Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  34—ఆహ్వానం

  “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”DATel 354.1

  తనను వెంబడిస్తున్న జనసమూహాన్నుద్దేశించి యేసు ఈ మాటలు పలికాడు. మనుషులు తన ద్వారా మాత్రమే దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందగలరని రక్షకుడు చెప్పాడు. తన శిష్యుల్ని పరలోక జ్ఞానం పొందినవారిగా ఆయన ప్రస్తావించాడు. అయినా తన ప్రేమ నుంచి శ్రద్ధాసక్తుల నుంచి తమను విడిచి పెట్టినట్లు భావించడానికి ఆయన ఎవరినీ విడిచి పెట్టలేదు. ప్రయాసపడి భారం మోసే వారంతా ఆయన వద్దకు రావచ్చు.DATel 354.2

  మతపరమైన ఆచారాల్ని నిష్ఠగా ఆచరించే శాస్త్రులు రబ్బీలికి ప్రాయశ్చిత్త కర్మకాండ తీర్చలేని కొదవగా మిగిలిపోయింది. సుంకరులు, పాపులు శారీరకం లౌకికం అయిన వాటితో తృప్తి చెందినట్లు నటించవచ్చు. కాని వారి హృదయాల్లో అవిశ్వాసం భయం ఉన్నాయి. ఆందోళన చెందుతోన్న వారి వంక, హృదయభారంతో కుంగిపోతున్న వారి వంక, నిరీక్షణ భగ్నమైన వారి వంక, లౌకికానందంతో ఆత్మ ఆశలను ఆకాంక్షలను సద్దుమణచడానికి చూస్తోన్న వారి వంక యేసు చూశాడు. వారందరినీ తనలో విశ్రాంతి పొందాల్సిందిగా ఆహ్వానించాడు. “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మిమిద నాకాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.”DATel 354.3

  ఈ మాటల్లో ప్రతీ మానవుడితోను యేసు మాట్లాడున్నాడు. వారికి తెలిసినా తెలియకపోయినా అందరూ అలసిపోయారు. ఆయాసకరమైన భారాలు మోస్తోన్నారు. క్రీస్తు మాత్రమే తొలగించగల భారాలతో అందరూ కుంగిపోతోన్నారు. మనల్ని కుంగదీస్తోన్న దుర్భరమైన భారం పాపం. ఈ భారాన్ని మనమే భరించడమైతే దాని కింద మనం కూలిపోడం ఖాయం. అలాగుండగా పాపరహితుడైన ప్రభువు మన స్థానంలో మనకు బదులుగా నిలిచాడు. “యెహోవా మన యందరి దోషమును ఆయన మీద మో పెను. “యెషయా 53:6. మన అపరాధభారాన్ని ఆయన భరిస్తాడు. అలసిపోయిన మన భుజాల మీద ఉన్న బరువును తనపై వేసుకుంటాడు. వేసుకుని మనకు విశ్రాంతినిస్తాడు. ఆందోళన భారాన్ని దుఃఖభారాన్ని కూడా ఆయన ఆహ్వానిస్తోన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడూ తన మనసులో ఉంచుకుంటాడు.DATel 354.4

  మానవ జాతి పెద్దన్న నిత్యసింహాసనం పక్క ఉన్నాడు. రక్షకుడుగా తన వంక చూసే ప్రతీ ఆత్మను ఆయన చూస్తాడు. మానవాళి బలహీనతలేంటో, మన అవసరాలేంటో, మన శోధనల బలం ఎక్కుడుందో అనుభవం ద్వారా ఆయన ఎరుగును. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లోను మనలాగే శోధనకు గురి అయ్యాడు. అయినా పాపం చెయ్యలేదు. భయంతో వణుకుతున్న దేవుని బిడ్డా, ఆయన మిమ్ముల్ని పరిశీలిస్తోన్నాడు. వారు శోధనకు గురి అవుతున్నారా? శోధన నుంచి మిమ్ముల్ని విడిపిస్తాడు. మీరు బలహీనంగా ఉన్నారా? మిమ్ముల్ని ఆయన బలపర్చుతాడు. నాకు జ్ఞానం కొదవయ్యిందా? ఆయన మిమ్ముల్ని చైతన్య పర్చుతాడు. వారు గాయపడ్డారా? మిమ్ముల్ని ఆయన స్వస్తపర్చుతాడు. “నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు.” అయినా “గుండె చెదరివారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.” కీర్త 147:4,3. “నా యొద్దకు రండి” అంటూ ఆయన ఆహ్వానిస్తోన్నాడు. ఈ ఆందోళనలు మీ శ్రమలు ఏమైనా ఈ సమస్యను ప్రభువుముందు పెట్టండి. అప్పుడు సహించడానికి నా ఆత్మ బలో పేతమవుతుంది. ఎంత బలహీనంగా నిస్సహాయంగా ఉన్నట్లు వారు తెలుసుకుంటారో ఆయన శక్తితో వారు అంత బలవంతువలవుతారు. మీ బరువు ఎంత భారంగా ఉంటే భారాన్ని మోసే ప్రభువుపై దాన్ని మోపి విశ్రాంతి పొందడంలో అంత ఆనందం ఉంది. క్రీస్తు ఇస్తానన్న విశ్రాంతి షరతుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ షరతుల్ని స్పష్టంగా వివరించడం జరిగింది. అవి అందరూ ఆచరించ గల షరతులు. తన విశ్రాంతి ఎలా దొరుకుతుందో మనకు చెబుతున్నాడు.DATel 355.1

  “మీ మిద నా కాడి ఎత్తికొను”డి అంటున్నాడు యేసు. కాడి సేవాపరికరం. ఎడ్లని పనినిమిత్తం కాడికడ్తారు. అవి పనిచెయ్యడానికి కాడి అవసరం. మనం జీవించినంతకాలం సేవ చేయ్యాలని ఈ ఉదాహరణ ద్వారా క్రీస్తు ఉద్బోధిస్తోన్నాడు. ఆయనతో జతపనివారమయ్యేందుకు మనం ఆయన కాడిని ఎత్తుకోవలసి ఉన్నాం.DATel 356.1

  సేవకు పిలుపునిచ్చే కాడి దేవుని నిబంధన. ఏదెనులో వెల్లడై సీనాయి మీద ప్రకటితమై నూతన నిబంధనలో హృదయంలో లిఖితమైన ప్రేమా నిబంధనే మానవ కార్యకర్తను దేవుని చిత్తానికి బంధించేది. మనల్ని మన చిత్త వృత్తి ననుసరించి నివసించడానికి మన చిత్తం ఎక్కడికి నడిపితే అక్కడకు వెళ్లడానికి దేవుడు విడిచి పెడితే మనం సాతాను అనుచరగణంలో చేరి అతడి గుణగణాల్ని సంతకరించుకునే వాళ్లం. అందుకే దేవుడు మనల్ని తన చిత్రానికి బంధిస్తాడు. ఆయన చిత్తం ఉన్నతం ఉదాత్తం అయ్యింది. సేవా విధుల్ని మనం ఓర్పుతో విజ్ఞతతో చేపట్టాలని ఆయన కోరుతోన్నాడు. యేసు మానవుడుగా ఉన్నప్పుడు సేవ అనే కాడిని మోశాడు. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రమును నా అంతర్యములో నున్నది.” అని అన్నాడు. కీర్త 40:8. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. ” యోహాను 6:38. దేవుని పట్ల ప్రేమ ఆయన మహిమ విషయం ఉత్సాహం పాపమానవులపై ప్రేమానురాగాలు బాధలను భరించి మరణించడానికి యేసును లోకంలోకి తీసుకువచ్చాయి. ఇదే ఆయన జీవితాన్ని అదుపు చేసే శక్తి. ఈ సూత్రాన్ని అవలంబించాల్సిందిగా ఆయన మనల్ని ఆదేశిస్తోన్నాడు.DATel 356.2

  లోక ప్రమాణాల్ని చేరడానికి ప్రయత్నిస్తూ తీవ్ర వ్యాకులత భారం కింద నలిగిపోతున్నవారు అనేకమంది. లోక సంబంధిత సేవను వారు ఎంపిక చేసుకుంటారు. దాని బాధ్యతల్ని అంగీకరిస్తారు. దాని ఆచారాల్ని అవలంబిస్తారు. ఇలా వారి ప్రవర్తన చెడ్డదై వారి జీవితం ఆయాసకరంగా మారుతుంది. అత్యాశను లౌకిక కోర్కెల్ని తృప్తిపర్చడానికిగాను వారు మనస్సాక్షిని గాయపర్చి అదనపు భారమైన పశ్చాత్తాపాన్ని తమమీదికి తెచ్చకుంటారు. ఎడతెరపిలేని ఆందోళన జీవశక్తుల్ని క్షీణింపచేస్తుంది. ఈ బానిసత్వ కాడిని పక్కన పెట్టవలసిందని ప్రభువు కోరుతున్నాడు. తన కాడిని స్వీరించాల్సిందని వారిని ఆహ్వానిస్తోన్నాడు. “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నది” అని ఆయన అంటోన్నాడు. ముందు తన రాజ్యాన్ని తన నీతిని వెదకవలసిందిగా వారిని కోరుతున్నాడు. అప్పుడు ఈ జీవితానికి అవసరమైనవన్నీ వారికి అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తోన్నాడు. ఆందోళన గుడ్డిది. అది భవిష్యత్తును చూడలేదు. అయితే క్రీస్తు ఆది నుంచి అంతం చూడగలడు. ప్రతీ సమస్యలోను సహాయమందించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. మనకు సహాయ మందించడానికి మన పరలోక తండ్రికి మనకు తెలియని వెయ్యి మార్గాలున్నాయి. దేవుని సేవకు ఆయన గౌరవానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేవారు తమ ఆందోళనలు మటుమాయమవ్వడం తన పాదాలికి సరళమైన బాటపరచిఉండడం కనుగొంటారు.DATel 356.3

  యేసు ఇలా అంటున్నాడు, “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక... నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు నా ప్రాణములకు విశ్రాంతి దొరకును.” సాత్వికం అణకువ నేర్చుకోడానికి మనం క్రీస్తు పాఠశాలలో చేరాలి. విమోచన ఆత్మకు పరలోకానికి శిక్షణనిచ్చే పక్రియ. ఈ శిక్షణ అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం. ఈ శిక్షణ అంటే చీకటి రాజు పాఠశాలలో నేర్చుకున్న అభిప్రాయాలు అలవాట్లు ఆచారాల నుంచి విముక్తి పొందడం. దైవ భక్తికి విరుద్ధంగా ఉన్న సమస్తం నుంచి ఆత్మ విడుదల పొందాల్సి ఉంది.DATel 357.1

  దేవునితో పరిపూర్ణ సామరస్యం ఉన్న క్రీస్తు హృదయంలో పరిపూర్ణ సమాధానం ఉంది. ఆయన మెప్పువల్ల ఉప్పొంగలేదు. ఖండన వల్ల లేదా ఆశాభంగం వల్ల కుంగిపోలేదు. తీవ్ర వ్యతిరేకత నడుమ క్రూర హింసనడుమ ఆయన ధైర్యం ఏ మాత్రం చెదరలేదు. అయితే ఆయన అనుచరులమని చెప్పుకునే వారిలో అనేకమంది భయపడినందున దేవుని మీద ఆధారపడడానికి ఆందోళన సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుంటారు. వారు దేవునికి తమ్మునుతాము పూర్తిగా సమర్పించుకోరు. ఎందుకంటే అలాంటి సమర్పణ పర్యవసానాలకు వారు భయపడ్డారు. ఈ సమర్పణ చేస్తేనే తప్ప వారికి సమాధానం లభించదు.DATel 357.2

  అశాంతిని తెచ్చేది స్వార్ధ ప్రేమ కాదు. మనం ఆత్మమూలంగా జన్మిస్తే యేసులో ఉన్న మనసు అనగా మనం రక్షణ పొందేందుకు గాను తన్నుతాను తగ్గించుకోడానికి ఆయన్ని నడిపించిన మనసు మనలో ఉంటుంది. అప్పుడు మనం అత్యున్నత స్థానాన్ని అన్వేషించం. యేసు పాదాల వద్ద కూర్చుని నేర్చుకోవాలని ఆశిస్తాం. మనం చేసే పని విలువ లోకంలో మన ప్రదర్శనలోను ఆర్భాటంలోను మన సొంత బలంతో ఉద్రేకంగా ఉత్సాహంగా పని చెయ్యడంలోను లేదని మనం గ్రహిస్తాం. మన పనికి విలువ మనం పొందే పరిశుద్దాత్మ నిష్పత్తిలో ఉంటుంది. దేవునిపై విశ్వాసం మనసుకు పరిశుద్ధతను ఆపాదిస్తుంది. ఫలితంగా ఓర్సు కలిగి మనం మన ఆత్మల్ని స్వాధీనంలో ఉంచుకోగలుగుతాం. .DATel 358.1

  బరువును లాగుతూ భారాన్ని తేలిక చెయ్యడానికి ఎద్దులపై కాడి మోపుతారు. క్రీస్తు కాడి కూడా ఇదే పని చేస్తుంది. మన చిత్తం దేవుని చిత్రానికి లోబడి ఉన్నప్పుడు ఆయన వరాల్ని ఇతరుల మేలుకోసం వినియోగించినప్పుడు మన జీవితభారం తేలిక అవుతుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నవ్యక్తి క్రీస్తుతో జతగా నడుస్తాడు. అతడి ఆత్మ ఆయన ప్రేమలో విశ్రమిస్తుంది. “నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.” అని మోషే ప్రార్ధన చేసినప్పుడు ప్రభువిచ్చిన జవాబు ఇది “నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను.” ప్రవక్తల ద్వారా ప్రభువు ఈ వర్తమానాన్నిచ్చాడు, “మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గాములను గూర్చి విచారించుడి మేలు కలుగుమార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు నాకు నెమ్మది కలుగును.” నిర్గమ 33:13; యిర్మీయా 6: 16. ఆయన ఇలా అంటున్నాడు, ” నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” యెషయా 48:18.DATel 358.2

  క్రీస్తు వాక్యాన్ని విశ్వసించి తమ ఆత్మల్ని ఆయన కాపుదలకు అప్పగించేవారు తమ జీవితాల్ని ఆయన నియంత్రణకు సమర్పించుకునేవారు శాంతి సమాధానాల్ని అనుభవిస్తారు. యేసు వారిని తన సన్నిధితో సంతోషపర్చినప్పుడు లౌకికమైనదేదీ వారిని వ్యాకులపర్చలేదు. సంపూర్ణ సమ్మతిలో సంపూర్ణ విశ్రాంతి ఉంది. ప్రభువిలా అంటున్నాడు, “ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు.” యెషయా 26:3. మన జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్టు కనిపించవచ్చు. అయినా మనం మన ప్రభువుకి నిబద్దులమై నిలబడితే తనకు మహిమ కలిగే రీతిలో జీవితాన్ని ప్రవర్తన్ని ఆయన రూపుదిద్దుతాడు. క్రీస్తు మహిమను అంటే క్రీస్తు ప్రవర్తనను వ్యక్తంచేసే ఆ ప్రవర్తన దేవుని పరదైసుకు తీసుకువెళ్లే ప్రవర్తన. నూతనత్వం పొందిన ప్రజలు తెల్లని వస్త్రాలు ధరించి ఆయనతో నడుస్తారు. ఎందుచేతనంటే వారు యోగ్యత గలవారు.DATel 358.3

  మనం యేసుద్వారా విశ్రాంతిలో ప్రవేశించగా పరలోకం ఇక్కడే ఆరంభమౌతుంది. రండి నా వద్ద నేర్చుకోండి అన్న ఆయన ఆహ్వానానికి మనం స్పందిస్తాం. ఆయన వద్దకు రావడంతో మనం నిత్యజీవాన్ని ఆరంభిస్తాం. పరలోకమంటే క్రీస్తు ద్వారా దేవున్ని ఎడతెగకుండా సమిపించడం. ఈ ఆనందమయ పరలోకంలో మనం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఇంకా ఎక్కువ మహిమ మనకు కనిపిస్తుంది. మనం దేవున్ని గురించి ఎంత ఎక్కువ తెలసుకుంటే మన ఆనందం అంత గాఢమవుతుంది. మనం ఈ జీవితంలో యేసుతో నడిచే కొద్దీ మనం ఆయన ప్రేమతో నిండి ఆయన సన్నిధితో తృప్తి చెందవచ్చు. మానవ నైజం భరించగలిగినదంతా మనం ఇక్కడ పొందవచ్చు. అయితే నిత్యజీవ మహిమతో పోల్చినప్పుడు ఇది ఏపాటిది? “వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారి మీదకప్పును. వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు. సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొట్టెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” ప్రక 7:15-17.DATel 359.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents