Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    3—“కాలము పరిసమాప్తము”

    ” కాలము పరిసమాప్తమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను... మనము దత్త పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.” గలతీ 4:4,5DATel 17.1

    రక్షకుని రాక ఏదెనులో ప్రవచితమయ్యింది. ఆ వాగ్దానాన్ని ఆదామవ్వలు మొదటగా విన్నప్పుడు అది త్వరగా నెరవేరుతుందని ఎదురు చూశారు. తమ ప్రథమ కుమారుడు పుట్టినప్పుడు ఆనందంతో స్వాగతించారు. అతడే తమ విమోచకుడని భ్రమపడ్డారు. కాని ఆ వాగ్దాననెరవేర్పులో జాప్యం చోటుచేసుకుంది. ఆ వాగ్దానాన్ని ఆదిలో అందుకున్నవారు దాని నెరవేర్చును చూడకుండానే మరణించారు. హనోకు దినాలనుంచి పితరులు ప్రవక్తల ద్వారా ఈ వాగానాన్ని పునరుద్ఘాటించటం జరుగుతూ వచ్చింది. ఇలా ఆయన వస్తాడన్న నిరీక్షణ కొనసాగుతూ వచ్చింది. కాని ఆయన రాలేదు. దానియేలు ప్రవచనం ఆయన రాక సమయాన్ని బయలుపర్చింది. కాని దాని వివరణలో పొరపాటు వల్ల ఆ వర్తమానాన్ని అపార్థం చేసుకోవటం జరిగింది. ఒక దాని తర్వాత ఒకటిగా శతాబ్దాలు గతించిపోయాయి. ప్రవక్తల స్వరాలు ఆగిపోయాయి. ఇశ్రాయేలు పై హింసకుడి హస్తం ప్రబలమైనందువల్ల ప్రజలు “దినములు జరిగిపోవుచున్నవి; ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది.” (యెహె12:22) అనటానికి సిద్ధమయ్యారు.DATel 17.2

    వాటికి ఏర్పాటైన విశాల పరిభ్రమణ మార్గంలోని నక్షత్రాల్లా దేవుని సంకల్ఫాలసిద్ధికి తొందరగాని జాప్యంగాని ఉండదు. గొప్ప అంధకారం, కాలుతున్న కొలిమి చిహ్నాల ద్వారా ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని గురించి దేవుడు అబ్రహాముకి బయలుపర్చాడు. అక్కడ వారి సంచార కాలం నాలుగువందల సంవత్సరాలని తెలిపాడు. “తరువాత వారు మిక్కిలి ఆసక్తితో బయలుదేరి వచ్చెదరు” అన్నాడు. ఆది 15:14. ఆ మాటను వమ్ము చెయ్యటానికి గర్వాంధుడైన ఫరో తన సర్వశక్తినీ ఒడ్డి వ్యర్థంగా పోరాడాడు. దైవ వాగ్దానంలో నిర్దేశితమైనట్లు “ఆ దినమందే యోహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.” నిర్గమ 12:41. అలాగే దేవుని ఆలోచనలో క్రీస్తు రాక ఘడియ నిర్దేశితమయ్యింది. ఆ సమయాన్ని సూచించే గడియారం ఆ ఘడియను నిర్ధారించినప్పుడు యేసు బేల్లెహేములో జన్మించాడు.DATel 17.3

    “కాలము పరిసమాప్తమైనప్పుడు దేవుడు తనకుమారుని పంపెను.” విమోచకుని రాకకు లోకం సంసిద్ధంగా ఉండేవరకూ వివిధ జాతుల చలనాన్ని మానవ ఉద్వేగ ప్రభావాన్ని దేవుడు అదుపులో ఉంచాడు. జాతులు ఒక్క ప్రభుత్వం కింద ఏకమయ్యాయి. ప్రజలందరూ ఒకే భాష మాటాడారు. అదే సాహితీ భాషగా అన్ని చోట్ల గుర్తింపు పొందింది. అన్ని ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్న యూదులు సాంవత్సరిక పండుగలకు యెరూషలేములో సమావేశమయ్యేవారు. వారు తమ తమ స్థలాలకు తిరిగి వెళ్లినప్పుడు మెస్సీయా ఆగమనాన్ని గురించి లోకమంతా ప్రకటించవచ్చు.DATel 18.1

    ఈ సమయంలో ప్రజలపై అన్యమత వ్యవస్థల ప్రాబల్యం తగ్గుతోంది. హృదయానికి తృప్తినిచ్చే మతం కోసం వారు ఎదురుచుస్తున్నారు. సత్యకాంతి మనుషుల మధ్య నుంచి వెళ్ళిపోయినట్లు కనిపిస్తుండగా ఆందోళనతోను ఆవేదనతోను నిండిన వ్యక్తులు, వెలుగును వెదకుతున్నారు. వారు దేవుని గూర్చిన జ్ఞానంకోసం, మరణం అనంతరం జీవాన్ని గూర్చి హమీ కోసం వారు దప్పికగొని ఉన్నారు.DATel 18.2

    యూదులు దేవుని నుంచి దూరమైన కొద్ది వారి విశ్వాసం మసకబారింది. వారి నిరీక్షణ భవిష్యత్తును ఉత్తేజపరచడం దాదాపు ఆగిపోయింది. ప్రవక్తల మాటలు వారికి అవగతం కాలేదు. ప్రజాబాహుళ్యానికి మరణం భయంకర మర్మమయ్యింది. మరణం అనంతర కాలం నిర్దిష్టతలేని చీకటిమయమైన కాలం. అది బేల్లె హేము తల్లుల ఏడ్పే కాదు అది మానవాళి హృదమవేదన. అది శతాబ్దాల కిందట నివసించిన ప్రవక్తకు రామాలో ” రాహేలు తన పిల్లల విషయమై యేడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను” అంటూ వినిపించిన స్వరం. మత్తయి 2:18; మనుషులు ఓదార్పు లేకుండా మరణ ప్రాంగణంలోను మరణఛాయలోను కూర్చుని ఉన్నారు. వారు రానున్న రక్షకుడి కోసం ఆశతో కనిపెట్టారు. తమ చీకటి పోవటానికి, భవిష్యత్తును గూర్చిన మర్మం విశదమవ్వటానికి ఆయనకోసం కనిపెట్టారు.DATel 18.3

    దైవ విషయాల ఉపదేశకుడు వస్తాడని ప్రవచించిన వ్యక్తులు ఉన్నారు. వారు యూదులు కారు. ఈ మనుషులు సత్యాన్ని అన్వేషిస్తున్నారు. వారు ఆవేశపూరిత అత్మను పొందారు. చీకటితో నిండిన ఆకాశంలో నక్షత్రాలవలె అలాంటి బోధకులు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. వారి ప్రవచన వాక్యాలు అన్యజనులలో నిరీక్షణను రేకెత్తించాయి.DATel 19.1

    వందల సంవత్సరాలుగా లేఖనాలు గ్రీకు భాషలోకి అనువాదమయ్యి ఉన్నాయి. గ్రీకు భాష రోమా సామాజ్యంలో ఎక్కువమంది మాట్లాడిన భాష, యూదులు అన్ని ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నారు. మెస్సియా వస్తాడన్న వారి నిరీక్షణను అన్యజనులు కొంతమేరకు విశ్వసించారు. అన్యజనులుగా యూదులు వ్యవహరించే వీరిలో మెస్సీయాను గూర్చిన ప్రవచనాలపై అవగాహన ఉన్నవారు ఇశ్రాయేలులోని బోధకులకన్నా మెరుగైన అనేకులున్నారు. ఆయన పాప విమోచకుడుగా వస్తాడని క్ ందరు అన్నారు. తత్వజ్ఞానులు హెబ్రీ వ్యవస్థను గూర్చిన మర్మాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు. కాని యూదుల దురుభిమానం సత్యకాంతి ప్రకాశానికి అడ్డుతగిలింది. ఇతర జాతుల నుంచి వేరుగా ఉండాలన్న ఉద్దేశంతో తమకు ఇంకా ఉన్న సంకేతాత్మాక సేవాజ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి ఇష్టపడలేదు. నిజమైన బోధకుడు రావాలి. ఈ ఛాయారూపక విషయాలు ఎవరిని సూచిస్తున్నాయో ఆ ప్రభువే వాటి ప్రాధాన్యాన్ని వివరించాలి.DATel 19.2

    ప్రకృతి ద్వారా ఛాయారూపకాలు చిహ్నాల ద్వారా పితరులు ప్రవక్తల ద్వారా దేవుడు లోకంతో మాట్లాడాడు. మానవులికి మానవ భాషలోనే పాఠాలు బోధించాలి. నిబంధన దూత మాట్లాడాలి. ఆయన స్వరం ఆయన ఆలయంలో వినిపించాలి. క్రీస్తు రావాలి. వచ్చి స్పష్టంగా నిర్దిష్టంగా గ్రాహ్యమయ్యే మాటలు మాట్లాడాలి. సత్యానికి కర్త అయిన ఆయన మానవులు చెప్పే పొట్టు నుంచి సత్యాన్ని వేరు చెయ్యాలి. ఆ పొల్లు వల్ల సత్యం నిరర్ధకమయ్యింది. దేవుని ప్రభుత్వ సూత్రాల్ని రక్షణ ప్రణాళికను ఆయన విస్పష్టంగా నిర్వచించాలి. పాతనిబంధన పాఠాల్ని పూర్తిగా మనుషుల ముందు పెట్టాలి. యూదుల్లో దృఢచిత్తం గలవారు దేవుని గూర్చినDATel 19.3

    జ్ఞానాన్ని పరిరక్షించిన పరిశుద్ధ వంశీయుల సంతతివారు ఇంకా ఉన్నారు. తమ తండ్రులకు దేవుడు చెప్పిన వాగ్దాన నిరీక్షణ కోసం వారు ఇంకా కనిపెడున్నారు. మోషే ద్వారా దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మననం చేసుకోడం ద్వారా వారు తమ విశ్వాసాన్ని పటిష్ఠంచేసుకున్నారు. “ప్రభువైన దేవుడు నావంటి యొక్క ప్రవక్తను నా సహోదరులలోనుండి మీ కొరకు పుట్టించును. ఆయన మితో ఏమి చెప్పినను అన్ని విషయములలో నారాయన మాట వినవలెను.” అ.కా. 3:22: “బీదలకు సువార్తమానము ప్రకటించుటకు” “నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విడుదల ప్రకటించటకును” “యెహోవా హితవత్సరమును” ప్రకటించడానికి దేవుడు ఒకన్ని అభిషేకిస్తాడని వారు చదివారు. యెషయా 61:1,2. ఆయన “భూలోకమున” న్యాయము ఎలా స్థాపిస్తాడో అతని బోధకొరకు ద్వీపాలు ఎలా ఎదురుచూస్తాయో కాంతిలోకి ఎలా వస్తాయో వారు చదివారు. యెషయా 42:4: 60:3.DATel 20.1

    తన మరణశయ్యపై యాకోబు పలికిన మాటలు వారిని నిరీక్షణతో నింపాయి. “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్యనుండి రాజ దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు.” ఆ.ది 49:10. మెస్సీయా రాక సమిపిస్తోందని క్షీణిస్తున్న ఇశ్రాయేలుశక్తి సూచించింది. లోకరాజ్యాలు అంతమొందుతాయని ఆయన మహిమా రాజ్యం స్థాపించి రాజ్యపాలన చేస్తాడని దానియేలు ప్రవచనం చిత్రీకరిస్తోంది. “అది యుగయుగములు నిలుచును” అన్నాడు ప్రవక్త, దానియేలు 2:44. క్రీస్తు కర్తవ్య స్వభావాన్ని అవగాహన చేసుకున్న వారు బహుకొద్ది మందే కాగ మహా శక్తిగల యువ రాజు జాతుల విమోచకుడుగా వచ్చి ఇశ్రాయేలులో రాజ్యం స్థాపిస్తాడని అందరూ కని పెడ్తున్నారు.DATel 20.2

    కాలం పరిసమాప్తమయ్యింది. యుగాల కొద్దీ సాగిన అతిక్రమంవల్ల నైతికంగా దిగజారి పోయిన మానవ జాతికి విమోచకుని అవసరం ఏర్పడింది. పరలోక భూలోకాలకు మధ్య ఉన్న అగాధాన్ని మరింత లోతు చేసి దాటటం అసాధ్యపర్చడానికి సాతాను శాయశక్తుల కృషి చేస్తోన్నాడు. తన అబద్దాల ద్వారా మనుషులు ధైర్యంగా పాపంలో కొనసాగటానికి తోడ్పడ్డాడు. దేవుని సహనాన్ని నాశనం చేసే మానవుడి పట్ల ఆయన ప్రేమను ఆర్పివేయాలని సంకల్పించాడు. ఆ విధంగా దేవుడు లోకాన్ని సాతాను శక్తుల ఆధిపత్యం కింద విడిచి పెట్టి వెళ్లిపోతాడని యోచించాడు.DATel 21.1

    ప్రజల మనసుల్ని దేవుని ఆజ్ఞల పైనుంచి మళ్లించటానికి తన సొంత రాజ్యాన్ని స్థాపించటానికి వారికి దేవునిగూర్చిన జానాన్ని లేకుండా చెయ్యడానికి సాతాను ప్రయత్నిస్తోన్నాడు. ఆధిక్యం కోసం అతడు సలుపుతున్న పోరు దాదాపు పూర్తిగా విజయవంతమైనట్లు కనిపించింది. ప్రతియుగంలో దేవునికి ప్రతినిధులున్న మాట వాస్తవమే. అన్యజనుల్లో సైతం కొందరు మనుషులున్నారు. ప్రజల్ని తమ పాపస్థితినుంచి అధోగతి నుంచి లేవదియ్యడానికి క్రీస్తు పనిచేస్తున్నాడు. అయితే ఈ మనుషులు తృణీకారానికి ద్వేషానికి గురిఅయ్యారు. అనేకమంది భయంకర మరణం పొందారు. లోకం పై సాతాను చీకటి నీడలు ఇంకా దట్టమయ్యా యి.DATel 21.2

    అనేక యుగాలుగా అన్యమతం ద్వారా సాతాను మనుషుల్ని దేవునికి దూరంగా తరిమివేశాడు. కాని ఇశ్రాయేలు విశ్వాసాన్ని వక్రీకరించడంలో అతడు గొప్ప విజయం సాధించారు. తమ సొంత అభిప్రాయల ప్రకారం ధ్యానించడం ఆరాధించడం ద్వారా అన్యులు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పోగోట్టుకుని దుష్టులయ్యారు. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. తన మంచి పనుల వలన తన్నుతాను రక్షించుకోవచ్చునన్న సిద్ధాంతం అన్యమత మూలసూత్రం. ఇప్పుడది యూదు మత మూల సిద్ధాంతమయ్యంది. ఈ సిద్ధాంత కర్త సాతానే. ఎక్కడ ఈ సిద్ధాంత అమలవుతుందో అక్కడ పాపానికి అడ్డూ అదుపూ ఉండదు.DATel 21.3

    రక్షణ వర్తమానం మానవ సాధనాల ద్వారా మనుషులకు అందుతోంది. అయితే యూదులు నిత్యజీవం అయిన సత్యాన్ని సొంతం చేసుకుని దానిపై సర్వాధికారం చెలాయించాలనుకున్నారు. వారు మన్నాను నిల్వ చేసుకున్నారు. అది చెడి పోయింది. తమ సొంతం చేసుకో జూనిన మతం అభ్యంతరకరమయ్యింది. వారు దేవుని మహిమను దోచుకున్నారు. నకిలీ సువార్తను ప్రవేశపెట్టి లోకాన్ని వంచించారు. లోకరక్షణ నిమిత్తం దేవునికి తమ్మును తాము అంకితం చేసుకోవడానికి నిరాకరించారు. కనుక లోకాన్ని నాశనం చేసేందుకు వారు సాతాను ప్రతినిధులయ్యారు.DATel 22.1

    సత్యానికి స్తంభంగాను సానంగాను ఉండేందుకు దేవుడు ఏ ప్రజల్ని పిలిచాడో ఆ ఇశ్రాయేలు ప్రజలు సాతాను ప్రతినిధులయ్యారు. వారు సాతాను చేయమన్న పనిని చేస్తోన్నారు. దేవుని ప్రవర్తన గురించి దుష్ప్రచారం చేస్తోన్నారు. ప్రపంచం దేవుణ్ని కర్కోటకుడుగా పరిగణించేటట్లు చేస్తోన్నారు. దేవాలయంలో పరిచర్య చేసిన యాజకులే తాము చేసిన పరిచర్య ప్రాధాన్యాన్ని విస్మరించారు. వారు గుర్తునే చూసి ఆగుర్తు సూచించిన ప్రభువుని విస్మరించారు. బలి అర్పణల సమర్పణలో వారు నాటకంలోని నటులవలె వ్యవహరించారు. స్వయంగా దేవుడే నియమించిన ఆచారాల్ని మనుషుల మనసుల్ని కట్టి వేయడానికి వారి హృదయాల్ని కఠినపర్చడానికి సాధనాలుగా మార్చివేశారు. దేవుడు ఈ సాధనాల ద్వారా మనుషులకు ఇంకేమి చెయ్యలేకపోయాడు. ఆ వ్యవస్థ మెత్తాన్ని తుడిచి వేయాలి.DATel 22.2

    పాపం చేసే మోసం పరాకాష్ఠకు చేరుకుంది. మానవాత్మల్ని భ్రష్టు పట్టించే శక్తులన్నీ తమ కార్యసాధనకు పూనుకున్నాయి. దైవకుమారుడు లోకం వంక చూస్తూ లోకంలోని బాధను దుఃఖాన్ని గమనించాడు. మనుషులు సాతాను కాఠిన్యానికి ఎలా బలి అవుతున్నారో కనికరంతో చూశాడు. అనీతికి హత్యకు ఆహుతి అయి నశించిపోతున్న వారిని కరుణగా వీక్షించాడు. వారు ఎంపిక చేసుకున్న అధినేత వారిని తన రథానికి బంధించి బానిసలుగా తీసుకువెళ్తన్నాడు. మోసపోయి గందరగోళ పరిస్థితిలో ఉన్నవారు నిత్యనాశనం దిశగా ఊరేగింపుగా కదులుతోన్నారు. వారు కదుల్తోన్నది మరణానికి. అది జీవించే నిరీక్షణ లేని మరణం. అది ఉదయం ఎన్నడూ రాని రాత్రిలోకి పయనం. సాతాను ప్రతినిధులు మానవులతో ఏకమయ్యారు. దేవునికి నివాస స్థలంగా నిర్మితమైన మానవ శరీరాలు దయ్యాలకు ఉనికిపట్లుగా మారాయి. మానవాతీత సాధనాల ద్వారా మనుషుల ఇంద్రియాల్ని నరాల్ని భావోద్వేగాల్ని అవయవాల్ని రెచ్చగొట్టి నీచాతి నీచమైన శృంగార క్రియలకు వారిని నడిపించడం జరిగింది. తమను అదుపు చేస్తోన్న దుష్టదూత సేవల దుర్మార్గత మానవుల ముఖాల్లో ప్రతిబింబించింది. లోక రక్షకుడు పై నుంచి వీక్షించగా ఆయనకు కనిపించిన భావిదృశ్యం ఇది. పరిశుద్ధుడు వీక్షించడానికి ఎంత నీచమైన దృశ్యమిది!DATel 22.3

    పాపం ‘ఒక శాస్త్రం అయ్యింది. దుష్టత్వం మతంలో అంతర్భాగ మయ్యింది. తిరుగుబాటు స్వభావం హృదయంలోకి వేళ్లు తన్నింది. దేవునిపట్ల మానవుడి వైరం దౌర్జన్యపూరితమయ్యింది. దేవుని తోడు లేకుండా మానవాళి ప్రగతి లేదని విశ్వం ముందు ప్రదర్శితమయ్యింది. లోకాన్ని సృజించిన దేవుడే నవజీవాన్ని శక్తిని అనుగ్రహించాలి.DATel 23.1

    భూనివాసుల్ని ఒక్క త్రుటిలో తుడిచి వెయ్యడానికి యెహోవా లేస్తాడని పాపం చెయ్యని పరిశుద్దుల లోకాలు అసక్తిగా కనిపెట్టొన్నాయి. దేవుడే గాని ఈపనిచేస్తే పరలోక నివాసుల విశ్వాసాన్ని పొందేందుకు తన ప్రణాళికను అమలు పర్చడానికి సాతాను సంసిద్ధంగా ఉన్నాడు. దైవప్రభుత్వ సూత్రాల ప్రకారం క్షమాపణ అసాధ్యమని సాతాను ప్రచారం చేశాడు. దేవుడు ఈ లోకాన్ని నాశనం చేసి ఉంటే తన ఆరోపణలు నిజమైనవని రుజువయ్యిందని సాతాను చెప్పేవాడు. దేవునిపై నింద మోపడానికి తన తిరుగుబాటును ఇతర లోకాలకు విస్తరింపజేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కాగా లోకాన్ని నాశనం చేసే బదులు లోకాన్ని రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ని పంపాడు. లోకం అనీతితో ధిక్కారంతో నిండి ఉన్నా దాని పునరుద్ధరణకు మార్గం ఏర్పాటయ్యింది. గడ్డు పరిస్థితి ఏర్పడి సాతాను విజయం సాధించబోతున్నట్లు కనిపించినప్పుడు దేవుని కుమారుడు దైవ కృపాబాహుళ్యంతో వచ్చాడు. ప్రతీ యుగంలోను ప్రతీ ఘడియలోను పాపులపట్ల దేవుడు తన ప్రేమను కనపర్చుతూనే ఉన్నాడు. మనుషులు వక్రబుద్ధిగలవారైనా ఆయన కృపాచిహ్నాలు అనునిత్యం కళ్లకుకడునే ఉన్నాయి. కాలం పరిసమాప్తమైనప్పుడు విస్తారమైన స్వస్తతకృపను దేవుడు లోకంపై గుమ్మరించాడు. రక్షణ ప్రణాళిక నెరవేరేవరకూ దానికి ఆటంకం ఏర్పడడంగాని దాన్ని ఉపసంహరించుకోడం గాని జరగదు.DATel 23.2

    మానవుల్లో దేవుని రూపాన్ని హీనపర్చడంలో విజయం సాధించానని సాతాను సంబరపడున్నాడు. మానవుడిలో తన సృష్టికర్త స్వరూపాన్ని పునరుద్ధరించడానికి ఆ సమయంలో క్రీస్తు వచ్చాడు. పాపం వల్ల నాశనమైన ప్రవర్తనను త గి రూపుదిద్దగలవా:కు క్రీస్తు ఒక్కడే. చిత్తాన్ని అదుపుచేసే దయ్యాల్ని ఎంవోలడానికి ఆయన వచ్చాడు. మనల్ని మురికిలో నుంచి పైకి లేవనెత్తగానికి భష్టమైన ప్రవర్తనను తిరిగి తన ప్రవర్తనవలె రూపుడి దడానికి తన సొంత మహిమతో ఆ ప్రవర్తనను సర్వాంగసుందరం చెయ్య డానికి ఆయన వచ్చారు.DATel 24.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents