Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    9—సంఘర్షణ దినాలు

    యూదు బాలుడు రబ్బీల నిబంధనల నడుమ పెరగడం జరిగింది. జీవితంలో అతిచిన్న విషయంలోనూ ప్రతీ కార్యానికి కఠినమైన నిబంధనలుండేవి. సమాజమందిరపు ఆధ్యాపకులు యువతకు అనేక నిబంధనల్ని బోధించేవారు. సనాతన విశ్వాసులుగా ఇశ్రాయేలీయులు ఆ నిబంధనల్ని ఆచరించాల్సి ఉండేది. అయితే ఈ విషయాలపై క్రీస్తు ఆసక్తి చూపలేదు. చిన్ననాటి నుంచి ఆయన రబ్బీల నియమనిబంధనల్ని లెక్కచెయ్యలేడు. ఆయన పాతనిబంధన లేఖనాల్ని సర్వదా అధ్యయనం చేసేవాడు. “యెహోవా సెలవిచ్చుచున్నాడు.” అన్న మాటలు ఆయన పెదవుల మీద ఎల్లప్పుడూ ఉండేది.DATel 68.1

    ప్రజల పరిస్థితి తన మనసుకు బహిర్గతమైనప్పుడు సమాజ నిబంధనలు డైచ విధులమధ్య నిత్యసంఘర్షణ ఉన్నట్లు ఆయన గుర్తించాడు. మనుషులు దైవ ధర్మశాసనాల్ని విడిచి పెట్టి తాము సొంతంగా రూపొందించుకున్న సిద్ధాంతాల్ని ఘనపర్చుతున్నారు. ఏమీ విలువలేని సంప్రదాయాల్ని ఆచారాల్ని ఆచరిస్తున్నారు. వారి ఆరాధన కేవలం ఆచారాల సమాహారం. ఆరాధన బోధించాల్సిన పరిశుద్ధ సత్యాలు ఆరాధకులకు మరుగుపడ్డాయి. తమ విశ్వాసరహిల ఆరాధనలో వారికి ఎలాంటి శాంతి లభించలేదని ప్రభువు చూశాడు. చిత్తశుద్ధితో దేవుని సేవించడం వల్ల వచ్చే స్వేచ్ఛ స్పూర్తి వారికి తెలియదు. దేవుని ఆరాధించటమంటే ఏంటో నేర్పించడానికి యేసు వచ్చాడు. దైవ నియమాలతో మానవ నిబంధనల్ని మిళితం చేయడం ఆయన ఆమోదించలేదు. పాండిత్యంగల బోధకుల సూత్రాల్నిగాని ఆచారాల్నిగాని ఆయన ఎదిరించలేదు. కాని సామాన్యమైన తన అలవాటు నిమిత్తం మందలింపుకు గురి అయినప్పుడు తన ప్రవర్తనను సమర్థించుకోడానికి ఆయన దైవవాక్యాన్ని సమర్పించేవాడు.DATel 68.2

    తనతో పరిచయం ఏర్పర్చుకున్న వారిని సంతోషపర్చడానికి సున్నితమైన మృదువైన మార్గాలన్నిటిని యేసు అవలంబించాడు. ఆయన ఎంతో దీనంగా సామాన్యంగా కనిపించడంతో శాస్త్రులు పెద్దలు ఆయన్ని తమ బోధనలతో వశపర్చుకోవచ్చునని భావించారు. పూర్వపు రబ్బీల నుంచి వస్తోన్న నీతి సూత్రాల్ని సంప్రదాయాల్ని స్వీకరించాల్సిందిగా వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే దైవ వాక్యంలో వాటికి ఆధారం చూపించమని ఆయన వారిని కోరాడు. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతీమాటా వింటానని కాని మానవ కల్పితాల్ని మాత్రం ఆచరించనని ఆయన కుండబద్దలు కొట్టాడు. యేసుకి లేఖనాలు ఆది నుంచి అంతం చరకు తెలిసినట్లు కనిపించింది. వాటిని ఆయన యధార్ధమైన భావంతో సమర్చించాడు. బాలుడు తమకు ఉపదేశం ఇవ్వడం వబ్బీలకు సిగ్గుగా ఉంది. లేఖనాల్ని వివరించడం తమ పని అని తాము చెప్పే భాష్యాన్ని అంగీకరించడం తన పని అని రబ్బీలు యేసుతో అన్నారు. తమ మాటను వ్యతిరేకిస్తున్నందుకు వారు ఆయనపై మండిపడ్డారు.DATel 69.1

    తమ సంప్రదాయాలకు వాక్యంలో ఏ ఆధారం లేదని వారికి తెలుసు. ఆధ్యాత్మిక విషయాల అవగాహనలో యేసు తమకన్నా ఎంతో ముందున్నట్లు వారు గుర్తించారు. ఆయినా తమ ఆదేశాల్ని ఆచరించనందుకు ఆయనపై వారు ఆగ్రహించారు. ఆయన్ని ఒప్పించలేకపోవడంతో వారు యోసేపు మరియల వద్దకు వెళ్లి ఆయన అవిధేయ ప్రవర్తనను వారి ముందు పెట్టారు. వారు ఆయన్ని ఈ రకంగా మందలించారు.DATel 69.2

    తన ప్రవర్తనను నిర్మించుకోడం విషయంలో యేసు చిన్న వయసులోనే స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభించాడు. దైవవాక్యం పట్ల తన విధేయత నుంచి తల్లిదండ్రుల పట్ల గౌరవంగాని ప్రేమగాని ఆయన్ని పక్కకు మరల్చలేకపోయాయి. తన కుటుంబచారాల్తో విభేదించిన తన ప్రతీక్రియకు ఆయన చూపిన హేతువు “అని వ్రాయబడియున్నది” అన్నదే. కాని రబ్బీల పలుకుబడివల్ల ఆయన జీవితం కష్టభరితమయ్యింది. తన యౌవన దశలో సయితం నిశ్శబ్దంగా ఓర్పుతో భరించడమన్న కఠినమైన పాఠాన్ని ఆయన నేర్చుకోవాల్సి వచ్చింది.DATel 69.3

    యేసేపు కుమారుల్ని యేసు సోదరులని పిలిచేవారు. వారు రబ్బీలతో కుమ్మక్కయ్యేవారు. సంప్రదాయాలు దైవవిధులన్నట్లు వాటిని ఆచరించాల్సిందే అని వారు పట్టుపడుతుండేవారు. దేవుని వాక్యంకన్నా మనుషుల సూక్తుల్ని సైతం వారు ఘనంగా ఎంచారు. యేసు సత్యాసత్యాల్ని స్పష్టంగా గుర్తించి తాము మొండితనంగా ఖండించిన దైవ ధర్మశాస్త్రాల్ని విధేయంగా ఆచరించడం వారికి కంటగింపుగా ఉండేది. రబ్బీలకు సమాధానం చెప్పడంలో ఆయన ప్రదర్శించిన జ్ఞానాన్ని వివేకాన్ని చూసి వారు విస్మయం చెందేవారు. ఆయన జ్ఞానుల వద్ద విద్యనభ్యసించలేదని ఆయినా ఆయన తమకు ఉపదేశమిచ్చే స్థాయిలో ఉన్నాడని వారు గుర్తించారు. కాగా ఆయనకు జీవవృక్షఫలాలు తినే ఆధిక్యత ఉందని ఆ వృక్షం జ్ఞానానికి మూలం అని వారు గ్రహించలేదు. ఆ విషయమై వారు అజ్ఞానులు.DATel 70.1

    క్రీస్తు వేర్పాటు వాది కాడు. ఈ విషయమై తమ కఠిన నియమనిబంధనల్ని పాటించకపోవడం ద్వారా పరిసయ్యుల్ని తీవ్రంగా నొప్పించాడు. మతం అనుదిన జీవితానికి అందుబాటులో ఉండరానిదిలా దాని చూట్టూ ఎత్తయిన వేర్పాటు గోడలు నిర్మితమయి ఉండడం క్రీస్తు కనుగొన్నాడు. ఈ అడ్డుగోడల్ని ఆయన కూల్చివేశాడు. ప్రజలతో కలిసి మసులుతున్నప్పుడు మీ మతమేంటి? అని ఆయన ప్రశ్నించలేదు. అవసరంలో ఉన్నవారందరికీ ఆయన చేయూతనిచ్చాడు. తన పవిత్ర ప్రవర్తనను చూపించుకోడానికి యోగిలా ఏకాంతంలో ఉండే బదులు మానవుల, శ్రేయోభివృద్ధికి పాటుపడ్డాడు. బైబిలు మతం . శరీరాన్ని హింసించుకోడం ప్రబోధించదన్న సూత్రాన్ని ఆయన బోధించాడు. పవిత్రమైన నిష్కళంకమైన మతం నిర్దిష్ట సమయాలకు ప్రత్యేక సందర్భాలకు పరిమితమయ్యింది కాదని ఆయన బోధించాడు. అన్నివేళల్లో అన్ని స్థలాల్లో మనుషులపై అనురాగపూరిత ఆసక్తిని ప్రదర్శించాడు. తన చుట్టూ ఉత్సాహపూరిత ప్రభావాన్ని ప్రసరించాడు. పరిసయ్యులకు ఇదంతా మందలింపుగా ఉంది. మతంలో స్వార్ధం లేదని స్వార్ధప్రయోజనాల నిమిత్తం తాము చూపిస్తోన్న భక్తి నిజమైన భక్తి కాదని అది సూచించింది. ఇది క్రీస్తుపట్ల వారి శత్రుత్వానికి కారణమయ్యింది. అందువల్ల తమ కట్టుబాట్లను ఆయన ఆచరించితీరాలని ఒత్తిడిచేశారు.DATel 70.2

    తన దృష్టికి వచ్చిన ప్రతీవ్యక్తి బాధను నివారించడానికి యేసు కృషిచేశాడు. ఇవ్వడానికి ఆయనవద్ద ద్రవ్యం లేదు. కాని తనకన్నా మరింత అవసరంలో ఉన్నవారి అవసరాన్ని తీర్చడానికి ఆయన తరచు ఆకలిగా ఉండిపోయాడు. ఆయన పలుకుబడి తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ విస్తరిస్తోందని ఆయన సహోదరులు అభిప్రాయపడ్డారు. ఆయనకున్న నేర్పు ఆయన సహోదరులికి లేదు. అది కావాలని వారు అభిలషించనూ లేదు. బీదలతో కొరగాని వారితో వారు నిర్దయగా మాట్లాడితే యేసు వారిని చేరదీసి ఉత్సాహపర్చేవాడు. అవసరంలో ఉన్నవారికి తాగడానికి మంచినీళ్ళిచ్చి తన భోజనాన్ని వారి కందించేవాడు. ఇలా వారి బాధల్ని నివారించినప్పుడు ఆయన బోధించిన సత్యాలు ఆయన కారుణ్యకార్యాలతో సంధానపడి వారి మనసుల్లో నాటుకుపోయేవి.DATel 71.1

    యేసు తన సోదరులపట్ల ప్రేమానురాగాలుకలిగి దయగా వ్యవహరించేవాడు గాని వారు ఆయనపట్ల ఈర్య కలిగి అపనమ్మకంతో ద్వేషంతో మెలిగేవారు. ఆయన ప్రవర్తనను వారు అవగాహన చేసుకోలేకపోయేవారు. యేసులో వారికి గొప్ప వైరుధ్యాలు కనిపించేవి. ఆయన దైవకుమారుడే అయినా ఆయన నిస్సహాయ బాలుడు. ఆయన లోకాల్ని సృజించినవాడు; భూమి ఆయన సొత్తు అయినా అడుగడుగునా జీవితానుభవంలో పేదరికం ఆయనను వెంటాడింది. ఆయన ఠీవి వ్యక్తిత్వం లౌకికమైన దర్పం ఊహాగానాలకి ఎంతో వ్యత్యాసంగా ఉన్నాయి. ఆయన లోకప్రతిష్టకు పాకులాడలేదు. అతి సామాన్య స్థితిలో సైతం తృప్తి చెందాడు. ఇది తన సహోదరులకి కోపం రప్పించింది. శ్రమలు లేమి నడుమ ఆయన నిశ్చల ప్రశాంతతను వారు అవగాహన చేసుకోలేకపోయారు. మనం “తన దారిద్రము వలన ధనవంతులము కావలెనని” మన నిమిత్తం ఆయన నిరుపేద అయ్యాడని వారికి తెలియదు. (2కొరింథీ 8:9) యోబు మిత్రులు అతని శ్రమల్ని దుస్తితిని ఎంతగా అర్ధంచేసుకున్నారో యేసు కర్తవ్యాన్ని గూర్చిన మర్మాన్ని ఆయన సహోదరులూ అంతగానే అర్ధం చేసుకున్నారు.DATel 71.2

    యేసు తమకులా లేడు కాబట్టి ఆయన సోదరులు ఆయనను అపార్ధం చేసుకున్నారు. ఆయన ప్రమాణం వారి ప్రమాణం కాదు. వారు మనుషుల వంక చూడడంలో దేవుని నుంచి తొలగిపోయారు. వారి జీవితాల్లో దైవ శక్తి లోపించింది. వారు ఆచరించిన లాంఛన నిబద్దమైన మతం వారి ప్రవర్తనను మార్చలేకపోయింది. వారు “పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను” పదోవంతు చెల్లించి “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును” విడిచిపెట్టారు. మత్తయి 23:23 యేసు ఆదర్శం వారికి చెవిలో జోరీగలా కంటగింపుగా ఉంది. లోకంలో ఆయన ద్వేషించింది ఒక్కటే. అది పాపం: ఒక దుశ్చర్యను చూసినప్పుడు ఆయన బాధపడకుండా ఉండలేకపోయేవాడు. ఆ బాధను దాచుకోలేకపోయేవాడు. పైకి భక్తిపరులుగా కనిపిస్తూ తమ పాపేచ్ఛను కప్పిపుచ్చుకునే సాంప్రదాయక విశ్వాసులకూ, ఎల్లప్పుడు దేవుని మహిమపర్చడానికి ఉద్రేకంతో ముందుకువెళ్లే వారి ప్రవర్తనకూ మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. యేసు జీవితం పాపాన్ని ఖండించింది కాబట్టి ఆయనకు ఇంటాబయటా వ్యతిరేకత ఎదురయ్యింది. ఆయన నిస్వార్ధతను విశ్వసనీయతను ఎగతాళి చేశారు. ఆయన సహనాన్ని కారుణ్యాన్ని పిరికితనమని గేలిచేశారు.DATel 72.1

    మానవాళికి కలిగే దుఃఖ బాధలన్నీ క్రీస్తు అనుభవించాడు. ఆయన జననాన్ని గురించి ఆయనను నిందించి ఎగతాళి చేసినవారున్నారు. తన పసితనంలో సైతం ప్రజల ద్వేషపు చూపుల్ని దుష్ప్రచారాన్ని చవిచూశాడు. సహనం కోల్పోయి ఒక్కమాట అన్నా ఒక్క కొర కొర చూపు విసరినా తన సోదరులకు సహకరించే ఒక్క తప్పుడు పనిచేసినా ఆయన మనకు పరిపూర్ణ ఆదర్శంగా ఉండేవాడు కాదు. మన రక్షణ నిమిత్తం రూపొందిన ప్రణాళికను సాకారం చేయలేకపోయేవాడు. పాపానికి సాకు ఉన్నట్లు ఆయన అంగీకరించి ఉన్నా సాతాను విజయం సాధించేవాడు. ఆయన పరాజయంపాలై నశించేవాడు. అందుకే ఆయన్ని పాపంలోకి నడిపించేందుకు ఆయన జీవితాన్ని కష్టభరితం చెయ్యడానికి సాతాను ప్రయత్నించాడు.DATel 72.2

    అయితే ప్రతీ శోధనకూ ఆయన సమాధానం ఒక్కటే “అని వ్రాయబడి యున్నది” అన్నదే. తన సహోదరుల పొరపాట్లను గద్దించిన సందర్భాలు చాలా అరుదు. కాని వారితో మాట్లాడడంలో దేవుని వాక్యం వారికందించేవాడు. తప్పుడు పనిలో తమకు సహకరించనందుకు వారు ఆయన్ని పిరికి వాడని ఎగతాళి చేసేవారు. ఆయన సమాధానం “అని వ్రాయబడియున్నది” అన్నదే. “యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.” యోబు 28:28;DATel 73.1

    ఆయన సన్నిధిలో శాంతి ఉన్నదని గుర్తించి కొందరు ఆయన సాంగత్యాన్ని అభిలషించారు. అయితే అనేకులు ఆయనకు దూరంగా వెళ్లిపోయేవారు. ఎందుకంటే ఆయన నిష్కళంక జీవితం వారికి గద్దింపుగా ఉండేది. తాము చేసే పనులే చేయమని తోటి బాలురు ఆయనను ప్రోత్సహించేవారు. ఆయన చురుకుగా ఉల్లాసంగా ఉండేవాడు. ఆయనతో ఉండడం వారికి ఆనందంగా ఉండేది. ఆయన సలహాల్ని స్వాగతించేవారు. కాని ఆయన నియమాలతో విసుగు చెందేవారు. ఆయన్ని సంకుచితభావాలు ఒంటెత్తు పోకడలు గలవాడని విమర్శించేవారు. ” యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధి పరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే కదా?” “నీయెదుట నేను పాపము చేయకుండునట్లు నాహృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను” (కీర్త 119:9,11) అని రాయబడి ఉన్నది అని యేసు వారికి సమాధానమిచ్చేవాడు.DATel 73.2

    మా అందరికన్నా వేరుగా ప్రత్యేకంగా ఉండాలని ఎందుకు పట్టుపడున్నావు? అని ఆయన్ని వారు తరచుగా ప్రశ్నించేవారు. “యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు” (కీర్త 119:1-3) అని రాయబడి ఉన్నది అని ఆయన బదులు పలికేవాడు.DATel 73.3

    నజరేతు పిల్లలతో ఆటపాటలు చిలిపి చేష్టల్లో ఎందుకు పార్లోలేదని ఆయన్ని ప్రశ్నించగా ఇలా రాయబడి ఉన్నదని ఆయన జవాబిచ్చేవాడు. “నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను.” కీర్తనలు 119:14-16;DATel 73.4

    యేసు తన హక్కుల నిమిత్తం పోరాడలేదు. సర్దుకుంటూ ఫిర్యాదులు చేయకుండా పోతున్నందువల్ల ఆయన ఆ పని మానెయ్యలేదు లేక నిరాశ చెందలేదు. ఈ కష్టాల్ని అధిగమించి నివసించాడు. దేవుని సముఖపుకాంతిలో ఉన్నట్లు మెలగేవాడు. తనపట్ల క్రూరంగా వ్యవహరించిన వారిపై తిరగబడలేదు. అవమానాన్ని సహనంతో భరించాడు.DATel 74.1

    తన సోదరులు సైతం తనను నిందిస్తున్నప్పుడు ఎందుకు నెమ్మదిగా ఉంటున్నావని ఆయన్ని అడిగినప్పుడు “నా కుమారుడా నా ఉపదేశము మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియ్యకుము. వాటిని కంఠ భూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసికొనుము” (సామె 3:1-4) అని రాయబడి ఉన్నది అని చెప్పేవాడు.DATel 74.2

    యేసు తలిదండ్రులు ఆయన్ని ఆలయంలో కనుగొన్నప్పటి నుంచీ ఆయన కార్యాచరణ విధానం ఓ మర్మంగా తయారయ్యింది. వివాదానికి దిగేవాడుకాదు. అయినా ఆయన ఆనందోత్సాహాలతో నిండి ఉండేవాడు. అవకాశం లభించినప్పుడల్లా పచ్చని లోయల్లో ధ్యానించడానికి, పర్వతాలపక్క లేక అడవిలోని చెట్లు నడుమ దేవునితో మాట్లాడడానికి తన సేవారంగం నుంచి తప్పుకునే వాడు. తరచు ఉదయం పెందలాడే లేఖనాల్ని పరిశోదించడానికి ధ్యానించడానికి లేక ప్రార్ధించడానికి ఏదో ఏకాంత స్థలానికి వెళ్లేవాడు. ఈ ప్రశాంత ఘడియల నుంచి ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ తన విధుల్ని నిర్వహిస్తూ ఓర్పుతో పని చెయ్యడంలో ఆదర్శంగా నిలిచేవాడు. క్రీస్తు తన తల్లినిDATel 74.3

    గౌరవించి ప్రేమించాడు. తనకు జన్మించిన పరిశుద్ధ బాలుడు వాగ్రత్త మెస్సీయా అని మరియ విశ్వసించింది. అయినా తన విశ్వాసాన్ని వ్యక్తం చెయ్యలేకపోయింది. లోకంలో ఆయన జీవించిన కాలమంతా ఆమె ఆయన శ్రమల్లో పాలుపంచుకుంది. తన బాల్యంలోను యౌవనంలోను ఆయనకు కలిగిన శ్రమల్ని ఆమె చూసి దుఃఖించింది. ఆయన ప్రవర్తనలో యధార్ధమైనవిగా తాను ఎరిగిన వాటిని సమర్ధించడం వలన ఆమెకు శ్రమలు సంభవించాయి. గృహసహవాసాలు, తల్లి తనబిడ్డల్ని మమతానురాగాల్లో పెంచడం, ప్రవర్తన నిర్మాణంలో మిక్కిలి ప్రాముఖ్యమని ఆమె పరిగణించింది. యోసేపు కుమారులు కుమార్తెలు కూడా దీన్ని గుర్తించారు. ఆమె ఆందోళనకు మద్దతు పలుకుతూ తమ ప్రమాణాల మేరకు యేసు అలవాట్లును సరిదిద్దడానికి ప్రయత్నించేవారు.DATel 74.4

    మరియ తరచు యేసును నిరోధిస్తూ రబ్బీల ఆచారాల్ని అనుసరించాల్సిందిగా విజ్ఞప్తి చేసేది. కాని ఆయన దైవ కార్యాన్ని గూర్చి ధ్యానించడంలోను మనుషులు, మూగజీవుల బాధ నివారించడంలోను తన ఆలవాట్లను మార్చుకోడానికి ససేమిరా యిష్టపడలేదు.DATel 75.1

    యాజకులు బోధకులు యేసును అదుపుచెయ్యడంలో మరియ సహాయాన్ని కోరినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురి అయ్యేది. కాని ఆయన తన కార్యాచరణను సమర్ధించే లేఖనవాక్యాల్ని సమర్పించినప్పుడు ఆమె మనసుకు శాంతి లభించేది.DATel 75.2

    ఆమె కొన్నిసార్లు యేసుకూ దేవుడు ఆయనను పంపలేదని నమ్మిన ఆయన సోదరులకూ మధ్య ఊగిసలాడేది. కాని ఆయన దైవసంబంధి అనడానికి నిదర్శనం కోకొల్లుగా ఉంది. పరులమేలు కోసం ఆయన త్యాగం చెయ్యడం ఆమె చూసింది. ఆయన సముఖం వల్ల గృహంలో పరిశుద్ధ వాతావరణం నెలకొంది. ఆయన జీవితం సమాజంలో పులిపిండిలా పనిచేసింది. ఎవరికీ హానిచేయని ఆ పరిశుద్దుడు ఆలోచనరహితులు, మట్టు మర్యాదలు లేని వారు అయిన ప్రజల మధ్య నడిచాడు. అన్యాయస్తులైన సుంకరుల నడుమ, దుర్మార్గులు తప్పిపోయినవారి నడుమ, నీతిలేని సమరయుల నడుమ, అన్యులైన సైనికుల నడుమ, శ్రామిక ప్రజల నడుమ, మిశ్రిత జనసమూహాల నడుమ ఆయన నడిచాడు. అలసిసొలసి ఉన్నా, భారమైన బరువులు మోస్తున్న ప్రజలతో దయతో సానుభూతితో నిండిన మాటలు మాట్లాడాడు. వారి బరువుల్ని పంచుకున్నాడు. ప్రకృతి నుంచి తాను నేర్చుకున్న ప్రేమ, దయ, దేవుని దయాళుత్వ పాఠాల్ని వారికి బోధించాడు.DATel 75.3

    ప్రతివారు విలువైన వరాలు పొందిన వ్యక్తులుగా తమ్మును తాము పరిగణించుకోవాలని ఆయన బోధించాడు. ఆ వరాల్ని వారు సవ్యంగా వినియోగిస్తే వారికి నిత్యమైన ఐశ్వర్యం లభిస్తుందని బోధించాడు. ఆయన జీవితంలో అహంకారాన్ని తీసివేశాడు. కాలంలోని ప్రతి నిమిషంలో నిత్య ఫలితాలు నిక్షిప్తమై ఉన్నాయని, దాన్ని భాగ్యంగా పరిగణించి పరిశుద్ధ కార్యాలకు వినియోగించాలని తన ఆదర్శం ద్వారా ఆయన బోధించాడు. ఏ మనిషినీ పనికిమాలిన వాడిగా ఆయన పరిగణించలేదు. ప్రతీ ఆత్మను రక్షించడానికి పూనుకున్నాడు. ఎవరి మధ్య ఉన్నప్పటికీ ఆ సమయానికీ పరిస్థితులకు సరిపోయే పాఠాల్ని సమర్పించాడు. విద్యలేని మొరటు ప్రజల్ని చైతన్యపర్చడానికి ప్రయత్నించాడు. తాము నిందారహితులు నిరపాయులు అయి దేవుని పిల్లలుగా రూపొందడానికి కావలసిన ప్రవర్తనను కనపర్చడం సాధ్యమన్న ఆశాభావాన్ని రగిలించడానికి ప్రయత్నించాడు. సాతాను నియంత్రణ కిందికి వెళ్లి అతడి ఉచ్చులోనుంచి తప్పించుకోలేని వారిని ఆయన తరచుగా కలుసుకునేవాడు. అధైర్యం చెంది వ్యాధికి శోధనకు గురి అయి పతనమొందిన అలాంటి వ్యక్తితో యేసు దయగా మాట్లాడేవాడు. ఆ మాటలు అతనికి అవసరమైన మాటలు. అతడు గ్రహించగల మాటలు. ఆయన కలుసుకున్న ఇతరులు అపవాదితో చేయీ చేయీ కలిపి యుద్ధం చేసే ఆత్మలు. ఓర్పుతో కొనసాగమంటూ వీరిని ప్రోత్సహిస్తూ తమకు విజయం లభిస్తుందని భరోసా ఇచ్చేవాడు. ఎందుకంటే వారి సరసన దేవదూతలున్నారు. వారికి విజయం కూర్చేది ఆ దేవదూతలే. ఈ విధంగా ఆయన ఎవరికి సహాయంచేశాడో వారు తాము సంపూర్ణ విశ్వాసంతో నమ్మదగినవాడు ఆయనేనని నమ్మారు. తాము ఆయనకు చెప్పుకున్న రహస్యాల్ని ఆయన బయట పెట్టడని వారు నమ్మారు.DATel 76.1

    యేసు శరీరాన్ని ఆత్మను స్వస్తపర్చుతాడు. తన దృష్టికి వచ్చిన ప్రతివిధమైన బాధ విషయంలో ఆయన ఆసక్తి చూపాడు. బాధలో ఉన్న ప్రతివ్యక్తి బాధను నివారించాడు. దయగల ఆయన మాటలు ఉపశమనం కూర్చే తైలంలా ఉన్నాయి. ఆయన అద్భుతం చేశాడని ఎవరూ అనలేరు. కాని ప్రభావం - ప్రేమలోని స్వస్థత శక్తి - ఆయన వద్ద నుంచి వ్యాధిగ్రస్తుల మీదికి దుఃఖితుల మీదికి వెళ్ళింది. ఇలా నిరాడంబరంగా ఆయన తన చిన్నతనం నుంచీ ప్రజల కోసం పని చేశాడు. ఈ కారణంగానే తన బహిరంగ సేవ ప్రారంభమైన తర్వాత అనేకులు ఆయన బోధను వినడానికి సంతోషించారు.DATel 76.2

    అయినా తనబాల్యంలోను యౌవనంలోను పెద్దవాడుగా ఎదిగిన కాలంలోను యేసు ఒంటరిగా నడిచాడు. పరిశుద్ధత విషయంలోను విశ్వాస పాత్రత విషయంలోను ఆయన ఒంటరి పయనమే సాగించాడు. ప్రజల్లో ఎవరూ ఆయనతో లేరు. మానవ రక్షణ భారమైన బాధ్యతను ఆయనే మోశాడు. మానవజాతి సిద్దాంతాల్లోను ఆశయాల్లోను నిర్దిష్టమైన మార్పు లేకపోతే అంతా నాశనం అవుతుందని ఆయనకు తెలుసు. ఇదే ఈయన హృదయభారం. ఆయనకున్న భారాన్ని గ్రహించగలిగినవారు లేరు. సంకల్ప శుద్ధితో ప్రజలకు తాను వెలుగై ఉండేందు నిమిత్తం ఆయన తన పథకాన్ని అమలు పర్చాడు.DATel 77.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents