Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    57—“నీకింక ఒకటి కొదువగానున్నది”

    “ఇదిగో ఒకడు ‘ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని అడిగెను.”DATel 577.1

    ఈ ప్రశ్న అడిగిన యువకుడు ఒక అధికారి. గొప్ప ఆస్తిపరుడు. బాధ్యత గల హోదాలో ఉన్నవాడు. తల్లులు తెచ్చిన చిన్న బిడ్డల పట్ల ఆయన చూపించిన ప్రేమను అతడు చూశాడు. రక్షకుని పట్ల అతడి గుండెల్లో ప్రేమ రగుల్మొన్నది. ఆయన శిష్యుడు కావాలన్న కోరిక కలిగింది. ఆ కోరిక ఎంత బలీయమయ్యిందంటే యేసు తన మార్గాన వెళ్తుండగా ఆయన వెనక పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆయన పాదాల వద్ద మోకరించి తన ఆత్మకు ఎంతో ప్రాముఖ్యమైన, ప్రతీ మానవాత్మకు ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్నను అడిగాడు: “బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చేయవలెను?” అని అడిగాడు.DATel 577.2

    “మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే” అని యేసు అన్నాడు. ఆ అధికారి చిత్త శుద్ధిని యేసు పరీక్షించగోరాడు. తాను ఎవరితో మాట్లాడున్నాడో ఆయన దేవుని కుమారుడని అతడు గుర్తించాడా? అతడి హృదయంలోని నిజమైన ఉద్దేశం ఏంటి?DATel 577.3

    ఈ అధికారికి తాను ఎంతో నీతిమంతుణ్ని అన్న అభిప్రాయం ఉంది. తనకు ఎలాంటి లోపం లేదని భావించాడు. అయినా అతడికి తృప్తిలేదు. తనలో లేనిదేదో ఒకటి ఉందని గుర్తించాడు. చిన్నపిల్లల్ని ఆశీర్వదించిన రీతిగా తన్నుకూడా యేసు ఆశీర్వదించి తన ఆత్మలోని కోరికను తీర్చలేడా?DATel 577.4

    నిత్యజీవం పొందడానికి దేవుని ఆజ్ఞల్ని ఆచరించడం అవసరమని అతడి ప్రశ్నకు యేసు సమాధానం చెప్పాడు. సాటి మనుషుల పట్ల మానవుడి విధిని సూచించే అనేక ఆజ్ఞల్ని యేసు అతడికి ఉటంకించాడు. అధికారి జవాబు నిశ్చయాత్మకంగా ఉంది. “ఇవన్నియు అనుసరించుచునేయున్నాను; ఇకను నాకు కొదువ ఏమి?”DATel 578.1

    అతడి జీవితాన్ని చదువుతున్నట్టు అతడి ప్రవర్తనను పరిశోధిస్తున్నట్టు క్రీస్తు ఆ యువకుడి ముఖంలోకి చూశాడు. యేసు అతణ్ని ప్రేమించాడు. అతడి ప్రవర్తనలో మార్పు తెచ్చే సమాధానాన్ని కృపను ఆనందాన్ని అతడికి ఇవ్వడానికి తహతహలాడాడు. “నీకింక ఒకటి కొదువగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగియున్నవన్నియు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము” అని యేసన్నాడు.DATel 578.2

    క్రీస్తు ఈ యువకుడికి ఆకర్షితుడయ్యాడు. “ఇవన్నియు అనుసరించుచునేయున్నాను” అనడంలో అతడు నిజాన్ని పలికినట్లు ఆయనకు తెలుసు. హృదయంలో దైవభక్తి, క్రైస్తవ సద్గుణం అవసరాన్ని గుర్తించడానికి సామర్థ్యాన్నిచ్చే వివేకాన్ని అతనిలో సృష్టించాలని రక్షకుడు ఆశించాడు. అతడిలో వినయం పశ్చాత్తాపం చూడాలని, మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించి తన లోటును క్రీస్తు సంపూర్ణతలో దాచుకునే హృదయాన్ని చూడాలని ఆయన ఎదురుచూశాడు.DATel 578.3

    రక్షణ పరిచర్యలో తనతో కలసి పని చెయ్యడానికి ఇష్టపడితే ఈ అధికారిలో తనకు అవసరమైన సహాయాన్ని యేసు చూశాడు. క్రీస్తు నడుపుదలకు తనను తాను సమర్పించుకుంటే అతడు మంచి చేసే మహశక్తిగా రూపొందేవాడు. ఆ అధికారి యేసుకి శక్తిమంతమైన రాయబారి అయ్యేవాడు. ఎందుకంటే అతడు గొప్ప అర్హతలు గలవాడు. అతడు రక్షకుడు ఏకమైతే ఆ అర్హతలను బట్టి అతడు మనుషుల మధ్య గొప్ప దైవశక్తిగా ఉండేవాడు. అతడి ప్రవర్తనను పరిశీలించి యేసు అతణ్ని ప్రేమించాడు. అధికారి మనసులో క్రీస్తు పట్ల ప్రేమ రగుల్కొంటున్నది. ఎందుకంటే ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది. తనతో జతపనివాడిగా అతణ్ని చూడాలని యేసు ఆశించాడు. తాను దేవుని రూపాన్ని ప్రతిబింబించే అద్దంలాగున్నట్లే అతణ్ని తనలా చెయ్యాలని ఆయన ఆశించాడు. తన ప్రవర్తనను అతడిలో దిద్దాలని దాన్ని ప్రభువు సేవకు వినియోగించుకోవాలని ఆయన అభిలషించాడు. అధికారి అప్పుడు తన్నుతాను క్రీస్తుకి సమర్పించుకొని ఉంటే అతడు ఆయన సన్నిధి వాతావరణంలో పెంపారేవాడు. ఈ ఎంపికను చేసుకుని ఉంటే అతడి భవిష్యత్తు ఎంత వ్యత్యాసంగా ఉండేది!DATel 578.4

    “నీకు ఒకటి కొదువగానున్నది” అన్నాడు యేసు. “నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల, పోయి, నీ ఆస్థిని అమ్మి, బీదలకిమ్ము; అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము.” క్రీస్తు అధికారి మనసును చదివాడు. అతడి లోటు ఒకటే. అయితే అది ముఖ్యమైన నియమం. అతడి ఆత్మలో దేవుని ప్రేమ ఆవసరం. ఈ లోటు భర్తీ కావాలి. లేకపోతే అది ప్రాణాంతకం. అతడి నైజమంతా కలుషితమౌతుంది. ఆచరణ వల్ల స్వార్ధం బలపడుతుంది. దేవుని ప్రేమను పొందేందుకు గాను స్వార్ధం పట్ల తనకున్న ప్రగాఢ ప్రేమను అతడు త్యజించాలి.DATel 579.1

    యేసు ఇతడికి ఒక పరీక్ష పెట్టాడు. పరలోక ధనం ఇహలోక ఔన్నత్యం ఈ రెంటిలో ఒకదాన్ని ఎంచుకోవలసిందిగా అతణ్ని కోరాడు. క్రీస్తుని వెంబడిస్తే పరలోక ఐశ్వర్యం లభిస్తుందన్న నిశ్చయత ఉంది. అయితే స్వారం పోవాలి. అతడి చిత్తం క్రీస్తు నియంత్రణ కిందకి రావాలి. ఆ యువ అధికారికి దేవుని పరిశుద్ధత అందుబాటులో ఉంది. దేవుని కుమారుడయి క్రీస్తుతో కలసి పరలోక ఐశ్వర్యానికి సహవారసుడయ్యే ఆధిక్యత అతడికి ఉంది. అయితే అతడు సిలువనెత్తుకుని ఆత్మత్యాగం మార్గాన రక్షకుని వెంబడించాలి.DATel 579.2

    క్రీస్తు ఆ అధికారితో అన్నమాటలు నిజానికి “మీరు ఎవరిని సేవించెదరో. . . కోరుకొనుడి” (యెహో 24:15) అన్న ఆహ్వానపు మాటలు. ఎంపిక చేసుకోవాల్సింది అతడు. అతడిలో మార్పుకోసం యేసు ఆశతో ఎదురుచూశాడు. అతడి ప్రవర్తనలోని లోపాన్ని వేలెత్తి చూపించాడు. ఆ యువకుడు ఆ సమస్యను పరిగణిస్తున్నప్పుడు ఆయన ఎంత తీవ్రమైన ఆసక్తితో కనిపెట్టాడు! క్రీస్తుని వెంబడించటానికి అతడు తీర్మానించుకుంటే అతడు ప్రతీ విషయంలోనూ ఆయనకు విధేయుడై ఉండాలి. అతడు తన పథకాలకు స్వస్తి చెప్పాలి. ఆ యువకుడు దేవుని ఆత్మ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందిస్తాడని ఆశిస్తూ రక్షకుడు అతడి వంక ఎంత ఆసక్తితో ఎంత ఆతృతతో చూశాడు!DATel 579.3

    క్రైస్తవ ప్రవర్తనను సంపూర్ణం చేసుకోగల స్థలంలో ఆ అధికారిని ఉంచే షరతుల్నే క్రీస్తు విధించాడు. ఆయన మాటలు కఠినంగా నిష్కరగా ఉన్నా వివేకంతో నిండిన మాటలు. వాటిని అంగీకరించి పాటించడంలోనే అధికారి రక్షణ నిరీక్షణ ఉంది. అతడి ఉన్నత స్థానం అతడి సంపద అతడి ప్రవర్తనపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాటిని విడిచి పెట్టకపోతే అతడి ప్రేమ దేవునిపై గాక తన సంపదపై నిలుస్తుంది. దేవుని నుంచి కొంచెంగాని ఎక్కువగాని అట్టి పెట్టుకోడం అతడి నైతిక శక్తిని సామార్థ్యాన్ని క్షీణింపజేసే దాన్ని అట్టి పెట్టికోడమే. కారణమేంటంటే, లౌకిక విషయాల్ని ప్రేమించడం జరిగితే - అవి ఎంత అనిశ్చితం ఎంత అనర్హం అయినా - అవే మనకు సర్వం అవుతాయి.DATel 580.1

    క్రీస్తు మాటల ఆంతర్యాన్ని అధికారి వెంటనే గ్రహించాడు. దుఃఖం ముంచుకొచ్చింది. ప్రభువు ఇవ్వనెంచిన వరం ఎంత విలువైనదో అతడు గుర్తించి ఉంటే వెంటనే క్రీస్తు అనుచరుడయ్యేవాడు. అతడు యూదుల ప్రతిష్టాత్మక సభకు సభ్యుడు. ఉజ్వల భవిష్యత్తుకు భరోసాతో సాతాను అతణ్ని శోధిస్తున్నాడు. పరలోక ఐశ్వర్యం కావాలని కోరాడు. కాని లౌకిక భాగ్యం ఒనగూర్చే ఐహిక ప్రయోజనాల్ని కూడా ఆశించాడు. అలాంటి షరతు ఉన్నందుకు విచారించాడు. నిత్యజీవాన్ని ఆశించాడు. కాని దానికి అగత్యమైన త్యాగానికి వెనకాడాడు. నిత్యజీవ మూల్యం చాలా ఎక్కువని భావించాడు. విచారిస్తూ వెళ్లిపోయాడు. “అతడు మిగుల ఆస్థిగలవాడు”.DATel 580.2

    ధర్మశాస్త్రాన్ని ఆచరించానని అతడన్నమాట మోసపూరితం. ధనమే తన విగ్రహమని అతడు నిరూపించుకున్నాడు. లోకాన్ని ప్రేమిస్తూనే అతడు దేవుని ఆజ్ఞల్ని ఆచరించలేడు. దేవునికన్నా దేవుని వరాల్ని అతడు ఎక్కువ ప్రేమించాడు. యేసు ఆయువకుడికి తన సహవాస హస్తాన్ని చాపాడు. “నన్ను వెంబడించుము” అన్నాడు. రక్షకుడు తనకు ఏమంత విలువగలవాడు కాడు. మనుషుల మధ్య తన పలుకుబడి తన సంపద అతడికి ఎక్కువ విలువైనవి. కనిపించని పరలోక భాగ్యం కోసం కనిపించే తన ఐహిక సంపదను విడిచి పెట్టడం ప్రమాదకరం అనుకున్నాడు. ఇస్తానన్న నిత్యజీవాన్ని విసర్జించి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతడు లోకాన్ని ఆరాధించనున్నాడు. లోకాన్ని విసర్జించి క్రీస్తుని ఎంపిక చేసుకోడంలో వేలాది ప్రజలు ఇదే సంకట పరిస్థితిని ఎదుర్కుంటోన్నారు. అనేకులు లోకాన్ని ఎన్నుకుంటోన్నారు. ఈ యువ అధికారిమల్లే రక్షకుడి నుంచి వెనుదిరిగి ఈ వ్యక్తిని నేను నా నాయకుడిగా ఎంపిక చేసుకోను అంటూ వెళ్లిపోతోన్నారు.DATel 580.3

    ఈ యువకుడితో క్రీస్తు వ్యవహరణ ఒక దృష్టాంత పాఠంగా వస్తోంది. దేవుడు మనకొక ప్రవర్తన నియమావళినిచ్చాడు. ఆయన సేవకులందరూ ఆ నియమావళిని ఆచరించాలి. ఆయన ధర్మశాస్త్రానికి విధేయులై నివసించాలి. అది కేవలం చట్టపరమైన విధేయతకాదు, కాని జీవితంలో ప్రవేశించి ప్రవర్తనలో క్రియాత్మకమయ్యే విధేయత. తన రాజ్యపౌరులు అవ్వగోరే వారందరికీ ప్రామాణిక ప్రవర్తన నియమావళిని దేవుడు నియమించాడు. క్రీస్తుతో కలిసి పనిచేసేవారు, ప్రభువా, నేనూ నాకున్నదంతా నీసొత్తు అనేవారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలుగా పరిగణన పొందుతారు. పరలోకాన్ని ఆశించి ఆమోదట దానిలో ప్రవేశానికి ఉన్నషరతుల కారణంగా వెనుకంజ వేయడమంటే ఏంటో అందరూ ఆలోచించాల్సిన విషయం. క్రీస్తు ఆహ్వానాన్ని కాదనడాన్ని గురించి ఆలోచించండి. అది కుదరదు, నేను నాకున్నదంతా నీకివ్వలేను అన్నాడా అధికారి. మనమూ అలాగే అంటున్నామా? దేవుడు మనకు నియమించిన పనిలో మనకు సహకరించడానికి యేసు ముందుకు వస్తోన్నాడు. లోకంలో తన సేవను కొనసాగించేందుకు దేవుడిచ్చిన సాధనాల్ని ఆయన వినియోగిస్తానంటోన్నాడు. ఈ రీతిగా మాత్రమే ఆయన మనల్ని రక్షించగలుగుతాడు.DATel 581.1

    ఆ అధికారి దేవునికి విశ్వసనీయమైన ధర్మకర్తగా వ్యవహరించేందుకే దేవుడు అతడికి సిరిసంపదలిచ్చాడు. ఎవరు అవసరాల్లో ఉంటారో వారి అవసరాలు తీర్చి మేలు చెయ్యడానికి అతడు తన సంపదను వినియోగించాల్సి ఉన్నాడు. అలాగే దేవుడు మనుషులికి ధనం, వరాలు, అవకాశాలు ఇప్పుడు ఇస్తున్నాడు. బీదవారికి, బాధల్లో ఉన్నవారికి చేయూతనివ్వడంలో ఆయనకు ప్రతినిధులుగా ఉండడానికి వాటిని ఇచ్చాడు. దేవుడు ఉద్దేశించిన రీతిగా ఏవ్యక్తి తన వరాల్ని వినియోగిస్తాడో అతడు రక్షకుని తోటి పనివాడు. అతడు క్రీస్తుకి ఆత్మల్ని సంపాదిస్తాడు. ఎందుచేతనంటే అతడు రక్షకుని వంటి ప్రవర్తన కలవాడు.DATel 581.2

    ఈ యువ అధికారికిలాగ గొప్ప హోదా గలవారికీ, గొప్ప సంపద గలవారికీ క్రీస్తుని వెంబచడించేందుకు సమస్తాన్నీ వదులుకోవడం గొప్ప త్యాగంగా కనిపించవచ్చు. అయితే ఆయన శిష్యులు కావాలని కోరుకునే వారందరూ పాటించాల్సిన ప్రవర్తన నియమం ఇది. విధేయత తప్ప మరేదీ ఆయనకు అంగీకృతం కాదు. ఆత్మ సమర్పణ క్రీస్తు బోధనల సారాంశం. తరచు అది సాధికార భాషలో వచ్చి అధికారికంగా అమలును కోరుతుంది. ఎందుకంటే మానవుణ్ని రక్షించడానికి వేరే మార్గం లేదు. ఏవి సర్వశరీరాన్ని నైతికంగా పతనం చేస్తాయో వాటిని తొలగించి వేయడమే ఆమార్గం.DATel 582.1

    క్రీస్తు అనుచరులు ప్రభువుకు చెందినదాన్ని తిరిగి ఆయనకు ఇచ్చినప్పుడు, “భళా, నమ్మకమైన మంచిదాసుడా... నీ యజమానుని సంతోషములో పాలు పొందుము” అన్న మాటలు వారు విన్నప్పుడు అది వారికి ఇవ్వబడుతుంది. “ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టె సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్యమున ఆసీనుడైయున్నాడు. ” మత్త. 25:23, హెబ్రీ 12:2. ఆత్మలు విమోచన పొందడం, ఆత్మలు నిత్యరక్షణ పొందడం చూడడంలోని ఆనందమే “నన్ను వెంబడించుడి” అన్న ప్రభువు అడుగుజాడల్లో తమ పాదాలు మోపి నడిచేవారందరూ పొందే ప్రతిఫలం.DATel 582.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents