Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    60—నూతన రాజ్య ధర్మశాస్త్రం

    పస్కా సమయం దగ్గరపడుతోంది. యేసు మళ్లీ యెరూషలేము తట్టు తిరిగాడు. తండ్రి చిత్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చానన్న తృప్తి మనశ్శాంతి ఆయనకుంది. ఆత్మార్పణ స్థలానికి ఆతృతగా అడుగులు వేశాడు. అయితే ఆయన శిష్యుల్లో మర్మం, సందేహం, భయం చోటుచేసుకున్నాయి. రక్షకుడు “వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించువారు భయపడిరి.”DATel 606.1

    క్రీస్తు మళ్లీ ఆ పన్నెండుమందినీ తన చుట్టూ రమ్మని పిలిచి, క్రితంలో ఎన్నటికన్నా నిర్దిష్టంగా తన అప్పగింతను గురించి, శ్రమల్ని గురించి వారికి వివరించాడు. ఆయన, “ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము, మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహించలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.”DATel 606.2

    కొద్దికాలం క్రితమే “దేవుని రాజ్యము సమీపించియున్నది” అని వారు ప్రకటించలేదా? దేవుని రాజ్యంలో అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో అనేకులు కూర్చుంటారని స్వయంగా క్రీస్తే వాగ్దానం చెయ్యలేదా? తన నిమిత్తం ఏమైనా విడిచిపెట్టిన వారికి వందరెట్లు ఈ జీవితంలోను కొంతభాగం తన రాజ్యంలోను ఇస్తానని దేవుడు వాగ్దానం చెయ్యలేదా? తన రాజ్యంలో పన్నెండుమందికీ గొప్పగౌరవం గల హోదాల్ని సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలికీ తీర్పు తీర్చడం అన్న ప్రత్యేక వాగ్దానం చెయ్యలేదా? తనను గురించి ప్రవక్తలు రాసిన విషయాలన్నీ నెరవేరతాయని ఇప్పుడు సయితం ఆయన అన్నాడు. మెస్సీయా రాజ్యపరిపాలన మహిమను గురించి ప్రవక్తలు ప్రవచించలేదా? ఈ ఆలోచనల వెలుగులో, అప్పగింత గురించి, హింస గురించి, మరణం గురించి ఆయన చెప్పిన మాటలు అస్పష్టంగా ఉన్నాయి. ఎలాంటి కష్టాలు కడగండ్లు ఎదురైనా రాజ్యం మాత్రం త్వరలో స్థాపితమౌతుందని వారు విశ్వసించారు.DATel 606.3

    జెబెదయి కుమారుడైన యోహాను యేసుని వెంబడించిన ఇద్దరి శిష్యుల్లో ఒకడు. అతడు అతడి సోదరుడు యాకోబు ఆయన సేవ నిమిత్తం తమ సమస్తాన్నీ విడిచి పెట్టినవారి మొదటి గుంపులో ఉన్నారు. ఆయనతో ఉండేందుకోసం గృహాన్ని స్నేహితుల్నీ వారు ఆనందంగా వదిలి వచ్చారు. తమ హృదయాలు ఆయన హృదయంతో అనుసంధానమయ్యేంతగా, తమ ప్రగాఢ ప్రేమలో వారు ఆయన రాజ్యంలో ఆయనకు అతి సమీపంగా ఉండాలని ఆకాంక్షించేంతగా వారు ఆయనతో నడిచారు, ఆయనతో మాట్లాడారు. ఆయనతో కలిసి గృహాల రహస్య మందిరాల్లోను, బహిరంగ సమావేశాల్లోను ఉన్నారు. ఆయన వారి భయాల్ని తొలగించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా యోహాను రక్షకుని పక్కనే ఉండేవాడు. యాకోబు ఆయనతో అంతే సాన్నిహిత్యాన్ని అందులోని గౌరవాన్ని ఆకాంక్షించాడు.DATel 607.1

    వారి తల్లి క్రీస్తు విశ్వాసి. ఆమె తన సొంత ఖర్చుతో ఆయన సేవచేసింది. తల్లి ప్రేమతో, తన కుమారుల అభివృద్ధిని లక్షించి, నూతన రాజ్యంలో వారికి ప్రతిష్టాత్మకమైన స్థానాల్ని కోరింది. ఈ మేరకు మనవి చేయమని వారిని ప్రోత్సహించింది.DATel 607.2

    తల్లి, ఆ ఇద్దరు కుమారులు కలిసి యేసు వద్దకు వచ్చి తన కుమారులు ఆశిస్తున్న ఒక మనవిని మంజూరు చేయవలసిందిగా ప్రభువుని అభ్యరించింది.DATel 607.3

    “నీవేమి కోరుచున్నావు? అని ఆయన అడిగాడు.DATel 607.4

    “నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్ము” అని ఆ తల్లి బదులు పలికింది.DATel 608.1

    యేసు వారిపట్ల దయగా వ్యవహరించారు. తమ సహోదరులకన్నా ఉన్నత స్థానాల్ని స్వార్థంతో కోరుతున్నందుకు వారిని గద్దించలేదు. వారి హృదయాలు ఆయనకు తెలుసు. తనతో వారికున్న అనుబంధం ఆయనకు తెలుసు. వారి ప్రేమ కేవలం మానవ వాత్సల్యం కాదు. మానవ సాధనం తాలూకు లౌకికత వలన అపవిత్రత అంటినా, అది ఆయన విమోచక ప్రేమ ఊట నుంటి వచ్చిందే. ఆయన దాన్ని గద్దించడు. దాన్ని ఇంకా లోతుగాను పవిత్రంగాను చేస్తాడు. ఆయన ఇలా అన్నాడు, “నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను నా చేత అగునా?” తన శ్రమల్ని గురించి బాధలు గురించి ఆయన అన్నమాట జ్ఞాపకం చేసుకున్నారు. అయినా “చేత అగును’ అని ఆత్మ విశ్వాసంతో జవాబు చెప్పారు. తమ ప్రభువుకి కలుగనున్న సమస్త బాధలు శ్రమల్లో పాలుపంచుకోడం ద్వారా తమ స్వామిభక్తిని నిరూపించుకోడం గొప్ప గౌరవంగా ఎంచుకోడానికి వారు సిద్ధంగా ఉన్నారు.DATel 608.2

    “నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుదురు” అన్నాడాయన. అయన ముందు సింహాసనానికి బదులు సిలువ, కుడి పక్క ఒకడు ఎడమపక్క ఒకడు ఇద్దరు దొంగలు ఆయన మిత్రులు. యోహాను యాకోబులు తమ ప్రభువు శ్రమల్లో పాలు పంచుకోవాల్సి ఉన్నారు. సోదరుల్లో ఒకడు ఖడ్గానికి బలి అవుతాడు. కడమ సోదరుడు దీర్ఘకాలం శ్రమను, నిందను, చిత్రహింసను భరిస్తాడు.DATel 608.3

    “కాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు. నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకును” అని ఆయన అన్నాడు. దేవుని రాజ్యంలో హోదా ఆశ్రిత పక్షపాతం ద్వారా లభించదు. దాన్ని నిర్దేతుకంగా సంపాదించడంగాని అనుగ్రహించడంగాని జరగదు. అది ప్రవర్తన ఫలం. సాధించిన స్థితికి కిరీటం సింహాసనం సంకేతాలు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆత్మ విజయానికి అవి ప్రతీకలు.DATel 608.4

    చాలాకాలం తర్వాత, ఆయన శ్రమల్లో పాలు పంచుకోడం ద్వారా శిష్యులికి క్రీస్తు పట్ల సానుభూతి కలిగినప్పుడు, తన రాజ్యంలో తనకు దగ్గరగా ఉండడానికి షరతులు ఏమిటో ప్రభువు యోహానుకి బయలుపర్చాడు. క్రీస్తు ఇలా అన్నాడు, “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతోకూడ నా సంహాసనమునందు కూర్చుండనిచ్చెదను.” “జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను, అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును.... నా క్రొత్త పేరును వానిమీద, వ్రాసెదను.” ప్రక. 3:21, 12. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమిపమైయున్నది. మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మిదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు.... అనుగ్రహించును.” 2తిమోతి 4:6-8.DATel 609.1

    యాకోబు యోహానుల మనవిని తక్కిన పదిమందీ విన్నప్పుడు వారు తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు. ప్రతీవారు ఆ రాజ్యంలో అత్యున్నత స్థానాన్ని ఆశిస్తున్నవారే. ఈ ఇద్దరూ తమకన్నా పై చెయ్యి సాధించారని తక్కినవారు కోపంగా ఉన్నారు.DATel 609.2

    మళ్లీ ఎవరు గొప్ప అన్న వివాదం పునఃప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు శిష్యుల్ని తన వద్దకు పిలిచి కోపంగా ఉన్న శిష్యులతో ఆయన ఇలా అన్నాడు, “అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియును. నాలో అలాగుండకూడదు.”DATel 609.3

    లోక రాజ్యాల పరంగా హోదా స్వీయ ప్రబల్యాన్ని పెంచుకోడానికి ఉపయుక్తమయ్యింది. తమ సేవలకోసం, తమ ప్రయోజనం కోసం ప్రజలున్నారని పరిపాలకులు భావించారు. నాయకుల స్వార్థం కోసం ప్రజా సామాన్యంపై అదుపు సాధించడంలో పలుకుబడి, భాగ్యం, విద్య ప్రబల సాధనాలయ్యాయి. ఉన్నత తరగతులవారు ఆలోచనలకు, తీర్మానాలకు, రాజ్యపాలనకు ఉండగా, తక్కువ స్థాయి ప్రజలు బుద్ధిమంతులు, విధేయులు అయి సేవ చెయ్యడానికే ఉన్నారు. ఇతర అంశాల్లాగే మతం అధికారానికి సంబంధించినది. అధికారుల ఆదేశాల ప్రకారం ప్రజల విశ్వాసాలు ఆచరణ ఉండాలి. మనిషి మనిషిగా తనకుతాను ఆలోచించడానికి వ్యవహరించడానికి లేదు. ఆ హక్కుకి గుర్తింపులేదు.DATel 609.4

    విభిన్నమైన సూత్రాలపై క్రీస్తు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. అధికారం చెలాయించడానికి కాదు. సేవ చెయ్యడానికి మనుషుల్ని పిలిచాడు. ఆయన బలహీనుల్ని మోయడానికి బలవంతుల్ని పిలిచాడు. అధికారం, హోదా, వరాలు, విద్య గలవారు వాటి మూలంగా సాటి మనుషులికి సేవ చెయ్యడానికి మరింత బద్దులై ఉన్నారు. క్రీస్తు అనుచరుల్లో అత్యల్పులైన వారి విషయంలో సైతం ఇలా ఉంది, “సమస్తమైనవి మీ కొరకైయున్నవి.” 2 కొరింథు. 4:14.DATel 610.1

    “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” తన శిష్యుల నడుమ ఒక సేవకుడిగాను బరువుమోసేవాడుగాను ఉన్నాడు. వారి పేదరికాన్ని పంచుకున్నాడు. వారి నిమిత్తం ఆత్మత్యాగం పాటించాడు. కష్టమైన స్థలాన్ని సుగమం చెయ్యడానికి వారికి ముందు నడిచాడు. తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా భూమిపై తన పరిచర్యను త్వరలో పూర్తిచేయనున్నాడు. క్రీస్తు ఏ సూత్రన్ననుసరించి పనిచేశాడో ఆ సూత్రమే తన శరీరమైన సంఘసభ్యుల్ని క్రియాశీలుల్ని చేయాలి. రక్షణకు ఆధారం ప్రేమే. క్రీస్తు ఇచ్చిన ఆదరాన్ని ఎవరు అనుసరించి ఆయన మందకు కాపరులుగా పనిచేస్తారో వారే ఆయన రాజ్యంలో గొప్పవారు.DATel 610.2

    పౌలన్న ఈ మాటలు క్రైస్తవ జీవిత ఘనతను గౌరవాన్ని వెల్లడిస్తున్నాయి, “నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను.... అందరికినీ నన్ను నేను దాసునిగా చేసికొంటిని,” “అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనము కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.” 1 కొరి. 9:19, 10:33.DATel 610.3

    మనస్సాక్షి విషయంలో ఆత్మకు స్వతంత్రత ఉండాలి. ఒకరు ఇంకొకరి మనసును అదుపు చెయ్యకూడదు, ఇంకొకరికి తీర్మానాలు చెయ్యకూడదు లేక ఇంకొకరి విధుల్ని నిర్ధారించకూడదు. స్వతంత్రంగా తలంచడానికి తన నమ్మకాన్ని అనుసరించడానికి ప్రతీ వ్యక్తికి దేవుడు స్వేచ్ఛనిస్తాడు. “ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్కయెప్పగింపవలెను.” తన వ్యక్తిత్వాన్ని ఇంకొకరి వ్యక్తిత్వంతో విలీనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. నియమానికి సంబంధించిన విషయాల్లో “ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూధి పరచుకొనవలెను” రోమా 14:12,5. క్రీస్తు రాజ్యంలో అధికారుల హింస ఉండదు. ఆచార విషయంలో ఒత్తిడి ఉండదు. పరిపాలన చెయ్యడానికి మన్ననలందుకోడానికి వారు భువికి దిగిరారు. కాని వారు కృపనందించే దూతలుగా మానవుల్ని ధైర్యపర్చడానికి మనుషులికి సహకరించడానికి వస్తారు.DATel 610.4

    రక్షకుని బోధన నియమాలు, ఆయన దివ్యమధుర వాక్కులు అనుంగు శిష్యుడైన యోహాను మనసులో నిలిచాయి. తన చివరి దినాల వరకూ సంఘాలికి యోహాను సాక్ష్యం ఇది, “మనమొకనినొకడు ప్రేమింపవలెననునది మొదటినుండి మీరు వినిన వర్తమానమేగదా.” “ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ యెట్టి దని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై యున్నాము.” 1 యోహా. 3:11, 16.DATel 611.1

    తొలినాళ్ల సంఘంలో ఉన్న స్ఫూర్తి ఇలాటిది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దరిమిల “విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు.” “వారిలో ఎవనికిని కొదువలేకపోయెను” “అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.” అ.కా. 4:32, 34, 33.DATel 611.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents