Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  64—నశించిన ప్రజలు

  క్రీస్తు విజయుడుగా యెరూషలేములోకి ప్రవేశించడం, దేవదూతల విజయం పరిశుద్దుల ఆనందోత్సాహాల నడుమ ఆయన మేఘారూఢుడై మహాశక్తి మహిమలతో రెండోసారి రావడాన్ని మనకు మసకగా సూచిస్తోంది. యేసు యాజకులతోను పరిసయ్యులతోను అన్న ఈ మాటలు అప్పుడు నె వేరాయి: “ఇది మొదలుకొని - ప్రభువు పేరట వచ్చువాడు స్తుంతింపబడునుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను” మత్తయి 23:39. ప్రావచనిక దర్శనంలో ఆ అంతిమ విజయ దినం జెకర్యాకు ప్రదర్శితమయ్యింది. ఆయన మొదటి రాకడలో ఆయన్ని విసర్జించిన వారి నాశనాన్ని కూడా చూశాడు: “వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.” జెక. 12:10. యేసు యెరూషలేము పట్టణాన్ని చూసి విలపించినప్పుడు ఈ దృశ్యాన్నే చూశాడు. ఏ ప్రజలు దేవుని కుమారుని రక్తం చిందించడంలో పాలుపొందారో వారి చివరి నాశనాన్ని యెరూషలేము భౌతిక నాశనంలో ఆయన చూశాడు.DATel 645.1

  యేసుపట్ల యూదుల ద్వేషాన్ని శిష్యులు చూశారుగాని అది ఏ పరిణామాలకి దారితీస్తుందో వారింకా చూడలేదు. వారింకా ఇశ్రాయేలు ప్రజల వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకోలేదు. యెరూషలేము మిద పడనున్న తీర్పును కూడా వారు అవగాహన చేసుకోలేదు. ఒక ముఖ్యమైన సాదృశ్య పాఠం ద్వారా దీన్ని వారికి వ్యక్తంచేశాడు.DATel 645.2

  యెరూషలేముకి చేసిన చివరి విజ్ఞాపన నిరర్ధకమయ్యింది. “ఈయన ఎవరు?” అన్న ప్రశ్నకు సమాధానంలో యాజకులు అధికారులు గతకాలపు ప్రవచన స్వరాన్ని ప్రజలు దాన్ని ప్రతి ధ్వనించడాన్ని విన్నారు. కాని వారు దాన్ని దైవావేశ స్వరంగా అంగీకరించలేదు. ఆగ్రహంతో విస్మయం చెందుతూ ప్రజల నోళ్లు ముయ్యించడానికి ప్రయత్నించారు. ఆ ప్రజా సమూహంలో రోమా అధికారులున్నారు. యేసు తిరుగుబాటు నాయకుడని ఆయన ప్రత్యర్థులు వారికి చెప్పారు. ఆయన దేవాలయాన్ని స్వాధీన పర్చుకోడానికి యెరూషలేములో రాజుగా పరిపాలించడానికి సమాయత్తమౌతున్నాడని చెప్పారు.DATel 646.1

  తాను లౌకిక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదని యేసు ప్రశాంతంగా చెప్పినప్పుడు జనసమూహం కొంత సేపు నిశ్శబ్దంగా ఉంది. తాను త్వరలో తన తండ్రి వద్దకు పైకి వెళ్లాల్సి ఉందని తన్ను నిందిస్తున్నవారు తాను మళ్లీ మహిమతో వచ్చేవరకు తనను ఇక చూడరని చెప్పాడు. అప్పుడు తమ రక్షణకు ఇక తరుణం లేకపోయినప్పుడు వారు తనను అంగీకరిస్తారని ప్రవచించాడు. ఈ మాటల్ని యేసు వ్యాకులతతోను అపూర్వశక్తితోను సలికాడు. రోమా అధికారులు మాట్లాడలేకపోయారు. దేవుని శక్తిని వారు ఎరుగకపోయినప్పటికీ వారి హృదయాలు చలించాయి. యేసు ప్రశాంతమైన, గంభీరమైన ముఖంలో ప్రేమను, ఔదార్యాన్ని నిరాడంబరమైన ఔన్నత్యాన్ని వారు చూశారు. తమకు అర్థంకాని సానుభూతి వారిలో చోటుచేసుకున్నది. యేసును బంధించే బదులు వారు ఆయనకు నీరాజనాలర్పించారు. యాజకులు అధికారుల తట్టు తిరిగి అల్లర్లు సృష్టిస్తున్నారని వారిని నిందించారు. దిగ్ర్భాంతి చెందిన ఈ నాయకులు తమ ఫిర్యాదులతో ప్రజల వద్దకు వెళ్లారు. వారి మధ్య తమలో తాము వాదులాడుకుని ఘర్షణలకు దిగారు.DATel 646.2

  ఇంతలో ఎవరూ గుర్తించకుండా యేసు దేవాలయంలోకి వెళ్లాడు. అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఒలీవలకొండ మీది దృశ్యం ప్రజల్ని చెల్లాచెదురు చేసింది. కొద్ది సేపు యేసు దేవాలయంలో ఉన్నాడు. దాని వంక దుఃఖంతో చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు తన శిష్యులతో కలిసి బేతనియకు తిరిగి వచ్చాడు. ఆయన్ని సింహాసనం ఎక్కించాలని ప్రజలు ఆయనకోసం వెదకినప్పుడు ఆయన కనిపించలేదు.DATel 646.3

  యేసు రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయం మళ్లీ దేవాలయానికి వచ్చాడు. మార్గంలో ఒక అంజూరపు తోట దాటి వెళ్లాడు. ఆకలిగా ఉన్నాడు. “ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు.”DATel 647.1

  కొన్ని ప్రాంతాల్లో తప్ప అది అంజూరపు పండ్ల కాలం కాదు. యెరూషలేము చుట్టూ ఉన్న మెట్ట భూముల విషయంలో “అది అంజూరపు పండ్లకాలము కాదు” అని వాస్తవంగా చెప్పవచ్చు. కాని యేసు వెళ్లిన అంజూరపు తోటలో ఒక చెట్టు అన్ని చెట్ల కన్నా ముందంజలో ఉన్నట్లు కనిపించింది. అది ఆకులతో నిండి ఉంది. ఆకులు రాకముందు పక్వమౌతున్న పండ్లు రావడం అంజూరపు చెట్టు లక్షణం. కాబట్టి ఆకులు విస్తారంగా కలిగి ఉన్న ఈ చెట్టు పక్వమైన పండ్లు ఉంటాయన్న భ్రమ పుట్టించింది. కాని దాని పై మెరుగు మోసకరం. దాని కొమ్మల్ని కిందనుంచి పైవరకూ వెదకి చూసిన తర్వాత యేసుకి “ఆకులు తప్పమరేమియు” కనిపించలేదు. దానికి విస్తారమైన ఆకుల ఆడంబరం తప్ప మరేమీకాదు.DATel 647.2

  దాన్ని యేసు ఇలా శపించాడు, “ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురుగాక.” మరుసటి ఉదయం రక్షకుడు ఆయన శిష్యులు మళ్లీ పట్టణానికి వెళ్తున్నారు. ఎండిపోయిన కొమ్మలు వాడిపోయిన ఆకులు వారి గమనాన్ని ఆకర్షించాయి. పేతురు ఇలా అన్నాడు, “బోధకుడా యిదిగో నీవు శపించిన అంజూరపు చెట్లు ఎండిపోయెను.”DATel 647.3

  క్రీస్తు అంజూరపు చెట్టుని శపించడం శిష్యుల్ని ఆశ్చర్యపర్చింది. అది ఆయన వ్యవహరించే తీరు కాదని వారనుకున్నారు. లోకాన్ని ఖండించడానికి కాదుగాని లోకాన్ని రక్షించడానికి వచ్చానని ఆయన ప్రకటించడం వారు తరచుగా విన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు గుర్తు చేసుకున్నారు, “మనుష్యకుమారుడు మనుష్యల ఆత్మను రక్షించుటకే కాని నశింపజేయుటకు రాలేదు.” లూకా 9:56 (పుట్ నోట్). ఆయన తన మహత్కార్యాల్ని పునరుద్ధరించడానికేగాని నాశనం చెయ్యడానికి చెయ్యలేదు. శిష్యులు ఆయన్ని పునరుద్దారకుడుగాను సహాయకుడుగాను మాత్రమే ఎరిగి ఉన్నారు. ఈ కార్యం వేర్పాటుగా ఉంది. దాని ఉద్దేశమేంటా అని వారు ప్రశించుకున్నారు.DATel 647.4

  దేవుడు “కనికరము చూపుట యందు సంతోషించువాడు” “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషములేదు” మికా 7:18, యెహే 33:11. నాశనం చెయ్యడం, నిందించి తీర్పు తీర్చడం ఆయనకు “ఆశ్చర్యమైన కార్యము” యెష 28:21. దేవుడు తన కృపను ప్రేమను బట్టి భవిష్యత్తును మరుగుపర్చే తెరను తొలగించి మనుషులికి పాప జీవిత ఫలితాల్ని వెల్లడిచేస్తాడు.DATel 648.1

  అంజూరపు చెట్టును శపించడం ఒక ఉపమానాన్ని ప్రదర్శించడమే. పండ్లు లేని చెట్టు క్రీస్తుకి తన ఆకుల డంబాన్ని ప్రదర్శించడం యూదుజాతికి చిహ్నంగా ఉంది. ఇశ్రాయేలు నాశనానికి కారణాన్ని ఆ నాశనం నిశ్చయతను తన శిష్యులికి విశదం చెయ్యాలని రక్షకుడు సంకల్పించాడు. ఈ సంకల్పంతో ఈ చెట్టుకి నైతిక లక్షణాలు ఆపాదించి దైవ సత్యాన్ని వివరించడానికి దాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. దేవుని విశ్వసించేవారమని చెప్పుకుంటూ యూదులు అన్ని జాతుల కన్నా ప్రత్యేకంగా ఉన్నారు. దేవుడు వారిపట్ల ప్రత్యేకాభిమానం చూపించాడు. అందుకు వారు తామే అందరికన్నా నీతిమంతులమని చెప్పుకున్నారు. కాని వారు లోకాన్ని అక్రమ లాభాల్ని ప్రేమించి నైతికంగా దిగజారిపోయారు. వారు తమ జ్ఞానాన్ని గురించి అతిశయించారు. కాని దైవ విధుల విషయంలో వారు అజ్ఞానులు. వేషధారణ వారి అణువణునా ఉన్నది. పండ్లులేని చెట్టులాగ వారు తమ ఆడంబరపు కొమ్మల్ని విస్తరించుకుని పైకి చక్కగా కంటికి అందంగా కనిపించారేగాని వారిలో “ఆకులు తప్ప మరేమియు కనబడలేదు.” వైభవోపేతమైన దేవాలయం, పరిశుద్ధ బలిపీఠాలు, పాగాలు ధరించిన యాజకులు ఆకట్టుకునే ఆచారకాండతో యూదుమతం పైకి చక్కగా కనిపించేది. కాని దానిలో వినయం, ప్రేమ, ఉపకార గుణం శూన్యం.DATel 648.2

  అంజూరపు తోటలోని చెట్లన్నీ పండ్లు లేకుండానే ఉన్నాయి. అయితే ఆకులు లేని చెట్లు ఆశలు రేపలేదు, ఆశాభంగం కలుగజెయ్యలేదు. ఇవి అన్య జనుల్ని సూచిస్తున్నాయి. యూదుల్లాగే వారు కూడా భక్తిలేని వారే. కాకపోతే వారు దేవుణ్ని సేవిస్తున్నామని చెప్పుకోలేదు. నీతిమంతులుగా నటించలేదు. దేవుని కార్యాలు ఆయన మార్గాలు వారికి తెలియవు. వారి విషయంలో అంజూరపు పండ్లకాలం ఇంకా కాలేదు. వెలుగు నిరీక్షణ వచ్చే దినం కోసం వారింకా ఎదురుచూస్తున్నారు. దేవుని వద్ద నుంచి గొప్ప దీవెనలు పొందిన యూదులు ఈ దీవెనల దుర్వినియోగానికి జవాబుదారులు. వారు తమ ఆధిక్యతల గురించి డంబాలు చెప్పుకున్నారు. ఆ ఆధిక్యతలే వారి దోషిత్వాన్ని అధికం చేశాయి.DATel 648.3

  యేసు ఆకలిగా ఉండి ఆకలి తీర్చుకోడానికి అంజూరపు చెట్టువద్దకు వచ్చాడు. అలాగే ఆయన ఇశ్రాయేలుకు వచ్చాడు. ఆ ప్రజల్లో నీతి ఫలాలు కనుగోవాలన్న ఆశతో వచ్చాడు. వారు ఫలాలు ఫలించి లోకానికి మేలు చేసేందుకు వారికి ఆయన ఎన్నో వరాలిచ్చాడు. వారికి లెక్కకు వించిన తరుణాల్ని లెక్కకుమించిన ఆధిక్యతల్ని ఇచ్చాడు. తిరిగి వారు తమ సానుభూతిని చూపించి తన కృపా పరిచర్యకు సహకరించాలని కోరాడు. ఆత్మార్పణ, కనికరం, దేవుని నిమిత్తం ఉద్రేకం, తమ సోదర మానవుల రక్షణ పట్ల ఆసక్తి వారిలో చూడాలని ఆయన ఆశించాడు. వారు దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించి ఉంటే క్రీస్తు చేసిన స్వార్థరహిత పరిచర్యనే వారూ చేసేవారు. అయితే దేవుని పట్ల సహమానవుడి పట్ల ప్రేమను అహంభావం, స్వావలంబన మసకబార్చాయి. ఇతరులికి పరిచర్య చెయ్యడానికి నిరాకరించడం ద్వారా వారు తమ మీదికి తామే నాశనాన్ని తెచ్చుకున్నారు. దేవుడు తమకు అప్పగించిన సత్యసంపదను వారు లోకంతో పంచుకోలేదు. వారు తమ పాపాన్ని దాని శిక్షను చదువుకోవచ్చు. రక్షకుని శాపం కింద ఎండిపోయి, మాడిపోయి, వేళ్లు వరకు ఎండి ఉన్న అంజూరపు చెట్టు, దేవుని కృపకు దూరమైనప్పుడు యూదు ప్రజల పరిస్థితి ఎలాగుంటుందో చూపిస్తోంది. మేలు చేయడానికి నిరాకరించిన వారు మేలును పొందలేరు. ప్రభువిలా అంటున్నాడు, “ఇశ్రాయేలూ.... నిన్ను నీవే నిర్మూలము చేసికొని చున్నావు.” హోషే 13:9.DATel 649.1

  ఈ హెచ్చరిక అన్ని కాలాలికీ వర్తిస్తుంది. తన సొంత శక్తి సృజించిన చెట్టును క్రీస్తు శపించడం సంఘాలన్నిటికి, క్రైస్తవులందరికి హెచ్చరికగా నిలుస్తుంది. ఇతరులకు పరిచర్య చేయకుండా ఎవరూ దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించడం సాధ్యం కాదు. కాని క్రీస్తు జీవించినట్లు దయగా, స్వార్థరహితంగా నివసించనివారు అనేకులున్నారు. తాము మంచి క్రైస్తవులమని భావించే వారు దేవునికి సేవ చెయ్యడమంటే ఏంటో గ్రహించరు. వారి ప్రణాళికలు తమ ఆనందం కోసమే. వారి అధ్యయనం తమ సంతోషం కోసమే. వారు చేసే పనులు తన స్వార్థం కోసమే. వారు సమావేశమయ్యేది సంతోషించడానికి మాత్రమే. జీవితంలోని విషయాలన్నిటిలోను వారి ధ్యేయం ఇదే. వారు ఇతరులికి పరిచర్య చెయ్యరు. వారు తమకే పరిచర్య చేసుకుంటారు. స్వార్ధరహిత సేవ చెయ్యడానికి లోకంలో నివసించడానికి దేవుడు వారిని సృజించాడు. సాటి మానవులకు అన్ని విధాల సహాయం చెయ్యడానికి ఆయన వారిని రూపొందించాడు. కాని స్వార్థం వారికి ఇంకేది కనిపించకుండా అడ్డు నిలుస్తుంది. వారికి మానవాళితో సంబంధం ఉండదు. తమకోసం మాత్రమే నివసించేవారు పైకి నిండుగా కనిపించినా పండ్లులేని చెట్టులాంటి వారు. వారు ఆరాధనకు సంబంధించిన ఆచారాల్ని ఆచరిస్తారు. కాని వారికి పాపపశ్చాత్తాపం లేక విశ్వాసం ఉండదు. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటారు. కాని వాస్తవంలో ఆచరణ ఉండదు. వారు చెబుతారేగాని చెయ్యరు. మోసకరమైన నటనను తాను ఎంత ద్వేషిస్తాడో ఆయన ప్రదర్శించాడు. దేవున్ని సేవిస్తున్నానని చెబుతూ ఆయన మహిమకోసం ఫలాలు ఫలించని వాడికన్నా బహిరంగ పాపి తక్కువ అపరాధి అని ఆయన ప్రకటిస్తున్నాడు.DATel 649.2

  యెరూషలేము సందర్శనానికి ముందు యేసు చెప్పిన అంజూరపు చెట్టు ఉపమానం, పండ్లులేని చెట్టును శపించడంలోని పాఠంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. ఉపమానంలోని పండ్లువేని చెట్టు విషయంలో దాన్ని ఈ సంవత్సరం ఉంచమని, దాని చుట్టూ తవ్వి సేద్యం చేసేవరకు ఉంచమని తోటమాలి విజాపన చేశాడు. అది ఫలిస్తే సరి. ఫలించకపోతే అప్పుడు దాన్ని కొట్టివేయమన్నాడు. ఫలాలు ఫలించని చెట్టుకు ఎక్కువ సేద్యం చేయడం అనవసరం. దానికి అన్ని సదుపాయాలు చేయాలి. అయినా అది ఫలించకుండా ఉంటే దాన్ని నాశనం చెయ్యక తప్పదు. ఉపమానంలో తోటమాలి కృషి ఫలితాన్ని గురించిన ప్రవచనం ఏమిలేదు. క్రీస్తు ఎవరితో ఆమాటలు మాట్లాడాడో వారి మీద అది ఆధారపడి ఉంది. పండులేని చెట్టు వారిని సూచించింది. వారే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సి ఉన్నారు. తానివ్వగల సహాయం దేవుడు వారికిచ్చాడు. కాని వారు పొందిన దీవెనల్ని వారు సద్వినియోగ పర్చుకోలేదు. పండ్లులేని అంజూరపు చెట్టును శపించడంలో క్రీస్తు తీసుకున్న చర్య ద్వారా పర్యవసానం ప్రకటితమయ్యింది. వారు తమ నాశనాన్ని తామే నిర్ణయించుకున్నారు.DATel 650.1

  వెయ్యి సంవత్సరాలు పైచిలుకు యూదు జాతి దేవుని కృపను దుర్వినియోగం చేసి ఆయన తీర్పులకు గురి అయ్యింది. వారు ఆయన హెచ్చరికల్ని తోసిపుచ్చి ఆయన ప్రవక్తల్ని చంపారు. అదే మార్గాన్ని అనుసరించడం ద్వారా క్రీస్తు రోజుల్లోని ప్రజలు ఈ పాపాలకు తమ్ముని తాము బాధ్యుల్ని చేసుకున్నారు. ప్రస్తుత కృపలను, హెచ్చరికలను తోసిపుచ్చడంలోనే ఆ తరం ప్రజల అపరాధం ఉంది. ఆ జాతి శతాబ్దాలుగా తయారుచేస్తున్న సంకెళ్లని క్రీస్తు దినాల్లోని ప్రజలు తమ చేతులుకి బిగించుకుంటున్నారు.DATel 651.1

  మనుషులు దేవునితో సమాధానపడేందుకు ప్రతీ యుగంలోను దేవుడు వెలుగును ఆధిక్యతను ఇచ్చిదాన్ని అంగీకరించడానికి కొంత కృపకాలాన్నిస్తాడు. ఈ కృపకు పరిమితి ఉంటుంది. కృప ఎన్నో సంవత్సరాలు విజ్ఞాపన చేయవచ్చు. మనుషులు దాన్ని తృణీకరించి తోసిపుచ్చవచ్చు. అయితే కృప తన చివరి విప్తి చేసే సమయం వస్తుంది. దేవుని ఆత్మకు ప్రతిస్పందించడం ఆగిపోయేంతగా హృదయం కఠినమవుతుంది. అప్పుడు మధురమైన సున్నితమైన ఆ స్వరం పాపిని బతిమాలడం ఇక ఉందడు. మందలింపులు హెచ్చరికలు ఇక ఉండవు.DATel 651.2

  ఆ దినం యెరూషలేముకి వచ్చింది. నాశనం దిశగా వెళ్తున్న ఆ పట్టణం గురించి యేసు దుఃఖించాడు. కాని దాన్ని విడిపించలేకపోయాడు. అన్ని విధాలా ప్రయత్మించి ఊరకున్నాడు. దేవుని ఆత్మ చేసిన హెచ్చరికల్ని నిరాకరించడంలో సహాయం చేయగల ఒకేఒక వనరును ఇశ్రాయేలు తోసిపుచ్చింది. వారిని విడిపించే శక్తి మరేదీ లేదు.DATel 651.3

  అనంత ప్రేమగల దేవుని విజ్ఞాపనల్ని తృణీకరించి తోసిపుచ్చే అన్నియు గాల ప్రజలకు యూదు జాతి ఒక చిహ్నంగా నిలిచింది. యెరూషలోమును గురించి ఏడ్చిన యేసు కన్నీళ్లు అన్ని కాలాల్లోని పాపాల నిమిత్తం కార్చి కన్నీళ్లు. దేవుని పరిశుద్దాత్మ గద్దింపులు హెచ్చరికల్ని తోసిపుచ్చేవారు ఇశ్రాయేలు పై దేవుడు ప్రకటించిన తీర్పుల్లో తమ శిక్షను చదువుకోవచ్చు.DATel 651.4

  విశ్వాసంలేని యూదులు ఏ మార్గంలో నడిచారో అదే మార్గాన్ని అవలంబిస్తున్నవారు ఈ తరంలో చాలామంది ఉన్నారు. వారు దేవుని శక్తి ప్రదర్శనల్ని చూశారు. పరిశుద్దాత్మ వారి హృదయాల్లో మాట్లాడాడు. అయినా వారు తమ అవిశ్వాసాన్ని ప్రతిఘటనను విడిచిపెట్టడం లేదు. దేవుడు వారికి హెచ్చరికలు మందలింపులు పంపిస్తున్నాడు. అయినా వారు తమ తప్పులు ఒప్పుకోడానికి సిద్ధంగా లేరు. దేవుని వర్తమానాన్ని ఆ వర్తమానం తెచ్చిన దూతను నిరాకరిస్తున్నారు. వారి పునరుద్ధరణకు ఆయన ఏ వనరుల్ని వినియోగిస్తున్నాడో అవే వారికి అడ్డుబండగా నిలుస్తున్నాయి.DATel 652.1

  తమ రహస్యపాపాల్ని బయట పెట్టినందుకు భ్రష్ట ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రవక్తల్ని ద్వేషించారు. తన రహస్య పాపాల్ని ఏలీయా ప్రవక్త బయటపెట్టాడు కాబట్టి ఆహాబు రాజు నమ్మకమైన ఆ ప్రవక్తను తన శత్రువుగా ఎంచాడు. అలాగే నేడు పాపాన్ని ఖండించి గద్దించే క్రీస్తు సేవకుడు ద్వేషాన్ని ప్రతిఘటనను ఎదుర్కుంటాడు. బైబిలు సత్యం అనగా క్రీస్తు మతం తీవ్రమైన నైతిక అపవిత్ర ప్రవాహానికి ఎదురీదాల్సి ఉంటుంది. మనుషుల హృదయాల్లో దురాభిమానం క్రీస్తు రోజుల్లో కన్నా ఇప్పుడు అధికంగా ఉంది. క్రీస్తు మనుషుల ఆశలను నెరవేర్చలేదు. ఆయన జీవితం వారి పాపాలకు మందలింపు. అందుకే ఆయన్ని నిరాకరించారు. అలాగే ఇప్పుడూ దేవుని సత్యం మానవుల ఆచారాలు అలవాట్లకు వారి స్వాభావిక ప్రవృత్తలకు అనుగుణంగా లేదు. అందుకే వేల ప్రజలు దాని వెలుగును విసర్జిస్తోన్నారు. మనుషులు సాతాను ప్రేరణతో దేవుని వాక్యంపై సందేహాలు శంకలు కలిగించి తమ సొంత భాష్యాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తోన్నారు. వారు వెలుగుకన్నా చీకటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇది వారి ఆత్మల నాశనానికి దారితీస్తుంది. క్రీస్తు మాటల్ని తప్పుపట్టినవారు తప్పులెన్నడానికి మరిన్ని కారణాలు కనుక్కుంటూపోయి చివరికి సత్యానికి జీవానికి దూరంగా వెళ్లిపోయారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. సత్యానికి వ్యతిరేకంగా పాప హృదయం తెచ్చే ప్రతీ అభ్యంతరాన్ని తొలగించడం దేవుని సంకల్పం కాదు.DATel 652.2

  ఒలీవల కొండ శిఖరం నుంచి క్రీస్తు ప్రపంచాన్ని అన్ని యూగాల్నీ తేరిపార జూశాడు. దేవుని కృపా విజ్ఞాపనల్ని అలక్ష్యం చేసే ప్రతీ ఆత్మకూ ఆయన మాటలు వర్తిస్తాయి. ఆయన ప్రేమను అలక్ష్యం చేస్తే సోదరా, నేడు ఆయన మీతోనే మాట్లాడున్నాడు. నా సమాధానాలికి సంబంధించిన సంగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న “మితోనే కేవలం మీతోనే” ఆయన మాట్లాడున్నాడు. కన్నీళ్లు లేని నా కోసం యేసు కన్నీళ్లు కార్చుతున్నాడు. పరిసయ్యుల్ని పతనం చేసిన ప్రాణాంతక హృదయ కాఠిన్యం మిలో ఇప్పటికే కనిపిస్తోంది. దేవుని కృప తాలూక ప్రతీ నిదర్శనం, దేవుని వెలుగు తాలూకు ప్రతీ కిరణం ఆత్మను కరిగించి లొంగతీసుకోడమన్నా చేస్తుంది లేదా పశ్చాత్తాపం లేని తన అధ్వాన స్థితిలో ధ్రువీకరించటమన్నా చేస్తుంది.DATel 653.1

  యెరూషలేము తన పశ్చాత్తాప రహిత స్థితిలో మొండిగా నిలిచి ఉంటుందని క్రీస్తు దివ్యదృష్టితో చూశాడు. అపరాధమంతా కృపను తిరస్కరించిడం వల్ల కలిగే పర్యవసానమన్నది వారికి ముంజేతి కంకణమే. అదే మార్గాన్ని అనుసరిస్తోన్న ప్రతీ ఆత్మ విషయంలోను ఇదే వాస్తవమౌతుంది. ప్రభువిలా అంటున్నాడు, “ఇశ్రాయేలూ.... నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు” “భూలోకమా, వినుము, ఈ జనులు నామాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారికి రప్పించుచున్నాను.” హోషే. 13:9, యిర్మీ. 6:19.DATel 653.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents