Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    14—“మేము మెస్సీయాను కనుగొంటిమి”

    బాప్తిస్మమిచ్చే యెహాను యోర్దానుకి ఆవల ఉన్న బేతనియలో బోధిస్తూ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దాటేవరకూ నదీ ప్రవాహాన్ని ప్రభువు ఆపుజేసిన స్థలం దీనికెంతో దూరంలో లేదు. పరలోక సైన్యాలు కూల్చివేసిన యెరికో పట్టణం ఇక్కడకు కొంచెం దూరంలో ఉంది. ఈ ఘటనల జ్ఞాపకాలు యెహాను మనసులో మెదిలి వర్తమానాన్ని ఆసక్తిదాయకం చేశాయి. గత యుగాలల్లో అద్భుతకార్యాలు చేసిన ప్రభువు ఇశ్రాయేలు విమోచనకు మళ్ళీ అద్భుత శక్తిని ప్రదర్శించడా? దినదినం ప్రతీదినం యోర్దాను తీరంపై గుమిగూడుతోన్న ప్రజలు మనసుల్లో ఇలాంటి ఆలోచనలు పుట్టుతోన్నాయి.DATel 122.1

    యోహానుబోధన ఆప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేయ్యడంతో మతాధినేతలు దానిపై దృష్టిపెట్టాల్సివచ్చింది. తిరుగుబాటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రోమా అధికారులు ప్రజా సమావేశాల్ని ఓ కంట కనిపెడ్తూ ఉండేవారు. ప్రజలు తిరుగుబాటును సూచించేదల్లా యూదు పరిపాలకుల భయాందోళల్ని పెంచి పోషించేవి. యోహాను స హెడ్రిన్ సభ అధికారాన్ని గుర్తించలేదు. తన పనికి ఆ సభ అనుమతి కోరనూలేదు. పరిపాలకుల్ని ప్రజల్ని పరిసయుల్ని సదూకయ్యుల్ని అందర్ని అతడు మందలిస్తోన్నాడు. అయినా ప్రజలు అతన్ని ఆత్రంగా వెంబడించారు. ఆతడి సేవపై ప్రజాసక్తి నిత్యం అధికమౌతోంది. యోహాను సన్ హెడ్రిన్ ని గుర్తించకపోయినప్పటికీ సన్ హెడ్రిన్ అతణ్ని ప్రజా ప్రబోధకుడుగా గుర్తించి అతడు తమ అధికార పరిధిలోకి వస్తాడని ప్రకటించింది.DATel 122.2

    ఆ దేశం యాజకుల్లో నుంచి ప్రధాన పరిపాలకుల్లోనుంచి బోధకుల్లో నుంచి ఎంపికైన వ్యక్తులు ఆసభకు సభ్యులు. సాధారణంగా ప్రధాన యాజకుడు ఆ సభకు అధ్యక్షుడుగా నియమితుడయ్యేవాడు. ఆసభ సభ్యులందరూ వృద్ధులు కాకపోయినా వయసు పెరిగిన వారై ఉండేవారు. వారు యూదుమతంలోను చరిత్రలోనే కాక లోక జ్ఞానంలో నిష్ణాతులైన వ్యక్తులు. వారు శారీరిక లోపాలు లేనివారు, వివాహితులు తండ్రులు అయిఉండి ఇతరులకన్నా ఎక్కువ దయ పరిగణన గలవారై ఉండాలి. వారి సమావేశ స్థలం యెరూషలేము దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఒక గది. యూదు ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన దినాల్లో సన్ హెడ్రిన్ ఆదేశ సర్వోన్నత న్యాయస్థానం. ఆసభకు లౌకికాధికారం మతాధికారం రెండూ ఉండేవి. ఇప్పుడు రోమాగవర్నర్ల అధికారానికి లోబడాల్సి ఉన్నప్పటికీ పౌరసంబంధమైన విషయాల్లోను మతపరమైన విషయాల్లోను సన్ హెడ్రిన్ కి ఇంకా ప్రముఖ పాత్ర ఉంది. యోహాను పనిని గూర్చిన దర్యాప్తును సన్ హెడ్రిన్ వాయిదా వేయలేదు. దేవాలయంలో జెకర్యాకు వచ్చిన ప్రత్యక్షతను తన కుమారుడు మెస్సీయా దూతగా ఉంటాడన్న అతని ప్రవచనాన్ని గుర్తుంచుకున్నవారు కొందరున్నారు. ముప్పయి ఏళ్ళ గలాభాలు మార్పుల నడుమ ఈ విషయాలు చాలామట్టుకు మరుగున పడిపోయాయి. యోహాను పరిచర్యతో అవి మళ్లీ జ్ఞప్తికి రావడంతో గొప్ప ఉద్రేకోత్సాహాలు చోటుచేసుకున్నాయి.DATel 123.1

    ఇశ్రాయేలులో ప్రవక్త ఉండి చాలా కాలమయ్యింది. ఇప్పుడు జరుగుతోన్న దిద్దుబాటులాంటి దిద్దుబాటు జరిగి చాలా కాలమయ్యింది. పాపాన్ని ఒప్పుకోవాల్సిందిగా వస్తోన్న పిలుపు కొత్తగా కనిపిస్తోంది. భయం పుట్టిస్తోంది. నాయకుల్లో అనేకులు యోహాను విజ్ఞప్తుల్ని ఖండనల్ని వినడానికి వెళ్లడం లేదు. తమ రహస్య పాపాలు ఒప్పుకోవలసి వస్తుందనే వారి భయం. కాగా అతని బోధ మెస్సీయాను గూర్చిన ప్రత్యక్ష ప్రకటన. మెస్సీయారాకకు సంబంధించి దానియేలు ప్రవచించిన డెబ్బయి వారాలు దాదాపు పూర్తి అయినట్లు అందరికీ తెలిసిన విషయమే. తాము ఎదురుచూస్తోన్న జాతీయ మహిమాయుగంలో పాలుపంచుకోడానికి అందరూ ఉవ్విళ్లూరున్నారు. ప్రజల ఉత్సాహం అలా ఉంది. స హెడ్రిన్ సభ దాన్ని ఆమోదించడమో లేదా యోహాను పనిని తిరస్కరించడమో చేయాల్సి ఉంది. ప్రజల పై వారి పట్టు అప్పటికే బలహీనమౌతోంది. తమ ఉనికిని ఎలా కాపాడుకోవాలా అని వారు మల్లగుల్లాలు పడ్తోన్నారు. ఏదో తీర్మానానికి రావాలన్న ఉద్దేశంతో యాజకులు లేవియులతో కూడిన బృందం ఒక దాన్ని ఆ కొత్త బోధకుడితో సంప్రదించడానికి ఆఘమేఘాలమీద యోర్దానుకి పంపారు.DATel 123.2

    ఆ ప్రతినిధులు వచ్చేసరికి యోహాను మాటలు వినడానికి పెద్ద సంఖ్యలో జనులు సమావేశమయ్యారు. అధికార దర్పం ప్రదర్శించుకుంటూ ప్రవక్త మన్ననలు అందుకోజూస్తూ ఆ రబ్బీలు ప్రవక్త వద్దకు వచ్చారు. గౌరవంతో దాదాపు భయంతో తప్పుకుంటూ ప్రజలు వారికి దారిచ్చారు. విలువైన దుస్తులు ధరించి, హోదా అధికారం కలబోసుకున్న అహంకారంతో ఆ ఘనులు ఆ అరణ్యవ్రవక్త ముందు నిలబడ్డారు.DATel 124.1

    “నీ వెవడవు?” అడిగారు వారు.DATel 124.2

    వారి మనస్సుల్లో ఏముందో గ్రహించి యోహాను “క్రీస్తును కాను” అన్నాడు.DATel 124.3

    “మరి నీవెవరు?DATel 124.4

    నీవు ఏలీయావా?”DATel 124.5

    “కాను” అన్నాడు.DATel 124.6

    “నీవు ఆ ప్రవక్తవా?”DATel 124.7

    “కాను”DATel 124.8

    “నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు?”DATel 124.9

    “ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము.”DATel 124.10

    యోహాను ప్రస్తావించిన లేఖనం యెషయా ప్రవచించిన ఆ చక్కని వచనం “నా దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా - నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యేను. ఆమె దోషరుణము తీర్చబడెను..... అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా - అరణ్యములో యోహోవా వాక్కు మార్గము సిద్ధపరచబడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తుచేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమయముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలు పరచబడును. ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు.” యెషయా 40:1-5.DATel 124.11

    తన రాజ్యంలో ప్రజలు ఎక్కువ ప్రయాణం చేయని ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు పూర్వం రాజు రధానికి ముందుగా కొంతమంది మనుషుల్ని పంపించి రాజు మార్గంలోని ఎత్తుపల్లాల్ని సరిచేయించి రాజు ప్రయాణం క్షేమంగా ఆటంకాలు లేకుండా సాగేటట్లు చూసేవారు. సువార్త పరిచర్యను ఉదాహరించేందుకు ప్రవక్త ఈ ఆచారాన్ని ఉటంకించాడు. “ప్రతి లోయను ఎత్తుచేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను” ప్రాణంపోసే అద్భుత శక్తిగల దైవాత్మ ఆత్మను స్పృశించినప్పుడు అది మానవుడి అహంభావాన్ని కుంగదీస్తుంది. లోకభోగాలు, అధికారం అంతస్తు నిరర్థకమనిపిస్తాయి. “వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అగించు ప్రతి ఆటంకమును” (2కోరి 10:5) పడదోసి ప్రతీ ఆలోచనను “క్రీస్తుకు లోబడునట్లు” చెరపట్టడం జరుగుతుంది. అప్పుడు మనుషులు అంతగా విలువ ఇవ్వని సాత్వికం త్యాగపూరిత ప్రేమ మాత్రమే విలువగల గుణాలుగా పరిగణన పొందుతాయి. ఇది సువార్త చేసేపని. యోహాను బోధన ఈ పనిలో ఒక భాగం.DATel 125.1

    రబ్బీలు ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నారు “నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త కాని యెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావు.?” “ఆ ప్రవక్త ” అన్నమాటలు మోషేను సూచిస్తోన్నాయి. మోషేని మృతుల్లోనుంచి లేపిన దేవుడు పరలోకానికి తీసుకువెళ్లాడన్న సంగతి వారికి తెలియదు. స్నానికుడు తన పరిచర్యను ప్రారంభించినప్పట్లో అతడే మరణంనుంచి లేపబడ్డ మోషే అని అనేకులు నమ్మారు. ఎందుకంటే ప్రవచనాలపై ఇశ్రాయేలు చరిత్రపై అతనికి అపారజ్ఞానం ఉంది.DATel 125.2

    ఇంకా మెస్సీయా రాకకు ముందు ఏలీయా వ్యక్తిగతంగా ప్రత్యక్షమవుతాడన్న నమ్మకంకూడా ప్రజల్లో ఉంది. తాను కాదనడంలో యోహను ఆ నమ్మకాన్ని వమ్ముచేశాడు. అయితే అతని మాటల్లో లోతైనభావం ఉంది. “ఈ సంగతి నంగీకరించుటకు నాకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే” మత్త 11:14; ఏలీయా చేసినలాంటి పరిచర్య చెయ్యడానికి ఏలీయా స్వభావంతోను శక్తితోను యోహాను వచ్చాడు. యూదులు అతణ్ని అంగీకరించి ఉంటే యోహాను వారిపక్షంగా ఆకార్యాన్ని సాధించేవాడు. అయితే వారు అతని వర్తమానాన్ని తిరస్కరించారు. వారికి అతడు ఏలీయా కాలేదు. ఏ కార్యాన్ని నెరవేర్చడానికి అతడు వచ్చాడో దాన్ని నెరవేర్చలేకపోయాడు.DATel 125.3

    యోర్దాను వద్ద సమావేశమైన వారిలో అనేకులు యేసు బాప్తిస్మమప్పుడు అక్కడున్నారు. కాని అప్పుడు ప్రదర్శితమైన గుర్తు వారిలో కొందరు మాత్రమే వీక్షించగలిగారు. దానికి ముందు స్నానికుడు పరిచర్య మాసాల్లో పశ్చాత్తాపపడాల్సిందంటూ అతడిచ్చిన పిలుపును చాలా మంది తిరస్కరించారు. వారు తమ హృదయాల్ని కఠినపర్చుకుని తమ అవగాహనను మసకబార్చుకున్నారు. యేసు బాప్తిస్మ సమయంలో పరలోకం ఇచ్చిన సాక్ష్యాన్ని వారు గుర్తించలేకపోయారు. కనిపించని ఆ ప్రభువును విశ్వాస నేత్రాలతో వీక్షించనివారు ప్రదర్శితమైన దేవుని మహిమను చూడలేకపోయారు. నేడూ అదే జరుగుతోంది. క్రీస్తు సముఖం, పరిచర్యచేసే దేవదూతలు సముఖం మనుషుల సమావేశాల్లో తరచు చోటుచేసుకుంటుంది. వారి హృదయాల్ని నింపి ఉత్తేజపర్చుతాయి. వారి ఓదార్సు ఉత్సాహం పొంది ధన్యులవుతారు.DATel 126.1

    యెరూషలేము నుంచి వచ్చిన ప్రతినిధులు “ఎందుకు బాప్తిస్మ మిచ్చుచున్నావు? అని యెహానును ప్రశ్నించి అతని జవాబుకు ఎదురు చూస్తోన్నారు. ఆ జనసమూహంపై అతని దృష్టి ప్రసరించినప్పుడు అతని ముఖం కాంతితో నిండింది. అతని శరీరం ఉద్వేగభరితమయ్యింది. చేతులు చాపి ఇలా అన్నాడు, “నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నావెనుక వచ్చువాడు మా మధ్య ఉన్నాడు.” నారాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను.” యెహాను 1:27;DATel 126.2

    సన్ హెడ్రిన్ సభకు వారు తీసుకువెళ్లాల్సిన సందేశం స్పష్టంగా నిర్ద్వంద్వంగా ఉంది. యోహాను పలికినమాటలు వాగ్రత్త మెస్సీయాకే వర్తించేమాటలు. మెస్సీయా వారి మధ్యనే ఉన్నాడు! ఆశ్చర్యపడుతూ యాజకులు ప్రధానులు యోహాను ఎవరిని గురించి మాట్లాడాడో ఆ మెస్సీయాకోసం తమ చుట్టూ చూశారు. కాని ఆ జనసమూహంలో ఆయన గుర్తు తెలియలేదు. యేసు బాప్తిస్మం సమయంలో యోహను ఆయన్ని దేవునిDATel 126.3

    గొర్రెపిల్లగా వర్ణించినప్పుడు మెస్సీయా పరిచర్య పై కొత్త వెలుగు ప్రసరించింది. యోహను మనసు యెషయా ప్రవక్త చెప్పిన ఈ మాటలుపై కేంద్రీకృతమయ్యింది. “వధకు తేబడు గొట్టె పిల్ల” వలె ఆయన ఉన్నాడు. యెషయా 53:7 ఆ తర్వాతి వారాల్లో యోహాను బల్యర్పణ సేవకు సంబంధించిన ప్రవచనాల్ని బోధనల్ని నూతనాసక్తితో అధ్యయనం చేశాడు. క్రీస్తు పరిచర్యలోని రెండు దశల్ని - బాధననుభవించే బలిగా, జయించే రాజుగా - అతడు స్పష్టంగా గుర్తించలేదు. కాని ఆయన రాక యాజకులూ ప్రజలు గ్రహించిన దానికన్నా ప్రగాఢ ప్రాధాన్యం గలదని అవగాహన చేసుకున్నాడు. యేసు అరణ్యంనుంచి తిరిగివచ్చాక, ఆయన్ని జనసమూహాంలో చూసినప్పుడు, తాను వాస్తవంగా ఎవరో అన్న విషయమై ప్రజలకు ఏదో సూచన చూపిస్తాడని యోహాను ఎదురుచూశాడు. రక్షకుడు తన కర్తవ్యాన్ని ప్రకటిస్తాడని ఆత్రంగా ఎదురు చూశాడు. ఆయన ఒక్కమాట మాట్లాడలేదు. ఎలాంటి సూచన కూడా ఇవ్వలేదు. తన్ను గూర్చి స్నానికుడు చేసిన ప్రకటనకు యేసు స్పందించలేదు. యోహాను శిష్యులతో కలిసి ఉన్నాడు. తాను నిర్వహించాల్సిన ప్రత్యేక పరిచర్య విషయంలో ఎలాంటి బాహ్యమైన నిదర్శన ఇవ్వలేదు. ప్రజల గుర్తింపు పొందడానికి ఎలాంటి చర్య తీసుకోలేదు.DATel 127.1

    మరుసటి రోజు యోహాను యేసును చూశాడు. దేవుని మహిమ తనపై ప్రకాశిస్తోండగా ప్రవక్త చేతులు చాపి ఇలా అన్నాడు, “ఇదిగో లోకపాపమును మోసికొనుపోవు దేవుని గొట్టెపిల్ల నావెనుక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటివాడాయెనని నేనెవని గూర్చి చెప్పితినో ఆయన యీయనే. నేను ఆయనను ఎరుగనైతినిగాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితిని.... ఆత్మ పావురమువలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆయనను ఎరుగనైతినిగాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు - నీ వెవనిమిద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్దాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిని.” యోహను 1:29-34;DATel 127.2

    ఈయనే క్రీస్తా? దైవకుమారుడుగా ప్రకటితమైన ఆయన వంక భీతితోను ఆశ్చర్యంతోను చూశారు. యోహాను పలికిన మాటలు వారి హృదయాల్ని కదిలించాయి. దేవుని నామంలో అతడు వారితో మాట్లాడాడు. దినదినం అతడు తమ పాపాల నిమిత్తం మందలించడం విన్నారు. అతణ్ని దేవుడు పంపాడన్న నమ్మకం రోజు రోజుకి బలపడింది. ఇంతకీ యోహానుకన్నా అధికుడైన ఇతడు ఎవరు? ఆయన వస్త్రాలు, స్వరూప స్వభావాలు ఉన్నత స్థాయిని సూచించడం లేదు. పైకి సామాన్యుడిలా ఉన్నాడు. తమలాగే సామాన్యుల, సాదాసీదా జనుల దుస్తులు ధరించాడు. క్రీస్తు బాప్తిస్మమప్పుడు దేవుని మహిమను చూసి ఆయన స్వరాన్ని విన్నవారు కొందరు ఆ జన సమూహాంలో ఉన్నారు. అయితే అప్పటి నుంచి రక్షకుని రూపంలో చాలా మార్పు వచ్చింది. బాప్తిస్మమప్పుడు ఆయన ముఖం పరలోక మహిమతో ప్రకాశించింది. ఇప్పుడు ఆయన బలహీనంగా అలసిపోయి చిక్కిపోయి ఉన్నాడు. ఆయన్ని ప్రవక్త అయిన యోహాను మాత్రమే గుర్తించగలిగాడు.DATel 128.1

    అయితే ప్రజలు ఆయన వంక చూసినప్పుడు దయ అధికారం మిళితమైన ముఖం వారికి కనిపించింది. ఆయన చూపులో ముఖ కవళికల్లో ప్రేమతోనిండిన నమ్రత ఉట్టిపడుతోంది. ఆయనను ఆధ్యాత్మిక ప్రభావంగల వాతావరణం ఆవరించినట్లు కనిపించింది. ఆ శక్తిని పూర్తిగా మరుగుపర్చడం సాధ్యం కాలేదు. ఇశ్రాయేలీయులు ఎంతో కాలంగా కనిపెట్టొన్నవాడు. ఈయనేనా?DATel 128.2

    మనకు ఆదర్శంగాను విమోచకుడుగాను ఉండేందుకు యేసు దరిద్రుడుగా దీనుడుగా అవతరించాడు. రాజభోగంతో వచ్చి ఉంటే నమ్రతను ఎలా నేర్పించేవాడు? కొండమీద ప్రసంగంలో బోధించిన నొప్పి కలిగించే సత్యాల్ని ఎలా ప్రబోధించేవాడు? యేసు మన మధ్య రాజుగా నివసించడానికి వచ్చిఉంటే సామాన్య, బడుగువర్గాలు ప్రజలకు నిరీక్షణ ఎక్కడుండేది?DATel 128.3

    పోతే జనసమూహం పరంగా యోహాను ప్రస్తావిస్తోన్న వ్యక్తి తమ ఉన్నతాశయాలికి సరిపోవడం అసాధ్యమనిపించింది. అందుచేత అనేకులు నిరాశచెందారు. ఏమి తోచని స్థితిలో పడ్డారు.DATel 128.4

    యాజకులు రబ్బీలు వినాలని ఎంతో ఆశిస్తోన్న మాటలు అనగా యేసు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరిద్ధరిస్తాడన్న మాటలు ఆయననోటి వెంట రాలేదు. అలాంటి రాజు కోసం వారు ఎదురుచూస్తోన్నారు. అలాంటి రాజును స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని తమ హృదయంలో నీతి సమాధానాల రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభువును వారు అంగీకంరిచలేదు.DATel 129.1

    మరుసటి రోజు దగ్గరలో ఇద్దరు శిష్యులు నిలబడి ఉన్న తరుణంలో జనులమధ్య యేసు ఉన్నట్టు యోహాను మళ్లీ చూశాడు. ప్రవక్త ముఖం మళ్లీ కనిపించని దేవుని మహిమతో ప్రకాశిస్తుండగా అతడు “ఇదిగో దేవుని గొట్టెపిల్ల” అన్నాడు. ఈ మాటలు శిష్యుల హృదయాల్ని ఆనందిపజేశాయి. వాటిని వారు పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. ” దేవుని గొట్టె పిల్లగా యోహాను పలికిన పేరు అర్ధం ఏంటి? యోహాను దాన్ని విశదం చెయ్యలేదు.DATel 129.2

    వారు యోహానుని విడిచి పెట్టి ‘ యేసును వెంబడించడానికి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరిలో ఒకడు సీమోను సోదరుడైన అంబ్రెయ. రెండోవాడు సువార్తికుడైన యోహాను. వీరు క్రీస్తు ప్రథమశిష్యులు. వారిలో ప్రతిఘటించలేని ప్రేరణ కలిగింది. వారు యేసుని వెంబడించారు. ఆయనతో మాట్లాడడానికి తహతహలాడారు. అయినా భయం పుట్టింది. నిశ్శబ్దం రాజ్యమేలింది. వారు “ఈయన మెస్సీయా” అన్న ఆలోచనలో మునిగిపాయారు.DATel 129.3

    శిష్యులు తన్ను వెంబడిస్తోన్నారని యేసుకు తెలుసు. వారు ఆయన సేవ ఫలించిన ప్రథమఫలాలు. వీరు దైవ కృపకు స్పందిచడం చూసి ఆ పరమ బోధకుని హృదయం ఆనందంతో నిండింది. వెనక్కు తిరిగి “మీరేమి వెదకుచున్నారు?” అని ప్రశ్నించాడు. వెనక్కు వెళ్ళిపోవడానికి లేదా తమ అభీష్టమేంటో వ్యక్తంచెయ్యడానికి వారికి స్వేచ్ఛ ఇచ్చాడు.DATel 129.4

    వారి ఆశయం ఒక్కటే. ఒకరి సముఖమే వారి మనసుల్ని ఆలోచనల్ని నింపింది. “రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావు?” అని అడిగారు. దారిపక్క కాసేపు జరిపే సమావేశంలో తాము ఏది ఆశిస్తోన్నరో దాన్ని పొందడం సాధ్యం కాదు. అందుకే వారు యేసుతో ఏకాంతంగా ఉండాలని ఆయన పాదాలవద్ద కూర్చుని ఆయన చెప్పే మాటలు వినాలని ఆకాంక్షించారు.DATel 129.5

    ” వచ్చి చూడుడని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆదినము ఆయనయొద్ద బసచేసిరి.”DATel 130.1

    యోహాను అంద్రియలు యాజకులు, ప్రధానుల మాదిరిగా విశ్వసించని స్వభావం కలవారైతే వారు యేసు పాదాలవద్ద కూర్చుని నేర్చుకునే వారుకారు. ఆయన వద్దకు విమర్శకులుగా తీర్పరులుగా వచ్చేవారు. అలాగే అనేకులు తమకు వచ్చే అవకాశాలకు అడ్డుకట్టు వేస్తుంటారు. ఈ ప్రథమ శిష్యులు ఆ పని చెయ్యలేదు. స్నానికుడు యోహాను బోధనలోని పరిశుద్ధాత్మ పిలుపుకు వారు సానుకులంగా స్పందించారు. ఇప్పుడు ఆ పరమగురువు స్వరాన్ని గుర్తించారు. యేసుమాటలు వారికి తాజాతనాన్ని, సత్యాన్ని, అందాన్ని సమకూర్చాయి. పాతనిబంధన లేఖనాల పై దైవకాంతి ప్రకాశించింది. నూతనతేజం సంతరించుకుని సత్యం వివిధ కోణాల్లో ప్రదర్శితమయ్యింది.DATel 130.2

    పాపపశ్చాత్తాపం విశ్వాసం ప్రేమ మూలంగానే పారలౌకిక జ్ఞానం ఆత్మకు అబ్బుతుంది. ప్రేమ సూత్రం ప్రకారం పనిచేసే విశ్వాసం జ్ఞానానికి మూలం. ప్రేమించే ప్రతీవాడు “దేవుని ఎరుగును.”DATel 130.3

    శిష్యుడైన యోహాను ప్రగాఢ ప్రేమానురాగాలు ఆప్యాయతగల వ్యక్తి. పట్టుదల దీర్ఘాలోచన గల వ్యక్తి. క్రీస్తు మహిమను గుర్తించడం మొదలుపెట్టాడు. అయితే అది తానునేర్చుకున్నరీతిగా లోక ప్రాభావానికి ప్రాబల్యానికి సంబంధించిన మహిమకాదు. అది “తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ” యోహాను 1:14; అద్భుతమైన ఈ అంశంపై ధ్యానంలో ప్రవక్త మునిగిపోయాడు.DATel 130.4

    తన హృదయాన్ని నింపిన ఆనందాన్ని గూర్చి చెప్పడానికి అంద్రియ ప్రయత్నించాడు. సహోదరుడు సీమోన్ని వెదకి అతనితో ఇలా అన్నాడు. “మేము మెస్సీయాను కనుగొంటిమి” సీమోను రెండో పిలుపు వచ్చేవరకూ ఆగలేదు. బాప్తిస్మమిచ్చే యోహాను బోధనుకూడా అతడు విన్నాడు. రక్షకుని వద్దకు ఆఘమేఘాలమీద వెళ్ళాడు. క్రీస్తు దృష్టి అతనిమీద నిలిచింది. ప్రవర్తన అతడి చరిత్ర ఆయనకు అవగతమయ్యాయి. అతని దుందుడుకు స్వభావం మమతానురాగాలు దయాకనికరాలతో నిండిన అతడి హృదయం అతని ఆశలు ఆత్మవిశ్వాసం అతడి పరాజయ చరిత్ర అతడి పశ్చాత్తాపం అతడి సువార్త కృషి అతడి హతసాక్షి మరణం - అంతా రక్షకుడు ఆకళించుకుని ఇలా అన్నాడు. “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్ధము”DATel 130.5

    “మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి పిలిప్పును కనుగొని - నన్ను వెంబడించమని అతనితో చెప్పెను.” ఫిలిప్పు ఆ ఆజ్ఞను శిరసావహించాడు. వెంటనే అతడుకూడా క్రీస్తు కార్యకర్తల్లో ఒకడయ్యాడు.DATel 131.1

    ఫిలిప్పు నతనయేలును పిలిచాడు. స్నానికుడు యేసును దేవుని గొర్రెపిల్లగా వ్వవహరించినప్పుడు జనసమూహాంలో ఫిలిప్పుకూడా ఉన్నాడు. నతనయేలు యేసును చూసి నిరాశ చెందాడు. కాయకష్టపు గుర్తులు పేదరికం ముద్రలు ఉన్న ఈ మనుష్యుడు మెస్సీయా అయి ఉంటాడా? అలాగని నతనయేలు యేసును నిరాకరించడానికి తీర్మానించుకోనూలేడు. ఎందుకంటే యోహాను బోధించిన వర్తమానం తన హృదయంలో నమ్మకం పుట్టించింది.DATel 131.2

    తన్ను పిలిప్పు పిలిచే సమయానికి నతనయేలు యోహాను చేసిన ప్రకటన పైన మెస్సీయాను గూర్చిన ప్రవచనాల పైన ధ్యానించడానికి ప్రశాంతమైన తోటలోకి వెళ్లాడు. యోహాను ప్రకటించిన వ్యక్తే విమోచకుడైతే అది తనకు తెలియపర్చాల్సిందిగా ప్రార్ధించాడు. అంతట పరిశుద్దాత్మ అతని మీదికి వచ్చి దేవుడు తన ప్రజల్ని దర్శించాడని తమకోసం రక్షణ శృంగాన్ని లేపాడని చెప్పాడు. తనమిత్రుడు ప్రవచనాల్ని పరిశీలిస్తున్నాడని ఫిలిప్పుకు తెలుసు. నతనయేలు అంజూరపు చెట్టుకింద ప్రార్ధన చేస్తుండగా ఫిలిప్పు అతని విజ్ఞాపనస్థలాన్ని కనుగొన్నాడు. గుబురుగా ఉన్న చెట్ల నడుమ మదుగుగా ఉన్న ఈ స్థలంలో వారు తరచుగా కలిసి ప్రార్ధించేవారు.DATel 131.3

    “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటి మి” అన్న వర్తమానం నతనయేలు చేసిన ప్రార్ధనకు ప్రత్యక్ష సమాధానంలా ఉంది. అయినా ఫిలిప్పు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది! “యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు” అన్నాడు తన సందేహాన్ని వెలిబుచ్చుతూ. నతనయేలు హృదయంలో దురభిమానం మళ్లీ తలెత్తింది. “నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా?” అన్నాడు.DATel 131.4

    ఫిలిప్పు వాదనకు దిగలేదు గాని ఇలా అన్నాడు. “వచ్చిచూడుము.... యేసు నతనయేలు తనయొద్దకు వచ్చుట చూచి - ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతనియందు ఏకపటమునులేదని అతనిగూర్చి చెప్పెను” నిర్ఘాంతపోయి నతనయేలు ఇలా అన్నాడు. “నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని .... అడుగగా యేసు పిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే చూచితినని అతనితో చెప్పెను.”DATel 132.1

    అది సరిపోయింది. అంజూరపు చెట్టు కింద తాను ఏకాంతంగా ఉండి ప్రార్ధించినప్పుడు నతనయేలు సాక్ష్యమిచ్చిన దైవాత్మ ఇప్పుడు యేసుమాటల్లో అతనితో మాట్లాడాడు. సందేహించి ఒకింత దురభిమానానికి లోనైనప్పటికీ నతనయేలు చిత్తశుద్ధితో సత్యాన్ని అన్వేషిస్తూ క్రీస్తు వద్దకు వచ్చాడు. ఇప్పుడతడు కోరుకున్నది లభించింది. తన్ను యేసువద్దకు తీసుకు వచ్చినవారి విశ్వాసంకన్న నతనయేలు విశ్వాసం మిన్న అయ్యింది. అతడిలా అన్నాడు. “బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇశ్రాయేలు రాజవు.”DATel 132.2

    నడుపుదల కోసం నతనయేలు రబ్బీలను నమ్ముకుంటే అతడు యేసును కనుగొనేవాడుకాదు. తాను స్వయంగా చూసి మంచిచెడ్డలు గ్రహించిన తర్వాత అతడు శిష్యుడయ్యాడు. నేడు అనేకుల పరిస్థితి ఇదే. దురభిమానం వారిని మంచికి దూరంగా ఉంచుతుంది. వారు “వచ్చిచూస్తే” పర్యవసానం ఎంత వ్యత్యాసంగా ఉంటుంది.!DATel 132.3

    మానవ వివేకాన్ని నమ్ముకున్నంత సేపూ ఎవరూ రక్షణ సత్యాన్ని కనుగోలేరు. నతనయేలుమల్లే మనం స్వయంగా దైవవాక్యం అధ్యయనం చేసి పరిశుద్దాత్మ ఉత్తేజం కోసం ప్రార్ధన చెయ్యాలి. అంజూరపు చెట్టుకింద నతనయేలుని చూసిన ప్రభువు రహస్య ప్రార్థన స్థలంలో ఉన్న మనల్ని చూస్తాడు. మార్గనిర్దేశం కోరుతూ వినయమనసుతో దేవుని ఆశ్రయించేవారికి వెలుగులోకపు దూతలు దగ్గరగా ఉంటారు.DATel 132.4

    యోహాను, అంద్రియ, సీమోను, ఫిలిప్పు, నతనయేలుల పిలుపుతో క్రైస్తవ సంఘం పునాది ప్రారంభమయ్యింది. యోహాను తన ఇద్దరి శిష్యుల్ని క్రీస్తు వద్దకు నడిపించాడు. అందులో ఒకడైన అంబ్రెయ తన సోదరుణ్ని రక్షకుని వద్దకు నడిపించాడు. అప్పుడు ఫిలిప్పును పిలిచాడు ప్రభువు. అతడు నతనయేలును వెదుక్కుంటూ వెళ్ళాడు. వ్యక్తిగత కృషి, బంధువులు మిత్రులు ఇరుగుపొరుగులకూ ప్రత్యక్షంగా విజ్ఞప్తి చెయ్యడం ప్రాముఖ్యమని ఈ సాదృశ్యాలు బోధిస్తున్నాయి. జీవితకాలమంతా క్రీస్తును విశ్వసించినవారమని చెప్పుకుంటూ ఒక్కవ్యక్తిని కూడా క్రీస్తు వద్దకు తీసుకురాని విశ్వాసులున్నారు. సువార్తపరిచర్య అంతటినీ బోధకుడికే విడిచి పెట్టేస్తారు. అతడు మంచి అర్హతలున్న బోధకుడే కావచ్చు. అయినా సంఘసభ్యులకి దేవుడు మిగిల్చిన పనిని బోధకుడు చెయ్యలేడు.DATel 132.5

    ప్రేమగల క్రైస్తవ సహోదరుల పరిచర్య అవసరమైనవారు అనేకులున్నారు. తమ పొరుగువారు సామాన్య స్త్రీ పురుషులు వ్యక్తిగతంగా కృషి చేసి ఉంటే బాగుపడడానికి అవకాశం ఉండి చెడిపోయి నాశనమైన వారు చాలామంది. వ్యక్తిగతంగా మాట్లాడితే దారికి రావడానికి సిద్ధంగా ఉన్నవారు అనేకులున్నారు. మన కుటుంబంలోనే మనపరిసర ప్రాంతాల్లోనే క్రీస్తు మిషనరీలుగా మనంచేయాల్సిన సేవ ఉంది. మనం క్రైస్తవులమైతే ఈ సేవ మనకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఒకరు క్రైస్తవుడు అయిన వెంటనే అతనిలో ఓ కోర్కె బలంగా ఉంటుంది. అదే యేసులో తాను కనుగొన్న మిత్రుణ్నిగూర్చి ఇతరులికి చెప్పాలన్నకోరిక. రక్షణ కూర్చే ఆ సత్యాన్ని పరిశుద్ధపర్చే అ సత్యాన్ని హృదయంలో బంధించి ఉంచడం సాధ్యంకాదు.DATel 133.1

    తమ్మును తాము దేవునికి సమర్పించుకున్న వారందరు సత్యప్రసార సాధనాలవుతారు. తన కృపానిధుల్ని ఇతరులకు అందించే ప్రతినిధులుగా వారిని దేవుడు ఏర్పర్చుకుంటాడు. ఆయన ఈ వాగ్దానం చేస్తోన్నాడు. “వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షము కురియును” యెహె 34:26DATel 133.2

    ఫిలిప్పు, నతనయేలుతో “వచ్చిచూడుము” అన్నాడు. ఇంకొకరి వకy పుచ్చుకోమని కోరలేదు. స్వయంగా తానే క్రీస్తును చూడాల్సిందిగా నతనయేలు కోరాడు. యేసు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన శిష్యులే మనుషుల మధ్య ఆయన ప్రతినిధులు. ఆయనకు ఆత్మల్ని సంపాదించడంలో ఫలభరితమైన ఒకమార్గం మన దినదిన జీవితంలో ఆయన ప్రవర్తనకు ప్రతిరూపాలు కావడం. ఇతరులపై మనం చూపే ప్రభావం మన మాటలనాదకన్నా మన జీవిత సరళి మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు మన తర్కాన్ని మన హేతువాదాన్ని కాదనవచ్చు. మన విజ్ఞప్తిని తోసిరాజనవచ్చు. కాని నిస్వార్దప్రేమా జీవితం ఎవరూ ప్రతిఘటించలేని వాదం. క్రీస్తు సాత్వికంతో కూడిన, నిలకడగల క్రైస్తవ జీవితం లోకంలో మహత్తర శక్తిగా నిలుస్తుంది.DATel 133.3

    క్రీస్తు బోధన ఆయన అంతర్గత విశ్వాస అనుభవ ప్రకటన. ఆయన గురించి నేర్చుకునేవారు ఆ దైవ వ్యవస్థ ప్రబోధకులవుతారు. ఆ బోధనద్వారా పరిశుద్ధత పొందిన వ్యక్తి బోధించే వాక్యానికి జీవాన్నిచ్చే శక్తి ఉంటుంది. అది వినేవారిని ఆకట్టుకుని అది సజీవమైన వాస్తవమన్న నమ్మకం వారిలో కలిగిస్తుంది. సత్యం పట్ల ఆసక్తిని బట్టి ఒక వ్యక్తి దాన్ని అంగీకరించినప్పుడు దాన్ని తన విశ్వాస వైఖరిలోను తన కంఠ స్వరంలోను ప్రదర్శిస్తాడు. తాను స్వయంగా విన్న, చూసిన, చేతులతో ముట్టుకున్న జీవవాక్యాన్ని ప్రకటిస్తాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానం ద్వారా ఇతరులు తనతో సహావాసం కలిగి ఉండేందుకు వాక్యాన్ని ప్రకటిస్తాడు. కాలుతున్న బలిపీఠం నుంచి తీసిన అగ్ని తాకిన పెదవులతో పలికిన అతని సాక్ష్యం స్వీకరించే హృదయానికి సత్యం. అది ప్రవర్తనను శుద్ధీకరిస్తుంది.DATel 134.1

    ఇతరులకు వెలుగు అందించడానికి కృషి చేసేవ్యక్తి తానే దీవెన పొందుతాడు. “ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది.” (నీళ్లుపోయు వారికి నీళ్లు పోయబడును.” సామెతలు 11:25 పాపుల్ని రక్షించడమన్న తన లక్ష్యాన్ని మన సహకారం లేకుండానే దేవుడు సాధించేవాడు. కాని క్రీస్తు వంటి ప్రవర్తనను వృద్ధిపర్చుకునేందుకు మనం ప్రభువు సేవలో పాలుపొందడం అవసరం. ఆయన సంతోషంలో - తన బలియాగం ద్వారా ఆత్మలు విమోచన పొందడం చూసి పోందే సంతోషంలో- ప్రవేశించడానికి వారి రక్షణ కోసం మనం ఆయనతో కలిసి సేవచేయడం అవసరం.DATel 134.2

    నిండైన యధార్థమైన నతనయేలు ప్రథమ విశ్వాస ప్రకటన యేసు చెవులకు సంగీతంలా వినిపించింది. అందుకు ఆయన ఇలా అన్నాడు. “ఆ ఆంజూరపు చెట్టు క్రింద నిన్నుచూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువు. దీనులకు సువార్త ప్రకటించడంలోను, నలిగిన హృదయం గలవారిని ధృఢపర్చడంలోను సాతాను చెరలో ఉన్నవారికి విడుదల ప్రకటించడంలోను తాను చేయాల్సి ఉన్న సేవకు రక్షకుడు ఆనందోత్సాహాలతో ఎదురుచుశాడు. మనుషులికి తాను చేసిన మేలు గురించి ఆలోచించి యేసు ఇంకా ఇలా అన్నాడు. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.DATel 134.3

    “వాస్తవంలో ఇక్కడ క్రీస్తు చెబుతున్నదేంటంటే - యోర్దాను నదిగట్టున పరలోకం తెరుచుకుందని పరిశుద్దాత్మ తనమీదికి పావురంవలె దిగివచ్చాడని. నేను దేవుని కుమారుణ్నని చెప్పడానికి ఆ సన్నివేశం ఒక గుర్తు మాత్రమే. అలా మీరు నన్ను నమ్మితే మావిశ్వాసం చైతన్యవంతమౌతుంది. పరలోకం తెరుచుకొని ఉన్నట్లు, అది ఎన్నడూ మూతపడదన్నట్లు మీకు తెలుస్తుంది. నేను పరలోకాన్ని మీ కోసమే తెరిచి ఉంచాను. పరలోక దూతలు అవసరాల్లో ఉన్నవారు దుఃఖాల్లో, ఉన్నవారి ప్రార్ధనల్ని తండ్రి వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ నుంచి దీవెనలు, నిరీక్షణ, ధైర్యం, సహాయం , జీవం దైవప్రజలకు తెస్తారు.DATel 135.1

    పరలోకం నుంచి భూలోకానికి భూలోకం నుంచి పరలోకానికి దేవుని దూతలు సర్వదా దిగుతూ ఎక్కుతూ ఉంటారు. బాధితులు శ్రమల కోరల్లో విలవిలలాడుతున్నవారినిమిత్తం క్రీస్తు అద్భుతాలు దూతల సేవద్వారానే చోటుచేసుకుంటాయి. దేవుని వద్దనుంచి మనకు వచ్చే ప్రతీ మేలూ క్రీస్తూ ద్వారా ఆయన దూతల సేవ మూలంగా వస్తోంది. తన దేవత్వం ద్వారా దేవుని సింహాసనాన్ని పట్టుకుని తన మానవత్వం ద్వారా పతనమైన ఆదాము కుమారులు కుమార్తెలు అయిన మన ఆసక్తులతో ఆసక్తుల్ని రక్షకుడు సంయుక్తం చేస్తాడు. ఈ రీతిగా మనుషులు దేవునితోను దేవుడు మనుషులతోను సంబంధం కలిగి సంప్రదింపులు చేసుకోడానికి క్రీస్తు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు.DATel 135.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents