Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    73—“నా హృదయములను కలవరపడనియ్యకుడి”

    ప్రేమతోను సానుభూతితోను తన శిష్యులవంక చూస్తూ క్రీస్తు ఇలా అన్నాడు, ” ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడియున్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడియున్నాడు” యూదా మేడపై గదిలో నుంచి వెళ్ళిపోయాడు. తక్కిన పదకొండు మందితో క్రీస్తు ఒంటరిగా ఉన్నాడు. వారిని విడిచి వెళ్ళిపోవడానికి దగ్గరపడున్న సమయం గురించి వారితో చెప్పాలనుకున్నాడు. కాని దానికి ముందు తన పరిచర్య ఉద్దేశాన్ని గురించి వారికి వివరించాడు. ప్రతినిత్యం తన ముందున్న ధ్యేయం ఇదే. తాననుభవించనున్న శ్రమలు భరించనున్న సిగ్గు పరాభవం ద్వారా తండ్రి నామాన్ని మహిమపర్చనున్నందుకు సంతోషించాడు. ముందు శిష్యుల గమనాన్ని దీనిపై నిలుపుతున్నాడు.DATel 747.1

    అనంతరం . “పిల్లలారా” అని వారిని సంబోధిస్తూ ఆయన ఇలా అన్నాడు, “ఇంక కొంతకాలము నాతోకూడ ఉందును; మీరు నన్ను వెదకుదురు. నేనెక్కడికి వెళ్లుదునో అక్కడకి వారు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.”DATel 747.2

    ఈ మాటలు విన్నప్పుడు శిష్యులు ఉత్సహించలేకపోయారు. వారిని భయం ఆవరించింది. వారు రక్షకుని చుట్టూ ఆయనకు దగ్గరగా చేరాడు. తమ నాయకుడు, ప్రభువు, ప్రియతమ గురువు, మిత్రుడు అయిన ఆయన తమ ప్రాణం కన్నా వారికి ప్రియమైన వాడు. తమ కష్టాలు శ్రమలు, దుఃఖాలు ఆశాభంగాల్లో ఆదరణ కోసం వారు ఆయన్ని ఆశ్రయించేవారు. ఇప్పుడు ఒంటరివారు, ఆయన పై ఆధారపడి ఉన్నవారు అయిన తమని విడిచి పెట్టి ఆయన వెళ్ళిపోనున్నాడు.DATel 747.3

    అయితే వారితో రక్షకుడు చెప్పిన మాటలు ఆశాజనకంగా ఉన్నాయి. వారు శత్రువు వల్ల శ్రమలకు గురి అవుతారని ఆయనకు తెలుసు. కష్టాల మూలంగా అధైర్యం చెందిన వారి విషయంలో సాతాను మోసాలు బాగా పనిచేస్తాయని ఆయనకు తెలుసు. కనుక దృశ్యమైన వాటి నుంచి “అదృశ్యమైన” వాటి మీదికి వారి దృష్టిని ఆకర్షించాడు (2కొరి 4:18). వారి ఆలోచనల్ని లౌకిక బహిష్కారం నుంచి పరలోక గృహం మీదికి తిప్పాడు.DATel 748.1

    “నా హృదయములను కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశ్వాస ముంచుచున్నారు. నా యందును విశ్వాస ముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచునాను. నేను వెళ్ళి నాకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలవచ్చిన నాయొద్దనుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియును.” నాకోసం నేను లోకంలోకి వచ్చాను. నేను మీ తరపున పనిచేస్తున్నాను. నేను వెళ్ళిపోయినప్పుడు మీ పక్షంగా ఇంకా పనిచేస్తాను. మీరు నన్ను విశ్వసించేందుకు నన్ను నేను నాకు బయలుపర్చుకోవాలని ఈ లోకానికి వచ్చాను. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. మీ పక్షంగా నేను ఆయనతో సహకరంచి పని చేస్తాను. క్రీస్తు వెళ్ళడానికి గల ఉద్దేశం శిష్యులు భయపడున్న దానికి భిన్నమైంది. ఆయన వెళ్లడం వారికి నిత్యం దూరమవ్వడానికి కాదు. వారికి స్తలం సిద్ధపర్చడానికి ఆయన వెళ్తున్నాడు. ఆ పని ముగించిన తర్వాత వారిని తన వద్దకు తీసుకువెళ్ళేందుకు తిరిగి వస్తాడు. ఆయన వారికి నివాసాలు నిర్మిస్తుండగా వారు దేవుని పోలిన ప్రవర్తనని నిర్మించుకోవలసి ఉన్నారు.DATel 748.2

    శిష్యులు గాభరాపడ్డారు. ఎల్లప్పుడూ సందేహపడుండే తోమా, “ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియునని ఆయనడుగగా యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. వారు నన్ను ఎరిగియుంటే నాతండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మిరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారు” అన్నాడు.DATel 748.3

    పరలోకానికి ఎన్నో మార్గాలున్నాయి. ప్రతీవారూ తమ సొంత మార్గాన్ని ఎన్నుకోకూడదు. క్రీస్తిలా అంటున్నాడు, “నేనే మార్గమును... నా ద్వారా నే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” ఏదెనులో మొట్టమొదటి సువార్త ప్రసంగంలో స్త్రీ సంతానం సర్పం తల చితకకొడ్తాడని ప్రకటించడం జరిగినప్పటి నుంచి క్రీస్తు మార్గం, సత్యం, జీవంగా ప్రకటితమయ్యాడు. ఆదాము జీవించినప్పుడు, హేబెలు గొర్రెను చంపి విమోచకుని రక్తానికి చిహ్నంగా దాని రక్తాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఆయనే మార్గం. ఏ మార్గం ద్వారా పితరులు ప్రవక్తలు రక్షణ పొందారో ఆ మార్గం క్రీస్తే. మనం దేవుణ్ని చేరడానికి ఆయన ఒక్కడే మార్గం.DATel 749.1

    “మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారు.” అని క్రీస్తన్నాడు. శిష్యులు అవగహన చేసుకోలేదు. “ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, అంతే చాలును” అన్నాడు ఫిలిప్పు,DATel 749.2

    అతడి మంద బుద్ధికి క్రీస్తు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, ‘ఫిలిప్పు, నేనింత కాలము నా యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని యేల చెప్పుచున్నావు?” ఆయన నా ద్వారా చేస్తున్న పనుల్ని నీవు చూడకపోవడం సాధ్యమా? నేను తండ్రిని గురించి సాక్ష్యమివ్వడానికి వచ్చానని నీవు నమ్మవా? “తండ్రిని మాకు కనపరచుమని యేల చెప్పుచున్నావు?” “నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచియున్నాడు.” క్రీస్తు మానవుడుగా ఉన్నప్పుడు దేవత్వాన్ని కోల్పోలేదు. ఆయన తన్నుతాను తగ్గించుకుని మానవుడైనప్పటికీ ఆయన దైవం. క్రీస్తు ఒక్కడే తండ్రిని మానవులికి చూపించగలడు. క్రీస్తులో ఆయన ప్రతిరూపాన్ని శిష్యులు మూడు సంవత్సరాలికి పైగా చూశారు.DATel 749.3

    “తండ్రియందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.” వారి విశ్వాసం క్రీస్తు చేస్తున్న పనులలో ఉన్న నిదర్శనం పై ఆనుకోడం క్షేమం. అలాంటి పనులు ఏ మానవుడూ చేయడం నభూతో నభవిష్యతి. క్రీస్తు పని ఆయన దేవత్వాన్ని చాటుతోంది. ఆయన ద్వారా తండ్రి ప్రకటి తమౌతోన్నాడు.DATel 750.1

    తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధాన్ని శిష్యులు నమ్మితే నశిస్తోన్న ప్రపంచం నిమిత్తం క్రీస్తు శ్రమలనుభవించి మరణించడం చూసినప్పుడు వారి విశ్వాసం దెబ్బతినదు. తమ తక్కువస్థాయి విశ్వాసం నుంచి పెరిగి వారిని ఆయన వాస్తవిక స్థితికి అనగా ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడని గుర్తించే అనుభవానికి వారిని నడిపించాలని క్రీస్తు ప్రయత్నిస్తోన్నాడు. తమ విశ్వాసం తమను దేవుని వద్దకు నడిపించేటట్లు ఆయనపై స్థిరంగా పాదుకొనేటట్లు చూసుకోవాలని వారిని కోరాడు. కొద్దికాలంలోనే తమను తాకనున్న శోధన తుపానుకి తన శిష్యుల్ని సిద్ధం చెయ్యడానికి దయామయుడైన మన రక్షకుడు ఎంత ఆసక్తిగా ఎంత ఓర్పుగా కృషి చేశాడు! తనతో పాటు వారిని దేవునిలో దాచాలన్నది ఆయన ఆకాంక్ష.DATel 750.2

    క్రీస్తు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన ముఖం దేవుని మహిమతో ప్రకాశించింది. అక్కడున్న వారందరూ ఆయన మాటల్ని దీక్షగా వింటున్నప్పుడు వారిలో భయభక్తులు చోటుచేసుకున్నాయి. వారి హృదయాలు ఆయనకు మరింత నిశ్చయాత్మంగా ఆకర్షితమయ్యాయి. వారు ప్రేమతో క్రీస్తుని హత్తుకున్నప్పుడు వారు ఒకరికి ఒకరు సన్నిహితులయ్యారు. పరలోకం అతి సమీపంగా ఉన్నదని తాము వింటున్న మాటలు పరలోక తండ్రి వద్దనుంచి తమకు వస్తోన్న వర్తమానమని వారు భావించారు.DATel 750.3

    క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు, ” నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును.” తన దేవత్వం మానవత్వంతో ఎందునిమిత్తం సంయుక్తమయ్యిందో తన శిష్యులు అవగాహన చేసుకోవాలని రక్షకుడు అతురతగా ఉన్నాడు. దేవుని మహిమ చేకూర్చే పునరుద్ధరణ శక్తి వలన మానవుడు ఉన్నత స్థితికి చేరాలన్న ఉద్దేశంతో ఆ మహిమను ప్రదర్శించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వారిలో క్రీస్తు ప్రదర్శితమయ్యేందుకు క్రీస్తులో తండ్రి ప్రదర్శితమయ్యాడు. తనపై విశ్వాసముంచిన మనుషులికి లేని ఏ విశేషగుణాల్నీ యేసు కనపర్చలేదు, ఏ విశేష శక్తుల్ని ప్రదర్శించలేదు. ఆయన ప్రదర్శించిన నిష్కళంకమైన మానవత్వం వారు కూడా కలిగి ఉండవచ్చు.DATel 750.4

    “నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక... వాటి కంటే మరిగొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” తన సేవకన్నా తన శిష్యుల సేవ సమున్నతంగా ఉంటుందని కాదు ఈమాట ఉద్దేశం. వారి సేవాపరిధి ఇంకా విశాలంగా ఉంటుందని. అద్భుతాలు చెయ్యడాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించలేదు. పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా జరిగే సేవ అంతటిని ఆయన ఉద్దేశించి ఇలా అన్నాడు.DATel 751.1

    ప్రభువు ఆరోహణం అనంతరం శిష్యులు ఆయన వాగ్దానాల నెరవేర్పు చూశారు. క్రీస్తు సిలువ, పునరుత్థానం, ఆరోహణం వారు కళ్లారా చూసిన వాస్తవాలు. ప్రవచనాలు తు.చ. తప్పకుండా నెరవేరడం వారు చూశారు. వారు లేఖనాల్ని పరిశోధించారు. లేఖన బోధనల్ని అపూర్వ విశ్వాసంతో నిశ్చయతతో స్వీకరించారు. తమ పరమ తండ్రి చెప్పినందతా వాస్తవమని గుర్తించారు. వారు తమ అనుభవాల్ని ప్రజలకు చెప్పారు. దేవుని ప్రేమను ఉన్నతపర్చారు. మనుషుల హృదయాలు కరిగి దేవునికి విధేయమయ్యాయి. వేలాది ప్రజలు యేసుని విశ్వసించారు.DATel 751.2

    రక్షకుడు శిష్యులికి చేసిన వాగ్దానం లోకాంతం వరకూ సంఘానికి వర్తించే వాగ్దానం. మానవుణ్ని విమోచించడానికి రూపొందిన అద్భుత ప్రణాళిక అంతంత మాత్రపు ఫలితాలు సాధించడానికి ఉద్దేశించింది కాదు, తాము చెయ్యగల దాని మీద గాక తమ ద్వారా దేవుడు చెయ్యగలదాని మీద నమ్మకముంచి పనిచేసేవారందరూ ఈ వాగ్దాన నెరవేర్పును తమ అనుభవంలో చూస్తారు. “నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక... వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును.”DATel 751.3

    రక్షకుని అనంతమైన వనరులు శక్తి గురించి శిష్యులికింకా అవగాహనలేదు. వారితో ఆయనిలా అన్నాడు, “ఇదివరకు మిరేమియు నా పేరట అడుగలేదు.” యోహా 16:24. శక్తికోసం కృపకోసం తన పేరట అడగడంలోనే తమ విజయరహస్యం ఉందని ఆయన వివరించాడు. వారి పక్షంగా తండ్రికి మనవి చెయ్యడానికి ఆయన తండ్రి ముందు ఉంటాడు. విజ్ఞాపకుడి ప్రార్ధనను అతడి తరపున తన విజ్ఞాపనగా ఆయన తండ్రికి సమర్పిస్తాడు. ప్రతీ యధార్థ ప్రార్థనా పరలోకంలో ఉన్న దేవుడు వింటాజు, అది ‘సరిగా వ్యక్తం చెయ్యలేని ప్రార్థనకావచ్చు. కాని విజ్ఞాపకుడు హృదయపూర్వకంగా ప్రార్ధన చేస్తే క్రీస్తు పరిచర్య చేస్తున్న గుడారానికి అది వెళ్తుంది. దాన్ని ఆయన ఒక్క అపశ్రుతిగాని తడబాటుగాని లేకుండా సవరించి, తన సొంత పరిపూర్ణతతో దాన్ని చక్కని పరిమళ ధూపం చేసి తండ్రికి సమర్పిస్తాడు.DATel 751.4

    చిత్తశుద్ధి నైతిక వర్తన మార్గం ప్రతిబంధకాలులేని మార్గం కాదు. కాని ప్రతీ ఒడుదుకులోను మనం ప్రార్థనకు పిలుపును గుర్తించాలి. శక్తి గలవారు ఎవరైనా ఉంటే అది దేవుడిచ్చిన శక్తే. ఆ శక్తికి మూలం అతి బలహీన మానవుడికి సైతం అందుబాటులో ఉంది. “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అన్నాడు యేసు.DATel 752.1

    “నా పేరట” ప్రార్థించమని తన శిష్యుల్ని ఆదేశించాడు. తన అనుచరులు క్రీస్తు పేరట దేవుని ముందు నిలబడ్డారు. వారి నిమిత్తం ఆయన చేసిన త్యాగం వలన ప్రభువు దృష్టిలో వారికి విలువ ఉంటుంది. క్రీస్తు తమకు ఆరోపించిన నీతి కారణంగా వారు ప్రశస్తమైన వారిగా పరిగణన పొందుతారు. తనయందు భయభక్తులు గల వారిని క్రీస్తు నిమిత్తం ప్రభువు క్షమిస్తాడు. వారిలో నీచ పాపిని ఆయన చూడడు. వారు విశ్వసించే తన కుమారుని పోలికను చూస్తాడు.DATel 752.2

    తన ప్రజలు తమ్మును తాము తక్కువ అంచనా వేసుకున్నప్పుడు ప్రభువు ఆశాభంగం చెందుతాడు. తాను ఎన్నుకున్న ప్రజకు ఆయన పెట్టిన విలువను బట్టి వారు తమ విలువను తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. వారు కావాలని కోరుకున్నాడు. అందుకే వారిని విమోచించే ఖరీదైన కర్తవ్యంపై ఆయన్ని పంపాడు. వారిని ఆయన వినియోగించగోరుతున్నాడు. తన నామాన్ని మహిమపర్చడానికి వారు కోరినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన వాగ్దానాన్ని విశ్వసించినట్లయితే వారు గొప్పకార్యాలకు ఎదురు చూడవచ్చు.DATel 752.3

    అయితే క్రీస్తు పేరట ప్రార్ధన చెయ్యడంలో చాలా అర్థం ఉంది. మనం ఆయన ప్రవర్తనను అంగీకరించాలని, ఆయన స్వభావాన్ని ప్రదర్శించాలని, ఆయన పనులు చెయ్యాలని దాని అర్ధం. రక్షకుడు తన వాగ్దానాన్ని ఒక షరతు మీద ఇచ్చాడు. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు” అంటున్నాడు యేసు. మనుషుల్నిపాపంలో కాదు పాపం నుంచి ఆయన రక్షిస్తాడు. ఆయన్ని ప్రేమించే వారు ఆయన ప్రేమను ఆచరణలో చూపిస్తారు.DATel 753.1

    నిజమైన ఆచరణ హృదయం నుంచి వస్తుంది. హృదయం క్రీస్తుతో కలిసి చేసే పని అది. మనం సమ్మతించినట్లయితే ఆయన మన ఆలోచనల్లోను మన లక్ష్యాల్లోను మనతో ఏకమై మన హృదయాల్ని మనసుల్ని తన చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లు మల్చుతాడు. మనం ఆయనకు విధేయులమైనప్పుడు మన మనోభావాల్నే మనం నెరవేర్చుకుంటున్నట్లు చేస్తాడు. నిర్మల పరిశుద్ధ చిత్తం ప్రభువు సేవ చెయ్యడంలో అత్యధికానందాన్ని పొందుతుంది. తెలుసుకోగలిగినంత మేరకు మనం ప్రభువుని ఎరిగినట్లయితే, మనం ఆయనకు విధేయులమై నివసిస్తాం. క్రీస్తు ప్రవర్తనను అభినందించడం ద్వారా, దేవునితో సహవాసం ద్వారా మనకు పాపం హేయమౌతుంది.DATel 753.2

    క్రీస్తు మానవుడుగా ధర్మశాస్త్రానికి విధేయుడై నివసించిన రీతిగానే సర్వశక్తుని బలం మీద ఆధారపడితే మనం కూడా విధేయులమై నివసించవచ్చు. అయినా మన విధి నిర్వహణ బాధ్యతను ఇతరుల మీద పెట్టి ఏం చెయ్యాలో వారు మనకు చెప్పడానికి కనిపెట్టకూడదు. సలహాలు సూచనల కోసం మనం మానవుల మీద ఆధారపడకూడదు. ఇతరులికి ఎలా బోధిస్తాడో అలాగే ప్రభువు మనకు మన విధిని బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చినట్లయితే తన మర్మాల్ని మనకు వ్యక్తిగతంగా వివరిస్తాడు. హనోకుతో సహవాసం చేసినట్లు ఆయన మనకు దగ్గరగా వచ్చి మనతో సహవాసం చేస్తున్నప్పుడు తరచుగా మన హృదయాలు మనలో మండుతాయి.DATel 753.3

    దేవునికి ఏది ఇష్టంకాదో దాన్ని చెయ్యకుండా ఉండడానికి తీర్మానించుకునేవారు ఆయనకు తమ సమస్యను విన్నవించుకున్న తర్వాతే ఏ మార్గాన్ని అనుసరించాలో తెలుసుకుంటారు. వారు వివేకాన్ని శక్తిని కూడా పొందుతారు. క్రీస్తు వాగ్దానం చేసినట్లు విధేయులవ్వడానికి సేవ చెయ్యడానికి వారు శక్తిని పొందుతారు. పడిపోయిన మానవాళి అవసరాన్ని తీర్చడానికి క్రీస్తు ఏమైతే పొందాడో దాన్ని ఆయన మానవ జాతికి శిరసుగాను ప్రతినిధిగాను పొందాడు. “మన మాయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకును.” 1 యోహా 3:22.DATel 753.4

    తన్నుతాను బలిపశువుగా సమర్పించుకోకముందు, తన అనుచరులికి ఇవ్వడానికి అత్యవసరమైన, సంపూర్ణమైన వరం కోసం క్రీస్తు వేదకాడు. కృప తాలూకు వనరుల్ని వారి అందుబాటులో ఉంచేది ఎవరు మరి?’ ఆయన ఇలా అన్నాడు, “నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా స్యతస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; వారు ఆయనను ఎరుగుదురు. ఆయన మితో కూడ నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాధలుగా విడువను, నా యొద్దకు వత్తును.” యోహా 14:16-18.DATel 754.1

    దీనికి ముందు ఆత్మ లోకంలో ఉన్నాడు. విమోచన ఆరంభం నుంచి ఆయన మనుషుల హృదయాల్లో పని చేస్తూ వచ్చాడు. అయితే క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు, శిష్యులికి ఇంక ఎలాంటి సహాయకుడు అవసరం లేకపోయింది. క్రీస్తు ఇక లేకపోయేంత వరకు ఆత్మ అవసరాన్ని వారు గుర్తించలేదు. అప్పుడు ఆయన వస్తాడు.DATel 754.2

    పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రతినిధి. కాని ఆయనకు మానవ రూపం లేదు. ఆయన స్వతంత్రంగా వ్యవమరిస్తాడు. మానవ రూపంలో ఉన్న క్రీస్తు ప్రతీ స్థలంలోను వ్యక్తిగతంగా ఉండలేడు. అందుచేత ఆయన తండ్రి వద్దకు వెళ్లి పరిశుద్దాత్మను లోకంలోకి తన వారసుడుగా పంపడం వారికే మేలు. అప్పుడు తమ స్థానం వల్ల లేక క్రీస్తుతో తమ వ్యక్తిగత సంబంధం వల్ల ఎవరూ ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేరు. పరిశుద్దాత్మ ద్వారా రక్షకుడు అందరికీ అందుబాటులో ఉంటాడు. పూర్వం ఈ కోణంలో చూస్తే ఆయన ఆరోహణానికి ముందటికన్నా ఎక్కువ అందుబాటులో ఉంటాడు.DATel 754.3

    “నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి నేను వానికి కనపరచుకొందును” క్రీస్తు తన శిష్యుల భవిష్యత్తు చదివాడు. ఒకణ్ని ఉరితియ్యడం, ఒకణ్ని సిలువ వెయ్యడం, ఒకణ్ని సముద్రంలో శిలల నడుమ ఏకాంతంలో ఉంచడం, ఇతరుల్ని హింసించి చంపడం ఆయన చూశాడు. ఆ వాగ్దానం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. తన నిమిత్తం కారాగారాల్లో పడి ఉన్న లేదా నిర్జన ద్వీపాలకి బహిష్కృతులైన తన నమ్మకమైన సేవకుల్ని ప్రభువు ఎరుగును. తన సముఖంతో ఆయన వారిని ఓదార్చుతాడు. సత్యం నిమిత్తం నీతి బాహ్యమైన న్యాయస్థానాల ముందు విశ్వాసి నిలబడినప్పుడు, క్రీస్తు అతడి పక్క నిలబడ్డాడు. అతడి మీద పడే నిందలన్నీ క్రీస్తు మీద పడ్డాయి. తన శిష్యుడిలో క్రీస్తు మళ్లీ దోషిగా తీర్పు పొందుతాడు. ఒక వ్యక్తి చెరసాలలో బందీ అయినప్పుడు అతడి హృదయాన్ని క్రీస్తు తన ప్రేమతో నింపుతాడు. తన నిమిత్తం ఒకడు మరణిస్తే క్రీస్తు ఇలా అంటున్నాడు, “నేను... జీవించువాడను మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను... మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. ” ప్రక 1:18.DATel 754.4

    అన్ని వేళల్లోను అన్ని స్థలాల్లోను, అన్ని దుఃఖాల్లోను అన్ని శ్రమల్లోను, అంతా చీకటిగాను భవిష్యత్తు అస్తవ్యస్తంగాను కనిపించి మనం నిరీక్షణ లేకుండా ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పుడు విశ్వాస ప్రార్థనకు సమాధానంగా ఆదరణకర్తను పంపుతాడు ప్రభువు. లోకంలో ఉన్న ప్రతీ మిత్రుడి నుంచి పరిస్థితులు మనల్ని వేరుచెయ్యవచ్చు. అయితే మన పరలోక ఆదరణకర్తనుంచి పరిస్థితులు గాని దూరంగాని మనల్ని వేరు చెయ్యలేవు. మనం ఎవరిమైనా, మనం ఎక్కడికి వెళ్లినా, ఆయన మనల్ని ఆదుకోడానికి నిలబెట్టడానికి పైకెత్తడానికి ఆహ్లాదపర్చడానికి ఎల్లప్పుడూ మన కుడి పక్కన ఉంటాడు.DATel 755.1

    శిష్యులు క్రీస్తు మాటల ఆధ్యాత్మిక భావాన్ని ఇంకా గ్రహించ లేకపోయారు. ఆయన మళ్లీ తన భావాన్ని వారికి విశదం చేశాడు. ఆత్మద్వారా వారికి తన్నుతాను కనపర్చుకుంటానని చెప్పాడు. “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు బోధి” స్తాడు. మాకు బోధపడడం లేదు అని మీరు ఇక అనరు. అద్దంలో చూసినట్లు మీరు ఇక మబ్బుమబ్బుగా చూడరు. మీరు “సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు” అవ్వుతారు. ఎఫె 3:18, 19.DATel 755.2

    శిష్యులు క్రీస్తు జీవితాన్ని సేవను గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నారు. వారి మాట ద్వారా ఆయన ఈ లోకంలోని ప్రజలందరితో మాట్లాడాల్సి ఉన్నాడు. కాని క్రీస్తు భరించనున్న అవమానం సిగ్గు పొందనున్న మరణంలో వారు తీవ్ర శ్రమననుభవించి దుర్భర ఆశాభంగానికి గురి కావలిసి ఉన్నారు. ఈ అనుభవం తర్వాత వారి మాట తప్పకుండా ఉండేదుకు ఆదరణకర్త “నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని నాకు జ్ఞాపకము చేయును” అని యేసు వాగ్దానం చేశాడు.DATel 756.1

    ఆయన ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్య సత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానే యేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను నాకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.” యేసు తన శిష్యుల ముందు విశాలమైన సత్యమార్గాన్ని తెరిచాడు. ఆయన నేర్పిన పాఠాన్ని పరిసయ్యులు శాస్త్రులు బోధిస్తున్న సంప్రదాయాలు సూక్తుల నుంచి వేరు చెయ్యడం వారికి చాలా కష్టం. రబ్బీల బోధలు దైవస్వరంగా అంగీకరించడానికి వారు నేర్చుకున్నారు. ఆ తత్వం ఇంకా వారి మనసుల్ని అదుపుచేస్తూ వారి అభిప్రాయాల్ని తీర్చిదిద్దుతోంది. లౌకిక భావాలు, ప్రాపంచిక విషయాలు వారి ఆలోచనల్ని వారి మనసుల్ని అదుపుచేస్తూనే ఉన్నాయి. క్రీస్తు తరచుగా తన రాజ్యస్వభావాన్ని గురించి పారికి వివరించినా ఆ రాజ్యం ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని వారు గ్రహించలేదు. ఆయన బోధించిన పాఠాల్లో చాలామట్టుకు వారికి అర్ధమైనట్లు కనిపించలేదు. తన మాటల అర్థాన్ని వారు గ్రహించనట్లు క్రీస్తు చూశాడు. ఈ సంగతుల్ని పరిశుద్దాత్మ వారికి గుర్తు చేస్తాడని వారికి వాగ్గనం చేశాడు. శిష్యుల అవగాహనకు మించిన అనేక సంగతుల్ని ఆయన వారికి చెప్పకుండా విడిచి పెట్టాడు. వీటిని కూడా పరిశుద్ధాత్మ వారి దృష్టికిDATel 756.2

    తెరిచి ఉంచుతాడు. పరిశుద్ధాత్మ వారి అవగాహనను చైతన్యపర్చుతాడు. అప్పుడు వారు పరలోక సంగతుల్ని అభినందిస్తారు. “ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును.”DATel 757.1

    ఆదరణకర్తకు “సత్యస్వరూపియైన ఆత్మ” అని పేరు. సత్యాన్ని నిర్వచించి కొనసాగించడం ఆయన పని. సత్యస్వరూపి అయిన ఆత్మగా ముందు ఆయన హృదయంలో నివసించి ఆవిధంగా ఆదరణకర్త అవుతాడు. సత్యంలో ఆదరణ శాంతి ఉన్నాయి. అసత్యంలో నిజమైన శాంతి లేక ఆదరణ ఉండదు. తప్పుడు సిద్ధాంతాలు సంప్రదాయాల ద్వారా సాతాను మనుషుల మనసుల్ని అదుపును సాధిస్తాడు. మనుషుల్ని తప్పుడు ప్రమాణాలికి నడిపించడం ద్వారా అతడు ప్రవర్తనను వక్రీకరిస్తాడు. లేఖనాల ద్వారా పరిశుద్దాత్మ మనసుతో మాట్లాడి సత్యాన్ని హృదయంలో ముద్రిస్తాడు. ఇలా తప్పును బయలుపర్చి దాన్ని ఆత్మలో నుంచి బహిష్కరిస్తాడు. వాక్యం ద్వారా పనిచేస్తూ సత్యస్వరూపి అయిన ఆత్మద్వారా క్రీస్తు తాను ఎన్నుకున్న ప్రజల హృదయాల్ని వశపర్చుకుంటాడు.DATel 757.2

    పరిశుద్దాత్మ చేసే పనిని తన శిష్యులికి వర్ణించడంలో తన సొంత హృదయాన్ని నింపిన ఆనందం నిరీక్షణతో తన శిష్యుల్ని చైతన్యపర్చాలని యేసు ప్రయత్నించాడు. తన ప్రజల ఉద్దరణకు తండ్రి నుంచి తాను కోరగల వరాలన్నిటిలో పరిశుద్ధాత్మ వరమే అత్యున్నతమయ్యింది. ఆత్మ పునరుజ్జీవ సాధనంగా రావాల్సి ఉన్నాడు. ఈ పునరుజ్జీవం లేకుండా క్రీస్తు బలిదానం నిరర్ధకమౌతుంది. దుష్టశక్తి శతాబ్దాలు తరబడి బలం పుంజుకుంటోంది. సాతాను చెరకు మనుషులు లొంగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్రిత్వంలో మూడోవ్యక్తి అయిన పరిశుద్దాత్మ ద్వారా మాత్రమే పాపాన్ని ప్రతిఘటించి జయించడం సాధ్యపడుంది. ఆయన తన సంపూర్ణ దివ్యశక్తితో వస్తాడు. లోక రక్షకుడు ఏమైతే సాధించాడో దాన్ని ఫలప్రదం చేసేవాడు పరిశుద్దాత్మే. హృదయ శుద్ధిని నిర్వర్తించేది పరిశుద్దాత్మే. ఆత్మ ద్వారా విశ్వాసి దైవ స్వభావంలో పాలివాడవుతాడు. దుష్టి చెయ్యడానికి పారంపర్యంగాను అభ్యాసపరంగాను వచ్చే ప్రవుత్తుల్ని జయించి తన ప్రవర్తనను సంఘంపై ముద్రించడానికి క్రీస్తు తన ఆత్మను దైవశక్తిగా ప్రసాదిస్తున్నాడు.DATel 757.3

    ఆత్మను గురించి యేసు ఇలా అంటున్నాడు, “ఆయన... నన్ను మహిమపరచును,” తన ప్రేమను కనపర్చడం ద్వారా రక్షకుడు తన తండ్రిని మహిమపర్చడానికి వచ్చాడు. అలాగే క్రీస్తు కృపను లోకానికి ప్రత్యక్షపర్చడం ద్వారా ఆత్మ క్రీస్తును మహిమపర్చవలసి ఉన్నాడు. దేవుని స్వరూపం మానవాళిలో పునరుత్పత్తి కావలసిఉంది. దైవ ప్రజల ప్రవర్తన సంపూర్ణత సాధించడంతో దేవుని ప్రతిష్ఠ క్రీస్తు ప్రతిష్ఠ జతపడి ఉన్నాయి.DATel 758.1

    “ఆయన (సత్య స్వరూపియైన ఆత్మ) వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును.” పరిశుద్ధాత్మ ఉనికి సహాయం నిత్యం లేకపోతే వాక్యబోధ నిరర్ధకమౌతుంది. దైవ సత్యాన్ని ఫలప్రదంగా బోధించే ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మే. సత్యం వెంట హృదయంలోకి ఆత్మ వెళ్లినప్పుడే అది మనస్సాక్షిని చైతన్యపర్చుతుంది లేక జీవితాన్ని మార్చుతుంది. ఒక వ్యక్తి దైవవాక్యాన్ని తప్పులేకుండా బోధించవచ్చు. అతడికి ఆజ్ఞలు వాగ్దానాలన్నీ క్షుణ్ణంగా తెలిసిఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ బోధపర్చకపోతే ఏ ఆత్మా రక్షణ బండమీద పడి ముక్కలవ్వదు. దేవుని సహకారం లేకుండా ఎంతవిద్య అయినా, ఎన్ని సదుపాయాలైనా, అవి ఎంత గొప్పవైనప్పటికీ అవి ఒక్క వెలుగు సాధనాన్ని చెయ్యలేవు. పరలోకపు మంచుకురిసి విత్తనాన్ని మొలకెత్తించకపోతే సువార్త విత్తనం చల్లినంతమాత్రాన లాభం ఉందడు. క్రీస్తు ఆరోహణానంతరం కొత్త నిబంధనలో ఒక్క పుస్తకం రచించడం జరగక ముందు, క్రీస్తు ఆరోహణానంతరం ఒక్క సువార్త ప్రసంగం బోధించడం జరగక ముందు ప్రార్థిస్తున్న అపొస్తలుల మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. అప్పుడు వారి శత్రువుల సాక్ష్యం ఇది : “మీరు యెరూషలేమును మీ బోధలతో” నింపారు. అ.కా. 5:28.DATel 758.2

    క్రీస్తు సంఘానికి పరిశుద్దాత్మ వరాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తొలినాటి శిష్యులికి ఎంత వర్తించిందో అంతే ఈనాటి మనకూ వర్తిస్తోంది. కాకాపోతే ప్రతీ వాగ్దానానికిలాగే దీనికీ షరతులున్నాయి. ప్రభువు వాగ్దానాల్ని నమ్ముతున్నట్లు, అవి తమ విషయంలో నెరవేరుతున్నట్లు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. వారు క్రీస్తును గురించి పరిశుద్ధాత్మను గిరించి మాట్లాడారు. అయినా ఎలాంటి లాభం పొందరు. వారు తమ ఆత్మను దైవసాధనాల నడుపుదలకు అదుపుకు సమర్పించుకోరు. మనం పరిశుద్దాత్మను ఉపయోగించుకోలేం. పరిశుద్దాత్మే మనల్ని ఉపయోగించాలి. “ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగుజేయుటకును” దేవుడు ఆత్మ ద్వారా తన ప్రజల్లో పనిచేస్తాడు. ఫిలి. 2:13. కాగా అనేకులు దీన్ని అంగీకరించరు. వారు స్వతంత్రంగా వ్యవహిరించాలని కోరుకుంటారు. ఇందువల్లనే వారు ఈ పరలోక వరాన్ని పొందలేకపోతున్నారు. ఎవరైతే వినయంగా దేవుని మీద ఆధారపడి వేచి ఉంటారో, ఎవరైతే ఆయన నడుపుదలకోసం కృపకోసం కనిపెడ్తారో, వారు మాత్రమే పరిశుద్దాత్మను పొందుతారు. వారు డిమాండు చేసి స్వీకరించడానికి దేవుని శక్తి వేచి ఉంది. విశ్వాసమూలంగా పొందవలసిన ఈ వాగ్దత్త దీవెన దీనితోపాటు తకిన దీవెనలన్నిటిని తెస్తుంది. క్రీస్తు కృపైశ్వర్యాన్ని బట్టి ఇది అనుగ్రహించబడుతుంది. ప్రతీ ఆత్మకు తాను స్వీకరించగలిగినంత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.DATel 758.3

    శిష్యులతో తన మాటల్లో యేసు తన శ్రమల గురించి మరణం గురించి దుఃఖకరమైన ఎలాంటి ప్రస్తావన తేలేదు. ఆయన వారికి చివరగా విడిచి పెట్టే • ఆస్తి శాంతి. ఆయన ఇలా అన్నాడు, “శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. నా హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”DATel 759.1

    మేడ పైగదిని విడిచి పెట్టకముందు రక్షకుడు శిష్యుల్ని స్తుతిగానంలో నడిపించాడు. ఆయన స్వరం విలాపగీతాలాపనలో గాక పస్కా స్తోత్రగీత సునాదంలో వినిపించింది :DATel 759.2

    “యెహోవా కృప మన యెడల హెచ్చుగానున్నది
    ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును
    కాబట్టి సమస్త అన్యజనులారా,
    యెహోవాను స్తుతించుడి
    సర్వజనులారా, ఆయనను కొనియాడుడి
    యెహోవాను స్తుతించుడి” కీర్త. 117.
    DATel 759.3

    కీర్తన పాడిన తర్వాత వారు బయటికి వెళ్లారు. జనులతో నిండిన వీధులగుండా, పట్టణ, గుమ్మందాటి ఒలీవల కొండ దిశగా వెళ్లారు. వారు నెమ్మదిగా వెళ్తున్నారు. ఎవరి ఆలోచనల్లో వారు మునుగి నడుస్తున్నారు. వారు కొండకేసి దిగుతుండగా విషాద స్వరంతో యేసు ఇలా అన్నాడు, “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొట్టెల కాపరిని కొట్టుదును, మందలోని గొట్టెలు చెదరిపోవును అని వ్రాయబడియున్నదిగదా” మత్తయి 26:31. శిష్యులు దుఃఖంతో ఆశ్చర్యంతో విన్నారు. కపెర్నహోములో సమాజమందిరంలో క్రీస్తు తానే జీవాహారమని అన్నప్పుడు అనేకులు అభ్యంతరం వ్యక్తంచేసి ఆయన్ని వదిలి ఎలా వెళ్లిపోయారో జ్ఞాపకం చేసుకున్నారు. కాని పన్నెండుమంది శిష్యుల్లో ఎవరూ అపనమ్మకంగా ఉన్నట్లు కనపర్చుకోలేదు. సహోదరుల తరపున మాట్లాడూ పేతురు క్రీస్తుపట్ల తన ప్రభు భక్తిని ప్రకటించుకున్నాక అప్పుడు రక్షకుడిలా అన్నాడు, “నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచుకొనలేదా? నాలో ఒకడు సాతాను.” యోహా 6:70. పన్నెండు మందిలో ఒకడు తనను అప్పగిస్తాడని, పేతురు తనను ఎరుగనని బొంకుతాడని మేడగదిలో యేసు చెప్పాడు.DATel 759.4

    దాన్ని తీవ్రంగా నిరసిస్తూ పేతురు ఇలా అన్నాడు, “అందరు అభ్యంతర పడినను నేను అభ్యంతరపడను.” మేడ గదిలో పేతురు “మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాను” అని ఘంటాకంఠంగా చెప్పాడు. ఆ రాత్రే అతడు తన రక్షకుణ్ని ఎరుగనని బొంకుతాడని క్రీస్తు హెచ్చరించాడు. ఇప్పుడు క్రీస్తు ఆ హెచ్చరికనే మళ్లీ చేశాడు : “నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే పేతురు “మరి ఖండితముగా - నేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.” మార్కు 14:29, 30, 31. తాము పరీక్షకు సిద్ధంగా లేరని ఎరిగిన ఆయన పదేపదే చేసిన ప్రకటనల్ని ఆత్మవిశ్వాసం దండిగా ఉన్న శిష్యులు నిరాకరించారు.DATel 760.1

    తన ప్రభువుతో చెరసాలకీ మరణానికి వెళ్తానని పేతురు అన్నప్పుడు, ఆమాట ఆషామాషీగా అనలేదు. కాని అతడు తన్ను తాను తెలుసుకోలేకపోయాడు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవితంలో పెద్దవిగా మారే చెడ్డగుణాలు అతడి హృదయంలో దాగి ఉన్నాయి. అతడు తన ప్రమాదాన్ని గుర్తెరిగితేనే తప్ప ఇవి అతడి నిత్య నాశనానికి దారి తియ్యవచ్చు. స్వార్థప్రేమ, క్రీస్తుపట్ల తన ప్రేమను సయితం నియంత్రించే నిశ్చయతను రక్షకుడు అతడిలో చూశాడు. దుర్బలత, నిర్లజ్జగా పాపం చెయ్యడం, లెక్కచెయ్యని స్వభావం, దురాగ్రహం, మొండిగా శోధనలో ప్రవేశించడం - ఇవి అతడి అనుభవంలో కనిపించాయి. క్రీస్తు గంభీర హెచ్చరిక హృదయ పరిశోధనకు పిలుపు. పేతురు తన్నుతాను తక్కువ నమ్ముకుని క్రీస్తు పై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండడం అవసరం. హెచ్చరికను దీన మనసుతో స్వీకరించి ఉంటే, తన మందను కాసుకోమని మంద కాపరికి విజ్ఞప్తి చేసేవాడు. గలిలయ సముద్రంలో మునిగిపోడానికి సిద్ధంగా ఉన్నప్పుడు “ప్రభువా, నన్ను రక్షించుము” అని అరిచాడు. (మత్త 14:30). అప్పుడు క్రీస్తు అతడి చెయ్యిపట్టుకోడానికి చెయ్యి చాపాడు. అలాగే ఇప్పుడు ప్రభువా నన్ను నా స్వార్దాన్నుంచి రక్షించు అని వేడుకుని ఉంటే ఆయన అతణ్ని కాపాడేవాడు. కాని ఆయన తనని అనుమానిస్తున్నాడని భావించాడు. అది దారుణ మనుకున్నాడు. ఇప్పటికే అతడు నొచ్చుకున్నాడు. అతడి ఆత్మవిశ్వాసం ఇంకా ఎక్కువయ్యింది.DATel 760.2

    క్రీస్తు తన శిష్యుల వంక దయగా చూశాడు. వారిని శ్రమనుంచి కాపాడలేడు. కాని ఓదార్పు లేకుండా వారిని విడిచిపెట్టలేదు. సమాధి సంకెళ్లను బద్దలుకొడానని, తమను ప్రేమించడం మాననని వారికి ఆయన భరోసా ఇచ్చాడు. “నేను లేచిన తరువాత మీకంటే ముందు గలిలయకు వెళ్లెదను” అన్నాడు. మత్త. 26:32. ఆయన్ని ఎరగమని బొంకక ముందు వారికి క్షమాపణ పొందామన్న నిశ్చయత ఉన్నది. ఆయన మరణం పునరుత్థానం అనంతరం తాము క్రీస్తుకి ప్రియులమని వారు తెలుసుకున్నారు.DATel 761.1

    యేసు ఆయన శిష్యులు ఒలీవల కొండవద్ద ఉన్న గెత్సెమనే తోటకు వెళ్తున్నారు. ఆ తోటలో ఒక ప్రశాంతమైన చోటికి ప్రార్థించడానికి ధ్యానించడానికి ఆయన తరచుగా వెళ్లేవాడు. లోకంలో తన కర్తవ్యాన్ని, తనతో తాము కొనసాగించాల్సిన ఆధ్యాత్మిక సంబంధాన్ని రక్షకుడు వారికి వివరిస్తుండేవాడు. ఇప్పుడు ఆ పాఠానికి ఉదాహారణలిస్తోన్నాడు. చంద్రుడు ప్రకాశిస్తోన్నాడు. పెరుగుతున్న ద్రాక్షపాదు వెన్నెల్లో చక్కగా కనిపిస్తోంది. శిష్యుల గమనాన్ని దాని పైకి తిప్పి దాన్ని ఒక చిహ్నంగా వినియోగించాడు.DATel 761.2

    “నేను నిజమైన ద్రాక్షావల్లిని” అన్నాడు. అందమైన గొంజి చెట్టునో దేవదారు చెట్టునో సింధూర చెట్టునో ఎంపిక చేసుకునే బదులు మెలివేసుకునే తీగలు కాడలు ఉండే ద్రాక్షావల్లిని తనను సూచించడానికి యేసు ఎంపిక చేసుకున్నాడు. గొంజి, దేవదారు, సింధూర చెట్లు ఒంటరిగా నిలిచి ఉంటాయి వాటికి సహాయం అవసరంలేదు. కాని ద్రాక్షవల్లి చిన్న చిన్న తీగెలు కాడలతో చుట్టుకుంటూ ఆకాశం వైపుకు పెరుగుతుంది. అలాగే క్రీస్తు తన మానవ జీవితంలో దైవ శక్తిమీద ఆధారపడ్డాడు. “నా అంతట నేనే ఏమియు చేయలేను” అన్నాడాయన. యోహా 5:30.DATel 762.1

    “నేను నిజమైన ద్రాక్షవల్లిని.” మొక్కలన్నిటిలో దాక్షావల్లి ఉత్తమమైంది. శక్తిమంతమైన, శ్రేష్ఠమైన, ఫలప్రదమైన వాటన్నిటికీ చిహ్నంగా యూదులు దాన్ని పరిగణించారు. వాగ్దత్త భూమి పై దేవుడు నాటిన ద్రాక్షతోటగా ఇశ్రాయేలును వర్ణించడం జరిగింది. యూదులు ఇశ్రాయేలుతో తమ సంబంధంపై తమ రక్షణ నిరీక్షణను నిలుపుకున్నారు. కాని నేనే ద్రాక్షవల్లిని అని యేసంటున్నాడు. ఇశ్రాయేలుతో మీ సంబంధాన్ని బట్టి దేవుని జీవితంలో భాగస్వాములవుతామని ఆయన వాగ్దాన ఫలాన్ని పొందుతామని తలంచవద్దు. నా ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జీవితం లభ్యమౌతుంది అన్నాడు.DATel 762.2

    “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.” పాలస్తీనా కొండల పై మన పరలోక తండ్రి శ్రేష్ఠమైన ద్రాక్షావల్లిని నాటాడు. ఆయనే వ్యవసాయదారుడు. అందమైన ఆ ద్రాక్షావల్లికి అనేకులు ఆకర్షితులయ్యారు. అది పరలోకంలో పుట్టినదని వెల్లడించారు. కాని ఇశ్రాయేలు నాయకులికి అది బీడు భూమినుంచి తీసిన వేరులా కనిపిచింది. వారు ఆ వల్లిని చిత గొట్టారు. దాన్ని అపవిత్ర పాదాలతో తొక్కారు. దాన్ని ఇక ఎన్నటికీ లేకుండా నాశనం చెయ్యాని తలంచారు. అయితే ఆ పరలోక వ్యవసాయకుడు తాను నాటిన మొక్కను మర్చిపోలేదు. ఆ మొక్కను చంపేశామని మనుషులు భావించిన తర్వాత ఆయన దాన్ని తీసి గోడ అవతల మళ్లీ నాటాడు. ఆ ద్రాక్షావల్లి మొదలు ఇక కనిపించదు. మానవుల దాడికి గురి కాకుండా అది గూఢంగా దాగి ఉంది. ఇలాగుండగా ఆ వల్లి తీగెలు గోడమీద నుంచి కిందికి విస్తరించి ఉన్నాయి. అవి ద్రాక్షావల్లిని సూచించాల్సి ఉన్నాయి. వాటి ద్వారా అంటులు కట్టే వల్లితో ఇంకా ఏకం కావచ్చు. అవి ఫలాలు ఫలించాయి. వాటి పండ్లను దారినపోయేవారు కోసుకున్నారు.DATel 762.3

    “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు,” అని క్రీస్తు శిష్యులతో అన్నాడు. ఆయన వారిని విడిచి వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనతో వారి ఆధ్యాత్మిక ఐక్యతలో మార్పు ఉండదు. వల్లితో తీగెకున్న సంబంధాన్ని మీరు నాతో కలిగి ఉండాలి అని ఆయన ఉపదేశించాడు. జీవిస్తున్న వల్లికి అంటుకట్టడం జరుగతుంది. ఆ అంటు పీచుకిపీచు నాడికినాడిగా ఆ వల్లి మొదల్లోకి పెరుగుతుంది. వల్లి జీవమే తీగె జీవమౌతుంది. అలాగే అతిక్రమాలు పాపాల్లో మృతమైన ఆత్మ క్రీస్తుతో జతపడడం ద్వారా జీవాన్ని పొందుతుంది. వ్యక్తిగత రక్షకుడుగా ఆయన పై విశ్వాసం ద్వారా ఐక్యత ఏర్పడ్తుంది. తన బలహీనతను క్రీస్తు బలంతోను, తన శూన్యతను క్రీస్తు సంపూర్ణతతోను, తన శక్తి హీనతను క్రీస్తు అనంత శక్తితోను పాపి ఐక్యపర్చుకుంటాడు. అప్పుడు అతడికి క్రీస్తు మనసు ఉంటుంది. క్రీస్తు మానవత మన మానవతను స్పృశిస్తుంది. మన మానవత ఆయన దైవత్వాన్ని స్పృశిస్తుంది. ఈ రకంగా పరిశుద్ధాత్మ సేవ ద్వారా మానవుడు దైవ స్వభావంలో పాలివాడవుతాడు. తన ప్రియ కుమారుని ద్వారా దేవుడు అతణ్ణి అంగీకరిస్తాడు.DATel 763.1

    క్రీస్తుతో ఒకసారి ఏర్పడ్డ ఐక్యత కొనసాగాలి. క్రీస్తు ఇలా అన్నాడు, “నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట దానే యేలాగు ఫలింపదో ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.” ఇది కాకతాళీయంగా జరిగే స్పర్శగాని అంటీ ముట్టని సంబంధంగాని కాదు. తీగె వల్లి జీవితంలో భాగమవుతుంది. వేరు నుంచి తీగెలకు ప్రవహించే జీవం బలం ఫలదాయకశక్తి నిరాటంకంగా నిత్యం కొనసాగుతుంది. వల్లి నుంచి వేరైన తీగె బతకదు. అలాగే నాకు వేరుగా ఉండి మీరు జీవించలేరు అన్నాడు యేసు. నా నుంచి మీరు పొందిన జీవం నాతో నిత్య సంబంధం ద్వారానే కొనసాగుతుంది. నేను లేకుండా మీరు ఒక్క పాపాన్ని కూడా జయించలేరు లేక ఒక్క శోధనను కూడా ప్రతిఘటించలేరు.DATel 763.2

    “నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును.” క్రీస్తులో నిలిచి ఉండడమంటే ఆయన ఆత్మను నిత్యం స్వీకరించడం, ఆయన సేవకు మినహాయింపులేకుండా అంకితమై జీవించడం. మానవుడికి దేవునికి మధ్య సహవాసానికి మార్గం నిత్యం తెరుచుకుని ఉండాలి. వల్లికున్న తీగె సజీవ వల్లి నుంచి నిత్యం పోషణను తీసుకునే రీతిగా మనం యేసుని హత్తుకుని విశ్వాసం ద్వారా ఆయన నుంచి ఆయన ప్రవర్తన శక్తిని పరిపూర్ణతను పొందాలి.DATel 763.3

    వేరు తన పోషకాహారాన్ని బయట కాడలు రెమ్మలకు తీగె గుండా పంపుతుంది. అలాగే క్రీస్తు ఆధ్యాత్మిక విద్యుచ్ఛక్తిని ప్రతీ విశ్వాసికి పంపుతాడు. ఆత్మ క్రీస్తుతో కలిసి ఉన్నంతకాలం అది ఎండిపోతుందన్న భయంగాని కుళ్ళిపోతుందన్న బెంగగాని లేదు.DATel 764.1

    ద్రాక్షావల్లి బతుకు దాని తీగెలకుండే పండ్లలో బయలుపడుతుంది. “ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మిరేమియు చేయలేరు.” అని యేసన్నాడు. మనం విశ్వాసమూలంగా దైవ కుమారునిపై ఆధారపడి నివసిస్తే మనలో ఆత్మఫలాలు కనిపిస్తాయి. అందులో ఒక్కటి కూడా లోపించదు.DATel 764.2

    “నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును.” అంటు ద్రాక్షవల్లితో బాహ్యంగా కలిసిఉన్నా ఆ రెంటి మధ్య ముఖ్యమైన అనుసంధానం లేకపోవచ్చు. అప్పుడు పెరుగుదలగాని ఫలాలు ఫలించడం గాని ఉండదు. అలాగే క్రీస్తుతో బాహ్యా సంబంధముండవచ్చు, ఆయనతో విశ్వాసం ద్వారా నిజమైన ఐక్యత లేకపోవచ్చు. నామమాత్రపు మతంతో మనుషులు సంఘంలోకి రావచ్చు. అయితే వారికి క్రీస్తుతో సంబంధం ఉందో లేదో వారి ప్రవర్తన నడత బయలుపర్చుతాయి. వారు ఫలాలు ఫలించకపోతే వారు దొంగ తీగెలు. క్రీస్తుతో వారి వేర్పాటు ఎండిన తీగె సూచించే సంపూర్ణ నాశనాన్ని కలిగిస్తుంది. క్రీస్తు ఇలా అన్నాడు, “ఎవడైననను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.”DATel 764.3

    “ఫలించు ప్రతి తీగె మరియెక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.” యేసుని వెంబడించిన పన్నెండుమంది శిష్యుల నుంచి ఒకడు ఎండిపోయిన తీగేగా తీసివేయబడడానికి సిద్ధంగా ఉన్నాడు. తక్కినవారు తీవ్రశ్రమ కత్తికోతకు లోను కావాల్సి ఉన్నారు. వ్యవసాయదారుడి ఉద్దేశాన్ని యేసు ఓర్పుతోను నేర్పుతోను వివరించాడు. పనికిరాని తీగెల తొలగింపు బాధకలిగిస్తుంది. అయితే కత్తిని వాడేది తండ్రి. ఆయన నిరంకుశంగా గాని నిర్లక్ష్యంగాగాని వ్యవహరించడు. కొన్ని తీగలు నేలపై పడి ఉన్నాయి. వాటి సూక్షతీగెలు నేలపై పాకడం వల్ల ఏర్పడ్డ ఆధారం నుంచి వీటిని కోసి వెయ్యాలి. అది ఆకాశంవైపుకు పెరగాలి. దేవుని మీద ఆధారపడాలి. గుబురుగా పెరిగిన ఆకులు పండునుంచి జీవ విద్యుత్తును హరించివేస్తున్నాయి. వాటిని తీసివేయాలి. అధిక పెరుగుదలను తొలగించాలి. నీతిసూర్యుని స్వస్తత కిరణాలికి చోటు కల్పించడానికి ఈ పనిచెయ్యాలి. పండ్లు పుష్టిగా సమృద్ధిగా ఉండేందుకు వ్యవసాయదారుడు హానికరమైన ఎదుగుదలను తొలగిస్తాడు.DATel 765.1

    “మీరు బహుగా ఫలింటచుట వలన నా తండ్రి మహిమపరచబడును” అని యేసన్నాడు. దేవుడు తన సొంత ప్రవర్తన తాలూకు పరిశుద్ధతను, ఔదార్యాన్ని, దయాళుత్వాన్ని మీ ద్వారా ప్రదర్శించాలని ఆశిస్తోన్నాడు. అయినా శిష్యుల్ని ఫలాలు ఫలించమని ఆదేశించడం లేదు. తనయందు నిలిచి ఉండాల్సిందిగా కోరుతున్నాడు. ఆయన ఇలా అంటోన్నాడు, “నా యందు నారును నా యందు నామాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.” వాక్యం ద్వారా క్రీస్తు తన అనుచరుల్లో నిలిచి ఉంటాడు. ఆయన శరీరాన్ని తినడం ఆయన రక్తాన్ని తాగడం సూచించే ఏకత్వం ఇదే. క్రీస్తు మాటలు ఆత్మ, జీవం. వాటిని స్వీకరించడం ద్వారా మీరు ద్రాక్షవల్లి జీవితాన్ని పొందుతారు. “దేవుని నోటనుండి ప్రతి మాటవలనను” మీరు జీవిస్తారు. మత్త 4:4. మిలో క్రీస్తు జీవితం ఆయనలో ఫలించిన ఫలాలే ఫలిస్తుంది. క్రీస్తులో నివసించి, క్రీస్తు మాటలు ఆచరించి, క్రీస్తు మద్దతు కలిగి, క్రీస్తు నుంచి పోషణను పొందుతున్నప్పుడు మీరు క్రీస్తు ఫలించిన ఫలాలు ఫలిస్తారు.DATel 765.2

    తన శిష్యులతో ఈ చివరి సమావేశంలో క్రీస్తు తాను వారిని ఎలా ప్రేమించాడో అలాగే వారు కూడా ఒకరినొకరు ప్రేమించాలన్న కోరికను వ్యక్తం చేశాడు. పదేపదే దీన్ని గురించే ఆయన మాట్లాడాడు. “మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను” అంటూ ఆయన మళ్లీ మళ్లీ వారికి విజ్ఞప్తి చేశాడు. శిష్యులికి ఈ ఆజ్ఞ కొత్తది. ఎందుకంటే క్రీస్తు తమను ప్రేమించిన రీతిగా వారు ఒకరినొకరు ప్రేమించలేదు. నూతనాభిప్రాయాలు భావోద్రేకాలు వారిని అదుపుచెయ్యాలని, వారు నూతన సూత్రాన్ని అనుసరించాలని, తన జీవితం, మరణం ద్వారా వారు ప్రేమను గుర్చి నూతన అభిప్రాయాన్ని పొందాలని ఆయన భావించాడు. ఆయన ఆత్మార్పణ వెలుగులో వారు పరస్పరం ప్రేమించాలన్న ఆజ్ఞ నూతన అర్ధాన్ని సంతరించుకున్నది. కృప తాలూకు సేవ అంతా నిత్యం సాగే ప్రేమపూర్వక పరిచర్య, ఆత్మనిరసన, ఆత్మత్యాగ పూరిత కృషి. భూమిపై క్రీస్తు సంచారం చేసిన ప్రతీ గడియలోను దేవుని ప్రేమ ప్రవాహంలో ఆయన నుంచి ప్రవహించింది. ఆయన ఆత్మతో నిండిన ప్రతీవారు ఆయన ప్రేమించినట్లు ప్రేమిస్తారు. క్రీస్తును ఏ నియమం నడిపించిందో అదే నియమం వారు ఒకరితో ఒకరు వ్యవహిరించే తీరులో కూడా వారిని నడిపిస్తుంది.DATel 765.3

    ఈ ప్రేమ వారి శిష్యత్వ వాసికి నిదర్శనం. యేసు ఇలా అన్నాడు, “మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” ఒత్తిడివల్లగాని లేక స్వార్థాశ వల్లగాని కాక ప్రేమవల్ల మనుషులు ఐక్యత కలిగి ఉంటే మానవ ప్రభావాన్ని మించిన ఒక ప్రభావం పనిచేస్తుందని వారు చూపిస్తారు. ఈ ఏకత్వం ఉన్నచోట దేవుని స్వరూపం పునరుద్ధరించబడ్తుందని, ఒక నూతన జీవన సూత్రం హృదయంలో స్థాపితమయ్యిందని అర్థమౌతుంది. మానవాతీత దుష్టశక్తుల్ని తట్టుకోడానికి దైవ స్వభావంలో శక్తి ఉందని, స్వాభావిక మనసులో ఉండే స్వార్థాన్ని దైవకృప అణచివేస్తుందని అది చూపిస్తుంది.DATel 766.1

    సంఘంలో ప్రదర్శితమయ్యే ప్రేమ సాతానుకి కోపం పుట్టిస్తుంది. క్రీస్తు తన శిష్యులికి సులువైన మార్గాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఆయన ఇలా అన్నాడు, “లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోకసంబంధులుకారు, నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడుకాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడ హింసింతురు. నా మాటగైకొనిన యెడల, మీ మాటకూడ గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మికు చేయుదురు.” తీవ్రపోరాటంతోను వ్యతిరేకత నడుమ, అపాయం, నష్టం, శ్రమల మధ్య, సువార్తను ప్రచురించాలి. కాని ఈ సేవ చేసేవారు తమ ప్రభువు అడుగుజాడల్లో నడుస్తున్నారు.DATel 766.2

    లోక విమోచకుడుగా క్రీస్తుకి నిత్యం పరాజయం ఎదురైనట్లు కనిపిస్తుంది. లోకానికి కృపాదూత అయిన ఆయన ప్రజల్ని ఉద్దరించడంలోను రక్షించడంలోను తాను చేయాలని ఆశించిన దానిలో చాలా తక్కువ సాధించినట్లు కనిపిస్తోంది. ఆయన మార్గానికి ప్రతిబంధకాలు కలిగించడానికి సాతాను శక్తులు ప్రభావాలు నిత్యం కృషిచేస్తోన్నాయి. అయినా ఆయన నిరాశచెందడు. యెషయా ప్రవచనం ద్వారా ఆయన ఇలా అంటున్నాడు, “అయినను-వ్యర్ధముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృధాగా వ్యయపరచియున్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనేయున్నది... యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను.” ఈ వాగ్దానం క్రీస్తుకి ఇచ్చినది, “ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ములకు సేవకుడునగు వానితో... యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు... బయలు వెళ్లుడి అని బంధింపబడినవారితోను - బయటికి రండి అని చీకటిలోనున్నవారితోను చెప్పుచు దేశమును చక్కబరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని... వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవును. నీటి బుగ్గల యెద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలియైనను దప్పికయైనను కలుగదు. ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.” యెష. 49:4, 5, 7-10.DATel 767.1

    ఈ వాగ్దానంపై ఆధారపడి క్రీస్తు సాతానుకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. క్రీస్తుని సిగ్గుపర్చడానికి అవమానపర్చడానికి చివరి చర్యలు చేపడున్నప్పుడు, అతి విషాదకరమైన దుఃఖం ఆయన ఆత్మను ఆవరిస్తున్నప్పుడు, శిష్యులతో ఆయనిలా అన్నాడు, ” ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమియులేదు.” “ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు” “ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయబడును.” యోహా. 14:30, 16:11, 12:31. తన చివరి మహా సంఘర్షణలో చోటుచేసుకోనున్న సన్నివేశాల్ని ప్రవచన దృష్టితో క్రీస్తు చిత్రించాడు. “సమాప్తమైనది” అని తాను అన్నప్పుడు యావత్ పరలోకం విజయం సాధిస్తుందని ఆయనకు తెలుసు. పరలోకం నుంచి వస్తున్న సంగీతం జయజయ ధ్వనులు ఆయన చెవిని పడ్తున్నాయి. అప్పుడు సాతాను రాజ్యానికి మరణ ఘంటికలు మోగుతాయని ఈ విశాల విశ్వంలోని లోకాలన్నిటిలో తన పేరు ప్రకటితమవుతుందని క్రీస్తుకు తెలుసు.DATel 768.1

    తన అనుచరులు అడగగలిగిన దానికన్నా ఊహించగలిగిన దానికన్నా వారికి ఎక్కువ చేయగలిగినందుకు క్రీస్తు ఆనందిచాడు. లోక సృష్టికి ముందే సర్నోన్నతాదేశం వెలువడిందని తెలిసి ఆయన నిశ్చయతతో మాట్లాడాడు. దుర్మార్గం దుష్టత్వంతో సాగే సంఘర్షణలో సర్వశక్తిగల పరిశుద్దాత్మ దన్నుగల సత్యం విజయం సాధించడం తథ్యమని రక్తంతో తడిసిన ధ్వజం తన అనుచరుల తలలపై రెపరెపలాడూ ఎగురుతుందని ఆయనకు తెలుసు. నమ్మకమైన తన శిష్యుల జీవితం తన జీవితంలాగే ఆటంకాలు లేని కొన్ని విజయపరంపరలతో సాగుతుందని, అవి విజయాలుగా ఇక్కడ గుర్తింపు పొందుకపోయినా దేవుని రాజ్యంలో గొప్ప విజయాలుగా గుర్తింపు పొందుతాయని ఆయనకు తెలుసు.DATel 768.2

    “నాయందు నాకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నాతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించియున్నాను” అన్నాడు. క్రీస్తు అపజయం పొందలేదు. అధైర్యం చెందలేదు. ఆయన అనుచరులు అలాగే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి నివసించాలి. తమ ప్రభువు గొప్ప కార్యసాధకుడు అని నమ్మి ఆయనపై ఆధారపడతారు కాబట్టి ఆయన అనుచరులు ఆయన నివసించినట్లు నివసించి ఆయన పనిచేసినట్లు పమిచెయ్యాలి. వారికి ధైర్యం, శక్తి, సహనం ఉండాలి. అసాధ్యంగా కనిపించే కొన్ని సమస్యలు మార్గానికి ఆటంకాలుగా నిలిచినా ప్రభువు కృప ద్వారా వారు ముందుకిసాగాలి. కష్టాల్ని చూసి కన్నీళ్లు కార్చేకన్నా నడుం బిగించి వాటిని అధిగమించాలి. వారు దేని విషయంలోను నిస్సృహ చెందక ప్రతీ మంచికార్యం కోసం నిరీక్షించాలి. నిరుపమానమైన ప్రేమ అనే బంగరు గొలుసుతో దేవుని సింహాసనానికి క్రీస్తు వారిని బంధిచాడు. సర్వశక్తికి ఆధారభూతుడైన దేవుని నుంచి వస్తూ విశ్వాంతరాళం అంతటిలోను అత్యున్నతమైన ప్రభావం వారిదవ్వాలన్నది ఆయన పరముద్దేశం. వారు దుష్టిని ప్రతిఘటించే శక్తిని పొందాల్సి ఉన్నారు. భూమిగాని, మరణంగాని, నరకంగాని జయించలేని శక్తి అది. ఆ శక్తి క్రీస్తువలె జయించడానికి బలాన్నిస్తుంది.DATel 768.3

    పరలోక క్రమం, పరలోక పరిపాలనా విధానం, పరలోక పరిశుద్ధ సామరస్యం భూమిపై తన సంఘంలో ప్రతిబింబించాలన్నది క్రీస్తు ఆశయం. ఈ విధంగా ఆయన తన ప్రజల్లో మహిమను పొందుతాడు. వారి ద్వారా నీతి సూర్యుడు లోకానికి ప్రకాశవంతమైన వెలుగునిస్తాడు. తాను విమోచించి కొన్న ఆస్తినుంచి పెద్ద మొత్తంలో మహిమ అనే ఆదాయం పొందడానికి క్రీస్తు తన సంఘానికి చాలినన్ని సదుపాయాల్ని ఇచ్చాడు. తన సొంత సమృద్ధిని సూచిందేందుకు గాను ఆయన తన ప్రజలకు సమర్ధతలు దీవెనల్ని ఇచ్చాడు. క్రీస్తు నీతిని పొందిన సంఘం ఆయన ధనాగారం. అందులో ఆయన కరుణ, కృప, ప్రేమ సంపద పూర్తిగా సొంతంగా ప్రదర్శితం కావలసి ఉంది. తాను భరించిన సిగ్గుకు ప్రతిఫలంగా, సమస్త మహిమ ఎవరినుంచి ప్రకాశిస్తుందో దానికి కేంద్రమైన క్రీస్తు మహిమకు అనుబంధంగా పవిత్రులుగాను పరిపూర్ణులుగాను తన ప్రజల్ని చూడాలని ఆయన ఎదురుచూస్తోన్నాడు.DATel 769.1

    రక్షకుడు తన ఉపదేశాన్ని బలమైన, నిరీణపూరితమైన మాటలతో ముగించాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ఇలా అన్నాడు, “తండ్రి నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరుచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మిదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”DATel 769.2

    తండ్రి తనకిచ్చిన పనిని క్రీస్తు ముగించాడు. భూమిపై ఆయన తండ్రిని మహిమపర్చాడు. తండ్రి నామాన్ని ప్రచురపర్చాడు. లోకంలో తన సేవను కొనసాగించాల్సినవారిని పోగుచేశాడు. పోగుచేసి ఇలా అన్నాడు, “వారియందు నేను మహిమ పరచబడియున్నాను, నేనికను లోకములో ఉండనుగాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.” “వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచువారందరును ఏకమై యుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారియందు, నేనును నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనినట్లు నాకనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని.”DATel 770.1

    ఈ విధంగా దైవాధికారంగల వ్యక్తి మాటల్లో తాను ఎన్నుకున్న సంఘాన్ని క్రీస్తు తండ్రి చేతుల్లో పెట్టాడు. తన్ను తాను సమర్పించుకున్న ప్రధాన యాజకుడుగా క్రీస్తు తన ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్మకమైన కాపరిగా తన మందను సర్వశక్తుని నీడను బలమైన స్థిరమైన ఆశ్రయంలోకి పోగుచేస్తోన్నాడు. సాతానుతో ఆయనకు చివరి సంఘర్షణ వేచి ఉంది. దాన్ని ఎదుర్కోడానికి ఆయన ముందుకు సాగుతోన్నాడు.DATel 770.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents