Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    55—హంగు ఆర్బాటంతో కాదు

    “దేవుని రాజ్యమెప్పుడు వచ్చును?” అని ప్రశ్నిస్తూ కొంతమంది పరిసయ్యులు యేసు వద్దకు వచ్చారు. “వరలోక రాజ్యము సమిపించియున్నది” (మత్తయి 3:2) అంటూ బాకా శబ్దంలాంటి స్వరంతో బాప్తిస్మమిచ్చే యోహాను దేశమంతటా ప్రకటించి మూడు సంవత్సరాలకి పైచిలుకు కాలం గడిచింది. అయినా ఆరాజ్య స్థాపనకు ఎలాంటి సూచనలూ పరిసయ్యులికి కనిపించలేదు. యోహాన్ని విసర్జించిన వారిలోను, అడుగడుగున యేసుని వ్యతిరేకించిన వారిలోను అనేకులు యేసు కృషి విఫలమయ్యిందని వ్యంగ్య విమర్శలు చేస్తోన్నారు.DATel 563.1

    యేసు ఇలా సమాధానం ఇచ్చాడు, “దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము ఈ మధ్యనే యున్నది గనుక, ఇదిగోయిక్కడనని, అదిగో అక్కడనిన చెప్పవీలుపడదు.” దేవుని రాజ్యం హృదయంలో ఆరంభమౌతుంది. ఆ రాజ్యం ఆగమనాన్ని సూచించడానికి లౌకికాధికార ప్రదర్శనల కోసం ఇక్కడ అక్కడ చూడవద్దు.DATel 563.2

    శిష్యుల వంక చూస్తూ ఆయన ఇలా అన్నాడు, “మనుష్యకుమారుని దినములలో ఒక దినము చూడవలెనని వారు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు.” లోక సంబంధమైన హంగు ఆర్భాటం ఉండదు గనుక మహిమాన్వితమైన నా కర్తవ్యాన్ని మీరు అవగాహన చేసుకోలేని ప్రమాదముంది. మానవరూపంలో ఉన్నప్పటికీ లోకానికి జీవము వెలుగు ఎవరో ఆ ప్రభువు ఈమధ్య ఉండడమన్న మీ ప్రత్యేక గౌరవం ఎంత సమున్నతమైందో మీరు గ్రహించలేరు. దేవుని కుమారునితో కలసి నడవడానికి మాట్లాడడానికి ఇప్పుడు నాకున్నా, మీరు ఆనందిస్తున్న అవకాశాల్ని గురించి ఆశగా ఆలోచించే రోజులు రాబోతున్నాయి.DATel 563.3

    తమ స్వార్థాశలు లోకసంబంధమైన ఆసక్తుల కారణంగా యేసు తమకు వెల్లడించాలని ఆశించిన ఆధ్యాత్నిక మహిమను ఆయన శిష్యులు సయితం అవగాహన చేసుకోలేకపోయారు. క్రీస్తు తండ్రి వద్దకు ఆరోహణమైన అనంతరం విశ్వాసులపై పరిశుద్దాత్మ కుమ్మరింపు జరిగేంత వరకు రక్షకుని ప్రవర్తనను ఆయన పరిచర్యను శిష్యులు పూర్తిగా గ్రహించలేదు, అభినందించలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత తాము మహిమ ప్రభువు - ప్రత్యక్ష సన్నిధిలో ఉండి సంచరించామన్న వాస్తవాన్ని వారు గ్రహించారు. క్రీస్తు చెప్పిన విషయాలు వారికి గుర్తుకు రాగా ప్రవచనాల్ని అవగాహన చేసుకోడానికి ఆయన చేసిన అద్భుతాల్ని గ్రహించడానికి వారి మనసులు ఉత్తేజం పొందాయి. ఆయన చేసిన అద్భుతాలు వారి దృష్టి పథంలో నిలిచాయి. వారు కలలో మేల్కొన్న వ్యక్తుల్లా ఉన్నారు. “ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను (తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి)” అని వారు గుర్తించారు. యోహా 1:14. పతనమైన ఆదాము కుమారుల్ని కుమార్తెల్ని రక్షించడానికి క్రీస్తు పరలోకం నుంచి ఈ పాప లోకానికి వచ్చాడు. ఇది గ్రహించక పూర్వం కన్నా ఇప్పుడు శిష్యులు తమ దృష్టికి తాము ఏమంత ముఖ్యులం కామని గుర్తించారు. ఆయన మాటల్ని ఆయన కార్యాన్ని విసుగు విరామం లేకుండా వారు అభ్యాసం చేసుకుంటున్నారు. తాము అరకొరగా అవగాహన చేసుకున్న పాఠాలు ఇప్పుడు వారి మనసులికి నూతన ప్రత్యక్షతలా వచ్చాయి. లేఖనాలు వారికి ఒక నూతన గ్రంథంలా రూపుదిద్దుకున్నాయి.DATel 564.1

    శిష్యులు క్రీస్తును గూర్చిన ప్రవచనాల్ని పరిశోధిస్తుండగా వారికి దైవంతో సహవాసం ఏర్పడింది. ఈ లోకంలో తాను ప్రారంభించిన రక్షణ కార్యాన్ని పూర్తి చెయ్యడానికి పరలోకానికి ఆరోహణుడైన ప్రభువును గూర్చి వారు నేర్చుకున్నారు. ఆయనయందు జ్ఞానం ఉందని, దేవుని సహాయం లేకుండా ఏ మానవుడూ దాన్ని గ్రహించలేడని వారు గుర్తించాడు. ఎవర్ని గురించి రాజులు, ప్రవక్తలు, నీతిమంతులు ప్రవచించారో ఆ ప్రభువు సహాయం వారికి అవసరమయ్యింది. ఆయన ప్రవర్తన గురించి ఆయన పరిచర్య గురించిన ప్రవచన వర్ణనల్ని విస్మయంతో పఠించారు. ప్రవచన సంబంధిత లేఖనాల్ని గూర్చిన వారి అవగాహన ఎంత స్వల్పం! క్రీస్తుని గూర్చి సాక్ష్యమిచ్చే మహత్తర సత్యాల్ని అంగీకరించడంలో వారు ఎంత మందకొడిగా ఉన్నారు! ఆయన తన్ను తాను తగ్గించుకుని మానవుడుగా తమ మధ్య నివసించినప్పుడు, ఆయన నరావతారాన్ని, ఆయన ద్వివిధ స్వభావాన్ని గూర్చిన మర్మాన్ని వారు అవగాహన చేసుకోలేకపోయారు. ఆయన మానవత్వంలోని దైవత్వాన్ని పూర్తిగా గుర్తించకుండా ఉండేందుకుగాను వారికి దృష్టి మాంద్యం కలిగింది. అయితే పరిశుద్దాత్మ వారిని ఉత్తేజపర్చినప్పుడు ఆయన్ని మళ్లీ కలుసుకోవాలని, ఆయన పాదాల వద్ద కూర్చుని తమకు గ్రాహ్యంకాన్ని లేఖనాలు ఆయన వివరించడం వినాలని వారు ఎంత పరితపించారు! ఆయన మాటలు ఎంత ఆశగా వినాలని తహతహలాడారు! “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు” (యోహ. 16:12) అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? అదేంటో పూర్తిగా తెలుసుకోవాలని ఎంత ఆతురతగా ఉన్నారు! తమ విశ్వాసం బలహీనమైందని, తమ అభిప్రాయాలు ఆయన తమ ముందుంచిన గురిని చూడలేకపోయాయని, తాము వాస్తవాన్ని అవగతం చేసుకోడంలో విఫలమయ్యామని వారు వాపోయారు.DATel 564.2

    మనుషులు క్రీస్తుని స్వీకరించడానికి సిద్ధపడేందుకుగాను ఆయన రాకను ప్రకటించడానికీ, ఆయన పరిచర్యపై యూదుజాతి గమనాన్ని ప్రపంచం గమనాన్ని నిలపడానికి దేవుడు ఒక దూతను పంపాడు. యోహాను ప్రకటించిన ఆ మహనీయుడు ముప్పయిసంవత్సారాలకు పైగా వారి మధ్య నివసించాడు. అయినా ఆయన్ని దేవుని వద్దనుంచి వచ్చిన వానిగా వారు ఎరుగలేదు. ఆ దినాల్లో ప్రజల్లో ప్రబలిన అపనమ్మకం పులిసిన పిండిలాగ తమ అభిప్రాయాల్ని కలుషితం చేసి తమ అవగాహనను మసక బార్చనిచ్చినందుకు శిష్యులు తీవ్ర సంతాపం చెందారు. ఈ చీకటి లోకపు వెలుగు ఈ చీకటిలో ప్రకాశిస్తూనే ఉంది కాని ఆ వెలుగు కిరణాలు ఎక్కడ నుంచి వస్తున్నవో వారు గ్రహించలేకపోయారు. క్రీస్తు తమను మందలించాల్సి వచ్చిన విధంగా తాము ఎందుకు వ్యవహరించామా అని తమ్మును తాము ప్రశ్నించుకుని నిందించుకున్నారు. ఆయన సంభాషణల్ని తరచుగా వల్లిస్తూ లౌకికమైన ఆసక్తులు, యాజకులు రబ్బీల వ్యతిరేకత మన మనసుల్ని గజిబిజి పర్చడానికి మనం ఎందుకు అవకాశమిచ్చి తద్వారా మోషేకన్నా గొప్పవాడు మన మధ్య ఉన్నాడని, సొలొమోను కన్నా జ్ఞాని మనకు ఉపదేశమిస్తోన్నాడని మనం ఎందుకు గ్రహించలేదు? అనుకున్నారు. మన చెవులు ఎంత మొద్దు బారిపోయాయి! మన అవగాహన ఎంత స్వల్పం!.DATel 565.1

    రోమా సైనికులు ఆయనకు కలిగించిన గాయంలో తన వేలు పెట్టే వరకు తోమా ఆయన్ని నమ్మలేదు. ఆయన్ని అవమానించి విసర్జించిన తరుణంలో ఆయన్ని ఎరగనని పేతురు బొంకాడు. బాధాకరమైన ఈ జ్ఞాపకాలు వారికి దుఃఖం కలిగించాయి. వారు ఆయనతో ఉన్నారు గాని ఆయన్ని గ్రహించలేదు, అభినందించలేదు. ఆయితే ఇప్పుడు వారు తమ అపనమ్మకాన్ని గుర్తించినప్పుడు ఈ విషయాలు వారిని ఎంతగా కలచివేశాయి!.DATel 566.1

    యాజకులు అధికారులు తమకు వ్యతిరేకంగా ఏకమై తమను సభలముందు నిలబెట్టినప్పుడు, తమను చెరసాలలో బంధించినప్పుడు “ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున” క్రీస్తు అనుచరులు సంతోషించారు. (అ.కా. 5:41) తాము క్రీస్తు మహిమను గుర్తించామని సమస్తం విడిచిపెట్టి ఆయన్ని వెంబడించడానికి ఎంపిక చేసుకున్నామని మనుషుల ముందు దేవదూతల ముందు నిరూపించుకోడానికి వారు ఆనందించారు.DATel 566.2

    దైవాత్మ చైతన్యం లేకుండా మానవులు క్రీస్తు మహిమను గ్రహించలేరన్నది అపొస్తలుల దినాల్లో ఎంత నిజమో ఇప్పుడూ అంతే నిజం. లోకాన్ని ప్రేమించి దానితో రాజీపడే క్రైసవులు దేవుని సేవను సత్యాన్ని అభినందించరు. క్రీస్తు అనుచరులు సుఖానుభవం, లోక గౌరవం లేక లౌకిక సయోధ్య కోరే వారు కారు. కష్టపడి పని చెయ్యడంలో, పరాభవం నిందలు భరించడంలో “ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను” జరిగే పోరాటంలో వారు ముందుంటారు. (ఎఫెసీ. 6:12) క్రీస్తు దినాల్లో లాగే ఇప్పుడు కూడా క్రీస్తు అనుచరులు తమ కాలంలోని యాజకులు పరిసయ్యుల వలన అపార్థాలకు నిందలకు బలి అయిపోతున్నారు.DATel 566.3

    దేవుని రాజ్యం హంగు ఆర్భాటంతో రాదు. ఆత్మ త్యాగ స్ఫూర్తి గల దైవకృపా సువార్తకు లోక సంబంధమైన స్వభావంతో పొత్తు కుదరదు. ఈ రెంటి సూత్రాలు పరస్పర విరుద్ధాలు. “ప్రకృతి సంబంధియైన ముష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెళితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” 1కొరింధి. 2:14.DATel 567.1

    క్రీస్తు రాజ్యాన్ని లౌకిక రాజ్యంగా స్థాపించడానికి పాటుపడున్నామని విశ్వసిస్తున్నవారు నేటి మత ప్రపంచంలో లెక్కకుమించి ఉన్నారు. ఈ లోక రాజ్యాలు, దాని న్యాయస్థానాలు, దాని శాసన మండళ్లు, దాని రాజ భవనాలు, విపణులు మన ప్రభువుని పాలకుణ్ని చేయాలన్నది వారి ఆకాంక్ష. మానవ అధికారులు అమలుపర్చే చట్ట నిర్మాణంలో ఆయన నాయకత్వం వహించాలన్నది వారి కోరిక. వ్యక్తి గతంగా క్రీస్తు ఇప్పుడు ఇక్కడ లేడు గనుక వారే ఆయన స్థానంలో ఆయన చట్టాల్ని అమలు పర్చడానికి పూనుకుంటారు. అలాంటి రాజ్యస్థాపనకు యూదులు క్రీస్తు దినాల్లో ప్రయత్నించారు. క్రీస్తు లౌకిక రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని చట్టమని, వారు పరిగణించిన నియమాల్ని ఆ రాజ్యంలో అమలు పర్చడానికి, వాటికి వారి భాష్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడి ఉంటే, వారు యేసుని స్వీకరించేవారు. అయితే ఆయన ఇలా అన్నాడు, “నా రాజ్యము ఈలోకసంబంధమైనది కాదు.” యోహా 18:36. ఆయన లౌకిక సింహాసనాన్ని అంగీకరించడు.DATel 567.2

    క్రీస్తు నివసించిన దినాల్లోని ప్రభుత్వం అవినీతితోను దౌర్జన్యంతోను నిండి ఉంది. ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలే. బలవంతపు వసూళ్లు అసహనం, క్రూర ప్రవర్తన లేని స్థలం లేదు. అయినా రక్షకుడు సాంఘిక దిద్దుబాటుకు పూనుకోలేదు. జాతీయ దురాచారాల్ని వ్యతిరేకించలేదు. జాతీయ శత్రువుల్ని ఖండించలేదు. రాజకీయ అధి కారంలోగాని పరిపాలనలోగాని తలదూర్చడానికి ప్రయత్నించలేదు. మనకు ఆదర్శమైన ఆ ప్రభువు లౌకిక ప్రభుత్వాలకి దూరంగా ఉన్నాడు. మానవుల బాధలు వ్యధల్ని ఆయన పట్టించుకోలేదనికాదు. కారణమేంటంటే వాటి పరిష్కారం కేవలం మానవుల్లోను బాహ్య చర్యలోను లేదు. సమర్ధమైంది కావడానికి స్వస్తత మనుషుల్ని వ్యక్తిగతంగా చేరాలి. హృదయానికి నవజీవనమివ్వాలి.DATel 567.3

    కోర్టులు లేక సభలు లేక చట్టసభ్యుల తీర్మానాల వల్ల, లోకంలోని ప్రముఖుల మద్దతువల్ల క్రీస్తు రాజ్యస్థాపన జరగదు. అది పరిశుద్దాత్మ పని ద్వారా మానవుల్లో క్రీస్తు స్వభావం పాదుకొల్పడం ద్వారా జరుగుతుంది. “తనను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచువారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మను షేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు.” యోహా 1:12, 13. మానవాళిని ఉద్దరించ గల శక్తి ఇది ఒక్కటే. ఈ కార్యాన్ని సాధించే మానవ సాధనం దైవ వాక్యబోధ, ఆ వాక్యానుసారమైన జీవితం.DATel 568.1

    కొరింథు పెద్ద నగరం. అది భాగ్యవంతమైన నగరం, దుర్మార్గమైన నగరం కూడా. అన్యమత సంబంధమైన అనేక పాపాలతో కలుషితమైన నగరం అది. అపొస్తలుడు పౌలు ఆ నగరంలో తన సువార్త పరిచర్యను ప్రారంభించినప్పుడు ఇలా అన్నాడు, “నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని ఈ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.” 1కొరి. 2:2. అనంతరం ఘోర పాపాల్లో పడ్డ కొంతమందికి రాస్తూ అతడు ఇలా చెప్పగలిగాడు, “మిలో కొందరు అట్టివారై యుంటిరిగాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడిరి.” “క్రీస్తు యేసు నందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి, ఈ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను”. 1కొరి. 6:11, 1:4.DATel 568.2

    తెలుగు క్రీస్తు దినాల్లోలాగే ఇప్పుడూ దేవుని రాజ్యానికి సంబంధించిన పని గుర్తింపు కోసం, లౌకిక అధికారుల మద్దతుకోసం, మానవ చట్టాల కోసం గగ్గోలు పెట్టే వారితో జరిగేది కాదు. కాని స్వీకరించేవారిలో అపొస్తలుడు పౌలు అనుభవాన్ని రూపొందించే ఆధ్యాత్మిక సత్యాల్ని ప్రభువు నామంలో ప్రజలికి ప్రకటించే వారితోనే అది జరుగుతుంది, “నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.” గలతీ 2:20. అప్పుడు వారు పౌలువలె మనుషుల మేలుకోసం పనిచేస్తారు. పౌలు ఇలా అన్నాడు, “కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై - దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.” 2కొరి. 5:20.DATel 568.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents