Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    31—కొండమీద ప్రసంగం

    తన ఉపదేశం వినడానికి క్రీస్తు కేవలం తన శిష్యుల్నే సమావేశపర్చిన సందర్భాలు అరుదు. జీవమార్గాన్ని ఎరిగిన వారినే తన మాటలు వినడానికి శ్రోతలుగా ఎంపిక చేసుకోలేదు. అజానంలోను అపరాధాల్లోను ఉన్న జనసమూహాలికి తన వర్తమానం అందించడమే ఆయన కర్తవ్యం. సత్యాన్ని ప్రకటించి మనుషుల అవగాహనను ఆయన వెలుగుతోనింపాడు. సత్యం ఆయనే. దీవించడానికి సర్వదా చేతులు చాపి తన వద్దకు వచ్చే వారందరినీ ఉద్దరించే ప్రయత్నంలో హెచ్చరిస్తూ, విజ్ఞాపన చేస్తూ ధైర్యపర్చుతూ ఆయన నడుంబిగించి నిలబడి ఉన్నాడు.DATel 318.1

    కొండమీద ప్రసంగం ముఖ్యంగా శిష్యులికి ఉద్దేశించిందైనా జనసమూహానికి వినిపించేటట్లుగా చేయడం జరిగింది. శిష్యుల అభిషేకం అనంతరం యేసు వారితో కలిసి సముద్రం పక్కకు వెళ్లాడు. అది ఉదయం. ప్రజలు సమావేశమవ్వడం మొదలు పెట్టారు. గలిలయ పట్టణాల నుంచి సాధారణంగా వచ్చే ప్రజలే గాక యూదయ నుంచి యెరూషలేము నుంచి దెకపొలి నుంచి ఇదూమయ నుంచి యూదయకు దక్షిణం నుంచి తూరు సిదోనుల నుంచి మధ్యధరా సముద్రతీరాన ఉన్న ఫేనీకే పట్టణాల నుంచీ ప్రజలు వచ్చారు. “ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు” ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకు” ను వచ్చారు. “ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను” మార్కు 3:8; లూకా 6:17-19.DATel 318.2

    ఆ సన్నటి తీరం పై మనుషులు నిలబడడానికి కూడా స్థలం లేదు. వినాలని ఆశించిన వారందరికీ ఆయన స్వరం వినిపించడం లేదు. కనుక యేసు తిరిగి కొండ పక్కకు వారిని తీసుకువెళ్లాడు. ఆ విస్తార జనసమూహానికి చాలే చదువైన స్థలాన్ని కనుగొని అక్కడ పచ్చని గడ్డిపై కూర్చున్నాడు. శిష్యులు ఆ జనసమూహాం కూడా గడ్డి పై కూర్చున్నారు.DATel 319.1

    శిష్యుల స్థలం ఎప్పుడూ యేసు పక్కనే . ఆయనకు దగ్గర్లో ఉండడానికి ప్రజలు నిత్యం తోసుకుంటున్నారు. అయినా తాము ఆయనకు దూరంగా ఉండకూడదని శిష్యులు గ్రహించారు. వారు ఆయన చెప్పే ప్రతీమాటను శ్రద్ధగా వినేందుకు ఆయన పక్కనే కూర్చున్నారు. తాము అన్ని దేశాల్లోను అన్ని కాలల్లోను ప్రచురించాల్సి ఉన్న సత్యాల్ని అవగాహన చేసుకోవాలన్న ఆసక్తితో వారు శ్రద్ధగా వింటున్నారు.DATel 319.2

    “అసాధారణ ఘటనలేవో చోటుచేసుకోవచ్చునన్న మానోగతంతో వారు ప్రభువుకు దగ్గరగా జరిగారు. ఆ రాజ్యం త్వరలో స్థాపితం కానుందనీ ఆ ఉదయం జరిగిన సంఘటనల్ని బట్టి చూస్తే దాన్ని గూర్చిన ప్రకటన వెలువడడం ఖాయమని వారు భావించారు. ప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొందరి ముఖాలు తీవ్ర ఆసక్తిని ప్రతిబింబిస్తోన్నాయి. పరమబోధకుని మాటలు వినడానికి ఆశగా ఎదురుచూస్తూ ప్రజలు ఆ కొండ పక్క పచ్చని చెట్లలో కూర్చున్న పిదప తమ బంగారు భవిష్యత్తును గురించిన తలంపులు వారి హృదయాల్ని నింపాయి. శాస్త్రులు పరిసయ్యులు రోమీయుల మీద అధికారం చలాయించి ప్రపంచంలో గొప్ప రాజ్యం తాలూకు సిరిసంపదల్ని ప్రాభావాన్ని కైవసం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తోన్నారు. శామ్రిక ప్రజలు, జాలరులు తమ మురికివాడల బదులు మంచి నివాసాలు వస్తాయని, ఆకలి బాధలు ఇక ఉండవని, శ్రమ జీవనం ఉండదని, లేమి భయం ఇక ఉండదని ఆహారం సమృద్ధిగా ఉంటుందని, జీవితం సుఖంగా సాగుతుందని వాగ్దానం చేయడం జరుగుతుందని ఎదురుచూస్తోన్నారు. వారు పగలు ధరించే ముతక అంగీబదులు రాత్రివేళ కప్పుకునే దుప్పటి బదులు తమకు తమ పరిపాలకుల విలువైన దుస్తుల్ని క్రీస్తు ఇస్తాడని కలలుకంటోన్నారు. దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలుగా ఇశ్రాయేలు ఇతర జాతుల ముందు గౌరవాన్ని పొందబోతుందని, యోరూషలేము ప్రపంచ రాజ్యానికి శిరసు కాబోతుందని నిరీక్షించి అందరూ ఆనందించారు.DATel 319.3

    లోక సంబంధమైన గొప్పతనం విషయంలో వారి నిరీక్షణను క్రీస్తు నీరుగార్చాడు. కుహనా విద్యవల్ల కలిగిన ఫలితాన్ని రద్దుచేసి తన రాజ్యాన్ని గూర్చి తన ప్రవర్తనను గూర్చి సరియైన అభిప్రాయాన్ని తన శ్రోతలకు అందించాలని కొండమీది ప్రసంగంలో ఆయన ప్రయత్నించాడు. అలాగని ప్రజల దోషాలపై ప్రత్యక్షంగా దాడికి దిగలేదు. పాపం మూలాన లోకంలో ప్రబలుతోన్న దుఃఖాన్ని చూసినా వారి దుర్మార్థతను కళ్లకు కట్టినట్లు స్పష్టంగా వివరించలేదు. వారికి తెలిసిన దానికన్నా ఎంతో మెరుగైన దాన్ని వారికి బోధించాడు. దేవుని రాజ్యాన్ని గురించి వారికున్న అభిప్రాయాన్ని వ్యతిరేకించకుండా ఆ రాజ్య ప్రవేశానికి షరతుల్ని పేర్కొని దాని స్వభావం ఎలాంటిదన్నది వారి విచక్షణకే విడిచిపెట్టాడు. ఆయన బోధించిన సత్యాలు, నాడు ఆయన్ని వెంబడించిన జనసమూహాలకు ఎంత ప్రాముఖ్యమో నేటి మనకూ అంతే ప్రాముఖ్యం. దేవుని రాజ్యప్రాథమిక సూత్రాల అవగాహన ఆ కాలంలో వారికెంత అవసరమో ఈ రోజుల్లోని మనకూ అంతే అవసరం.DATel 320.1

    కొండమీది ప్రజలనుద్దేశించి క్రీస్తు పలికిన మొట్టమొదటి మాటలు దీవెన వచనాలు. ఎవరైతే తమ ఆధ్యాత్మిక పేదరికాన్ని రక్షణ అవసరాన్ని గుర్తిస్తారో వారు ధన్యులు అన్నాడు. సువార్త బీదలకు ప్రకటించాలి. ఆధ్యాత్మికంగా అతిశయించేవారికి తాము భాగ్యవంతులమని తమకు ఏ కొదువలేదని భావించే వారికి కాదు. దీనమనసు విరిగిన నలిగిన హృదయం కలవారికి సువార్తను ప్రకటించాలి. పాపానికి తెరచిన నీటిధార ఒక్కటి. మాత్రమే. అదే ఆత్మ విషయమై దీనులైన వారికి ఏర్పాటైన ఊట.DATel 320.2

    అహంకారంతో నిండిన హృదయం రక్షణను తనంతట తానే సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. అయితే పరలోక ప్రవేశానికి మన హక్కు దానికి మన అర్హత క్రీస్తు తాలూకు నీతి మాత్రమే. మానవుడు స్వీయ బలహీనతను గుర్తించి స్వీయ సమృద్ధతను విడిచి పెట్టి దేవుని నియంత్రణకు తన్నుతాను సమర్పించుకునే వరకు అతడి పునరుద్ధరణ దిశగా దేవుడు ఏమి చెయ్యలేదు. తనకు ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్న వరాన్ని అందుకోడానికి మానవుడు అప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన ఆవశ్యకతను గుర్తించే ఆత్మకు లభ్యం కానిదేదీ ఉండదు. ఎవరి యందు సర్వ సంపూర్ణత నివసిస్తుందో ఆ ప్రభువు వద్దకు అతడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లవచ్చు. “మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్దుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. - నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీనమనసు గలవారి యొద్దను నివసించుచున్నాను” యెషయా 57:15.DATel 320.3

    “దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు” యేసు ఈ మాటలు అనడంలో దుఃఖానికి పాపం తాలూకు అపరాధాన్ని తొలగించడానికి శక్తి ఉందని బోధించడం లేదు. దొంగాటకానికి గాని స్వచ్చంద నమ్రతకుగాని ఆయన అనుమతి ఇవ్వడం లేదు. ఆయన ప్రస్తావిస్తున్న దుఃఖం చింతా ప్రవృత్తిగాని సంతాపంగాని కాదు. మనం పాపం నిమిత్తం దుఃఖించాల్సి ఉన్నా దేవుని పిల్లలవ్వడానికి మనకున్న ప్రత్యేక ఆధిక్యత విషయంలో ఆనందిచాల్సి ఉన్నాం .DATel 321.1

    మన దుష్క్రియలు తరచు మనకు ఆయాసకర పరిణామాలు తెస్తాయి. కాబట్టి మనం దుఃఖిస్తుంటారు. ఈ దుఃఖం పశ్చాత్తాపం కాదు. నిజమైన పాపపశ్చాత్తాపం పరిశుద్దాత్మ పనిద్వారా కలుగుతుంది. కృతజ్ఞతలేని హృదయం రక్షకుణ్ని కించపర్చి దుఃఖ పెట్టడాన్ని బయలుపర్చి, మనల్ని పశ్చాత్తాపంతో నింపి, సిలువ వద్దకు నడిపిస్తుంది. ప్రతీ పాపం యేసును సరికొత్తగా గాయపర్చుతుంది. మనం గాయపర్చిన ఆయన్ని మనం చూసినప్పుడు ఆయనకు బాధకలిగించిన పాపాల నిమిత్తం దుఃఖిస్తాం. అలాంటి దుఃఖం పాపాన్ని త్వజించడానికి నడిపిస్తుంది.DATel 321.2

    లౌకికవాదులు ఈ దుఃఖాన్ని బలహీనతగా పేర్కొవచ్చుగాక. కాని అది గొప్ప శక్తి. అది పశ్చాత్తపుణ్ని అనంతుడైన దేవునికి తెంప శక్యంకాని బంధాలతో కట్టివేసే శక్తి. దాని అర్ధమేంటంటే హృదయ కాఠిన్యంవల్ల అతిక్రమంవల్ల నాశనమైన కృపల్ని దేవుని దూతలు ఆత్మలోకి తిరిగి తీసుకువస్తున్నారని. పశ్చాత్తపుడి కన్నీళ్లు పరిశుద్ధత అనే సూర్యకాంతికి ముందు పడే చినుకులు మాత్రమే. ఈ దుఃఖం ఆనందాన్ని ప్రచురిస్తుంది. అది జీవపు ఊటలా ఆత్మలో కొనసాగుతుంది. “నీదేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు... పోయిన నీ దోషమును ఒప్పుకొనుము.” “మీ మీద నాకోపము పడనీయను. నేను కృపగలవాడును గనుక నేనెల్లప్పుడు కోపగించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు” యిర్మీయా 3:13, 21. “సీయోనులో దుఃఖించువారికి” “బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును” ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేశాడు. యెషయా 61:3.DATel 321.3

    శ్రమలనుభవిస్తూ దుఃఖించే వారికి కూడా ఓదార్పు కలుగుతుంది. పాపభోగాలకన్నా చింత అవమానం మేలు. తన కృపద్వారా మనం మన లోపాల్ని సరిచేసుకునేందుకుగాను మన ప్రవర్తనలో ఉన్న లొసుగుల్ని దేవుడు మనకు బయలుపర్చుతాడు. మనల్ని గురించి మనకు తెలియని సంగతులు మన ముందుకు వస్తాయి. దేవుని గద్దింపును, హితవును మనం స్వీకరిస్తామా అన్న పరీక్ష వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనం చిరచిరలాడడం గొణగడం చెయ్యకూడదు. తిరుగుబాటు చెయ్యకూడదు. క్రీస్తును విస్మరించి వ్యసనపడకూడదు. మన ఆత్మ దేవుని ముందు తల వంచాలి. విషయాల్ని తనకు నచ్చిన రీతిగా చూడాలని కోరే వ్యక్తికి ప్రభువు మార్గాలు అస్పష్టంగా ఉంటాయి. మన మానవ స్వభావానికి అవి చీకటిమయంగా నిస్సంతోషంగా కనిపిస్తాయి. కాని దేవుని మార్గాలు కారుణ్యమార్గాలు. వాటి లక్ష్యం రక్షణ. ఈ జీవితం ఇంతమట్టుకు చాలు. నా ప్రాణం తీసుకొమ్మని ఏలీయా అరణ్యంలో ప్రార్ధన చేసినప్పుడు తానేమి చేస్తున్నాడో అతడికి తెలియలేదు. కృపామయుడైన దేవుడు అతడి ప్రాణం తీసుకోలేదు. ఏలీయా ఇంకా గొప్ప సేవ చేయాల్సి ఉన్నాడు. ఆ పని పూర్తి చేసిన తర్వాత అతడు అరణ్యంలో నిరుత్సాహపడి ఏకాంతంగా మరణించకూడదు. అతడు మరణించి పాతాళంలోకి దిగడానికి లేదు. కాని అతడు పరలోక రథాలు ఎక్కి మహిమతో పరలోకానికి ఎగసి ఉన్నత సింహాసనం ఎక్కాల్సి ఉన్నాడు.DATel 322.1

    దుఃఖించే వారికి దేవుని వాగ్దానం ఇది, “నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.” “వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టి వేసి నేను వారికి ఆనందము కలుగజేతును.” యెషయా 57:18; యిర్మీయా 31:13.DATel 322.2

    “సాత్వికులు ధన్యులు.” మనం ఎదుర్కోవాల్సిన కష్టాలు కడగండ్లు, క్రీస్తులో దాగి ఉన్న సాత్వికం వల్ల చాలా మట్టుకు తగ్గవచ్చు. మన ప్రభువు మనకున్నట్లయితే, దినదినం మనం ఎదుర్కొనే అవమానాలు, ఎదురుదెబ్బలు, ఇబ్బందుల్ని అధిగమించగలుగుతాం. అవి ఇక మన ఆత్మను కుంగదీయలేవు. ఆత్మనిగ్రహమే క్రైస్తవుడి ఉదాత్తతకు అత్యున్నత నిదర్శనం. అవమానానికి దుర్భాషలకు హింసకు గురి అయినప్పుడు తొణకకుండా నిండుకుండలా నిర్మలంగా నిలిచే వ్యక్తి దేవుని ప్రవర్తన సంపూర్ణతను పుణికిపుచ్చుకుని దాన్ని ప్రదర్శిస్తాడు. క్రీస్తు అనుచరులకు విజయం చేకూర్చే శక్తి దీనమనసే. పరలోకంతో వారికున్న సంబంధానికి చిహ్నం అదే.DATel 323.1

    “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును.” కీర్తన 138:6. క్రీస్తు సాత్వికాన్ని దీనమనసును కనపర్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. లోకం వారిని ద్వేషించవచ్చగాక. వారు దేవుని దృష్టిలో గొప్ప విలువ గలవారు. జ్ఞానులు గొప్పవారు ఉపకారులు మాత్రమేకాదు, పనిలో తలమునకలై నిర్విరామంగా ఉత్సాహంతో కృషిచేసే వారు కాదు. పరలోకంలోకి ప్రవేశం పొందేవారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉన్నతాశయం కలిగి క్రీస్తు సన్నిధిని ఆశిస్తూ ఆత్మవిషయమై దీనులైన వినయహృదయులు - వీరు పరలోక ప్రవేశం పొందుతారు. దేవుని గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కొని వాటిని తెల్లగా చేసుకున్న వారిలో వీరుంటారు. “అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును ” ప్రక7:15.DATel 323.2

    “నీతి కొరకు ఆకలిదప్పుల గలవారు ధన్యులు.” అయోగ్యతా భావం నీతికోసం ఆకలి దప్పులు గొనడానికి హృదయాన్ని నడిపిస్తుంది. ఈ కోరిక ఆశాభంగానికి గురి కాదు. తమ హృదయాల్లో క్రీస్తుకి చోటిచ్చేవారు ఈ ప్రేమను వాస్తవంలో కనపర్చుతారు. దేవుని వంటి ప్రవర్తనను ఆకాంక్షించే వారందరూ తృప్తి పొందుతారు. యేసును ఆకాంక్షించే ఆత్మకు సహాయం చెయ్యకుండా పరిశుద్ధాత్మ విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ ఆ ఆత్మకు క్రీస్తు విషయాల్ని చూపిస్తాడు. దృష్టి క్రీస్తు మీద కేంద్రీకృతమై ఉంటే ఆత్మ దేవుని రూపంలోకి మారేవరకూ పరిశుద్దాత్మ పరిచర్య ఆగదు. ప్రేమలోని పవిత్ర భాగం ఆత్మను వృద్ధి పర్చి, ఉన్నత కార్యాల సాధనకు దాన్ని పరిపుష్టం చేసి, పరిపూర్ణత సాధనకు దాన్ని తీర్చిదిద్దుతుంది. “నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.”DATel 323.3

    దయగల వారికి కనికరం లభిస్తుంది. హృదయ శుద్ధిగలవారు దేవుని చూస్తారు. ప్రతీ చెడుతలంపు ఆత్మను అపవిత్రపర్చుతుంది. నైతిక భావాన్ని నాశనం చేస్తుంది. పరిశుద్దాత్మ ప్రభావాన్ని తుడిచివేస్తుంది. అది ఆధ్యాత్మిక దృష్టిని మసకబార్చుతుంది కనుక మనుషులు దేవున్ని చూడలేకుండా ఉంటారు. పశ్చాత్తాపపడే పాపిని ప్రభువు క్షమించవచ్చు, క్షమిస్తాడు కూడా. అయితే క్షమాపణ పొందినా ఆత్మ మైలపడుతుంది. ఆధ్యాత్మిక సత్యాన్ని స్పష్టంగా గ్రహించిన వ్యక్తి మాటలోను తలంపులోను సమస్త దుర్నీతిని త్యజించాలి.DATel 324.1

    శరీరేంద్రియాల అపవిత్రత నుంచి విముక్తి పొందడం కన్నా, యూదులు తు.చ. తప్పకుండా పాటించిన అపవిత్రతకు సంబంధించిన కర్మకాండ నుంచి విముక్తి కన్నా క్రీస్తు మాటల్లో ఎక్కువ అర్థం ఉంది. దేవున్ని చూడకుండా స్వారం అడ్డుకుంటుంది. దేవుడూ తన వంటి వాడేనని స్వార్ధపూరిత స్వభావం తీర్పుచెప్పుతుంది. ఈ స్వభావాన్ని త్యజించే వరకు ప్రేమాస్వరూపి అయిన దేవున్ని మనం అవగాహన చేసుకోలేం. స్వార్థం లేని హృదయం, వినయవిధేలేతలు గల స్వభావం మాత్రమే ” కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” దేవున్ని చూడగల్గుతుంది. నిర్గమ 34:6.DATel 324.2

    “సమాధానపరచువారు ధన్యులు.” క్రీస్తు తాలూకు సమాధానం సత్యం వల్ల కలిగే సమాధానం. అది మనకు దేవునితో ఏర్పడే సామరస్యం. లోకానికి దైవధర్మశాస్త్రమంటే కిట్టదు. పాపులకి తమ సృష్టి కర్తతో వైరుధ్యం. పర్యవసానంగా వారు ఒకరితో ఒకరు విరోధంగా ఉంటారు. కాని కీర్తనకారుడిలా అంటున్నాడు, ” నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మదికలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియు లేదు.” కీర్తDATel 324.3

    119:165. సమాధానాన్ని మనుషులు ఉత్పత్తి చెయ్యలేరు. మానవుల శుద్ధీకరణకు లేదా సమాజ శుద్ధీకరణకు ప్రగతికి మనుషులు రచించే ప్రణాళికలు సమాధానాన్ని ఉత్పత్తి చేయలేవు. ఎందుకంటే అవి హృదాయాన్ని చేరవు. క్రీస్తు కృప మాత్రమే వాస్తవిక సమాధానాన్ని సృష్టించగలుగుతుంది. ఇది హృదయంలోకి వచ్చినప్పుడు ఇది వైరుధ్యం విభేదం పుట్టించే దురావేశాల్ని విసర్జిస్తుంది. “ముండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదుగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును.” జీవితారణ్యం “ఉల్లసించి కస్తూరి పుష్పమువలే పూయును.” యెష 55:13; 35:1.DATel 325.1

    పరిసయ్యుల బోధనకు ఆచరణకు ఎంతో వ్యత్యాసంగా ఉన్న ఆయన బోధను విని జనసముహాలు ఆశ్చర్యపడ్డారు. ఈ లోక భాగ్యాన్ని సంపాదిస్తే ఆనందం కలుగుతుందని మనుషుల మెప్పు గౌరవాభిమానాలు కోరదగినవని మనుషులు తలంచడం మొదలు పెట్టారు. “రబ్బీ” అని పిలువబడడం, జ్ఞానిగా దైవభక్తుడుగా కీర్తి పొందడం, ప్రజలముందు తమ సుగుణాల్ని ప్రదర్శించుకోడం సంతోషదాయకమే. దీన్ని అత్యంత ఆనందదాయకమైన విషయంగా పరిగణించడం జరిగేది. అయితే లోక భాగ్యం లోక ప్రతిష్ఠ - ఇవే అలాంటి వారు పొందే ప్రతిఫలం అని విస్తారమైన ఆ జనసమూహం సమక్షంలో యేసు ప్రకటించాడు. ఆయన నిశ్చయతతో మాట్లాడాడు. ఆయన మాటల్లో నమ్మించే శక్తి ఉంది. ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు వారిలో ఒకలాంటి భయం ఏర్పడింది. వారు ఒకరి వంక ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. ఈయన బోధన వాస్తవమైందైతే వారిలో ఎవరు రక్షణ పొందగలరు? ఈ మహాబోధకుడు దైవాత్మ ప్రేరణ వల్ల మాట్లాడుతున్నాడని, ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలు దైవ ప్రేరితాలని వారిలో పలువురి విశ్వసించారు.DATel 325.2

    నిజమైన ఆనందాన్నిచ్చేదేమిటో తెలియచేసి అది ఎలా సంపాదించాలో విశదం చేసిన మిదట ఇతరుల్ని నీతిమార్గం గుండా నిత్యజీవానికి దేవుడు ఎంపిక చేసుకున్న బోధకుడుగా శిష్యుల బాధ్యత ఏమిటో యేసు మరింత నిర్దిష్టంగా సూచించాడు. వారు తరచు ఆశాభంగాలికి నిరుత్సాహానికి గురి అవుతారని వారికి తీవ్ర వ్యతిరేకత అవమానం ఎదురౌతాయని వారి సాక్ష్యాన్ని ప్రజలు నిరాకరిస్తారని ఆయనకు తెలుసు. తన మాటల్ని అతి శ్రద్ధగా వింటోన్న శిష్యులు తమ కర్తవ్య నెరవేర్చులో. నిందలు హింస చెరసాల మరణం అనుభవిస్తారని ఎరిగిన ఆయన ఇలా తన ప్రసంగాన్ని కొనసాగించాడు.DATel 325.3

    “నీతినిమిత్తము హింసించబడువారు ధన్యులు” పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగను. ఈ లాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి.DATel 326.1

    లోకం పాపాన్ని ప్రేమించి నీతిని ద్వేషిస్తుంది. యేసు పట్ల దౌర్జన్యానికి కారణం ఇదే! ఆయన అనంత ప్రేమను నిరాకరించే వారందరికీ క్రైస్తవమతం ఇబ్బందికరంగా ఉంటుంది. క్రీస్తు వెలుగు వారి పాపాల్ని కప్పి ఉంచే చీకటిని పారదోలి సంస్కరణ అవసరాల్ని సూచిస్తుంది. పరిశుద్దాత్మ ప్రభావానికి లోబడే వారు, తమతో తాము సంఘర్షణ పడుతుండగా పాపాన్ని విడిచిపెట్టకుండా ఉండేవారు సత్యానికి సత్య ప్రబోధకులకి వ్యతిరేకంగా సమరం జరుపుతారు.DATel 326.2

    ఇలా పోరాటం మొదలవుతుంది. క్రీస్తు అనుచరులని ప్రజల నడుమ కలహాలు రేపే వారిగా చిత్రిస్తారు. దేవునితో వారి సహవాసమే లోకం వారిపై వైరం పూనడానికి హేతువు. వారు క్రీస్తు నిమిత్తం నిందను భరిస్తున్నారు. లోకంలో మిక్కిలి ఉదాత్తులు నడిచిన మార్గాన్నే వారూ నడుస్తోన్నారు. హింసను దుఃఖంతోకాదు సంతోషానందాల్తో వారు భరించాలి. ప్రతీ అగ్నిపరీక వారిని శుద్దీకరించే దైవ సాధనం. ప్రతీ శ్రమ వారిని దేవునితో జతపనివారిగా తీర్చిదిద్దుతుంది. నీతి కోసం సాగే మహాసమరంలో ప్రతీ సంఘర్షణా ఒక భాగమే. వారి అంతిమ విజయానికి ప్రతీ సంఘర్షణ దోహదపడ్తుంది. ఇది దృష్టిలో ఉంచుకుని వారు భయపడి తమ విశ్వాసాన్ని ఓర్పును పరీక్షించే శ్రమల్ని తప్పించుకునే బదులు సంతోషంగా అంగీకరిస్తారు. లోకం పట్ల తమ విధిని నిర్వహించడానికి ఆతురత చూపుతూ దేవుని ఆమోదాన్ని పొందాలన్న కోరికతో దైవ సేవకులు తమ విధుల్ని నిర్వర్తించాలి. మనుషుల కోపతాపాల్ని ఆదరాభిమానాల్ని లెక్కచెయ్యకూడదు.DATel 326.3

    “మీరు లోకమునకు ఉప్పుయి యున్నారు” అన్నాడు యేసు. రక్షణ దీవెనల్ని తమ జాతికే పరిమితం చేసుకోవాలని యూదులు భావించారు. కాని రక్షణ సూర్యుడి వెలుగు వంటిదని క్రీస్తు వారికి వివరించాడు. రక్షణ సర్వలోకానికి చెందినది. బైబిలు మతం ఉన్నది ఓ పుస్తకం రెండట్టల మధ్యా ఆలయం గోడల నడుమా బంధించి ఉంచడానిక్కాదు. మన సొంత ప్రయోజనాల నిమిత్తం దాన్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చి మళ్లీ జాగ్రత్తగా పక్కన పెట్టెయ్యడానిక్కాడు. అనుదిన జీవనాన్ని శుద్ధి చేయడానికి ప్రతీ వ్యాపార వ్యవహారంలోను ప్రతీ సాంఘిక సంబంధంలోను ప్రదర్శించడానికి.DATel 326.4

    యధార్థ ప్రవర్తన బయట తయారు చేసి ధరించేది కాదు. అది లోపల నుంచి ప్రకాశిస్తుంది. మనం ఇతరుల్ని నీతిమార్గంలో నడిపించాలంటే నీతి సూత్రాలు మన హృదయంలో నిక్షిప్తమై ఉండాలి. మనం విశ్వాసాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పుకోడం ద్వారా మత సిద్ధాంతాన్ని ప్రకటించవచ్చు. అయితే సత్యవాక్యాన్ని ప్రదర్శించేది మనం జీవించే భక్తి జీవితమే. యధార్థ భక్తి జీవితం, శుద్ధమైన పలుకు, నిశ్చల విశ్వసనీయత క్రియాశీలక ఔఔదార్యం , ఆదర్శనీతి జీవితం - ఇవే ప్రపంచానికి వెలుగునందించే మాధ్యమాలు.DATel 327.1

    ధర్మశాస్త్రంలోని వివరాల్ని యేసు ప్రస్తావించలేదు. అలాగని ధర్మశాస్త్ర విధుల్ని రద్దుపర్చడానికి తాను వచ్నానన్న అభిప్రాయాన్ని తన శ్రోతలకు కలిగించలేదు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తన ప్రతీమాటను వక్రీకరించడానికి గూఢచారులు సిద్ధంగా ఉన్నట్లు ఆయనకు తెలుసు. తన శ్రోతలో అనేకమందికి దురభిప్రాయాలున్నాయిన ఆయనకు తెలుసు. అందుకే దేవుడు మోషే ద్వారా వారికిచ్చిన మతవ్యవస్థలపై వారికున్న విశ్వాసాన్ని సడలించే మాటల్ని ఆయన మాట్లాడలేదు. నీతి ధర్మశాస్త్రాన్ని ఆచార ధర్మశాస్త్రాన్ని ఆయనే ఇచ్చాడు. తన సొంత ఉపదేశంపై నమ్మకాన్ని నాశనం చెయ్యడానికి ఆయన రాలేదు. ధర్మశాస్త్రంపట్ల ప్రవక్తులపట్ల తనకున్న గౌరవాన్ని బట్టే యూదుల్ని నిరోధిస్తోన్న సంప్రదాయ విధుల్ని అంతం చెయ్యడానికి ఆయన ప్రయత్నించాడు. ధర్మశాస్త్రానికి వారు చెప్పే తప్పుడు భాష్యాన్ని తోసిపుచ్చుతూ హెబ్రీయులికి దేవుడిచ్చిన ప్రధాన సత్యాల్ని తన శిష్యులు విడిచి పెట్టకుండా వాటిని కాపాడడానికి ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. తాము ధర్మశాస్త్రవిధేయులమని పరిసయ్యులు గర్వంగా చెప్పుకునేవారు. అయినా అనుదినాచరణ ద్వారా వారు ధర్మశాస్త్ర సూత్రాల్ని ఎరిగింది చాలా తక్కువ. అందుచేత రక్షకుడన్న మాటలు వారికి సిద్ధాంత విరుద్దాలనిపించాయి. సత్యం చుట్టూ పోగుపడ్డ చెత్తను ఆయన తుడిచివేస్తున్నప్పుడు సత్యాన్నే తుడిచివేస్తున్నట్లు వారు భావించారు. ధర్మశాస్త్రాన్ని ఆయన చిన్నచూపు చూస్తున్నాడని వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు. వారి తలంపుల్ని గ్రహించి ఆయన ఇలా అన్నాడు:DATel 327.2

    “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.” పరిసయ్యుల ఆరోపణను ఇక్కడ రక్షకుడు తోసిపుచ్చుతున్నాడు. తాను ఏ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నట్లు ఆరోపణ వచ్చిందో ఆ ధర్మశాస్త్ర పరిశుద్ధ శాసనాల్ని ధ్రువీకరించడమే లోకంలో ఆయన నెరవేర్చాల్సి ఉన్న కర్తవ్యం. ధర్మశాస్త్రాన్ని మార్చడంగాని కొట్టివేయడంగాని సాధ్యపడితే అతిక్రమ పర్యవసానాల్ని క్రీస్తు అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు. మనిషికి ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న సంబందాన్ని విశదం చేసి దాని సూత్రాల్ని తన విధేయ జీవితం ద్వారా ఉదాహరించడానికి ఆయన వచ్చాడు.DATel 328.1

    దేవుడు మానవుల్ని ప్రేమిస్తున్నాడు గనుక తన పరిశుద్ధ సూత్రాల్ని మనకిచ్చాడు. అతిక్రమ పర్యవసానాల్నుంచి మనల్ని కాపాడడానికి మనకు నీతి సూత్రాల్ని వెల్లడిస్తాడు. దేవుని ఆలోచన ప్రకటనే ధర్మశాస్త్రం. క్రీస్తులో దాన్ని పొందినప్పుడు అది మన ఆలోచన అవుతుంది. అది స్వాభావిక పాపానికి దారితీసే ప్రవృత్తుల్నుంచి మనల్ని పైకి లేపుతుంది. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనకు తన ధర్మసూత్రాల్ని ఇచ్చాడు. వాటికి లోబడి మనం ఆనందంగా జీవించవచ్చు. క్రీస్తు జన్మ సమయంలో దూతలు “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక” అని పాడినప్పుడు (లూకా 2:14) వారు ధర్మశాస్త్ర సూత్రాల్ని ప్రకటించారు. ధర్మశాస్త్రాన్ని ఘనపర్చి గొప్పచెయ్యడానికి ఆయన వచ్చాడు.DATel 328.2

    సీనాయి కొండపై నుంచి ధర్మశాస్త్రాన్ని ప్రకటించినప్పుడు దేవుడు తన పరిశుద్ధ ప్రవర్తనను మానవులికి తెలియపర్చాడు. దానికి భిన్నంగా ఉన్న తమ పాపం ఎంత నీచమైందో మనుషులు తెలుసుకునేందుకు ఇది చేశాడు. వారికి పాప స్పృహ కలిగించి తమకు రక్షకుడు అవసరమన్న విషయాన్ని సూచించడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రాన్నిచ్చాడు. ధర్మశాస్త్రం ఈ పని చేస్తుంది. ఎందుకంటే పరిశుద్దాత్మ దాని సూత్రాల్ని హృదయానికి వర్తింపజేశాడు. ధర్మశాస్త్రం ఈ పనిని ఇంకా చేయాల్సి ఉంది. ధర్మశాస్త్ర సూత్రాలు క్రీస్తు జీవితంలో తేటతెల్లమయ్యాయి. పరిశుద్ధాత్మ హృదయాన్ని స్పృశించినప్పుడు, శుద్ధీకరించే తన రక్తం నీతిమంతుడని తీర్చే తన నీతి తమకు అవసరమని మనుషులికి క్రీస్తు వెలుగు బయలు పర్చినప్పుడు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్పు పొందడానికి మనల్ని క్రీస్తు వద్దకు తీసుకురావడంలో ధర్మశాస్త్రం ఇంకా ఓ సాధనమే. “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్ధమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును.” కీర్త 19:7.DATel 328.3

    యేసిలా అన్నాడు, “ఆకాశమును భూమియు గతించిపోతేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదు.” ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు, మీరు నివసిస్తోన్న స్థిరమైన భూమి దేవుని ధర్మశాస్త్రం మార్పులేనిది నిత్యమూ ఉండేది అన్న దానికి దేవుని సాక్షులు. అవి గతించిపోయినప్పటికీ దేవుని ధర్మశాస్త్ర సూత్రాలు నిత్యం నిలుస్తాయి. “ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.” లూకా 16:17. యేసుని దేవుని గొర్రెపిల్లగా సూచించే ఛాయరూపక వ్వవస్థ ఆయన మరణంతో రద్దుపడాల్సి ఉంది. కాని పది ఆజ్ఞల సూత్రాలు మార్పులేనివి. అవి దేవుని సింహాసనంలా స్థిరమైనవి.DATel 329.1

    దేవుని ధర్మశాస్త్రం పరిపూర్ణమైంది గనుక దానికి విరుద్ధమైన మార్పు ఏదైనా అది చెడ్డదే! అవాంఛనీయమే. దేవుని ఆజ్ఞలకు అవిధేయులై ఉంటూ ఇతరుల్ని కూడా అవిధేయులుగా చేసే వారిని క్రీస్తు ఖండిస్తోన్నాడు. రక్షకుడు ధర్మశాస్త్రానికి విధేయుడై నివసించాడు. మానవులు ధర్మశాస్త్రానుసారంగా జీవించగలరని ఇది నిరూపించింది. ధర్మశాస్త్రానికి లోబడి జీవించిన జీవితం ఉదాత్త ప్రవర్తనను రూపొందిస్తుందని ఇది నిరూపించింది. ఆయనమల్లే ధర్మశాస్త్రానుసారంగా నివసించేవారు ధర్మశాస్త్రం “పరిశుద్ధమైనది... నీతిగలది ఉత్తమమైనది” అని ప్రకటిస్తోన్నారు. రోమా 7:12. ఇకపోతే దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించే వారందరూ దేవుని ధర్మశాస్త్రం అన్యాయమైంది దాన్ని ఆచరించడం అసాధ్యం అన్న సాతాను వాదనను సమర్ధిస్తున్నవారవుతారు. సాతాను మోసాలికి ఇలా సై అని వారు దేవున్ని ఆగౌరవపర్చుతోన్నారు. దేవుని ధర్మశాస్త్రానికి ప్రప్రథమంగా ఎదురు తిరిగిన ఆ దుష్టుడి పిల్లలు వారు. వారిని పరలోకంలోకి అనుమతిస్తే పరలోకంలోకి మళ్లీ విభేదాలు తిరుగుబాటు తెచ్చి విశ్వశ్రేయస్సును దెబ్బ తీసినట్లవుతుంది. ధర్మశాస్త్ర సూత్రాల్లో ఒక్కదాన్ని ఉద్దేశపూర్వకంగా తృణీకరించే ఏ వ్యక్తి పరలోకంలో ప్రవేశించలేడు.DATel 329.2

    రబ్బీలు తమ నీతి తమకు పరలోక ప్రవేశపత్రమని పరిగణించారు. అయితే అది సరిపోదని అది అయోగ్యం నిరుపుయోగం అని యేసు కుండబద్దలు కొట్టాడు. బహిర్గత ఆచారాలు, సత్యాన్ని గూర్చిన సిద్ధాంత జ్ఞానం ఇవే పరిసయ్యుల నీతిలో అంతర్భాగాలు. తమ సొంత కృషి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆచరించడానకి ప్రయత్నిస్తూ తాము పరిశుద్ధులమని రబ్బీలు చెప్పుకునేవారు. అయితే వారి పనులు నీతిని మతం నుంచి వేరు చేశాయి. ఆచారాల్ని కర్మకాండని నిష్టగా ఆచరించినా వారి జీవితాలు మాత్రం నీచ అనైతిక జీవితాలు. వారు గొప్పలు చెప్పుకొంటున్న నీతి పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు.DATel 330.1

    క్రీస్తు దినాల్లో మానవ మనసుల్ని వంచించిన గొప్ప మోసం కేవలం సత్యానికి అంగీకారం తెలపడం వల్ల నీతి లభిస్తుందన్నది. ఆత్మను రక్షించడానికి సిద్ధాంతపరమైన సత్యజ్ఞానమే చాలదని మానవ అనుభం అంతటిలో నిరూపితముయ్యింది. అది నీతి ఫలాల్ని ఫలించదు. వేదాంత సత్యంగా పిలువబడే అంశాన్ని తీవ్రంగా పరిగణించడం జరిగితే దాని వెనక జీవితంలో ప్రదర్శితమైన యధార్థ సత్యం పట్ల ద్వేషం ఏర్పడడం తరచు జరుగుతుంటుంది. చరిత్రలోని చీకటి అధ్యాయాలు మతదురభిమానుల నేరాలతో బరువెక్కిఉన్నాయి. తాము అబ్రహాము పిల్లలమని పరిసయ్యులు చెప్పుకున్నారు. తమకు దైవలేఖనాలున్నాయని అతిశయించారు. అయినా ఈ వేషధారణ నుంచి అవి వారిని కాపాడలేకపోయాయి. లోకంలో తామే గొప్ప మతవిశ్వాసులమని వారు ఊహించుకున్నారు. కాని వారి సనాతన మతం మహిమ ప్రభువుని సిలువ వేసి చంపడానికి నడిపించింది.DATel 330.2

    ఇదే ప్రమాదం ఇంకా వుంది. కేవలం కొన్ని వేదాంత సిద్ధాంతాల్ని నమ్ముతున్నందువల్ల అనేకులు తాము క్రైస్తవులమని అనుకుంటారు. అయితే వారు సత్యాన్ని తమ వాస్తవ జీవితంలో ఆచరించరు. సత్యాన్ని విశ్వసించి ప్రేమించరు. అందుచేత సత్యం నిర్వహించే పవిత్రీకరణ ద్వారా కలిగే శక్తిని కృపను వారు పొందరు. మనుషులు సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పవచ్చు. అది వారిని యధార్థవంతులుగా, దయ, ఓర్పు, సహనం ఆధ్యాత్మిక మనస్తత్వం గలవారిగా మార్చకపోతే, అది వారికి శాపమౌతుంది. వారి చెడు ప్రభావం ద్వారా అది లోకానికి కూడా శాపంగా పరిణమిస్తుంది.DATel 331.1

    క్రీస్తు బోధించిన నీతి అంటే వెల్లడైన దేవుని చిత్తానికి హృదయం జీవితం అనుగుణంగా ఉండడం. పాప మానవులు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనతో క్రియాత్మక సంబంధం కలిగి ఉండడం ద్వారానే నీతిమంతు లవ్వగలుగుతారు. అప్పుడు యధార్ధ దైవ భక్తి తలంపుల్ని సమున్నత పర్చి జీవితాన్ని ఉదాత్తం చేస్తుంది. అప్పుడు దైవారాధనలో అవసరమైన ఆచారాలు పరిసయ్యుల దొంగ భక్తిలాగ ఆర్థరహిత కర్మకాండలాగ ఉండవు.DATel 331.2

    యేసు ఆజ్ఞల్ని వేరుగా తీసుకుని వాటి ఆచరణ విధుల లోతు వెడల్పుల్ని విశదీకరించాడు. వాటి ప్రాధాన్యంలో ఒక్క పొల్లును తొలగించే బదులు వాటి సూత్రాలు ఎంత దీర్ఘకాలికమైనవో వివరించి యూదులు చూపిస్తోన్న బాహ్యవిధేయతలో వారు చేస్తోన్న దారుణ తప్పిదాన్ని ఎండగట్టాడు. దుష్ట తలంపువల్ల దుర్బుద్ధితో కూడిన చూపువల్ల ధర్మశాస్త్ర ఉల్లంఘన జరుగుతుందని ప్రకటించాడు. స్వల్పమైన అన్యాయం చెయ్యడంలో సహకరించే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి తన నైతిక స్వభావాన్ని కించపర్చుకుంటాడు. హత్య ముందు మనసులో పుడుతుంది. ఏ వ్యక్తి తన హృదయంలో ద్వేషానికి చోటు పెడ్తాడో ఆతడు హంతకుడి మార్గంలో అడుగులు వేస్తోన్నాడు. అతడి అర్పణలు దేవునికి హేయాలు.DATel 331.3

    యూదులు ప్రతీకార స్వభావాన్ని అలవర్చుకున్నారు. రోమీయుల పట్ల తమకున్న ద్వేషంతో వారు తీవ్ర పదజాలంతో ఖండన మండనలు చేసి అపవాది దుర్గుణాల్ని ప్రదర్శించడం ద్వారా అతణ్ని సంతోషపర్చేవారు. అతడు నడిపించి ప్రోత్సహించిన భయంకర దుష్కృతాల్ని చేయడానికి వారు ఇలా తమ్ముతాము తర్బీతు చేసుకున్నారు. అన్యజనులకి స్ఫూర్తినిచ్చే అంశం పరిసయ్యుల మత జీవితంలో ఏదీ లేదు. తమను హింసిస్తోన్న రోమియులికి వ్యతిరేకంగా హృదయంలో తిరుగుబాటు చేసి వారిపై పగ కక్ష తీర్చుకోవాలన్న తలంపులతో తమ్మును తాము మోసగించుకోవద్దని యేసు హెచ్చరించాడు.DATel 331.4

    క్రీస్తు అనుచర్లతోసహ వారి ఆగ్రహం సహేతుకమైందే. దేవున్ని అగౌరవపర్చడం, ఆయన ఆరాధనను అప్రతిష్ఠపాలు చెయ్యడం చూసినప్పుడు అమాయకులు హింసకు గురికావడం చూసినప్పుడు హృదయంలో పరిశుద్ధ ఆగ్రహం రగులుతుంది. నైతిక భంగపాటు వల్ల కలిగిన ఆగ్రహం పాపం కాదు. కాగా ప్రతీ ఊహాజనిత కవ్వింపును ఆసరా చేసుకుని కోపోద్రేకాలకి లోనయ్యేవారు లేదా అసమ్మతిని తెలిపేవారు తమ హృదయాల్ని తెరిచి సాతానుని ఆహ్వానిస్తున్నవారవుతారు. మనం దేవునితో సామరస్యంగా ఉండాలని కోరుకుంటే ద్వేషాన్ని పగను బహిష్కరించాలి.DATel 332.1

    రక్షకుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఆయనిలా అంటోన్నాడు, “నీవు బలిపీఠము నొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మిద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచి పెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” తమకు తమ సహోదరులకు మధ్య సరిచేసుకోవాల్సిన విభేదాలు ఉండగా మత సంబంధమైన పరిచర్యలో అనేకులు ఉద్రేకంగా ఉంటారు. సామరస్య పునరుద్ధరణకు వారు శాయశక్తుల కృషి చేయ్యాలని దేవుడు కోర్తున్నాడు. వారు ఈ పని చేసే వరకు దేవుడు వారి సేవలను అంగీకరించడు. ఈ విషయంలో క్రైస్తవుడి విధి ఏమిటో స్పష్టంగా సూచించడం జరిగింది.DATel 332.2

    దేవుడు అందరిమీద తన దీవెనల్ని కుమ్మరిస్తాడు. “ఆయన చెడ్డవారి మీదను మంచివారి మిదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మిదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన కృతజ్ఞత లేనివారి యెడలను, దుషుల యెడలను ఉపకారియైయున్నాడు” లూకా 6:35. తనలా ఉండాల్సిందిగా ఆయన మనల్ని ఆదేశిస్తోన్నాడు. “మిమ్మును శపించువారిని దీవించుడి” “మీరును పరలోకంమందున్న నా తండ్రికి కుమారులై యుండునట్లు” “మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి.” ఇవి ధర్మశాస్త్రసూత్రాలు. ఇవి జీవితం అనే బావికి ఊటలు.DATel 332.3

    దేవుడు తన బిడ్డల ముందుంచిన ఆదర్శం అత్యున్నతమైన మానవ ఆలోచనకన్నా ఉన్నతమైంది. “నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను.” ఈ ఆదేశం ఒక వాగ్దానం. సాతాను శక్తి నుంచి మనల్ని పూర్తిగా పునరుద్ధరించడమన్నది విమోచన ప్రణాళిక ధ్యేయం. పశ్చాతప్త ఆత్మను క్రీస్తు ఎల్లపుడూ పాపం నుంచి వేరు చేస్తాడు. సాతాను పనుల్ని నాశనం చెయ్యడానికి ఆయన వచ్చాడు. పాపం చెయ్యకుండా ఉండేందుకుగాను పశ్చాత్తాపం పొందిన ప్రతీ ఆత్మకు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేశాడు.DATel 333.1

    ఒక్క తప్పుడు పనికి శోధకుడి అనుచరవర్గాన్ని సాకుగా చెప్పడానికి లేదు. క్రీస్తు అనుచరులమని చెప్పుకునే వారు తమ ప్రవర్తన లోపాలకి సాకులు చెబుతున్నప్పుడు సాతాను ఎగిరి గంతేస్తాడు. పాపానికి దారి తీసేవి ఈ సాకులే! పాపం చెయ్యడానకి ఏసాకూ లేదు. పశ్చాత్తాపం పొందే విశ్వసించే దేవుని బిడ్డలందరికి పరిశుద్ధ మనఃప్రవృత్తి, కలిగి ఉండడం, క్రీస్తులా నివసించడం సులభ సాధ్యం.DATel 333.2

    క్రీస్తు ప్రవర్తనే క్రైస్తవుడికి ఆదర్శం. మనుష కుమారుడు తన జీవితంలో పరిపూర్ణుడుగా ఉన్నరీతిగానే ఆయన అనుచరులూ పరిపూర్ణులుగా నివసించాల్సి ఉన్నారు. యేసు అన్ని విషయాల్లోను మనలాగే ఉన్నాడు. మనలాగే ఆయనా రక్తమాంసాలు కలిగి ఉన్నాడు. ఆయనకు ఆకలి అలసట ఉన్నాయి. ఆయనకు ఆహారం, నిద్ర అవసరమయ్యాయి. ఆయన మానవుడై మానవపరిస్థితిల్లో నివసించాడు. అయినా ఆయన నిందారహితుడైన దైవకుమారుడు. ఆయన శరీరం ధరించిన దేవుడు. మన ప్రవర్తన ఆయన ప్రవర్తనలా ఉండాలి.DATel 333.3

    ఆయనపై నమ్మిక గలవారిని గురించి ప్రభువిలా అంటున్నాడు, “నేను నివసించి సంచరింతును నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజల్లో యుందురు.” 2కొరి 6:16.DATel 333.4

    మొదలు భూమిమీద ఆనుకుని పరలోక గుమ్మాల్ని ఇంకా చెప్పాలంటే దేవుని మహిమా ద్వారాన్ని అంటుతున్నట్లు యాకోబు కలలో చూసిన నిచ్చెన క్రీస్తే! ఆ నిచ్చెన భూమిని చేరడానికి ఒక్కమెట్టు తక్కువై ఉంటే మనం నశించిపోయేవారం. కాని క్రీస్తు మనల్ని చేరుకున్నాడు. మనమున్న చోటనే మనల్ని చేరాడు. మనం తన స్వభావాన్ని తీసుకుని జయించేందుకుగాను ఆయన మన స్వభావాన్ని తీసుకుని జయించాడు. “పాప శరీరకారముతో” (రోమా 8:3) నిర్మితి అయినా ఆయన పాపరహిత జీవితం జీవించాడు. ఇప్పుడు తన దేవత్వం వల్ల పరలోక సింహసనానికి హక్కుదారుడై ఉండగా తన మానవత్వాన్ని బట్టి మనల్ని చేరుకుంటాడు. తనపై విశ్వాసం ద్వారా దేవుని ప్రవర్తనలోని మహిమను సాధించాల్సిందిగా ఆయన మనల్ని కోరుతోన్నాడు. మన “పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక” మనం పరిపూర్ణులం కావాలి.DATel 333.5

    దేని మూలంగా నీతి వస్తుందో సూచిస్తూ యేసు దేవున్ని నీతికి నిలయంగా పేర్కొన్నాడు. ఇప్పుడు ఆచరణాత్మక విధుల్ని చర్చించాడు. ధర్మం చెయ్యడం ప్రార్ధన చెయ్యడం ఉపవాసముండడం - దృష్టిని ఆకర్షించడానికో మెచ్చుకోళ్లు అందుకోడానికో వీటిని చేయకూడదని ఆయన అన్నాడు. బాధల్లో , ఉన్న పేదవారి సహాయార్ధం సహృదయంతో ఇవ్వండి. ప్రార్ధన చేసేటప్పుడు ఆత్మ దేవునితో మమేకమవ్యాలి. ఉపవాసం ఉండడంలో స్వార్ధాలోచనలతో నిండిన హృదయంతో తలవంచుకుని వెళ్లకండి. పరిసయ్యుడి హృదయం నిరుపయోగమైన ఎడారి నేల. అందులో భక్తి జీవితానికి వేసే విత్తనాలు మొలవవు. ఏ వ్యక్తి దేవునికి తన్నుతాను సంపూర్తిగా అప్పగించుకుంటాడో అతడు ఆయనకు ప్రియమైన సేవ చేస్తాడు. ఎందుకంటే దేవునితో సహవాసం ద్వారా మనుషులు దేవునితో జతపనివారై మానవ రూపంలో ఆయన ప్రవర్తనను ప్రదర్శిస్తారు.DATel 334.1

    చిత్తశుద్ధితో చేసిన సేవకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. “రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.” క్రీస్తు కృపవలన మనం జీవించే జీవితం ద్వారా ప్రవర్తన నిర్మితమౌతుంది. ఆత్మకు ఆది సౌందర్యం తిరిగి రావడం ప్రారంభమౌతుంది. క్రీస్తు ప్రవర్తనలోని గుణగణాలు అనుగ్రహించబడ్డాయి. దేవుని స్వరూపం ప్రకాశించడం మొదలవుతుంది. దేవునితో నడిచి ఆయనతో పని చేసే పురుషులు స్త్రీల ముఖాలు పరలోక శాంతిని ప్రతిబింబిస్తాయి. వారిని పరలోక వాతావరణం ఆవరిస్తుంది. ఈ ఆత్మల విషయంలో దేవుని రాజ్యం ప్రారంభమౌతుంది. క్రీస్తులో వారికి ఆనందం - మానవాళికి ఉపకారం చెయ్యడంలో ఉన్న ఆనందం - ఉంటుంది. ప్రభువు సేవకు వారు అంగీకృతులవుతున్నారన్న గౌరవం వారికుంటుంది. వారు ఆయన నామంలో ఆయన పరిచర్య చెయ్యడానికి విశ్వాసపాత్రులవ్వుతారు.DATel 334.2

    “ఎవడును ఇద్దరు యాజమానులకు దాసుడుగా నుండనేరడు.” మనం ద్వంద్వ మనసుతో దేవుని సేవించలేం. బైబిలు ప్రబోధించే మతం అనేక ఇతర ప్రభావాల్లో ఒకటి కాదు. దాని ప్రభావం సర్వోన్నతంగా ఉండాలి. అది అంతట వ్వాపించాలి. ప్రతీ ఇతర ప్రభావాన్ని అదుపు చెయ్యాలి. అది గుడ్డపై ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం పామే రంగులా ఉండకూడదు. గుడ్డలోని ప్రతీ నూలు పోగుకీ రంగుపట్టి వెలవని ముతక రంగువచ్చే వరకు గుడ్డను రంగులో ముంచినట్లు మతం జీవితమంతా వ్యాపించాల్సి ఉంది.DATel 335.1

    “దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమైయుండను.” పవిత్రత, కర్తవ్య నిబద్ధత - ఇవే దేవుని వద్ద నుంచి వెలుగు పొందడానికి షరతులు. సత్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించే వ్యక్తి సత్యం వెల్లడించే సమస్తాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అతడు అసత్యంతో రాజీపడకూడదు. సత్యాన్ని అనుసరించడంలో ఊగిసలాడడం అర్థాంగీకారం తెలపడం అబద్ధమనే చీకటిని సాతాను వంచనను ఎంచుకోడమే.DATel 335.2

    లౌకిక విధానం, రాజీలేని నీతి సూత్రాలు ఇంధ్రధనసులోని రంగుల్లా ఒకదానితో ఒకటి కలవవు. ఈ రెంటికీ మధ్య నిత్యుడైన దేవుడు స్పష్టమైన రేఖను గీశాడు. మధ్యాహ్నంతో మధ్యరాత్రి ఎలా భేదిస్తుందో అలాగే క్రీస్తు స్వరూపంతో సాతాను స్వరూపం ఎంతగానో భేదిస్తుంది. క్రీస్తు జీవితం జీవించేవారే ఆయనతో జతపనివారు. విడిచి పెట్టని పాపం ఒక్కటి హృదయంలో ఉంటే లేక జీవితంలో ఒక్క దురభ్యాసం కొనసాగుతుంటే శరీరమంతా వ్యాధిగ్రస్తమౌతుంది. వ్యక్తి అనీతికి సాధనమవుతాడు.DATel 335.3

    దేవుని సేవను ఎంపిక చేసుకున్నవారంతా ఆయన సంరక్షణలో ఉండాలి. ఆకాశపక్షుల్ని అడవిపువ్వుల్ని పేర్కొంటూ దైవ సృష్టిలోని వీటిని పరిగణించాల్సిందిగా ఆయన తన శ్రోతల్లి కోరాడు. ” వాటి కన్నా మీరు మరెంతో విలువైనవారు కారా?” అని ప్రశ్నించాడు. మత్త 6:26, ఆర్.వి. ఏ వస్తువుపైనైనా లేదా ప్రాణి పైనైనా దేవుని దృష్టి జీవన క్రమంలో ఆవస్తువు లేదా ప్రాణి స్థాయికి తగిన నిష్పత్తిలో ఉంటుంది. చిన్న పిచ్చుకను దేవుడు శ్రద్ధగా కాపాడాడు. అడవిలోని పువ్వుల్ని భూమిని కప్పేపచ్చని గడ్డిని కూడా దేవుడు శ్రద్ధగా కాపాడాడు. ఆ మహాకళాకారుడు అడవిపువ్వుల విషయంలో శ్రద్ధతీసుకుని వాటిని మిక్కిలి సుందరంగా చేశాడు. వాటి సౌందర్యం సొలొమోను వైభవంకన్నా ఎంతో గొప్పది. అలాగైతే దేవుని స్వరూపం దేవుని మహిమ గల మానవుడి పై ఆయన శ్రద్ధ మరెంత గొప్పది! ఆయన బిడ్డలు తన వంటి ప్రవర్తనను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సూర్యకిరణం పువ్వులికి వాటి వివిధమైన సున్నితమైన రంగుల్ని ఇచ్చే రీతిగానే దేవుడు తన సొంత ప్రవర్తన సౌందర్యాన్ని ఆత్మకు ఇస్తాడు.DATel 336.1

    అనురాగం, నీతి, సమాధానం వెల్లివిరిసే క్రీస్తు రాజ్యాన్ని ఎన్నుకుని దాని ఆసక్తుల్ని అత్యున్నతంగా ఎంచే వారందరూ పై లోకంతో అనుసంధానం కలిగి ఉన్నవారు. కనుక ఈ జీవితానికి అవసరమైన ఉపకారం వారికి కలుగుతుంది. దేవుని ఉపకార గ్రంధంలో జీవితం సంపుటిలో మనకు ఒక్కోపుట ఉంటుంది. ఆ పుటలో మన చరిత్రకు సంబంధించిన ప్రతీ వివరం ఉంటుంది. మన తలలోని వెంట్రుకల లెక్క సయితం ఉంటుంది. దేవుడు తన పిల్లల విషయం నిత్యం ఆలోచిస్తాడు.DATel 336.2

    “రేపటిని గూర్చి ఆందోళన పడకండి.” మత్త 6:34, ఆర్. వి. మనం క్రీస్తుని దినదినం వెంబడించాలి. దేవుడు రేపటికి సహాయాన్నివ్వడు. వారు తికపడకూడదని తన బిడ్డల జీవిత ప్రయాణానికి అవసరమైన సూచనలు సలహాలన్నింటిని ఒక్కసారే ఇవ్వడు. వారు జ్ఞాపకముంచుకుని ఆచరణలో పెట్టగలిగేంత మట్టుకే వారికి చెబుతాడు. ఆయన అనుగ్రహించే శక్తి, జ్ఞానం ప్రస్తుత అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి మాత్రమే. ఈ నాటికి “మిలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడది అతని అనుగ్రహించబడును.” యాకోబు 1:5.DATel 336.3

    “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు.” ఇతరుల కన్నామెరుగైనవారిగా మిమ్ముల్ని గూర్చి మీరు తలంచి వారిపై తీర్పరిగా మిమ్ముల్ని మీరు నియమించుకోకండి. మీరు ఉద్దేశాన్ని గ్రహించలేరు గనుక ఇతరుల్ని గూర్చి తీర్పు తీర్చడానికి మీరు అసమర్థులు. తీర్పుతీర్చడం ద్వారా సహోదరుల్ని నిందించే సాతానుతో వారు కలిసి పనిచేస్తున్నట్లు నిరూపించుకుటారు. “మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి” అంటున్నాడు ప్రభువు. మనం చేయాల్సిన పని ఇది. “అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము.” 2కొరి 13:5; 1కొరి11:31.DATel 337.1

    మంచి చెట్టు మంచి పండ్లు పండుతుంది. పండు తినడానికి పనికి రానిదైతే ఆ చెట్టు చెడ్డది. అలాగే జీవితంలో పండే పండు హృదయం పరిస్థితిని ప్రవర్తన నాణ్యతను సూచిస్తుంది. స్కియలు రక్షణను కొనలేవు. కాకపోతే ప్రేమవలన క్రియాశీమై ఆత్మను పవిత్రపర్చే విశ్వాసానికి అవి నిదర్శనాలు. నిత్యజీవ బహుమానం మన అర్హతను బట్టి మనకు లభించకపోయినప్పటికీ క్రీస్తు కృపద్వారా జరిగిన పని నిష్పత్తిలో అది ఉంటుంది.DATel 337.2

    క్రీస్తు ఈరీతిగా తన రాజ్య సూత్రాల్ని ప్రకటించి, అవి గొప్ప జీవిత నియమని సూచించాడు. ఆ ఉపదేశాన్ని వారి హృదయాల్లో పాదుకొల్పడానకి ఒక సాదృశ్యాన్ని కూడా ఇచ్చాడు. వారు నా మాటలు వినడం మాత్రమే చాలదు వాటికి లోబడి నివసించడం ద్వారా వాటిని మీ ప్రవర్తనకు పునాదిగా చేసుకోవాలి అన్నాడాయన. స్వార్థం ఊబిలాంటిది. మీరు మానవసిద్దాంతాలు కట్టుకథలపై మీ ఇంటిని కట్టుకుంటే అది కూలిపోతుంది. శోధన గాలులు శ్రమల తుపానులు వచ్చినప్పుడు అది కొట్టుకుపోతుంది. అయితే నేనిచ్చిన సూత్రాలు స్థిరంగా నిలుస్తాయి. నన్ను స్వీకరించండి. నా మాటలమీద ఇల్లు కట్టుకోండి.DATel 337.3

    “కాబట్టి యీ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పొలియుండును. వాన కురిసెను. వరదలు వచ్చెను గాలి విసిరి ఆ యింటి మీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.” మత్త 7:24, 25.DATel 337.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents