Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    85—మరోసారి సముద్రం పక్క

    తన శిష్యుల్ని గలిలయలో కలవడానికి యేసు నియమించాడు. పస్కావారం ముగిసిన వెంటనే వారు అక్కడకు ప్రయాణమయ్యారు. పండుగ సమయంలో వారు యెరూషలేములో లేకపోవడం అవిశ్వాసంగా విమతంగా వ్యాఖ్యానించడం జరిగి ఉండేది. కనుక శిష్యులు పస్కాముగిసే వరకు అక్కడే ఉండిపోయారు. అయితే అనంతరం వారు రక్షకుణ్ని కలవడానికి సంతోషంగా గలిలయకు వెళ్తున్నారు.DATel 912.1

    ఏడుగురు శిష్యులు కలిసి ప్రయాణిస్తున్నారు. వారు జాలరుల దుస్తులు ధరించి ఉన్నారు. లోక సంబంధమైన విషయాల్లో వారు పేదలు. కాని సత్యానికి సంబంధించిన జ్ఞానం విషయంలోను ఆచరణ విషయంలోను వారు భాగ్యవంతులు. దేవుని దృష్టిలో వారికి ఆ జ్ఞానం బోధకులుగా అత్యున్నత స్థానాన్నిచ్చింది. వారు ప్రవక్తల పాఠశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థులు కారు. కాని వారు మూడు సంవత్సరాలు సర్వోన్నత అధ్యాపకుడి శిక్షణలో విద్యనభ్యసించారు. ఆయన శిక్షణ కింద వారు ఉన్నతమైన, జ్ఞానయుక్తమైన, సంస్కారం గల ప్రతినిధులయ్యారు. వారి ద్వారా మనుషులు సత్యాన్ని తెలుసుకోవలసి ఉన్నారు.DATel 912.2

    క్రీస్తు పరిచర్యలో చాలాభాగం గలిలయ సముద్ర ప్రాంతంలో జరిగింది. ఎలాంటి అంతరాయాలు ఉండని స్థలంలో శిష్యులు సమావేశమైనప్పుడు, తాము క్రీస్తు చేసిన మహాకార్యాల నడుమ ఉన్నట్లు గుర్తించారు. ఈ సముద్రంపై తమను భయాందోళనలు ఆవరించగా భయంకర తుపాను తమను నాశనం దిశగా తరుముతుండగా తమను రక్షించడానికి యేసు కెరటాలపై నడిచివచ్చాడు. ఇక్కడ ఆయన అనేక సూచక క్రియలు చేశాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు రక్షకుని మాటలు పనులతో శిష్యుల మనసులు • నిండాయి.DATel 912.3

    సాయంత్రం ఉల్లాసంగా ఉంది. నావలు చేపలవేట అంటే ముందటి ఉత్సాహం ఉద్రేకం ఇంకా ఉన్న పేతురు సముద్రంలోకి వెళ్లి వలలు వేద్దాము అని ప్రతిపాధించాడు. ఈ ప్రణాళికలో చేరడానికి అందరూ సమ్మతి వ్యక్తం చేశారు. వారికి ఆహారం బట్టలు అవసరం. ఆ రాత్రి చేపలు పట్టి అమ్మితే వచ్చే సొమ్ముతో ఆ అవసరాలు తీర్చుకోవచ్చు. కనుక నావలో సముద్రంలోకీ వెళ్లారు. కాని వారికి చేపలు ఏమి దొరకలేదు. ఆ రాత్రంతా శ్రమపడ్డా ఫలితమేమి లేకపోయింది. శ్రమతో అలసిఉన్న ఆగడియల్లో తమతో లేని తమ ప్రభువు గురించి మాట్లాడుకున్నారు. ఆ సముద్రం ప్రక్క జరిగిన తమ ప్రభువు పరిచర్యలో తాము చూసిన అద్భుత సంఘటనల్ని గుర్తు చేసుకున్నారు. అంతట వారు తమ భవిష్యత్తును గురించి ప్రశ్నించుకుని వ్యాకులపడడం మొదలు పెట్టారు.DATel 913.1

    ఈ సమయమంతా ఒంటరిగా సముద్రతీరాన అదృశ్యుడై ఉండి తన నేత్రంతో వారిని కనిపెట్టొన్న ఒక వ్యక్తి ఉన్నాడు. కొంత సేపటికి తెల్లవారింది. నావ సముద్రతీరానికి కొంచెం దూరంలోనే ఉంది. తీరాన తమకు పరిచయంలేని వ్యక్తి ఎవరో నిలబడి, “పిల్లలారా, భోజనమునకు నా యెద్ద ఏమైనా ఉన్నదా?” అని అడగడం శిష్యులు విన్నారు. “లేదు” అని వారు బదులు పలికినప్పుడు, “దోనె కుడి ప్రక్కకు వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.”DATel 913.2

    యోహాను ఆ వ్యక్తిని గుర్తించి “ఆయన ప్రభువు సుమి” అని పేతురుతో అన్నాడు. ఆనందోత్సాహాలతో నిండిన పేతురు ఆతృతతో అమాంతంగా నీటిలోకి దూకి ఒక తృటిలో ప్రభువు పక్కన నిలబడ్డాడు. తక్కిన శిష్యులు నావలో చేపలతో నిండిన వలను లాగుకుంటూవచ్చారు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.”DATel 913.3

    ఆ అగ్ని ఆ ఆహారం ఎలా వచ్చాయా అని వారు ఆశ్చర్యపడ్డారు. “యేసు - మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని” వారితో చెప్పాడు. పేతురు వెంటనే వెళ్లి తాను విడిచి పెట్టి వచ్చిన వలను ఒడ్డుకి లాగడంలో సోదర శిష్యులికి చెయ్యాతనిచ్చాడు. వారి పని ముగిసిన తర్వాత, సిద్ధబాటు అయిన అనంతరం భోజనం చెయ్యడానికి యేసు శిష్యుల్ని రమ్మని పిలిచాడు. ఆహారాన్ని విరిచి అందరికీ పంచిపెట్టాడు. ఆ ఏడుగురు శిష్యులు ఆయన్ని గుర్తించారు. పర్వతం పక్క అయిదువేలమందికి ఆహారం పెట్టిన సూచక క్రియ వారికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక అవ్యక్తమైన భయభీతివారిని ఆవరించింది. తిరిగి లేచిన రక్షకుని ముఖంలోకి మౌనంగా చూస్తూ నిలిచిపోయారు.DATel 914.1

    తన్ను వెంబడించమంటూ ఆ సముద్రం తీరంపై యేసు తమకు పిలుపునిచ్చిన దృశ్యాన్ని వారు గుర్తుకి తెచ్చుకున్నారు. ఆయన ఆదేశం మేరకు తాము సముద్రంలోకి వెళ్లి, వలవేయగా వల పగిలిపోయేంత విస్తారంగా చేపలు ఎలా పడ్డాయో వారు గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు యేసు వారిని తమ నావలు వదిలి రమ్మని తమను మనుషుల్ని పట్టే జాలరనులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ దృశ్యాన్ని వారి గుర్తుకు తెచ్చి దాని ప్రాధాన్యాన్ని వారు మరింత గుర్తించేటట్లు చెయ్యడానికే ఆయన ఈ సూచక క్రియను మళ్లీ చేశాడు. ఆయన చర్య తన శిష్యులికి ఆయనిచ్చిన ఆదేశాన్ని నవీకరిస్తున్నది. తమ ప్రభువు మరణం ఆయన తమకు నియమించిన పరిచర్య విధిని ఏమాత్రం తక్కువ చేయదని ఇది చూపించింది. ఆయన వ్యక్తిగత సహవాసం ఇక ఉండకపోయినా, తమ పూర్వ వృత్తి ద్వారా పోషణ లభించకపోయినా, తిరిగిలేచిన రక్షకుడు వారిని గూర్చి ఇంకా శ్రద్ధ చూపిస్తాడు. వారు ఆయన సేవ కొనసాగిస్తుండగా వారి అవసరాల్ని ఆయన తీర్చుతాడు. నావ కుడి ప్రక్కన తమ వలను వేయమనడంలో యేసుకొక ఉద్దేశం ఉంది. తీరంపై ఆ ప్రక్కనే ఆయన నిలబడి ఉన్నాడు. అది విశ్వాసంతో కూడినపక్క. వారు తనతో ఉండి పనిచేస్తే అనగా వారి కృషితో ఆయన శక్తి కలిస్తే వారికి జయం కలగకపోడమన్నది ఉండదు.DATel 914.2

    పేతరుకి సంబంధించి ప్రభువు మరొక పాఠం బోధించాల్సి ఉంది. ప్రభువుపట్ల తన స్వామిభక్తి ఇంతకాదు అంతకాదు అంటూ కొద్దికాలం క్రితమే అతడు చేసిన బాసకు పేతురు తన ప్రభువుని ఎరుగనని బొంకడం ఎంతో వ్యత్యాసంగా విరుద్ధంగా ఉంది. అతడు క్రీస్తుని అగౌరవపర్చి తన సహోదరుల విశ్వాసాన్ని కోల్పోయాడు. తమ మధ్య తనకున్న స్థానాన్ని పేతురు కోల్పోతాడని తక్కిన శిష్యులు తలంచారు. అతడు కూడా తాను ప్రభువు విశ్వాసాన్ని కోల్పోయానని భావించాడు. అతడు అపొస్తలుడి సేవను మళ్లీ చేపట్టకముందు అతడు తనకు కలిగిన పశ్చాత్తాపానికి నిదర్శనాన్ని తక్కిన శిష్యులముందు కనపర్చాలి. ఇది జరగకపోతే ఆ పాపం గురించి పశ్చాత్తాపపడినా అది క్రీస్తు సేవకుడుగా అతడి పలుకుబడిని నాశనం చేసి ఉండేది. పేతురు తన సోదర శిష్యుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించడానికి, సువార్తకు కలిగిన నిందను సాధ్యమైనంత వరకు తొలగించడానికి రక్షకుడు అతడికి అవకాశం ఇచ్చాడు.DATel 914.3

    ఇక్కడ క్రైస్తవులందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. దుష్టత్వంతో సువార్త ఎన్నడూ రాజీపడదు. రహస్యపాపాలు దేవునితో రహస్యంగా ఒకప్పుకోవాలి. బహిరంగ పాపం బహిరంగా ఇప్పుకోవడం అవసరం. పేతరు పాపం వల్ల వచ్చిన నింద క్రీస్తు మీదకు వచ్చింది. అది సాతానుకి విజయం చేకూర్చి ఊగిసలాడుతున్న ఆత్మలకు అడ్డుబండ అయ్యింది. పశ్చాత్తాపపడ్డాను అనడానికి నిదర్శనం ఇవ్వడం ద్వారా ఈ శిష్యుడు ఈ నిందను తొలగించుకోవాల్సి ఉన్నాడు.DATel 915.1

    సముద్ర తీరాన క్రీస్తు ఆయన శిష్యులు కలిసి భోజనం చేస్తున్న తరుణంలో రక్షకుడు పేతురుని “యోహాను కుమారుడనైన సీమోనూ, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమంచుచున్నావా?” అని ప్రశ్నించాడు. తన సహోదరుల్ని దృష్టిలో ఉంచుకుని ఒకసారి పేతురు ప్రభుతో ఇలా అన్నాడు, “నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడను.” మత్త 26:33. కాని ఇప్పుడతడు తన్ను గురించి తాను వాస్తవికాభిప్రాయం కలిగి ఉన్నాడు.” అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అన్నాడు. తన ప్రేమ తక్కిన శిష్యుల ప్రేమకన్నా గొప్పదని బల్లగుద్ది చెప్పడం లేదు. తన భక్తిని గురించి సొంత అభిప్రయాల్ని వెలిబుచ్చడం లేదు. హృదయాలోచనలన్నిటిని చదవగల ఆ ప్రభువునే తన నిజయితీని గురించి తీర్పు తీర్చమని కోరుతున్నాడు, “నేను నిన్ను ప్రేమించుచున్నాని నీవే యెరుగుదువు.” “నా గొట్టె పిల్లలను మేపుము” అని యేసు అతణ్ని ఆదేశించాడు.DATel 915.2

    యేసు “యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా?” అవే మాటల్ని పునరుచ్చరిస్తూ మళ్లీ అదే పరీక్ష పేతురుకు పెట్టాడు. తన సహోదరులకన్న తనను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని పేతురుని ఆయన ప్రశ్నించలేదు. రెండోసారి ఇచ్చిన జవాబు మొదటిసారి జవాబులాగే ఆడంబరమైన హామీ ఏమీ లేకుండా ఉంది. “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు.” “నా గొట్టెలను కాయుము” అని ఆయన చెప్పాడు. మరోసారి రక్షకుడు ఆ బాధాకరమైన ప్రశ్నను వేశాడు, “యోహానుకుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా?” అని ప్రశ్నించాడు. యేసు తనను శంకిస్తున్నాడని పేతురు చాలా మనస్తాపం చెందాడు. యేసు తన ప్రేమను శంకిస్తున్నాడనుకున్నాడు. తన ప్రభువు తనను అనుమానించడానికి ఆయనకు హేతువుందని పేతరు ఎరుగును. కనుక బాధననుభవిస్తున్న హృదయంతో అతడు ఇలా బదులు పలికాడు, “ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు.” మళ్లీ యేసు ఇలా అన్నాడు, “నా గొట్టెలను మేపుము.”DATel 916.1

    పేతరు తన ప్రభువుని ఎరుగనని మూడుసార్లు బొంకాడు. గాయపడిన అతడి హృదయానికి బాణంలా గుచ్చుకునే ఆ ప్రశ్నవేసి అతడినుంచి అతడి ప్రేమకు నమ్మకానికి హామిని ప్రభువు మూడుసార్లు రాబట్టాడు. సమావేశమై ఉన్న శిష్యుల ముందు పేతరు పశ్చాత్తాపం లోతుల్ని బయలుపర్చి, ఒకప్పుడు డంబాలు పలికిన పేతురు ఎంతగా మారిపోయాడో వారికి చూపించాడు.DATel 916.2

    పేతురు స్వభావ సిద్ధంగా ముందుకు పోయే వ్యక్తి. చాలా ఆవేశపరుడు. అతణ్ని పడడగొట్టడానికి సాతాను వీటిని ఉపయోగించుకున్నాడు. పేతరు పతనానికి ముందు యేసు అతడికి ఈ హెచ్చరిక చేశాడు, “సీమోను, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండుటట్లు నేను నీ కొరకు నేడుకొంటిని; నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. లూకా 22:31,32. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. పేతురులో కలిగిన పరివర్తన అందరికి కనిపించింది. ప్రభువు వేసిన సూటి ప్రశ్నలు ఒక్క స్వయం సమృద్ధ సమాధానం కోరలేదు. తాను అనుభవించిన పరాభవం పొందిన పశ్చాత్తాపం వల్ల మంద కాపరిగా ఉండడానికి పేతురు మునుపెన్నటి కన్నా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు.DATel 916.3

    పేతురుని సువార్త సేవకు పునరుద్ధరించిన తర్వాత క్రీస్తు అతడికి అప్పగించిన ప్రథమ కర్తవ్యం గొర్రెపిల్లల్ని మేపడం. ఇది పేతురుకి అనుభవం లేని పని. ఆ పనికి ఎంతో శ్రద్ధ, దయాగుణం, ఓర్పు సహనం అవసరం. కొత్తగా విశ్వాసాన్ని అంగీకరించిన వారికి పరిచర్య చెయ్యడానికి, తెలియనివారికి సత్యం బోధించడానికి, వారికి లేఖనాలు విశదీకరించడానికి, క్రీస్తు సేవలో ప్రయోజనకరంగా ఉండడానికి వారికి శిక్షణనివ్వడానికి అది అతడికి పిలుపు నిస్తుంది. ఈ సేవ చెయ్యడానికి గాని దాని ప్రాముఖ్యాన్ని అవగాహన చేసుకోడానికి గాని ఇప్పటి వరకు పేతరు శిక్షణ పొందలేదు. అయితే ఇప్పుడు ఈ సేవ చెయ్యడానికి క్రీస్తు అతడికి పిలుపు నిచ్చాడు. బాధననుసరించిన అతడి అనుభవం, అతడు పొందిన పశ్చాత్తాపం అతణ్ని ఈ పరిచర్యకు సిద్ధం చేశాయి.DATel 917.1

    పేతురు ఈ పాపానికి బలికాకముందు అతడు ఎప్పుడూ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కలిగే భావోద్రేకాల ప్రకారం అవివేకంగా మాట్లాడేవాడు. ఇతరుల తప్పుదిద్దడానికి తనకు స్పష్టమైన అవగాహన లేకపోయినా లేదా తాను ఏమి చెప్పాలో తెలియకపోయినా తన మనోభావాల్ని వ్యక్తం చెయ్యడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. కాని మారిన పేతురు ఇప్పుడలాలేడు. ఎంతో తేడాగా ఉన్నాడు. తన పూర్వపు ఉద్రేకం చెక్కు చెదరకుండా ఉంది. క్రీస్తు కృప అతడి ఉత్సాహానికి కళ్ళెం వేసింది. అతడు ఇక దుండుడుకు వ్యక్తి, ఆత్మ విశ్వాసం గల వ్యక్తి, ఆత్మ ఔన్నత్యాన్ని కోరే వ్యక్తి కాడు. ఇప్పుడతడు నెమ్మది పరుడుగా వినిపించుకునే వ్యక్తిగా మారాడు. క్రీస్తు మందలోని గొర్రెపిల్లల్ని గొర్రెల్ని మేపడానికి ఇప్పుడతడు సమర్ధుడు.DATel 917.2

    రక్షకుడు పేతురుతో వ్యవహరించిన తీరులో అతడికి అతడి సహచర శిష్యులికి ఒక పాఠం ఉంది. అపరాధితో సహనంతో, సానుభూతితో, క్షమాస్వభావంతో వ్యవహరించాలని అది నేర్పించింది. పేతురు ప్రభువుని ఎరుగనని బొంకినా అతడి పట్ల యేసు ప్రేమ నిశ్చలంగా ఉంది. తనకు దేవుడప్పగించిన గొర్రెలు గొర్రెపిల్లల పట్ల సహాయకాపరులు అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. తనసొంత బలహీనతను వైఫల్యాన్ని గుర్తుంచుకుని క్రీస్తు తనతో ఎంత దయగా వ్యవహరించాడో అలాగే దయగా పేతురు తన మందను మేపాల్ని ఉన్నాడు.DATel 917.3

    క్రీస్తు పేతురుకి వేసిన ప్రశ్న ప్రాధాన్యం గలది. శిష్యుడవ్వడానికి సేవ చెయ్యడానికి ఆయన ఒక్క షరతు విధించాడు. అది “నన్ను ప్రేమించుచున్నావా?” అన్నది. ఇదే అత్యవసరమైన అర్హత. పేతురుకి ఇతర అర్హతలన్నీ ఉన్నా అతడిలో క్రీస్తు ప్రేమలేకపోతే ప్రభువు మందకు అతడు నమ్మకమైన కాపరిగా సేవచెయ్యలేడు. ఔదార్యం , వక్తృత్వం, కృతజ్ఞత, ఉద్రేకం - ఇవన్నీ మంచి సేవకు తోడ్పడతాయి. కాని క్రీస్తు ప్రేమ హృదయంలో లేకపోతే క్రైస్తవ పరిచారకుడి సేవ విఫలమౌతుంది.DATel 918.1

    క్రీస్తు పేతురుతో ఒంటరిగా నడిచాడు. అతడికి మాత్రమే అందించాలని ఆయన అభిలషించిన విషయం ఒకటి ఉంది. తన మరణానికి ముందు యేసు అతడితో ఇలా అన్నాడు, “నేను వెళ్లుచున్న చోటుకి నీవిప్పుడు నా వెంటరాలేవుగాని, తరువాత వచ్చెదవు.” దీనికి పేరు ఇలా సమాధానమిచ్చాడు, “ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంటరాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదును” యోహాను 13:36, 37. అతడు ఈ మాటలన్నప్పుడు క్రీస్తు పాదాలు ఏ ఎత్తులికి ఏ లోతులికి దారి చూపిస్తాయో పేతురుకి ఏమి తెలియదు. పరీక్ష వచ్చినప్పుడు పేతురు విఫలమయ్యాడు. అయితే క్రీస్తు పట్ల తన ప్రేమను నిరూపించుకోడానికి పేతురుకి మరో అవకాశం రానుంది. తన విశ్వాస పరీక్షలో చివరి మెట్టుకి అతణ్ని బలోపేతుణ్ని చెయ్యడానికి రక్షకుడు అతడి వైఫలాన్ని అతడి ముందుంచాడు. యేసు ఇలా అన్నాడు, “నీవు యౌవనుడవైయుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీనడుముకట్టి నీ కిష్టము కాని చోటికి నిన్ను మోసికొనిపోవును... అతడు ఎట్టి మరణము దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను.”DATel 918.2

    పేతురు పొందబోయే మరణం దాని తీరు గురించి యేసు అతడికి ఈ విధంగా తెలియపర్చాడు. సిలువమిద అతడి చేతుల్ని ఎలా చాపుతారో కూడా ముందుగానే చెప్పాడు. “నన్ను వెంబడించుము.” అని యేసు ఆ శిష్యుడితో చెప్పాడు. ఆ వెల్లడివల్ల పేతురు అధైర్యపడలేదు. తన ప్రభువు నిమిత్తం ఎలాంటి మరణాన్ని పొందడానికైనా సంసిద్ధత వ్యక్తం చేశాడు.DATel 918.3

    క్రీస్తుని ఇప్పుడు అనేకులు ఎరిగిన రీతిగా, ఇప్పటి వరకూ పేతురు కూడా శరీర సంబంధంగా ఎరిగాడు. కాని ఇక ఆ రీతిగా పరిమితమై నివసించడు. ప్రభువు మానవుడుగా ఉన్నప్పుడు ఆయన్ని ఎరిగినట్లు ఇప్పుడు పేతురు ఆయన్ని ఎరగడు. పేతురు ఆయన్ని మానవుడిగా పరలోకం నుంచి వచ్చిన బోధకుడిగా ప్రేమించాడు. తనకు క్రీస్తు సమస్తం అన్న పాఠం నేర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తన ప్రభువు ఆత్మత్యాగ పరిచర్యలో ఆయనతో భాగస్వామి అవ్వడానికి సన్నద్ధుడయ్యాడు. తుదకు అతణ్ని సిలువ చెయ్యడానికి తీసుకువచ్చినప్పుడు అతడి కోరిక మేరకు అతణ్ని తలకిందకు కాళ్లుపైకి పెట్టి సిలువ వేశారు. తన ప్రభువు బాధపడ్డ రీతిగానే తానూ సిలువను పొందడం గొప్ప గౌరవమని దానికి తాను అర్హుణ్నికానని ఈ రీతిగా మరణం పొందాడు.DATel 919.1

    “నన్ను వెంబడించుము” అన్నమాటలు పేతురుకి ఉపదేశపూరితమైన మాటలు. తన మరణం విషయంలోనే కాక తన జీవితంలో ప్రతీ మెట్టు విషయంలో అతడు ఉపదేశం పొందాడు. ఇప్పటి వరకూ పేతురు స్వతంత్రంగా వ్యవహరించే ప్రవృత్తి కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికను అనుసరించడానికి బదులు దేవుని సేవకు తానే ఇంతవరకూ ప్రణాళికలు రచించుకునేవాడు. కాని ప్రభువు కన్నా ముందు పరుగెత్తడంలో అతడు సాధించిన జయం ఏదీలేదు. నాకన్నా ముందు పరుగెత్తవద్దు, అప్పుడు సాతాను సైన్యాన్ని నీవు ఒంటరిగా ఎదుర్కొవలసి ఉండదు, కనుక నన్నుముందు నడవనివ్వు. అప్పుడు శత్రువు నిన్ను జయించలేడు అన్నాడు ప్రభువు.DATel 919.2

    పేతరు యేసు పక్కనడుస్తుండగా యోహాను వెంబడించడం చూశాడు. అతడి భవిష్యత్తు ఎలా గుంటుందో పేతురు తెలుసుకోగోరాడు. “ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసుని అడిగెను. యేసు - నేను వచ్చు వరకు అతడుండుట నా కిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమనెను... తనకు మంచిదని ప్రభువు పరిగణించిందంతా తనకు ఆయన బయలుపర్చుతాడని పేతురు తలంచి ఉండాల్సింది. ఇతరులికి నియమితమైన పనిని గురించి తెలుసుకోవాలన్న అనవసర ఆందోళనలు లేకుండా క్రీస్తుని వెండించడం ప్రతీవారి విధి. “నేను వచ్చువరకు అతడుండుట నా కిష్టమైతే” అనడంలో యోహాను ప్రభువు రెండోసారి వచ్చేవరకు జీవించి ఉండాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఆయన తన సర్వాధికారాన్ని గురించి నొక్కిచెబుతూ అది అలా జరగాలని తాను కోరుకుంటే పేతురు సేవకు అది ఎలాంటి ప్రతిబంధకం కాదని వ్యక్తం చేశాడు. పేతురు యోహానులు ఇద్దరి జీవితం తమ ప్రభువు చేతుల్లో ఉంది. ఆయన్ని వెంబడించే విషయంలో ఇద్దరూ విధేయులై ఉండడం ఆయన వారి నుంచి కోరుతున్న విధి.DATel 919.3

    నేడు పేతురు లాంటి వారు ఎందరున్నారు! వారికి ఇతరుల విషయాల్లో ఆసక్తి అధికం. వారి విధులేంటో తెలుసుకోడానికి చెవి కోసుకుంటారు. తాము నిర్వహించాల్సిన విధి మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రీస్తు వంక చూస్తూ ఆయన్ని వెంబడించడం తాము నిర్వహించాల్సిన విధిని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రీస్తు వంక చూస్తూ ఆయన్ని వెంబడించడం మన విధి. ఇతరుల జీవితంలో మనకు పొరపాట్లు కనిపిస్తాయి. వారి ప్రవర్తనలో లోపాలు కనిపిస్తాయి. మానవ జీవితం దుష్టత దుర్నీతితో నిండి ఉంటుంది. అయితే క్రీస్తులో మనం పరిపూర్ణతను చూస్తాం. ఆయన్ని చూస్తూ ఉండడం ద్వారా మనం మార్పు చెందుతాం.DATel 920.1

    యోహాను పెద్ద వయసు వచ్చేవరకు జీవించాడు. యెరుషలేము నాశనాన్ని చూశాడు. అందమైన దేవాలయం శిధిలాల కుప్పగా మారడం చూశాడు. ఆ దేవాలయం నాశనం చివరగా లోకం నాశనానికి సూచిక. తన చివరి గడియ వరకూ యోహాను ప్రభువుని దగ్గరగా వెంబడించాడు. సంఘాలికి తాను ఇచ్చిన సాక్ష్యంలో అతడి ముఖ్యమైన సందేశం ఇది, “ప్రియులారా మనము ఒకనినొకడు ప్రేమింతము” “ప్రేమయందు నిలిచి యుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచియున్నాడు.” 1 యోహా 4:7, 16.DATel 920.2

    పేతురు అపొస్తలుడి బాధ్యతల్ని తిరిగిపొందాడు. కాని క్రీస్తు నుంచి తాను పొందిన గౌరవం అధికారం అతడికి తన సహోదరుల మీద సర్వాధికారాన్ని కట్టబెట్టలేదు. “ఇతని సంగతి ఏమగును?” అని పేతురు ప్రశ్నించినప్పుడు, “నేను వచ్చువరకు అతడుండుట నా కిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుము” అని క్రీస్తు బదులు పలికినప్పుడు ఈ విషయాన్ని నిశదం చేశాడు. పేతురుని సంఘానికి శిరస్సుగా సన్మానించలేదు. తన భ్రష్టతను క్షమించడంలో క్రీస్తు అతనిపై దయచూపి మందను మేపే బాధ్యతను అతడికి అప్పగించడాన్ని బట్టి, క్రీస్తుని వెంబడించడంలో పేతురు చూపిన నమ్మకాన్ని బట్టి, అతడు తన సహోదరుల విశ్వాసాన్ని పొందగలిగాడు. సంఘంలో అతడి ప్రభావం ప్రబలంగా ఉంది. కాని గలిలయ సముద్ర తీరాన క్రీస్తు అతడికి బోధించిన పాఠం అతడు తన జీవితకాలమంతా గుర్తుంచుకున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన సంఘాలికి రాస్తూ అతడి ఇలా అన్నాడు.DATel 920.3

    “తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్గాబేక్షతో కాక సిద్దమనస్సుతోను, ఈ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచున్న దానిని కాయుడి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.” 1 పేతు 5:1-4.DATel 921.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents