రభువు ఆకాంక్షించాడు. క్రీస్తు కృపను ఆకాంక్షించక ముందు ప్రధాని తన అవసరమేంటో గుర్తించాలి. ఈ ఆస్థానికుడు తన దేశంలో అనేకులకు ప్రతినిధి. వారు స్వార్థప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని యేసుపట్ల ఆసక్తి కనపర్చారు. ఆ ప్రయోజన సాఫల్యం నాదే వారి విశ్వాసం ఆధారితమై ఉంది. అయితే తమలో ప్రబలుతోన్న ఆధ్యాత్మిక వ్యాధి ఏంటో వారికి తెలియలేదు. తమకు దైవకృప అగత్యమన్న సంగతి వారు గుర్తించలేదు.DATel 198.1

  రక్షకుని మాటలు వెలుగుగా ప్రకాశించి ఆ ప్రధాని హృదయాన్ని బహిర్గతం చేశాయి. యేసుని వెదకడంలో తనకు స్వార్ధం ఉందని గుర్తించాడు. చంచలమైన తన విశ్వాసం నిజస్వరూపం అతడికి గోచరమయ్యింది. తన శంక తన కుమారుడి ప్రాణానికే ముప్పుతెస్తుందని దిగులు చెందాడు. హృదయంలోని తలంపులు ఎవరికి తెలుసో, ఎవరికి సమస్తం సాధ్యమో ఆ ప్రభువు సన్నిధిలో తానున్నానని అతడు గుర్తించాడు. వేదనతో నిండిన హృదయంతో ఇలా మనవి చేశాడు, “ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్ము.” దేవదూతతో పెనుగులాడూ, “నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను.” (ఆది 32:26) అన్న యాకోబు విశ్వాసంలా అతడి విశ్వాసం క్రీస్తును బంధించింది.DATel 198.2

  యాకోబుమల్లే అతడు విజయం సాధించాడు. ఆత్మ తన అవసరాన్ని పురసర్కించుకొని విజ్ఞాపన చేస్తూ ఆయన్ని పట్టుకొని ఉన్నప్పుడు రక్షకుడు ఆ ఆత్మను విడిచి పెట్టి వెళ్ళలేడు. “నీవు వెళ్ళుము, నీకుమారుడు బ్రదికియున్నాడు” అని ఆయన అన్నాడు. సంతోషానందాలు శాంతి సమాధానాలతో నిండిన హృదయంతో ప్రధాని ప్రభువు సన్నిధినుంచి వెళ్లిపోయాడు. తన కుమారుడు స్వస్తత పొందాడని నమ్మడమే కాదు క్రీస్తే విమోచకుడని అతడు ప్రగాఢంగా విశ్వసించాడు.DATel 198.3

  కపెర్నహోములో తన గృహంలో మరణించడానికి సిద్ధంగా ఉన్న ఆ బాలుడుకి సపర్యలు చేస్తూ ఆ బిడ్డ చుట్టూ ఉన్నవారు అదే గడియలో అతడి పరిస్థితిలో విచిత్రమైన మార్పుకలగడం గుర్తించారు. బాధితుడి పై ముసురుతున్న మరణఛాయలు తొలగిపోయాయి. జ్వరం పోయింది. నిగనిగలాడుతున్న ఆరోగ్యం తిరిగి వచ్చింది. కళ్లల్లో మళ్లీ కాంతినిండింది. చిక్కిన శరీరం బంలంతో పరిపుష్టమయ్యింది. వ్యాధి చిహ్నలేమి బాలుడిలో కనిపించలేదు. జ్వరంతో మండిపోతున్న అతడి దేహం మృదువుగా కోమలంగా తయారయ్యింది. బిడ్డ ప్రశాంతంగా నిద్రపోయాడు. పగలు వేడిగా ఉన్న సమయంలోనే జ్వరం పోయింది. ఆ పరిణామం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యంలో ముంచింది. ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి.DATel 199.1

  కానా కపెర్నహోముకు ఎక్కువ దూరంలో లేదు. యేసుతో సమావేశం అయిన దినం సాయంత్రానికి ఆ ప్రధాని తన గృహం చేరుకోవచ్చు. కాని అతడు ఇంటికి బయల్దేరేందుకు తొందరపడలేదు. మరుసటి ఉదయమే కపెర్నహోము చేరుకున్నాడు. ఇంటికి అతడి తిరిగి రాక ఎంత ఆనందమయం! యేసును కలవడానికి వెళ్లినప్పుడు అతడి హృదయం దుఃఖంతో బరువెక్కింది. సూర్యకాంతి దుర్భరమయ్యింది. పక్షుల గానం తన్ను వెక్కిరించినట్లు తోచింది. ఇప్పుడతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ప్రకృతి నూతన శోభను సంతరించుకుంది. అతడు నూతన దృష్టిలో చూస్తున్నాడు. ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న ఆ ఉదయం తన ప్రయాణం సాగిస్తున్నప్పుడు ప్రకృతి అతడితో గళం కలిపి దేవుణ్ని స్తుతిస్తున్నట్లనిపించింది. అతడు ఇంటికి కొంచెం దూరంలో ఉండగానే అతణ్ని కలుసుకుని అతడికున్నదని తాము భావించి ఆందోళనను తొలగించడానికి సేవకులు బయటకు వచ్చారు. వారు తెచ్చిన వార్త అతడికి ఆశ్చర్యం కలిగించలేదు. కాని తీవ్ర ఆసక్తితో బిడ్డ ఏ గడియలో బాగుపడ్డాడని ప్రశ్నించాడు. “నిన్న ఒంటిగంటకు జ్వరము వానిని విడిచెను.” అని బదులిచ్చారు. “నీ కుమారుడు బ్రదికియున్నాడు. ” అన్న ప్రభువు మాటను ఆ తండ్రి విశ్వాసంతో నమ్మిన నిముషంలో ప్రేమగల ప్రభువు మరణిస్తున్న ఆ బిడ్డను సృశించాడు.DATel 199.2

  కుమారుణ్ని కలవడానికి ఆ తండ్రి వడివడిగా వెళ్లాడు. మరణం నుంచి లేచినవాడిలా ఆ చిన్నవాణ్ని కౌగిలించుకుని హృదయానికి హత్తుకున్నాడు. తన కుమారుణ్ని తిరిగి తనకిచ్చినందుకు దేవునికి పదేపదే కృతజ్ఞతలు చెల్లించాడు.DATel 199.3

  క్రీస్తును గూర్చి మరెక్కువ తెలుసుకోవాలని ఆ ప్రధాని ఆశించాడు. అనంతరం అతడు అతడి ఇంటి వారు ఆయన బోధలు విని ఆయన శిష్యులయ్యారు. వారికి కలిగిన ఆపద వారి కుటుంబమంతా మారుమనసు పొందడానికి సాధనమయ్యింది. ఆ అద్భుతాన్ని గూర్చిన వార్త విస్తరించింది. అనేకమైన ఆయన మహత్కార్యాలు చోటుచేసుకున్న కపెర్నహోములో క్రీస్తు వ్యక్తిగత పరిచర్యకు మార్గం సుగమమయ్యింది.DATel 200.1

  కపెర్నహోములోని ప్రధానికి మేలు చేసిన ప్రభువు మనకూ మేలు చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాడు. అయితే మనం కూడా ఆ తండ్రిలా లోకసంబంధమైన ఏదో ఉపకారం ఆశించి యేసును వెదుకుతుంటాం. మనం కోరింది లభించినప్పుడు ఆయన ప్రేమపై నమ్మకముంచుతాం. మనం వెదకేదానికన్నా సమున్నతమైన మేలు మనకు ఒనగూర్చాలన్నది రక్షకుని ఆకాంక్ష. మన హృదయంలో దాగిఉన్న చెడుగును మనకు బయలుపర్చి తన కృప విషయంలో మన అవసరాన్ని మనకు తెలియజేసేందు నిమిత్తమే మనం చేసే మనవికి సమాధానాన్ని ప్రభువు ఆలస్యం చేస్తాడు. తన్ను వెదకడానికి మనల్ని నడిపించే స్వార్ధాన్ని మనం త్వజించాలని ఆయన కోరుతున్నాడు. మన నిస్సహాయతను ఒప్పుకుంటూ, మన తీవ్ర అవసరాన్ని వ్యక్తం చేస్తూ మనం ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. ఆయన ప్రేమకు మనల్ని మనం అప్పగించుకోవాలి.DATel 200.2

  నమ్మడానికి ముందు తాను ప్రార్ధించింది నెరవేరడం చూడాలని ప్రధాని వాంఛించాడు. అయితే తన మనవిని ఆలకించానని తను వాంఛించింది మంజూరయ్యిందని యేసు చెప్పిన మాటను అతడు అంగీకరించాలి. ఈ పాఠం మనంకూడా నేర్చుకోవాలి. దేవుడు మన మనవులు ఆలకిస్తున్నట్లు చూస్తున్నందుకో లేక భావిస్తున్నందుకో మనం విశ్వసించకూడదు. మనం వాగ్దానాల్ని విశ్వసించాలి. మనం విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు మనం చేసే ప్రతీ విన్నపం ఆయనకు వినిపిస్తుంది. అది ఆయన మనసులో నమోదవుతుంది. ఆయన ఆశీసులు అభ్యర్థించినప్పుడు వాటిని పొందుతామని నమ్మి వాటిని పొందామని భావించి ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. అప్పుడు మనకు ఆవసరం ఏర్పడినప్పుడు ఆ దీవెనను మనం పొందుతామన్న భరోసాతో మన విధుల్ని నిర్వర్తిస్తూ సాగిపోవాలి. ఇది చెయ్యడం నేర్చుకున్నప్పుడు మన ప్రార్థనలు ఫలించాయని గ్రహిస్తాం. దేవుడు “తన మహిమైశ్వర్యము చొప్పున” తన అపరిమితమైన “మహాత్మ్యము” తో మనకు “అత్యధికముగా చేయ శక్తి” గలవాడు, ఎఫెసీ 3:16, 20; 1:19.DATel 200.3

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents