Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    12—శోధన

    “అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను” మార్కు మాటలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోన్నాయి. మార్కు ఇలా అంటోన్నాడు, “వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసికొనిపోయెను. ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడ నుండెను” “ఆదినములలో ఆయన ఏమియు తినలేదు.DATel 99.1

    శోధన పొందటానికి యేసు అరణ్యంలోకి వెళ్లినప్పుడు దేవుడు ఆయన్ని నడిపించాడు. ఆయన శోధనను ఆహ్వానించలేదు. ఏకాంతంగా ఉండటానికి తన కర్తవ్యం గురించి పరిచర్య గురించి ధ్యానించటానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. తాను నడవనున్న రక్తసిక్త మార్గాన సాగటానికి శక్తిని పొందటానికి ఉపవాసంతో ప్రార్ధించటానికి వెళ్ళాడు. అయితే రక్షకుడు అరణ్యంలోకి వెళ్లాడని తెలిసి ఆయనను కలుసుకోటానికి ఇదే మంచి తరుణమని సాతాను భావించాడు.DATel 99.2

    శాంతి సమాధానాధిపతికీ చీకటి రాజ్యపాలకుడికీ మధ్య జరిగే సంఘర్షణలో జటిల సమస్యలే ఉన్నాయి. ఆదామును శోధించి పాపంలో పడేసిన తర్వాత సాతాను ఈ భూగోళం తనదని చెప్పి ఈ లోకానికి తన్నుతాను అధినాయకుడిగా ప్రకటించుకున్నాడు. మానవజాతి తండ్రిని తల్లిని తన స్వభావానికి మలుచుకుని ఇక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. మనుషులపై నియంత్రణ సాధించడం ద్వారా లోకంపై అధికారం చెలాయించసాగాడు. సాతానుకి ఏ హక్కూలేదని నిరూపించడానికి క్రీస్తు వచ్చాడు. మనుషకుమారుడుగా క్రీస్తు దేవునికి నమ్మకంగా నివసిస్తాడు. మానవజాతిని నియంత్రించే హక్కు సాతానుకులేదని, లోకం తనదన్న సాతానుమాట పచ్చి అబద్దమని ఇలా నిరూపితమౌతుంది. అతడి ప్రాబల్యం నుంచి విముక్తికోరే వారందరికీ స్వేచ్చలభిస్తుంది. పాపం వలన ఆదాము పొగొట్టుకున్న పాలనాధికారం పునరుద్ధరించబడుతుంది.DATel 99.3

    “నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలుగ జేసెదను.” (ఆది 3:15) అని ఏదెనులో సర్పానికి దేవుడు ప్రకటించినప్పటి నుంచీ తనకు లోకంపై అధికారం లేదన్న సంగతి సాతానుకి తెలుసు. అతడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే అధికారం ఒకటుందని మనుషుల జీవితాలు ప్రదర్శించాయి. ఆదాము అతని కుమారులు అర్పించిన బలుల్ని అతడు ఆసక్తితో తిలకించాడు. పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్న సంబంధానికి ఈ ఆచారవ్యవహారాలు ఒక గుర్తుగా ఉన్నట్లు అవగతం చేసుకున్నాడు. ఈ సంబంధానికి తనదైన అర్ధం చెప్పడానికి పూనుకున్నాడు. దేవుని గూర్చి అబద్దాలు ప్రచారం చేశాడు. రక్షకుణ్ని సూచించే ఆచారాలకు వక్రభాష్యం చెప్పాడు. మనుషుల్ని నాశనం చెయ్యడమే దేవునికి ఆనందమని చెప్పి ఆయనపట్ల ప్రజలకు భయం పుట్టించాడు. ఆయన ప్రేమను బయలుపర్చాల్సిన బలి అర్పణల్ని దేవుని ఉగ్రతను చల్లార్చడానికి అర్పించే అర్పణలుగా చిత్రించాడు. మనుషులపై తన అధిపత్యాన్ని స్థాపించుకునేందుకు వారి దురావేశాల్ని రెచ్చగొట్టాడు. దేవుని లిఖిత వాక్యం వచ్చినప్పుడు సాతాను రక్షకునిరాకకు సంబంధించిన ప్రవచనాల్ని శ్రద్ధగా పఠించాడు. క్రీస్తు వచ్చినప్పుడు ప్రజలు ఆయనను తిరస్కరించాలన్న ధ్యేయంతో ప్రవచనాల విషయంలో వారికి గుడ్డితనం కలిగించాడు.DATel 100.1

    క్రీస్తు జన్మించినప్పుడు తన ఆధిపత్యాన్ని ప్రశ్నించే వ్యక్తి ఒకరు దైవాధికారంతో వచ్చాడని సాతానుకు తెలుసు. నూతనంగా జన్మించిన రాజు అధికారాన్ని ధ్రువీకరిస్తున్న దూత వర్తమానం విన్నప్పుడు భయంతో వణికాడు. తండ్రికి ప్రియమైన కుమారుడుగా పరలోకంలో క్రీస్తుకున్న స్థానమేంటో అతడికి తెలుసు. దేవుని కుమారుడు మానవుడుగా ఈ లోకానికి రావడం అతన్ని ఆశ్చర్యంతోను భయందోళనలతోను నింపింది. ఈ మహాత్యాగం తాలూకు మర్మం అతనికి అంతుచిక్కలేదు. మోసపోయిన మానవాళి పట్ల అంత గొప్ప ప్రేమను అతడి స్వార్ధపూరిత ఆత్మను అవగాహన చేసుకోలేకపోయింది. పరలోక మహిమ, సమాధానం, దేవునితో సహవాసానందం మానవులికి అంతంతమాత్రంగానే గ్రాహ్యమవుతాయి. ఆయితే ఆశ్రయంగా ఉన్న కెరూబయిన లూసిఫర్ కి ఇవి బాగా తెలిసినవే. తాను పరలోకాన్ని కోల్పోయాడు గనుక ఇతరులు కూడా తనలా పతనమయ్యేలా చూడడంద్వారా పగతీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. దైవ విషయాలకు విలువనియ్యకుండా మనుషులు లౌకిక విషయాలకు ప్రాధాన్యమిచ్చేందుకు వారిని నడిపించడం ద్వారా ఈ కార్యాన్ని సాధిస్తాడు.DATel 100.2

    పరలోక సేనాధిపతి పరలోక ప్రవేశానికి మానవాత్మల్ని సంపాదించడం నల్లేరుమీద బండి నడక కాదు. బేల్లె హేములో శిశువుగా ఉన్ననాటి నుంచి సాతాను ఆయనపై దాడిచేస్తూనే ఉన్నాడు. క్రీస్తులో దేవుని స్వరూపం మూర్తీభవించింది. ఆయనను జయించాలి అన్నది సాతాను సభల్లో తీర్మానించడం జరిగింది. లోకంలో పుట్టిన ఏ మనుషుడు ఆ మహావంచకుడి శక్తినుంచి తప్పించకోడం సాధ్యంకాదు. ఆయనతో పోరాటం సలిపి, సాధ్యమైతే ఆయన్ని జయించటానికి దుష్టశక్తుల సమాఖ్య ఆయన మార్గంలో మోహరించి ఉంది.DATel 101.1

    రక్షకుని బాప్తిస్మం వీక్షించిన జనుల్లో సాతానుకూడా ఉన్నాడు. తండ్రి మహిమ కుమారుణ్ని కప్పడం అతడు వీక్షించాడు. యేసు దైవత్వాన్ని ధ్రువపర్చుతూ యెహోవా పలికిన మాటలు విన్నాడు. ఆదాము పాపం జరిగిన నాటి నుంచి మానవుడికి దేవునితో ప్రత్యక్ష సంబంధం తెగిపోయింది. పరలోకానికి భూలోకానికి ఉత్తర ప్రత్యుత్తరాలు క్రీస్తు ద్వారానే జరిగేవి. కాగా “పాప శరీరాకారముతో” (రోమా 8:3) యేసు ఇప్పుడు వచ్చాడు. కనుక తండ్రి స్వయంగా తానే మాట్లాడాడు. ఇంతకుముందు తండ్రి క్రీస్తు ద్వారా మానవులతో మాట్లాడాడు. మానవులతో ఇప్పుడు క్రీస్తురూపంలో మాట్లాడాడు. పాపంపట్ల దేవునికున్న ఏహ్యతను బట్టి పరలోకభూలోకాల మధ్య సంబంధం ఇకఎన్నడూ ఉండదని సాతాను భావించాడు. అయితే దేవునికీ మానవుడికీ మధ్య సంబంధం తిరిగి స్థాపితమయ్యిందని ఇప్పుడు రుజువయ్యింది.DATel 101.2

    ఇక ఇప్పుడు జయించడమో జయించబడడమో జరగాల్సి ఉందని సాతానుకి అర్థమైపోయింది. ఆ సంఘర్షణలోని సమస్యల తనతో కూటమిగా ఏర్పడ్డ దూతలకు అప్పజెప్పలేనంత పాముఖ్యమైనది. ఆసమరానికి వ్యక్తిగతంగా తానే న్యాయకత్వం వహించాలి. దైవ కుమారునికి వ్యతిరేకంగా భ్రష్టశక్తులన్నిటినీ మోహరించాడు సాతాను. నరకంలోని ప్రతీ యుదాము క్రీస్తే గురి అయ్యాడు.DATel 102.1

    క్రీస్తుకి సాతానుకి మధ్య జరుగుతోన్న పొరాటంతో తమ జీవితానికి ప్రత్యేక సంబంధమేమిలేదని అనేకుల భావన. అందుకు దానిపై ఏమీ ఆసక్తి చూపరు. నిజం చెప్పాలంటే ప్రతీ మానవ హృదయంలో ఈ సంఘర్షణ పునరావృత్తమవుతోంది. దుర్మార్గుడైన ఓ వ్యక్తి మారి దేవుని సేవకు పూనిక వహించినప్పుడు అతనిపై సాతాను దాడులు తప్పవు. క్రీస్తు తోసిపుచ్చిన ఆకర్షణల్ని ప్రతిఘటించడం మనకు ఎంతో కష్టమవుతుంది. ఆయన ప్రవర్తన మన ప్రవర్తన కన్నా ఎంత ఉన్నతమైందో ఆ మేరకు వాటిని ఆయన ముందు ఉంచాడు సాతాను భయంకర లోకపాప భారం కింద ఉన్నా ఆహారాశ లోకాశ దురభిమానాని దారితీసే జీవపుడంబంపై వచ్చిన శోధనను క్రీస్తు తట్టుకున్నాడు. ఆదాముని అవ్వను పడగొట్టిన శోధనలు ఇవే. మనల్ని కూడా సునాయాసంగా పడగొట్టేవి ఇవే.DATel 102.2

    దేవుని ధర్మశాస్త్రం న్యాయమైంది కాదని అందుకు దాన్ని గైకోడం అసాధ్యమని చెబుతూ దానికి రుజువుగా సాతాను ఆదాము పాపాన్ని వేలెత్తి చూపించాడు. మనవంటి మానవుడుగా క్రీస్తు ఆదాము పరాజయాన్ని విజయం చేసి చూపాలి. కాని శోధకుడు ఆదాముపై దాడిచేసినప్పుడు పాప పర్యవసానాలేవీ అతడిపై లేవు అతడు పరిపూర్ణ మానవ బలంతో ఉన్నాడు. అతడికి సంపూర్ణ మానసిక శారీరకశక్తి ఉంది. ఏదెను మహిమ నడుమ నివసిస్తూ అనుదినం పరలోక దూతలతో మాట్లాడేవాడు. సాతానుని ఎదుర్కోడానికి యేసు అగణ్యంలోకి వెళ్ళినప్పుటి పరిస్థితి అలాంటిది కాదు. మానవజాతి శారీరిక మానసిక శక్తిలో నైతిక విలువల విషయంలో నాలుగు వేల సంవత్సరాలుగా క్షీణిస్తోంది. ఇలాంటప్పుడు క్రీస్తు దిగజారిపోయిన మానవాళి బలహీనతల్ని తన మీద వేసుకున్నాడు. మానవుణ్ని తన అధోగతి లోతుల్లోనుంచి ఈ విధంగానే ఆయన రక్షించగలిగాడు.DATel 102.3

    క్రీస్తు శోధనకు లొంగడం అసాధ్యమని అనేకులు వాదిస్తారు. అదే నిజమైతే ఆయన ఆదాము స్థానంలో నియమితుడయ్యేవాడుకాదు. ఆదాము సాధించిలేకపోయిన విజయాన్ని ఆయన సాధించి ఉండేవాడుకాదు. మనం ఏ రకంగానైనా మన రక్షకునికన్నా మరింత తీవ్రతగల సంఘర్షణకు గురి అయితే ఆయన మనకు చేయూత నియ్యగల సమ్మర్గుడు కాడన్నమాట. అయితే మనరక్షకుడు మానవ బలహీనతలన్నిటితో మానవుడయ్యాడు. శోధనకు లొంగే అవకాశంతో మానవ నైజాన్ని స్వీకరించాడు. మనం భరిస్తున్నవి సహిస్తున్నవి ఆయన భరించనివీ సహించనివీ కావు.DATel 103.1

    ఏదెను తోటలోని పరిశుద్ధ దంపతుల విషయంలోలాగే క్రీస్తు విషయంలోనూ మొట్టమొదటి గొప్ప శోధన తిండికి సంబంధించిందే. శిథిలం ఎక్కడ ప్రారంభమయ్యిందో అక్కడ రక్షణ ప్రక్రియ ప్రారంభమవ్వాలి. తిండి పర్వవసానంగా ఆదాము పడిపోయినట్లే తిండిని ఉపేక్షిచడం ద్వారా క్రీస్తు విజయం సాధించాల్సి ఉంది. “నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి - నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన - మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి యున్నదనెను”DATel 103.2

    ఆదాము నాటి నుంచి క్రీస్తు కాలం వరకూ ఆత్మ సుఖభోగాలు తిండిపై యావను పెంపుచేశాయి. చివరికి వాటి నియంత్రణ అడ్డూ ఆపు లేకుండా పోయింది. మనుషులు ఇలా నైతికంగా దిగజారి వ్యాధిగ్రస్తులయ్యారు. తమంతట తాము విజయం సాధించడం అసాధ్యమయ్యింది. కఠిన పరీక్షకు నిలబడడం ద్వారా క్రీస్తు మానవుడి పక్షంగా విజయం సాధించాడు. ఆయన ఆకలికన్నా లేదా మరణంకన్నా బలీయమైన ఆత్మనిగ్రహాన్ని మననిమిత్తం పాటించాడు. ఈ తొలివిజయంలో ఇతర అంశాలున్నాయి. అవి చీకటి శక్తులతో మన పోరాటాలన్నిటిలో ప్రవేశిస్తాయి.DATel 103.3

    యేసు అరణ్యంలో ప్రవేశించినప్పుడు తండ్రి మహిమ ఆయనను ఆవరించింది. దైవ ధ్యానంలో మునిగి ఉన్న ఆయన మానవ బలహీనతకు పైగా లేచాడు. కాని మహిమ వెళ్లిపోయింది. శోధనతో పోరాడడానికి ఆయన మిగిలి ఉన్నాడు. ప్రతీనిమిషం అది ఆయనమీదికి వస్తోంది. తన మానవ స్వభావం తనముందున్న సంఘర్షణకు వెనకాడ్తోంది. నలభై దినాలు ఉపవసించి ప్రార్ధించాడు. ఉపవసించడంవల్ల చిక్కి బలహీనంగా ఉన్నాడు. అలసిపోయి మానసిక వేదనతో వికారంగా ఉన్నాడు. “మనిషి రూపముకంటె అతని ముఖమును నర రూపముకంటె అతని రూపమును చాలవికారము” గా ఉంది. యెషయా 52:14; ఇది సాతానుకి మంచి అవకాశం. క్రీస్తును ఇప్పుడు జయించగలను అనుకున్నాడు.DATel 103.4

    తన ప్రార్థనకు జవాబుగా అన్నట్లు పరలోకంనుంచి వచ్చిన దూత రూపంలో ఒకడు రక్షకునివద్దకు వచ్చాడు. దేవుని ఆజ్ఞమేరకు వచ్చానని తన ఉపవాసకాలం ముగిసిందని చెప్పడానికి వచ్చానని క్రీస్తుతో అన్నాడు. ఇస్సాకును వధించకుండా అబ్రహాము హస్తాన్ని ఆపడానికి దేవుడు దూతను పంపినట్లే రక్తంతో తడిసిన మార్గాన నడవడానికి సన్నద్ధంగా ఉన్న క్రీస్తుతో తృప్తి చెందిన తండ్రి ఆయనని విడిపించడానికి దూతను పంపించాడు. యేసుకు తెచ్చిన వర్తమానం ఇది. రక్షకుడు ఆకలివల్ల బలహీనపడ్డాడు. ఆహారాన్ని ఆపేక్షిస్తోన్నాడు. అప్పుడు హఠాత్తుగా సాతాను యేసువద్దకు వచ్చాడు. అరణ్యంలో చెదరిపడి రొట్టెల ఆకారంలో ఉన్న రాళ్ళవంక చూపిస్తూ శోధకుడిలా అన్నాడు ” నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము”DATel 104.1

    అతడు వెలుగు దూతగా కనిపించినప్పటికీ ఈ మొదటి మాటలు అతడి ప్రవర్తనకు అద్దంపట్తోన్నాయి. “నీవు దేవుని కుమారుడవైతే” ఇవి అపనమ్మకం పుట్టించేమాటలు. సాతాను సలహామేరకు యేసు వ్యవహరిస్తే సందేహాన్ని అంగీకరించడం అవుతుంది. ఆదిలో మానవజాతి పతనానికి ఏ సాధనాల్ని ఉపయోగించాడో వాటిని ఉపయోగించే క్రీస్తును పడదొయ్యాలన్నది సాతాను పథకం. ఏదెనులో సాతాను ఎంత యుక్తిగా అవ్వను ఆకట్టుకున్నాడు! “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేనిఫలములనైన మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” ఆది 3: 1. ఇక్కడ వరకూ శోధకుడి మాటల్లో పొరపాటేమీ లేదు. కాని వాటిని పలికిన తీరులో ఉంది తిరకాసు. అది దేవుని మాటల్ని నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుంది. ఇందులో పరోక్షమైన వ్యతిరేకత దేవుని నిజాయితీని శంకించడం ధ్వనిస్తున్నాయి. దేవుడు చెప్పింది నెరవేర్చడు అన్న ఆలోచనను, అంత మంచిపండును తిననియ్యకపోవడమన్నది మానవుడిపట్ల దేవుని ప్రేమ దయ తత్వానికి విరుద్ధం. ‘అన్న ఆలోచనను అవ్వ మనసులో నాటడానికి కృషిచేశాడు సాతాను. ఇప్పుడు శోధకుడు తన సొంత అభిప్రాయాలతో క్రీస్తును ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తోన్నాడు. “నీవు దేవుని కుమారుడవైతే” అన్నమాటలు అతడి మనసులో విద్వేషాన్ని ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. అతడి స్వరంలో అపనమ్మకం ధ్వనులు వినిపించాయి. దేవుడు తనసొంత కుమారుడిపట్ల ఇలా వ్వవహరిస్తాడా? అరణ్యంలో అడవి మృగాల మధ్య ఆహారం లేకుండా స్నేహితులు లేకుండా సదుపాయం లేకుండా విడిచి పెట్టాడా? తన కుమారుడు ఈ స్థితికి రావడం దేవుని ఉద్దేశంకాదని వ్యంగ్యంగా సూచిస్తోన్నాడు. “నీవు దేవునికుమారుడై తే” నీశక్తి నుపయోగించి నీదుర్బర ఆకలిబాధను నివారించుకో. ఈరాళ్ళను కొద్దిగా మారాల్సిందని ఆజ్ఞాపించు.DATel 104.2

    “ఇదిగో ఈయనే నాప్రియ కుమారుడు; ఈయనయందు నేనానందించుచున్నాను.” మత్తయి 3:17 అన్నమాటలు సాతాను చెవుల్లో ఇంకా గింగిరు మంటోన్నాయి. ఈ సాక్ష్యాన్ని నమ్మకుండా క్రీస్తును పక్కతోవ పట్టించడానికి సాతాను కృతనిశ్చయంతో ఉన్నాడు. క్రీస్తు కర్తవ్యం దైవ ప్రాయోజిత సేవ అన్నదానికి దేవుని మాటే భరోసా. ఆయన మనుషుల మధ్య మనిషిగా నివసించడానికి వచ్చాడు. పరలోకంలో ఆయన సంబంధాన్ని ప్రకటించింది. దైవవాక్యమే. వాక్యాన్ని శంకించేటట్లు ఆయన్ను పక్క దారి పట్టించడమే సాతాను తాపత్రయం. దేవునిపై క్రీస్తు విశ్వాసం సడలేటట్లు చేయగలిగినట్లయితే మొత్తం సంఘర్షణలో తన విజయం ఖాయమని సాతానుకు తెలుసు. తాను యేసుపై జయం సాధించగలననుకున్నాడు. నిస్పృహకు తీవ్రమైన ఆకలిబాధకు గురి అయిన క్రీస్తు తండ్రి పై విశ్వాసాన్ని కోల్పోయి తన్నుతాను కాపాడుకోడానికి అద్భుతం చేస్తాడని సాతాను నిరీక్షించాడు. క్రీస్తు ఇదిగాని చేసి ఉంటే రక్షణ ప్రణాళిక నిరర్ధకమయ్యేది.DATel 105.1

    సాతాను, దైవకుమారుడు ప్రప్రధమంగా యుద్ధంలో కలుసుకున్నప్పుడు క్రీస్తు పరలోక సైన్యాధిపతి. సాతాను పరలోకంలో తిరుగాబాటు నాయకుడు. పరలోకం నుంచి బహిష్కృతుడు. ఇప్పుడు వారి పరిస్థితి తారుమారయ్యింది. ఇప్పుడు సాతాను తనకు కనిపిస్తున్న పరిస్థితిని తనకు అనుకూలంగా ఉండేటట్లు మలచుకోడానికి ప్రయత్నిస్తోన్నాడు. దూతల్లో శక్తిమంతుడొకడు పరలోకం నుంచి బహిష్కృతుడయ్యాడు అంటోన్నాడతడు. క్రీస్తు రూపాన్ని బట్టి ఆయనే బహిష్కరానికి గురి అయిన దూత అనిపిస్తోంది. దేవుడు బహిష్కరించిన వాడు, మనుషులు త్యజించిన వ్యక్తి ఆయనే అనిపిస్తోంది. దేవత్వం గలవాడు అద్భుతక్రియలు చేయడం ద్వారా తన దేవత్వాన్ని నిలుపుకోగలుగుతాడు. “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము” సృజనశక్తిని సూచించే క్రియ దేవత్వానికి తిరుగులేని నిదర్శనం అన్నాడు ఆ శోధకుడు. అది సంఘర్షణకు ముగింపు పలుకుతుంది.DATel 105.2

    ఈ అపూర్వ వంచకుడి మాటల్ని యేసు అంతరంగంలో సంఘర్షణ లేకుండా నిశ్శబ్దంగా ఉండి వినలేదు. దైవకుమారుడు తన దేవత్వాన్ని సాతానుకి నిరూపించుకోనవసరం లేదు లేదా తన అవమానానికి వివరణ నివ్వవలసిన పనిలేదు. తిరుగుబాటుదారుడి కోర్కెలు నెరవేర్చడంవల్ల మనుషులికి మేలు ఒనగూడడంగాని దేవునికి మహిమ కలగడంగాని జరగదు విరోధి సూచన మేరకు క్రీస్తు వ్యవహరించి ఉంటే నీవు దేవుని కుమారుడవని నేను నమ్మేందుకు ఇంకా ఒక అద్భుతం చేయమని సాతాను కోరేవాడు. అతడి మనసులోని తిరుగుబాటును తీసివేయడానికి నిదర్శనం చూపడం నిరర్ధకం అయ్యేది. అదీగాక క్రీస్తు తనసొంత మేలుకోసం దైవశక్తిని వినియోగించకూడదు. విశ్వాసం విషయంలోను విధేయత విషయంలోను మనకో ఆదర్శాన్ని విడిచి వెళ్లేందుకు మనలాగే శ్రమలు భరించడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ గాని అనంతరం తన ఇహలోక జీవితంలో ఏ సందర్భంలోగాని తన మేలు కోసం ఆయన ఏ అద్భుతాన్ని చెయ్యలేదు. ఆయన అద్భుత కార్యాలన్నీ ఇతరుల మేలుకోసమే చేశాడు. సాతాను ఆదినుంచీ ఎరిగిఉన్నా యేసు అతడితో ఎలాంటి వాదప్రతివాదాలకు దిగలేదు. పరలోకంనుంచి వచ్చిన ఆ స్వరాన్ని గుర్తుచేసుకుని బలో పేతుడవుతూ ఆయన తన తండ్రి ప్రేమలో విశ్రమించాడు. శోధనతో మంతనాలు జరపలేదు.DATel 106.1

    యేను సాతానుణ్ని లేఖనంతో ఎదుర్కున్నాడు. “అని వ్రాయబడియున్నది” అని బదులిచ్చాడు. ప్రతీ శోధనలోనూ ఆయనకు దేవుని వాక్యమే తన యుద్ధాయుధం. తన దేవత్వ నిదర్శనంగా ఓ అద్భుతకార్యం చెయ్యమని సాతాను డిమాండు చేశాడు. అయితే అద్భుత కార్యాలన్నిటికన్నా గొప్పది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అన్నదానిపై దృఢంగా ఆనుకోడం. ఇది కాదనలేని సూచన. యేసు దీనిపై నిలబడినంతకాలం శోధకుడు ముందడుగు వెయ్యలేకపోయాడు.DATel 107.1

    అతి బలహీనసమయంలో క్రీస్తు మిక్కిలి భయంకర శోధనల్ని ఎదుర్కున్నాడు. ఈ రకంగా ఆయన్ని పరాజయం పాలుచెయ్యడానికి సాతాను ప్రయత్నించాడు. అతడు ఇలాగే మనుషులపై విజయం సాధించాడు. శక్తి నశించి, ఆత్మ బలం క్షీణించి, దేవునిపై నమ్మకం కోల్పోయినప్పుడు సత్యానికి నమ్మకంగాను ధైర్యంగాను ఎంతో కాలం నిలిచిన వారు పరాజయం పొందారు. ఇశ్రాయేలు నలభై సంవత్సరాల అరణ్య సంచారంతో అలసిపోయి అనంత శక్తిగల దేవునిపై తన విశ్వాసాన్ని మోషే ఒక్క క్షణంలో జారవిడిచాడు. వాగ్రత్త భూమి పొలిమేరల్లో విఫలుడయ్యాడు. అహాబు రాజు ముందు ధైర్యంగా నిలిచిన ఏలీయా, మూడువందల ఏభై మంది బయలు ప్రవక్తల ఆధ్వర్యంలో ఇశ్రాయేలుజాతిని ఎదుర్కున్న ఏలీయా విషయంలోనూ ఇదే జరిగింది. కర్మలుపై ఆ భయానక సంఘటన అనంతరం అనగా అబద్ద ప్రవక్తలు హతమైన తర్వాత ప్రజలు తాము దేవునికి నమ్మకంగా నివసిస్తాము అని ప్రకటించినప్పుడు వ్యభిచారిణి అయిన యెజెబెలు బెదరింపులకు జడిసి ఏలీయా పారిపోయాడు. సాతాను ఇలా మానవుల బలహీనతను సోమ్ముచేసుకుంటున్నాడు. ఇలాగే ఇంకా పని చేస్తాడు. ఎవరినైనా మేఘాలు ఆవరించినప్పుడు, పరిస్థితులు గందరగోళపర్చినప్పుడు, దారిద్ర్యం దుఃఖం పీడించినప్పుడు, శోధించి హైరాన పెట్టడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. మన బలహీనతల్ని సొమ్ము చేసుకుంటాడు. అలాంటి దుస్థితికి మనల్ని తెచ్చింది దేవుడేనంటూ నిందిస్తూ ఆయనపై మన విశ్వాసాన్ని క్షీణింపచేస్తాడు. దేవుడు నమ్మదగినవాడు కాడని ఆయన ప్రేమ వట్టిదని నమ్మడానికి శోధిస్తాడు. క్రీస్తు వద్దకు వచ్చిన రీతిగా లోపాల్ని మన ముందుకు తెచ్చి వేలెత్తి చూపిస్తాడు. ఆత్మను నిరుత్సాహపర్చి దేవునిపై మన పట్టును విడిపించాలని చూస్తాడు. అలా జరిగినప్పుడు మనం అతడికి లొంగిపోడం ఖాయం. యేసు మాదిరిగా మనం అతణ్ణి ఎదుర్కుంటే అనేక వైఫల్యాల నుంచి మనం తప్పించుకోగల్గుతాం. శత్రువుతో సంప్రదించడం ద్వారా అతడికి మనం అలుసిస్తాం.DATel 107.2

    “మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును” అన్నమాటల్లో పద్నాలుగు వందల సంవత్సరాల పైచిలుకు క్రితం “ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము, ఆహారము వలననేగాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాట వలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను” అని ఇశ్రాయేలుతో తానన్న మాటల్ని క్రీస్తు ఇక్కడ పునరుద్ఘాటిస్తోన్నాడు. (ద్వితి 8:2,3). అరణ్యంలో ఆహార సరఫరాకు మార్గాలన్నీ మూత పడ్డప్పుడు దేవుడు తన ప్రజలకు పరలోకం నుంచి మన్నాను పంపాడు. అది వారి అవసరం మేరకు నిత్యం సరఫరా అయ్యింది. దేవునిపై విశ్వాసం ముంచి ఆయన మార్గాల్లో నడిస్తే ఆయన వారిని విడనాడడని ఈ సరఫరా వారికి నేర్పించాల్సి ఉంది. రక్షకుడు తాను ఇశ్రాయేలుకు నేర్పించిన పాఠం ఇప్పుడు ఆచరించాడు. దేవుని మాటవలన హెబ్రీయులికి సహాయం లభించింది. ఆ మాట వలననే యేసుకీ సహాయం లభిస్తుంది. సహాయం అందడానికి దేవుని సమయం కోసం ఎదురుచూశాడు. దైవాజ్ఞకు విధేయుడై అరణ్యంలోకి వెళ్లాడు. సాతాను సూచనల్ని అనుసరించి ఆహారం సంపాదించడం ఆయనకు ససేమిరా ఇష్టం లేదు. దేవుని చిత్తాన్ని ఏరకంగాను అనుసరించకుండా తప్పించుకోడం కన్నా తమకు ఏమి సంభవించనున్నదో దాన్ని అనుభవించడం తక్కువ ప్రమాదకరమని చూస్తున్న విశ్వాసానికి సాక్ష్యమిచ్చాడు.DATel 108.1

    “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును” క్రీస్తు అనుచరుడు దేవుని సేవించడం తన లౌకిక వ్యాపారాన్ని సాగించడం సాధ్యం కాని పరిస్థితులు తరచు ఏర్పడుంటాయి. బహుశా స్పష్టంగా ఉన్న దైవనియమాల్ని ఆచరించడం అతడి జీవనోపాధికి అడ్డుతగలవచ్చు. అయితే తాను మనస్ఫూర్తిగా నమ్మిన వాటిని త్యాగం చేయడం అవసరమని నమ్మడానికి సాతాను అతణ్ని నడిపిస్తాడు. కాగా లోకంలో మనం నమ్మి ఆధారపడగలిగింది దేవుని వాక్యం మాత్రమే. “కాబట్టి వారు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నియు మీకనుగ్రహించబడును” మత్తయి 6:33; మన పరలోక తండ్రి చిత్రానికి విరుద్ధంగా నడుచుకోడం ఈ జీవితంలో సైతం మనకు క్షేమంకాదు. మనం ఆయన వాక్యశక్తిని గ్రహించినప్పుడు ఆహారం సంపాదించడానికి గాని లేదా ప్రాణాలు కాపాడుకోడానికిగాని సాతానిచ్చే సలహాల్ని అనుసరించం. దేవుని ఆజ్ఞ చెబుతోంది ఏంటి? ఆయన వాగ్దానం ఏంటి? అన్నవి మాత్రమే మనం పరిగణించాలి. వీటిని గ్రహించిన మీదట మనం ఒకదాన్ని ఆచరిస్తాం. ఇంకోదాన్ని నమ్ముతాం.DATel 108.2

    సాతానుతో జరిగే పోరాటంలోని చివరి సంఘర్షణలో దేవునికి నమ్మకంగా నిలబడేవారు లోకంలో తమకు ఎలాంటి మద్దతు అండదండలు లేవని గుర్తిస్తారు. లోకాధికారులకు విధేయులై వారి ఆదేశం మేరకు దైవధర్మశాస్త్ర ఉల్లంఘనకు వారు సమ్మతించని కారణంగా వారిని కొనకుండా అమ్మకుండా నిషేదించడం జరుగుతుంది. తుదకు వారిని చంపాల్సిందిగా తీర్మానించడమౌతుంది. ప్రకటన 13:11-17 చూడండి. అయితే దేవునికి నమ్మకంగా నిలిచేవారికున్న వాగ్దానం ఇది. “పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.” యెషయా 33:16. దైవ ప్రజలు ఈ వాగ్దానాన్ని నమ్ముకుని నివసిస్తారు. కరవుకోరల్లో చిక్కి జనులు మరణిస్తుంటే వీరికి ఆహారం ఉంటుంది. “ఆపత్కాలమునందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తి పొందుదురు” కీర్త 37:19 ఆ శ్రమ కాలానికే హబక్కూకు ప్రవక్త ఎదురుచూశాడు. సంఘానికున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అతడిలా అన్నాడు, “అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్టు ఫలింపకపోయినను పొలములో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణ కర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను.” హబక్కూకు 3:17, 18;DATel 109.1

    ప్రభువు మొదటి శోధన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలన్నిటిలోను మిక్కిలి ప్రాముఖ్యమైంది ఆహారేచ్ఛను ఉద్రేకాన్ని అదుపుచేసుకోవడాన్ని గూర్చింది. అన్నియుగాల్లోను మానవాళిని దుర్నీతిలోకి దుర్మార్గంలోకి నడిపించడంలో మిక్కిలి విజయవంతమైన మార్గం శరీరేచ్ఛలకు సంబంధించిన శోధనల్ని వినియోగించడం. దేవుడు అమూల్యమైన వరంగా మానవుడికిచ్చిన మానసిక నైతిక శక్తుల్ని నిగ్రహంలేని ఆశ ద్వారా నాశనం చెయ్యడానికి సాతాను కృషి చేస్తోన్నాడు. అందుచేత మనుషులు నిత్య విలువల అంశాల్ని అభినందించడం సాధ్యపడడంలేదు. శారీరిక భోగాల ద్వారా ఆత్మలోని దైవరూపాన్ని తుడిచివేయడానికి సాతాను అదనుకోసం కనిపెడ్తూ ఉంటాడు.DATel 110.1

    క్రీస్తు మొదటి రాక సమయంలో ప్రబలిన విచ్చలవిడి ప్రవర్తన పర్యవసానంగా సంభవించిన వ్యాధులు ఆయన రెండోరాక సమయంలోనూ చోటుచేసుకుంటాయి. కాకపోతే ఇప్పుడు అవి కాస్త ఎక్కువ స్థాయిలో ఉంటాయి. లోకం పరిస్థితి జలప్రళయం ముందటి రోజుల్లోలాగ సొదమ గొమొర్రాల్లోలాగ ఉంటుందని క్రీస్తు చెప్పాడు. హృదయాలోచనలన్నీ నిత్యం చెడుగును గూర్చే ఉంటాయి. అలాంటి భయంకర సమయం అంచున ఇప్పుడు మనం నివసిస్తోన్నాం. రక్షకుని ఉపవాసం ఆంతర్యాన్ని మనం అవగాహన చేసుకోడం అవసరం. క్రీస్తు అనుభవించిన తీవ్ర వ్యధను బట్టి విచ్చలవిడి భోగాల వల్ల కలిగే కీడు ఎంతటిదో అంచనా వేసుకోగలుగుతాం. మన శరీరాశల్ని ఉద్రేకాల్ని దేవుని చిత్తం నియంత్రణ కిందికి తేవడం ద్వారానే మనకు నిత్యజీవ నిరీక్షణ ఉంటుందని ఆయన ఆదర్శం వెల్లడిచేస్తోంది.DATel 110.2

    పతనమైన మన స్వభావం కోర్కెల్ని స్వశక్తితో తోసిపుచ్చడం అసాధ్యం. వంశపారంపర్యంగా వస్తున్న బలహీనతల్ని ఆసరాగా తీసుకుని దేవుని విశ్వసించని వారినందరినీ తన వలలో వేసుకోడానికి సాతాను ప్రతీ మానవుడి వద్దకు వస్తాడని క్రీస్తుకు తెలుసు. మానవుడు పయనించాల్సిన మార్గాన పయనించడం ద్వారా విజయం సాధించేందుకు మన ప్రభువు మనకు మార్గం సుగమం చేశాడు. సాతానుతో పోరాటంలో మనం అననుకూల స్థానంలో ఉండడం ప్రభువుచిత్తం కాదు. సర్భం దాడుల వల్ల మనల్ని భయానికి నిరుత్సాహానికి గురిచెయ్యడం ఆయన అభిలాషకాదు. “ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించియున్నాను.” అంటున్నాడు. యోహాను 16:33.DATel 110.3

    ఆహారాశ అదుపుకు పోరాడున్న వ్యక్తి అరణ్యంలో శోధనను ఎదుర్కున్న రక్షకుని వంక చూడాలి. సిలువ మీద బాధ ననుభవిస్తూ “నేను దప్పిగొనుచున్నాను” అంటున్న ఆయనను చూడాలి. మనం భరించగలిగిందంతా ఆయన భరించాడు. ఆయన విజయం మన విజయం.DATel 111.1

    యేసు పరలోక మందున్న తన తండ్రి వివేకాన్ని నమ్ముకున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు.... నేను సిగ్గుపడనని యెరిగి... ప్రభువు నాకు సహాయము చేయును.” యెషయా 50:7-10;DATel 111.2

    “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు” అన్నాడు యేసు. యోహాను 14:30 సాతాను కుతర్కానికి స్పందించేదేమి ఆయనలో లేదు. పాపం చెయ్యడానికి ఆయన సమ్మతించలేదు. మనం కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు. క్రీస్తు మానవత్వం దేవత్వంతో సంయోగమయ్యింది. అంతరంగంలో పరిశుద్ధాత్మ నివాసం ద్వారా పోరాటానికి అవసరమైన శక్తిని ఆయన పొందాడు. దైవస్వభావంలో పాలివారిని చెయ్యడానికి అప్పుడు ఆయన మనవద్దకు వచ్చాడు. మనం విశ్వాసమూలంగా ఆయనతో ఏకమయి ఉన్నంతకాలం మనపై పాపం రాజ్యమేలలేదు. మనం క్రీస్తు పరిపూర్ణ ప్రవర్తనను సాధించేందుకు దేవుడు మనలోని విశ్వాసహస్తాన్ని, తీసుకుని ఆయన దైవత్యాన్ని గట్టిగా పట్టుకోవాల్సిందిగా మనల్ని ఆదేశిస్తాడు.DATel 111.3

    దీన్ని ఎలాసాధించాలో క్రీస్తు మనకు చూపిస్తోన్నాడు. సాతానుతో సంఘర్షణలో ఆయన విజయం ఎలా సాధించాడు? దేవుని వాక్యము ద్వారానే ఆయన శోధనను ప్రతిఘటించగలిగాడు. “అని వ్రాయబడియున్నది” అని అన్నాడు. మనకు “అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టతను ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను” 2 పేతురు 1:4. దైవవాక్యంలోని ప్రతీ వాగ్దానం మనదే. “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలన” మనం జీవించాల్సి ఉన్నాం. మా పై శోధన దాడి జరిగినప్పుడు పరిస్థితుల్ని గాని లేదా నాలోని బలహీనతల్నిగాని పరిగణించక వాక్యశక్తిని ఆశ్రయించండి. ఆ శక్తి అంతా నా సొంతమౌతుంది. కీర్తనకారుడిలా అంటున్నాడు, “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నాహృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను “బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీనోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను” కీర్తనలు 119:11; 17:4;DATel 111.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents