Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    40—సరస్సుపై ఒక రాత్రి

    వసంతకాలంలో సాయంత్ర సంధ్యకాంతిలో పచ్చని పచ్చిక మైదానంలో కూర్చున్న క్రీస్తు పెట్టిన భోజనాన్ని ప్రజలు తిన్నారు. ఆ రోజు వారు విన్న మాటలు వారికి దేవుని స్వరంగా వచ్చాయి. వారు చూసిన స్వస్తత కార్యాలు దైవశక్తి వల్ల మాత్రమే జరిగే కార్యాలు. కాగా రొట్టెల సరఫరా అద్భుతం ఆ మహాజనసమూహంలోని వారందరినీ ఆకట్టుకుంది. అందరూ ఆ ఉపకారంలో పాలుపంచుకున్నవారే. మోషే దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో మన్నాతో పోషించాడు. మోషే ఎవరి గురించి ముందే చెప్పాడో ఆయన తప్ప వారికి మన్నానిచ్చింది ఇంకెవరు? అయిదు రొట్టెలు రెండు చిన్న చేపల నుంచి వేలాది ప్రజలకు చాలినంత ఆహారం ఏ మానవ శక్తి సృష్టించగలిగేది కాదు, “నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే” అని వారు చెప్పుకున్నారు.DATel 408.1

    ఆదినమంతా వారికి ఏర్పడ్డ ఈ నమ్మకం బలపడింది. సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న విమోచకుడు తమ మధ్యనే ఉన్నాడనడానికి ఆ సూచక క్రియ ఒక హామి. ప్రజల ఆశలు నానాటికీ పెరిగాయి. యూదయను భూలోక స్వర్గంగా పాలు తేనెలు ప్రవహించే దేశంగా తీర్చిదిద్దే నేత ఈయనే; ప్రతీ కోర్కెను నెరవేర్చగలవాడు ఈయనే; రోమియుల అధికారాన్ని అంతం చెయ్యగలవాడు ఈయనే; యూదయను, యెరూషలేమును విమోచించగలవాడు ఈయనే; యుద్ధంలో గాయపడ్డ సైనికుల్ని బాగుచెయ్యగలవాడు ఈయనే; సైన్యాలికి ఆహారం సరఫరా చెయ్యగలవాడు ఈయనే; జాతుల్ని జయించి, దీర్ఘకాలంగా కనిపెట్టొన్న రాజ్యాధికారాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వగలవాడు ఈయనే అని ప్రజలు నిరీక్షించారు.DATel 408.2

    ఆ ఉద్రేకంలో ప్రజలు ఆయన్ని రాజుని చెయ్యడానికి సిద్ధపడ్డారు. ప్రజాదరణ పొందడానికి గాని లేదా వ్యక్తిగతంగా గౌరవ ప్రతిష్ఠలు పొందడానికిగాని ఆయన ప్రయత్నించడం లేదని వారు గ్రహించారు. ఈ విషయంలో యాజకులికి ప్రధానులికి ఆయన ఎంతో వ్యత్యాసంగా ఉన్నారు. కనుక దావీదు సింహాసనానికి తన హక్కును అమలు పర్చుకోడని వారి భయం. వారంతా సమాలోచనలు జరుపుకుని, ఆయన్ని బలవంతంగా తీసుకువెళ్లి ఇశ్రాయేలుకి రాజుగా ప్రకటించాలని తీర్మానించారు. దావీదు సింహాసనం తమ ప్రభువు న్యాయమైన స్వాస్థ్యమని చెప్పడంలో శిష్యులు జనసమూహంతో గొంతు కలిపారు. అలాంటి గౌరవాన్ని తోసిపుచ్చడం ఆయన సంస్కారాన్ని సూచిస్తోందని వారన్నారు. ప్రజలు తమ విమోచకుణ్ణి హెచ్చించాలి అన్నారు. దేవుని అధికారంతో వస్తోన్న ఆయన్ని గౌరవించడానికి గర్వాంధులైన యాజకులు ప్రధానుల్ని ఒత్తిడి చెయ్యాలి అన్నారు.DATel 409.1

    తమ ఉద్దేశం నెరవేర్పుకు వారు చకచకా పావులు కదుపుతున్నారు. అయితే ఏంజరుగుతోందో యేసు పసికట్టాడు. అలాంటి చర్యవల్ల ఏమి సంభవిస్తుందో శిష్యులు గ్రహించలేకపోయారు గాని ఆయన గ్రహించాడు. ఇప్పుడు సయితం యాజకులు ప్రధానులు ఆయన్ని వేటాడడానికి ప్రయత్నిస్తోన్నారు. తమ నుంచి ప్రజల్ని వేరుచేస్తున్నాడన్న ఆరోపణను ఆయన మీద మోపారు. ఆయన్ని సింహాసనం ఎక్కించే ప్రయత్నం వల్ల దౌర్జన్యం తిరుగుబాటు సంభవించి ఆధ్యాత్మిక రాజ్యకృషి దెబ్బతినడం ఖాయం. ఆ ఉద్యమానికి వెంటనే అడ్డుకట్ట వెయ్యాలి. తన శిష్యుల్ని పిలిచి, పడవ ఎక్కి కపెర్నహోముకి వెళ్లాల్సిందిగా యేసు ఆదేశించాడు. ప్రజల్ని పంపివేయడానికి తానక్కడే ఉంటానని వారికి చెప్పాడు.DATel 409.2

    క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్పు ఏదీ ఇంత అసాధ్యంగా ఎన్నడూ కనిపించలేదు. యేసుని సింహాసనంపై కూర్చోపెట్టడానికి ఒక ప్రజా ఉద్యమం జరపాలని శిష్యులు ఎంతో కాలంగా ప్రయత్నించారు. ఈ ఉత్సాహం ఉద్రేకం అంతా బూడిదలో పోసిన పన్నీరు కావడాన్ని వారు భరించలేకపోయారు. పస్కాను ఆచరించడానికి సమావేశమవుతున్న జనసమూహాలు నూతన ప్రవక్తను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ ప్రియతమ ప్రభువుని ఇశ్రాయేలు సింహాసంపై కూర్చోబెట్టడానికి ఇదొక బంగారు అవకాశంగా శిష్యులికి కనిపించింది. ఈ నూతన కోరిక వెలుగులో క్రీస్తును విడిచిపెట్టి వారు తమంతటతాము ఒడ్డుకు వెళ్లడం వారికి కష్టంగా ఉంది. ఆ ఏర్పాటుకు సమ్మతించలేదు. ఆ విషయాన్ని ఇక వ్యతిరేకించడం నిరుపయోగమని గ్రహించి వారు నిశ్శబ్దంగా సముద్రం దిశగా వెళ్లారు.DATel 409.3

    ఇప్పుడు యేసు ప్రజల్ని వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఆయన వైఖరి ఎంత నిర్ణయాత్మకమయ్యిందంటే వారు దాన్ని ఉల్లంఘించడానికి సాహసించలేకపోయారు. వారి పెదవులు మీద స్తుతి వాక్కులున్నాయి. ఆయన్ని పట్టుకోడానికి ముందుకు వెళ్తున్న సమయంలో వారి అడుగులు ముందుకి పడలేదు. వారి ముఖాల మీద ఆనందం మాయమయ్యింది. ఆ జన సమూహంలో నిశ్చలమైన మనసు, దృఢసంకల్పం గల వ్యక్తులున్నారు. అయితే యేసు రాజఠీవి, ఆయన ఉచ్చరించిన మితవాక్కులు గందరగోళాన్ని ఆపుజేశాయి. వారి ఎత్తుగడల్ని చిత్తు చేశాయి. ఆయనలో లోకాధికారాన్ని మించిన శక్తి ఉన్నట్లు గుర్తించారు. ప్రశ్నలేమీ లేకుండా ఆయనకు విధేయులయ్యారు.DATel 410.1

    యేసు ఒంటరిగా ఉన్నప్పుడు “ప్రార్ధన చేయుటకు కొండకు వెళ్లెను.” గంటలు తరబడి ఆయన దేవునితో విజ్ఞాపన చేశాడు. ఆయన తన కోసం కాదు మానవుల కోసం ఈ ప్రార్ధనలు చేశాడు. సాతాను మనుషుల అవగాహనకు గుడ్డితనం కలిగించి, వారి వివేచనను వక్రీకరించకుండేందుకు గాను, మనుషులికి తన దివ్యకర్తవ్య స్వభావాన్ని బయలు పర్చేందుకు శక్తి కోసం ప్రార్థించాడు. భూమిపై తన వ్యక్తిగత పరిచర్య దినాలు దాదాపు అయిపోయాయని, తనను కొద్దిమంది మాత్రమే రక్షకుడుగా స్వీకరిస్తారని రక్షకునికి తెలుసు. తన శిష్యుల నిమిత్తం హృదయవేదనతోను ఆత్మసంఘర్షణతోను ఆయన ప్రార్ధన చేశాడు. శిష్యులు తీవ్రశ్రమలను అనుభవించాల్సి ఉన్నారు. సామాన్యంగా మోసాలపై ఆధారితమైన ప్రజల చిరకాల నిరీక్షణలు అతి బాధాకరమైన అవమానకరమైన రీతిలో విఫలం కానున్నాయి. దావీదు సింహాసనం పై ఆసీనుడై ఉండడం వీక్షించే బదులు ఆయన సిలువ మరణాన్ని వారు వీక్షించనున్నారు. ఇదే ఆయన వాస్తవమైన పట్టాభిషేకం కావాల్సి ఉంది. కాని వారు దీన్ని గ్రహించలేదు. పర్యవసానంగా వారు తీవ్ర శోధనల్ని ఎదుర్కోవాల్సి ఉన్నారు. వాటిని వారు శోధనలుగా గుర్తించడం బహుకష్టం. తమ మనసును వివేకంతో నింపి తమ అవగాహనను విశాలపర్చడానికి పరిశుద్ధాత్మ లేకపోతే శిష్యుల విశ్వాసం విఫలమౌతుంది. తన రాజ్యం గురించి వారి అభిప్రాయాలు లౌకిక బలసంపదకు, ప్రతిష్ఠకు పరిమితమై ఉండడం యేసుకి తీవ్ర మనస్తాపం కలిగించాయి. వారిని గూర్చిన భారం ఆయన గుండెపై పెనుబారమయ్యింది. వేదనతోను, కన్నీటితోను ఆయన తన మనవుల్ని దేవునికి విన్నవించుకున్నాడు.DATel 410.2

    యేసు సూచన మేరకు శిష్యులు వెంటనే ఆ ప్రదేశం నుంచి బయల్దేరి వెళ్లిపోలేదు. ఆయన తమ వద్దకు వస్తాడని ఎదురుచూస్తూ వారు ఒక సమయం కోసం కనిపెట్టారు. కాని చీకటి పడుతుండడంతో వారు “దోనె యెక్కి సముద్రపుట్టదరినున్న కపెర్నహోమునకు పోవుచుండిరి.” యేసుని అయిష్టంగా విడిచిపెట్టి వెళ్తున్నారు. ఆయనపట్ల మునుపెన్నటికన్నా ఎక్కువ అసహనంతో ఉన్నారు. తన్ను రాజుగా ప్రకటించడానికి తమను అనుమతించలేదని వారు సణుగుకుంటున్నారు. ఆయన ఆజ్ఞకు తలవంచినందుకు తమ్మునుతాము నిందించుకున్నారు. తాము మరింత స్థిరంగా ఉండి పట్టుపట్టి ఉంటే ఆయన ఒప్పుకునేవాడని తర్కించుకున్నారు.DATel 411.1

    అపనమ్మకం వారి మనసుల్ని హృదయాల్ని నింపుతోంది. గౌరవాభిమానాలు వారికి గుడ్డితనం కలిగించాయి. పరిసయ్యులు యేసుని ద్వేషిస్తున్నట్లు వారికి తెలుసు. ఆయన తాము ఊహించిన రీతిగా ఘనత పొందడం చూడడానికి వారు అతురతగా ఉన్నారు. గొప్ప అద్భుతకార్యాలు చేయగల బోధకుడితో కలిసి పనిచేస్తూ వంచకులన్న అప్రదిష్ఠ పొందడాన్ని వారు భరించలేకుండా ఉన్నారు. అబద్ద ప్రవక్త అనుచరులు అని తాము నిత్యం పిలిపించుకోవాలా? రాజుగా క్రీస్తు తన అధికారాన్ని చలాయించడా? అంత శక్తిగల ఆయన ఎందుకు తన నిజస్వరూపాన్ని బయలు పర్చుకుని తమ మార్గాన్ని సులభతరం చేయడు? ఆ భయంకర మరణం నుంచి యోహానుని ఆయన ఎందుకు కాపాడలేదు? తమ మీదికి ఆధ్యాత్మిక అంధకారాన్ని తెచ్చుకునే వరకూ ఈ ధోరణిలో తర్కించుకుంటూ పోయారు. పరిసయ్యులు ఘంటాపథంగా చెబుతున్నట్లు యేసు వంచకుడా? అని ప్రశ్నించారు.DATel 411.2

    ఆ దినం క్రీస్తు చేసిన అద్భుత కార్యాల్ని శిష్యులు తిలకించారు. పరలోకమే భూమ్మీదికి దిగి వచ్చినట్లనిపింంది. ఆ ప్రశస్తమైన మహిమా న్వితమైన దినం వారిలో విశ్వాసాన్ని నిరీక్షణను నింపి ఉండాల్సింది. ఈ విషయాల గురించి వారు తమ హృదయంలో ఉన్న ఆలోచనల్ని మాట్లాడుకుని ఉంటే వారు శోధనలో పడేవారు కాదు. అయితే వారి తలంపులు తమ ఆశాభంగం చుట్టూనే పరిభ్రమిస్తోన్నాయి. “ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడి” అన్న రక్షకుని మాటలు వారు వినిపించుకోలేదు. శిష్యులికి గొప్ప మేలు చేసే గడియలవి. కాని వారు అదంతా మర్చిపోయారు. వారు గొప్ప ఉపద్రవం మధ్య ఉన్నారు. వారి తలంపులు తుపానులా ఉన్నాయి. అవి హేతుబద్ధంగా లేవు. కనుక వారి ఆత్మల్ని క్షోభింపజేసి వారి మనసుల్ని ఆలోచింపజెయ్యడానికి ప్రభువు వారికి ఒకటి సంకల్పించాడు. మనుషులు భారాలు కష్టాలు సృష్టించుకున్నప్పుడు దేవుడు తరచుగా ఈపనే చేస్తుంటాడు. శిష్యులు కష్టాలు సృష్టించుకోనవసరం లేదు. అప్పటికే ప్రమాదం విరుచుకు పడుతోంది.DATel 412.1

    తీవ్రమైన తుపాను వారి మిద పడడానికి పొంచి ఉంది. అందుకు వారు సిద్ధంగా లేరు. అది హఠాత్తుగా వచ్చిన పరిణామం. ఎందుకంటే అప్పటి వరకూ ఆ దినం ఆహ్లాదకరంగా ఉంది. పెనుగాలి వీచినప్పుడు వారు భయభ్రాంతులయ్యారు. వారు తమ అసంతృప్తిని మర్చిపోయారు. తమ అవిశ్వాసాన్ని మర్చిపోయారు. తమ అసహనాన్ని మర్చిపోయారు. పడవను మునిగిపోకుండా కాపాడడానికి ప్రతీవారు శాయశక్తుల కృషిచేస్తోన్నారు. బేత్సయిదా నుంచి సముద్రమార్గాన వారు యేసుని కలవవలసిన స్థలానికి అది ఎక్కువ దూరంలో లేదు. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో అది కొన్ని గంటల ప్రమాణం. ఇప్పుడైతే వారు తమ గమ్యస్థానం నుంచి ఎంతో దూరంగా గాలికి కొట్టుకుపోయారు. రాత్రి నాలుగోజాము వరకూ వారు తెడ్లువేసుకుంటూ పడవను కాపాడుకోడానికి ఆపసాపాలు పడుతోన్నారు. బాగా అలసిపోయిన ఆ మనుషులు ఇక సాగలేని స్థితికి వచ్చి ప్రాణాలు కోల్పోడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తుపానులోను చీకటిలోను సముద్రం తమ నిస్సహాయతను వారి కళ్లకు కట్టింది. వారు తమ ప్రభువు సన్నిధి కోసం ఎంతగానో అపేక్షించారు.DATel 412.2

    యేసు వారిని మర్చిపోలేదు. తీరాన నిలిచి చూస్తోన్న పరిశీలకుడు భయంతో నిండిన తుపానుతో పోరాడుతోన్న వారిని చుశాడు. ఒక్క క్షణం కూడా ఆయన తన శిష్యుల్ని మరవలేదు. తుపానులో చిక్కిన పడవలో ప్రశస్త ఆత్మలపై ఆందోళనతో నిండిన ఆయన దృష్టి నిలిచింది. ఎందుకంటే ఈ మనుషులు లోకానికి వెలుగు కానున్నారు. తల్లి తన పసికందును ఆప్యాయంతో చూసుకొనేటట్లు ప్రభువు తన శిష్యుల్ని ప్రేమతో పరిశీలిస్తోన్నాడు. వారి హృదయాలు లొంగినప్పుడు వారి అపవిత్ర వాంఛనిర్మూలమైనప్పుడు, సహాయం కోసం వినయ మనసుతో ప్రార్థించినప్పుడు వారికి సహాయం లభించింది.DATel 413.1

    తాము నశించిపోయామన్న భావన కలిగిన తరుణంలో ఓ కాంతి కిరణం నీళ్లపై తమ దిశలో వస్తోన్న ఓ విచిత్ర రూపాన్ని ఆవిష్కరించింది. అది యేసే అని వారికి తెలియదు. తమకు సహాయం చెయ్యడానికి వచ్చిన వ్యక్తిని వారు శత్రువుగా పరిగణించారు. వారిలో చెప్పలేని భయం పుట్టింది. ఉక్కువంటి కండరాలుగల చేతులు పట్టుకున్న తెడ్డుల్ని అవి వదిలేశాయి. పడవను కెరటాలు తమ ఇష్టం వచ్చినట్లు ఊపుతోన్నాయి. తెల్లని టోపీలు ధరించిన సముద్ర కెరటాలపై నడుస్తూ వస్తోన్న ఆ దృశ్యం మీదే అందరి కళ్లూ ఉన్నాయి.DATel 413.2

    అది ఒక భూతమని, తమ నాశనాన్ని సూచించడానికే అది వస్తోందని భావించి వారు భయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు. తమను దాటి వెళ్తున్నట్లు యేసు ముందికి వెళ్లాడు. ఆయన్ని గుర్తించి సహాయం చెయ్యమంటూ వారు కేకలు వేశారు. తమ ప్రియతమ ప్రభువు వారికేసి తిరిగాడు. “ధైర్యము తెచ్చుకొనుడి. నేనే భయపడకుడి” అన్న ఆయన స్వరం వారి భయాన్ని పోగొట్టింది.DATel 413.3

    ఆ వాస్తవాన్ని వారు నమ్మిన వెంటనే పేతురు ఆనందడోలల్లో ఊగుతూ తన్నుతాను మర్చిపోయాడు. ఇంకా నమ్మలేకుండా ఉన్నట్లు “ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్ము” అన్నాడు.DATel 413.4

    యేసు వంక చూస్తూ పేతురు దృఢంగా నడుస్తోన్నాడు. కాగా ఆత్మ సంతృప్తితో అన్నట్లు వెనక్కు తిరిగి తన మిత్రుల వంక చూశాడు. అతడి దృష్టి రక్షకుని మిద నుంచి మళ్లింది. గాలి బలంగా వీస్తోంది. కెరటాలు పైకెగసి పడూ అతడికీ ప్రభువుకీ మధ్యకు వచ్చాయి. పేతురు భయపడ్డాడు. ఒక్క నిమిషం క్రీస్తు అతడిగి మరుగుపడ్డాడు. అతడి విశ్వాసం సడలింది. మునిగిపోడం ప్రారంభించాడు. కెరటాలు మరణంతో మాట్లాడుతుండగా పేతురు ఆ భయంకర కెరటాలు మీదుగా దృష్టిని సారించి దాన్ని యేసుపై నిలిపి ” ప్రభువా, నన్ను రక్షించుము” అని కేక వేశాడు. వెంటనే యేసు చాపిన అతడి చేతిని పట్టుకుని “అల్పవిశ్వాసీ, యెందుకు సందేహించితివి” అన్నాడు.DATel 413.5

    పేతురు చేతిని ప్రభువు పట్టుకుని ఇద్దరూ పక్కపక్కన నడుస్తూ కలిసి పడవలోకి ఎక్కారు. అయితే పేతురు ఇప్పుడు అణిగిమణిగి మౌనంగా ఉన్నాడు. తోటి శిష్యులపై ఆధిక్యానికి అతిశయానికి అతడికి హేతువులేదు. ఎందుచేతనంటే అపనమ్మకం వల్ల ఆత్మాభిమానం వల్ల అతడు తన ప్రాణాన్ని దాదాపు పోగొట్టుకున్నాడు. అతడు తన దృష్టిని క్రీస్తు పై నుంచి మరల్పినప్పుడు తప్పటడుగు వేశాడు.DATel 414.1

    ఆపదవచ్చినప్పుడు ఎంత తరచుగా మనం పేతురులా ఉంటాం! రక్షకుని పై దృష్టిని నిలిపే బదులు మనం కెరటాల వంక చూస్తుంటాం. అప్పుడు అడుగులు జారాయి. అప్పుడు నీళ్లు మన ఆత్మల్ని ముంచివేస్తాయి. పేతురు నశించేందుకు తన వద్దకు రమ్మని యేసు పిలవలేదు. ఆయన మనల్ని పిలిచి ఆ తర్వాత విసర్జించడు. ఆయన ఇలా అంటోన్నాడు, “నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నాసొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్లుచున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్నుకాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను.” యెషయా 43:1-3.DATel 414.2

    క్రీస్తు తన శిష్యుల ప్రవర్తనల్ని చదివాడు. వారి విశ్వాసం ఎంత కఠినంగా పరీక్షించబడనుందో ఆయనకు తెలుసు. సముద్రంపై ఈ ఘటనలో పేతురుకి అతడి బలహీనతని బయలుపర్చాడు. తన క్షేమం నిత్య దైవ శక్తి మీద ఆధారపడి ఉండడం పైనే ఆధారపడి ఉంటుదని చూపించడమే దాని ఉద్దేశం శోధన తుపానుల మధ్య ఆత్మ విశ్వాసాన్ని పూర్తిగా వదులుకుని రక్షకుని మీద ఆధారపడి ఉన్నప్పుడు అతడు సురక్షితంగా నడవగలుగుతాడు. తాను ఏ విషయంలో బలంగా ఉన్నానని పేతురు భావించాడో అందులోనే అతడు బలహీనుడు. తన బలహీనతను గ్రహించే వరకు తాను క్రీస్తుపై ఆధారపడాల్సిన అవసరాన్ని అతడు గుర్తించలేదు. సముద్రంపై ఆ అనుభవంలో తనకు ఏ పాఠం నేర్పించడానికి క్రీస్తు ప్రయత్నించాడో దాన్ని పేతురు నేర్చుకుని ఉంటే తనకు గొప్ప పరీక్ష వచ్చినప్పుడు అతడు పరాజయం పొందేవాడు కాదు.DATel 414.3

    దేవుడు తన బిడ్డలికి దినదినం ఉపదేశం ఇస్తుంటాడు. తన సంకల్పం చొప్పున వారికి ఆయన ఏర్పాటు చేసిన విస్తృత సేవారంగంలో తమ పాత్రను పోషించడానికి తమ దినదిన పరిస్థితుల ద్వారా వారిని సిద్ధంచేస్తాడు. జీవితంలోని తీవ్ర సంక్షోభంలో వారి జయాపజయాల్ని నిర్ధారించేది దినదినం వారు ఎదుర్కొనే సమస్యల సందర్భంగా వారికి వచ్చే పరీక్షే.DATel 415.1

    ఎవరు ప్రతి నిత్యం దేవుని మీద ఆధారపడరో వారు శోధనకు లొంగిపోతారు. మేము సుస్థిరంగా ఉన్నాం, మాకుథోకాలేదు, అని ఇప్పుడు మనం భావించవచ్చు. నేను ఎవరిని విశ్వసించానో నేనెరుగుదును, దేవుని మీద ఆయన వాక్యం మీద నాకున్న నమ్మకాన్ని కదల్చగలిగింది ఏదీలేదు అని మనం అనవచ్చు. అయితే మనకు పారంపర్యంగా వచ్చిన గుణలక్షణాలు మన అలవాట్లను బట్టి మనం సంపాదించుకున్న గుణలక్షణాల సమాహారమైన ప్రవర్తన - వీటిని ఆసరా చేసుకుని మన అవసరాల్ని మనలోటుల్ని గుర్తించకుండా మనకు సాతాను అంధత్వం కలిగిస్తాడు. మన బలహీనతను గుర్తించి యేసు వంక నిశ్చలంగా చూడడం ద్వారా మాత్రమే మనం దృఢంగా అచంచలంగా నడవగలుగుతాం.DATel 415.2

    యేసు పడవ ఎక్కిన వెంటనే గాలి ఆగిపోయింది. “వెంటనే ఆదోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.” ఆ భయంకర రాత్రి గడిచి తెల్లవారింది. శిష్యులు, ఆ పడవలో ఉన్న ఇతరులు కృతజ్ఞతో నిండిన హృదయాల్లో యేసు పాదాలకి మొక్కి “నీవు నిజముగా దేవుని కుమారుడవు” అన్నారు.DATel 415.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents