Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    41—గలిలయలో సంక్షోభం

    తన్ను రాజుగా ప్రకటించవద్దని ప్రజల్ని క్రీస్తు నిలువరించినప్పుడు తన జీవితం ఓ మలుపు తిరుగుతోందని ఆయన గుర్తించాడు. ఈనాడు తనను రాజును చేసి అందలమెక్కించడానికి ఉవ్విళూర్తోన్న ప్రజలు రేపు తనను విడిచిపెడ్తారని ఆయనకు తెలుసు. తమ స్వార్థాశ నెరవేరకపోవడంతో చోటు చేసుకున్న నిరాశ వారి అభిమానాన్ని ద్వేషంగాను, వారి ప్రశంసల్ని శాపాలగాను మార్చనుంది. అయినా ఆ ఉపద్రవాన్ని తప్పించడానికి ఆయన చర్యతీసుకోలేదు. ఈ లోకసంబంధమైన ప్రతిఫలం ఇస్తానని తన అనుచరులికి ఆయన ఎన్నడూ చెప్పలేదు. తన శిష్యుడిగా ఉండడానికి వచ్చిన ఓ వ్యక్తితో ఆయన ఇలా అన్నాడు, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు.” మత్తయి 8:20. మనుషులు క్రీస్తుతో పాటు లోకాన్ని పొందగలిగితే జనులు తండోపతండాలుగా క్రీస్తుని స్వీకరించేవారు. కాని అలాంటి సేవను ఆయన అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనతో ఉన్నవారిలో అనేకమంది లోక రాజ్యాసక్తి కలిగి ఉన్నారు. వీరు మోసపోకూడదు. ఆహారం పెట్టడానికి సంబంధించిన అద్భుత కార్యంలోని గంభీరమైన ఆధ్యాత్మిక బోధనను వారు అవగాహనచేసుకోలేదు. దీన్ని వారికి సుబోధకం చేయాల్సి ఉంది. ఈ నూతనాంశ విశదీకరణతోపాటు మరింత నిశితమైన పరీక్ష వారికి రానుంది.DATel 416.1

    రొట్టెల సూచకక్రియ ఉదంతం అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. మరుసటి ఉదయం పెందలాడే బేత్సయిదా ప్రజలు యేసును చూడడానికి ఏరువాక సాగారు. రోడ్డు మార్గాన జలమార్గాన పడి జనులు వచ్చారు. ఎందుకంటే సరస్సు అద్దరికి వెళ్లడానికి పడవలేదు. అయితే వారి అన్వేషణ నిష్పలమయ్యింది. చాలామంది ఆయన్ని వెదక్కుంటూ కపెర్నహోముకి వెళ్లారు. అంతలో ఆయన గెన్నేసంతు చేరాడు. ఆయన వచ్చాడన్న వార్త తెలిసిన వెంటనే ప్రజలు “ఆ ప్రదేశమంతట పరుగెత్తుకొనిపోయి ఆయనయున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మిద మోసికొని వచ్చుటకు మొదలు పెట్టిరి.” మార్కు 6:55.DATel 416.2

    కొంత సేపు అయిన తర్వాత సమాజమందిరానికి వెళ్లాడు. బేత్సయిదానుంచి వచ్చిన వారికి ఆయన అక్కడ కనిపించాడు. ఆయన సముద్రం దాటిన తీరును గురించి శిష్యులు చెప్పగా వారు విన్నారు. తుపాను ఉద్దృతి, ప్రతికూల గాలుల్తో సతమతమౌతు ఎన్నో గంటలు పడవను నడపడానికి విఫలయత్నం చెయ్యడం, క్రీస్తు నీళ్లమీద నడిచిరావడం, తమలో భయాందోళనలు చెలరేగడం, తమకు ధైర్యం చెబుతూ ఆయన మాట్లాడడం, పేతురు సాహసకార్యం, దాని పర్వవసానం, తుపాను అర్ధాంతరంగా శాంతించడం, పడవ తీరాన్ని చేరడం - అంతా ఆ ప్రజలకు వివరించడం జరిగింది. దీనితో సంతృప్తి చెందక అనేకులు యేసు చుట్టూ చేరి “బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి?” అని ప్రశ్నించారు. ఆ అద్భుతాన్ని గూర్చి ఇంకా ఎక్కువ సమాచారం ఆయన నోటి నుంచే వినాలని వారు ఎదురుచుశారు.DATel 417.1

    యేసు వారి కోరిక తీర్చలేదు. గంభీర వదనంతో ఆయనిలా అన్నాడు, “మీరు సూచనలను చూచుటవలనకాదు, గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెంబడించుచున్నారు.” వారు ఆయన్ని గొప్ప ఆశయంతో వెంబడించలేదు. ఆయన వారిని రొట్టెలతో తృప్తి పర్చాడు. కనుక ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఇంకా ఎన్నో ఉపకారాలు పొందవచ్చునని ఆశించారు. రక్షకుడు వారికిలా సూచించాడు, “క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి.” కేవలం లౌకిక లాభాల్నే అన్వేషించవద్దు. ఈ జీవితావసరాల తృప్తి కోసమే ముఖ్యంగా పాటుపడకూడదు. ఆధ్యాత్మికాహారం కోసం నిత్యజీవం వరకు కొనసాగే జ్ఞానం కోసం వెదకాలి. దీన్ని దైవ కుమారుడు క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. “ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడు.”DATel 417.2

    తాత్కాలికంగా శ్రోతల ఆసక్తి మేల్కొంది. “మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను?” అని వారు అడిగారు. దేవుని అనుగ్రహాన్ని పొందడానికి వారు ఎన్నో భారమైన కర్మలు చేస్తోన్నారు. ఏదైన నూతన ఆచారం ఉన్నదేమో దాన్ని నిర్వహించి మరింత యోగ్యతను సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ప్రశ్న ఆంతర్యం పరలోకాన్ని సంపాదించడానికి మేమేం చేయాలి? అన్నదే. నిత్యజీవాన్ని సంపాదించడానికి మేం చెల్లించాల్సిన మూల్యం ఏమిటి అన్నదే. “యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవునికి ప్రియమని వారితో చెప్పెను.” యోహాను 6:29;DATel 418.1

    అయితే దైవ సత్యాన్ని గూర్చిన ఈ వచనాన్ని స్వీకరించడానికి ప్రజలు ఎంపికచేసుకోలేదు. మెస్సీయా ఏ సేవచేస్తాడని ప్రవచనం వచించిందో ఆ సేవనే యేసు నిర్వహించాడు. కాగా ఆయన సేవ ఇది అని తమ స్వార్థాశలు నిరీక్షణలు చిత్రించుకున్న చిత్రాన్ని వారు చూడలేదు. క్రీస్తు వాస్తవంగా యవల రొట్టెలతో ఒకసారి జనసమూహానికి ఆహారం పెట్టాడు. కాని మోషే దినాల్లో ఇశ్రాయేలీయులుని నలభై సంవత్సరాలు మన్నాతో పోషించాడు. ఇంకా గొప్ప కార్యాలు మెస్సీయా చేయనున్నాడు. తాము కళ్లారా చూసిన విధంగా, యేసు ఎన్నో అద్భుతకార్యలు చేయగలగితే తన ప్రజలకి ఆరోగ్యం , బలం, సౌభాగ్యం ఇచ్చి, వారిని తమ హింసకుల దుష్టపాలన నుంచి కాపాడి వారికి రాజ్యాధికారాన్ని గౌరవాన్ని ఇవ్వలేడా? అని ఆసంతృప్తితో ఉన్నవారు ప్రశ్నిస్తోన్నారు. దేవుడు పంపినవాణ్నని చెప్పుకుంటూనే ఇశ్రాయేలు రాచరికాన్ని తిరస్కరించడం వారికి అంతుచిక్కని మర్మంగా ఉంది. ఆయన నిరాకరణకి అపార్ధాలు తీశారు. తన కర్తవ్యం దైవనియోగితమైందో కాదో తానే ఇదవిజ్ఞంగా తేల్చలేకపోతున్నాడని అందుకే తన హక్కును అధికారాన్ని వినియోగించుకోలేకపోతోన్నాడని అనేకుల వాదించారు. ఈ రకంగా వారు తమ హృదయాల్లోకి సందేహాలికి సంశయాలికి ఆవాహన పలికారు. సాతాను నాటిన విత్తనాలు ఇలా ఆపోహలు విభేదాలు అనే పంట పండాయి.DATel 418.2

    ఇప్పుడు ఎగతాళిగా ఓ రబ్బీ ఇలా ప్రశ్నించాడు, “అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి.”DATel 419.1

    యూదులు మోషేని మన్నాను ఇచ్చినవాడిగా గౌరవించారు. ఎవరు ఆ కార్యాన్ని నిర్వహించారో ఆ ప్రభువుని విస్మరించి ఆయన చేతిలోని సాధనంగా వ్యవహరించిన మనిషిని ప్రశంసించారు. వారి తండ్రులు మోషే మీద సణిగారు. అతడికి దేవుడు నియమించిన కర్తవ్యాన్ని శంకించారు. అది దేవుడు నియమించిన కార్యం కాదన్నారు. ఇప్పుడు వారి పిల్లలు తమకు దేవుని వర్తమానాన్ని తెచ్చిన మెస్సీయాను నిరాకరించారు. “కాబట్టి యేసు - పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు.” అన్నాడు. మన్నా దాత వారి మధ్యనే ఉన్నాడు. హెబ్రీ ప్రజల్ని అరణ్యంలో నడిపించింది. వారికి రోజుకు రోజు పరలోకం నుంచి ఆహారం కురిపించింది సాక్షాత్తు క్రీస్తే. నిత్యుడు సర్వసంపూర్ణుడు అయిన దేవుని వద్ద నుంచి ప్రవహించే జీవప్రదాయక ఆత్మ వాస్తవమైన మన్నా యేసిలా అన్నాడు, ” పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నది.” యోహాను 6:33.DATel 419.2

    యేసు ప్రస్తావిస్తోన్నది శారీరక ఆహారమని భావిస్తూ ఆయన శ్రోతలు కొందరు ఇలా మనవి చేశారు, ” ప్రభువా యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుము.” అప్పుడు యేసు స్పష్టంగా “జీవాహారము నేనే” అన్నాడు.DATel 419.3

    యేసు వినియోగించిన సాదృశ్యం యూదులికి సుపరిచితమైనదే. పరిశుద్దాత్మ ప్రేరణ వలన మోషే ఇలా అన్నాడు, “ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రదుకుదురు.” యిర్మీయా ప్రవక్త ఇలా రాశాడు, “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని.... నీమాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి” ద్వితి 8:3; యిర్మీ 15:16. రొట్టె భుజించడమంటే ఆధ్యాత్మికంగా ధర్మశాస్త్రాన్ని పఠించడం, సత్కార్యాలు చెయ్యడం అని రబ్బీలే ఉపమానంగా చెబుతుండేవారు. మెస్సీయా వచ్చినప్పుడు ఇశ్రాయేలు అంతటికీ ఆహారం పెడతాడని తరచుగా చెబుతూ ఉండేవారు. రొట్టెల సూచక క్రియలోని ఆధ్యాత్మిక పాఠాన్ని ప్రవక్తల బోధనలు తేటతెల్లం చేశాయి. సమాజమందిరంలో తన శ్రోతలికి ఈ పాఠాన్ని సుబోధకం చెయ్యడానికి క్రీస్తు ప్రయత్నించాడు. వారు లేఖనాల్ని అవగాహన చేసుకుని ఉంటే, ” జీవాహారము నేనే” అని ఆయన అన్నప్పుడు ఆయన మాటల్ని వారు అవగతం చేసుకుని ఉండేవారు. దానికి ముందు రోజే అలసిపోయిన, ఆకలిగా ఉన్న ఆ విస్తార జనసమూహం ఆయన ఇచ్చిన ఆహారం తిన్నది. వారు ఆహారం నుంచి శారీరక శక్తిని విశ్రాంతిని పొందిన రీతిగానే ఆధ్యాత్మిక శక్తిని నిత్యజీవాన్ని పొందవచ్చు. ఆయన ఇలా అన్నాడు, “నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును అకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.” ఆయన ఈ మాటకూడా అన్నాడు, “మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారు.”DATel 419.4

    పరిశుద్ధాత్మ సాక్ష్యం వలన తమ ఆత్మలికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా వారు క్రీస్తుని చూశారు. ఆయన శక్తికి నిదర్శనాలు రోజు కిరోజు వారి కళ్లముందే ఉన్నా, వారు మరో గుర్తు కావాలని కోరారు. ఇది జరిగినా వారు క్రితంలోలాగే నమ్మకం లేకుండా ఉండేవారు. తాము చూసిందాన్ని బట్టి విన్నదాన్ని బట్టి వారికి నమ్మకం కలగకపోతే మరిన్ని అద్భుతాలు చెయ్యడం వ్యర్ధం. అవిశ్వాసానికి ఏదో సందేహం దొరుకుతుంది. దాని ముందు తిరుగులేని నిదర్శనం సయితం నిలువలేదు.DATel 420.1

    మొండి వైఖరిగల ఆ ప్రజలికి క్రీస్తు మరోసారి విజ్ఞప్తి చేశాడు. “నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.” తనను విశ్వాసంతో స్వీకరించిన వారందరికి నిత్యజీవముంటుందని ఆయన చెప్పాడు. ఆయన్ని విశ్వసించినవారెవ్వరూ నశించరు. భవిషత్ జీవితం గురించి పరిసయ్యులు సదూకయ్యులు తర్కించుకోనవసరం లేదు. మరణించిన తమ ఆప్తుల విషయంలో ఎవరూ కుమిలి కృషించనవసరం లేదు. “కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్య దినమున నేను వానిని లేపుదును.”DATel 420.2

    ప్రజానాయకునికి ఇది కోపం, పుట్టించింది. “ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఆయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.” యేసు పేదవాడిగా జన్మించడాన్ని ప్రస్తావించడం ద్వారా వారు ప్రజల్లో దురభిప్రాయాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ఆయన జీవితాన్ని గలిలయకు చెందిన శ్రామిక జీవితంగా ఆయన కుటుంబాన్ని పేద, బడుగు కుటుంబంగా ప్రచారం చేశారు. విద్యలేని ఈ వడ్రంగి చెప్పే విషయాలు తమ పరిగణనకు తగినవికావని ఎద్దేవా చేశారు. మర్మపూరితమైన ఆయన జన్మను ఆసరా చేసుకుని ఆయనకు జన్మనిచ్చిన వారెవరో ఇదమిత్థంగా తెలియదంటూ ఆయన జన్మకు సంబంధించిన మానవ పరిస్థితుల్ని బట్టి ఆయన చరిత్రపై బురద చల్లడానికి కృషిచేశారు.DATel 421.1

    తన జన్మకు సంబంధించిన మర్మాన్ని విశదం చేయ్యడానికి యేసు ప్రయత్నించలేదు. సముద్రం దాటి రావడం గురించి వేసిన ప్రశ్నలికి లాగే పరలోకం నుంచి దిగిరావడాన్ని గురించి వేసిన ప్రశ్నలికి ఆయన జవాబు చెప్పలేదు. తన జీవితంలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సూచకక్రియల్ని గురించి మాట్లడలేదు. ఆయన స్వచ్ఛందంగా తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్నుతాను సేవకుణ్ని చేసుకున్నాడు. కాని తనమాటలు తన కార్యాలు ఆయన ప్రవర్తనను వెల్లడి చేశాయి. దేవుని సత్యానికి తమ హృదయాల్ని తెరచే వారందరూ ఆయన్ని “కృపాసత్యసంపూర్ణుడుగా... తండ్రికి అద్వితీయ కుమారునిగా” గుర్తిస్తారు. యోహాను 1: 14.DATel 421.2

    పరిసయ్యుల ప్రశ్నలు సూచించే దానికన్నా లోతాంది వారి దురభిమానం. అది వారి వక్రమనసుల్లో పుట్టింది. క్రీస్తు ప్రతీమాట క్రీస్తు ప్రతీ కార్యం వారిలో వ్యతిరేకత సృష్టించింది. కారణమేంటంటే వారు పెంచుకున్న దుర్బుద్ధికి ఆయనలో ప్రతిస్పందన కరవయ్యింది.DATel 421.3

    “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా తండ్రి యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. - వారందరును దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.” తండ్రి ప్రేమకు ఆకర్షితులై ప్రతిస్పందించే వారు తప్ప మరెవ్వరూ క్రీస్తు వద్దకు రారు. అయితే దేవుడు అందరి హృదయాల్ని తన వద్దకు ఆకర్షించుకుంటోన్నాడు. ఆయన ఆకర్షణను ప్రతిఘటించే వారు మాత్రమే క్రీస్తు వద్దకు రావడానికి నిరాకరిస్తారు.DATel 421.4

    “వారందరును దేవునిచేత బోధింపబడుదురు.” అన్నమాటల్లో యేసు యెషయా ప్రవచనంలోని ఈ మాటల్ని ఉద్దేశించాడు; “నీ పిల్లలందరు యెహోవా చేత ఉపదేశము నొందుదురు.” యెషయా 54:13. యూదులు ఈ లేఖనాల్ని తమకు వర్తింపజేసుకున్నారు. దేవుడే తమ ఉపదేశకుడని గర్వంగా చెప్పుకున్నారు. ఇవి ప్రగల్భపు మాటలేనని యేసు సూచించాడు. ఎందుకంటే ఆయన ఈ మాటలన్నాడు, “తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడను నాయొద్దకు వచ్చును. ” తండ్రిని గూర్చిన జ్ఞానాన్ని వారు క్రీస్తు ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆయన మహిమను మానవమాత్రులు చూసి భరించలేరు. దేవుని గూర్చి నేర్చుకున్న వారు ఆయన కుమారుని స్వరాన్నే వింటున్నారు. ప్రకృతి ద్వారాను ప్రత్యక్షత ద్వారాను తండ్రిని ఎవరు ప్రకటించారో ఆ ప్రభుని నజరేయుడైన యేసులో వారు గుర్తిస్తారు.DATel 422.1

    “విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు.” ఈ మాటలు విన్న ప్రియ శిష్యుడు యోహాను ద్వారా సంఘాలికి పరిశుద్దాత్మ ఇలా ప్రకటించాడు,” “దేవుడు మనకు నిత్యజీవము దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు.” 1యోహాను 5:11, 12. “అంత్య దినమందు నేను వానిని లేపుదును” అని యేసు అన్నాడు. ఆత్మ సంబంధంగా మనం ఆయనతో ఒకటి అవ్వడానికిగాను శరీరసంబంధంగా క్రీస్తు మనతో ఒకటయ్యాడు. ఈ సంయోగ బలం చేత మనం సమాధిలో నుంచి బయటికి రానున్నాం. - కేవలం క్రీస్తు శక్తి ప్రదర్శన వలనే గాక విశ్వాసం ద్వారా ఆయన జీవితం మనది అయ్యింది గనుక క్రీస్తుని తన వాస్తవిక ప్రవర్తనలో చూసి ఆయన్ని తమ హృదయంలోకి స్వీకరించిన వారు నిత్యజీవం కలవారు. ఆత్మద్వారా క్రీస్తు మనలో నివసిస్తాడు. దేవుని ఆత్మను విశ్వాసం ద్వారా హృదయంలోకి అంగీకరించినప్పుడు నిత్య జీవం ఆరంభమౌతుంది. యేసు చేసిన అద్భుతాలకన్నా అది గొప్పదన్నట్టు అరణ్యంలో తమ పితరులు భుజించిన మన్నాకు ఆ ప్రజలు యేసు గమనాన్ని తిప్పారు. అయితే తాను ఇవ్వడానికి వచ్చిన దీవెనలతో పోల్చితే అది ఎంత స్వల్పమైందో యేసు వారికి చూపించాడు. మన్నా ఈ లోకసంబంధమైన జీవితాన్ని మాత్రమే పోషించగలదు. అది మరణం రాకుండా చెయ్యలేదు. అమరత్వాన్ని ఇవ్వలేదు. కాని ఆ పరలోకాహారం ఆత్మకు పోషణ నిచ్చి నిత్యజీవం చేకూర్చుతుంది. రక్షకుడిలా అన్నాడు, “జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమను నేనే; ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును.” యేసు ఈ సాదృశ్యరూపానికి ఇప్పుడు ఇంకొకదాన్ని జతజేస్తోన్నాడు. మరణించడం ద్వారా మాత్రమే ఆయన మనుషులికి జీవాన్ని ఇవ్వగలిగాడు. ఆ తర్వాతి మాటల్లో తన మరణాన్ని రక్షణ మార్గంగా సూచించాడు. ఆయనిలా అంటోన్నాడు, “నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే.”DATel 422.2

    యూదులు యెరూషలేములో పస్కాను ఆచరించడానికి సిద్ధపడ్తోన్నారు. మరణదూత ఐగుప్తీయుల గృహాల్ని మొత్తిన రాత్రి ఇశ్రాయేలుకు కలిగిన విమోచన జ్ఞాపకార్థంగా ఇశ్రాయేలు జరుపుకునే పండుగే ఈ పస్కా. పస్కా గొర్రెపిల్లలో వారు దేవుని గొర్రెపిల్లను చూడాలని, లోకాన్ని రక్షించడానికి తన్నుతాను అర్పించుకున్న ప్రభువుని ఈ చిహ్నాం ద్వారా వారు అంగీకరించాలని దేవుడు ఉద్దేశించాడు. యూదులు సమావేశమయ్యారు. వారు ప్రభువు శరీరాన్ని వివేచనాత్మకంగా గ్రహించలేదు. పస్కా సేవా చిహ్నంలోని సత్యాన్నే క్రీస్తు బోధించాడు. అయినా దాన్ని వారు గ్రహించలేదు.DATel 423.1

    ఇప్పుడు రబ్బీలు ఆగ్రహంతో ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడు?” అన్నారు. “ముసలివాడైన మనుష్యుడే లాగు జన్మింపగలడు;” (యోహాను 3:4) అన్న నీకొదేములాగ వారు ఆయన మాటల్ని అక్షరార్ధపరంగా అవగాహన చేసుకున్నట్లు నటించారు. కొంత మేరకు యేసు భావాన్ని వారు గ్రహించారు. కాని దాన్ని ఒప్పుకోడానికి వారు సిద్ధంగా లేరు. ఆయన మాటలికి అపార్ధాలు ఆపాదించడం ద్వారా ప్రజలికి ఆయనపై విరోధభావం కలిగించడానికి ప్రయత్నించారు.DATel 423.2

    తన ఉపదేశంలో సాదృశ్యం వినియోగాన్ని యేసు తగ్గించలేదు. ఇంకా బలమైన మాటలతో సత్యాన్ని పునరుద్ఘాటించాడు; “మీరు మనుష్యకుమారుని శరీరముతిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నారక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నాశరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి యుందుము.”DATel 423.3

    యేసు శరీరం తినడం రక్తం తాగడమంటే ఆయన్ని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించడం, ఆయన పాపాలు క్షమిస్తాడని, మనం ఆయనలో సంపూర్ణులం అని విశ్వసించడం. ఆయన ప్రేమను వీక్షించడం వలన, దానిని ప్రస్తావించడం వలన, దాన్ని పానం చెయ్యడం వలన ఆయన స్వభావాన్ని మనం సంతరించుకోవాల్సి ఉన్నాం. ఆహారం శరీరానికి ఎంత ముఖ్యమో క్రీస్తు ఆత్మకు అంతముఖ్యం కావాలి. ఆహారాన్ని తింటేనే గాని అది మన శరీరంలో కలిసిపోతేనే గాని దానివల్ల మనకు మేలు కలుగదు. అలాగే క్రీస్తును మనం వ్యక్తిగత రక్షకుడుగా ఎరిగితేనే తప్ప ఆయన వల్ల మనకు లబ్ది కలగదు. ఆయన్ని గూర్చిన సిద్ధాంత జ్ఞానం మనకు మేలు చెయ్యదు. ఆయన్ని భుజించాలి, హృదయంలోకి చేర్చుకోవాలి. అప్పుడు ఆయన జీవితం మనది అవుతుంది. ఆయన ప్రేమను ఆయన కృపను మన శరీరంలో ఓ భాగం చేసుకోవాలి.DATel 424.1

    చెప్పాలంటే ఈ చిహ్నాలు సయితం క్రీస్తుతో విశ్వాసి బాంధవ్య భాగ్యాన్ని వర్ణించలేవు. యేసు ఇలా అన్నాడు, “జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నామూలముగా జీవించును.” దేవకుమారుడు తండ్రిపై విశ్వాసమూలంగా జీవించినట్లే మనం క్రీస్తుపై విశ్వాసమూలంగా జీవించాల్సి ఉన్నాం. దేవుని చిత్రానికి యేసు ఎంత సంపూర్తిగా నిబద్దుడయ్యాడంటే ఆయన జీవితంలో తండ్రి మాత్రమే కనిపించాడు. మనలాగే అన్ని విషయాల్లోను శోధనకు గురి అయినప్పటికీ తన చుట్టూ ఉన్న దుర్మార్గత అంటకుండా నిష్కళంకంగా లోకంలో నిలిచాడు. ఈ రీతిగా క్రీస్తు జయించినట్లే మనమూ జయించాల్సి ఉన్నాం .DATel 424.2

    మీరు క్రీస్తు అనుచరులా? అయితే ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి రాసి ఉన్నదంతా మీ కోసమే రాసి ఉంది. క్రీస్తుతో సంయుక్తమవ్వడం ద్వారా దాన్ని మీరు సాధించవచ్చు. మీ ఉద్రేకం చల్లారుందా? మీ తొలిప్రేమ చల్లబడిందా? క్రీస్తు ఇస్తున్న ప్రేమను మళ్లీ స్వీకరించండి. ఆయన శరీరాన్ని భుజించండి. ఆయన రక్తం పానం చెయ్యండి. అప్పుడు మీరు తండ్రితోను కుమారునితోను ఏకమవుతారు.DATel 424.3

    అవిశ్వాసులైన యూదులు రక్షకుని మాటల్లో అక్షరపరమైన అర్ధాన్ని తప్ప వేరే అర్ధాన్ని తీసుకోడానికి నిరాకరించారు. ఆచారధర్మశాస్త్రం ప్రకారం రక్తాన్ని తాగడం నిషిద్ధం. కనుక ఇప్పుడు క్రీస్తు వాడిన భాషను అపరిశుద్ధ భాషగా పరిగణించి దాని విషయమై తర్కించుకున్నారు. శిష్యుల్లో అనేకులు “యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడు? అని చెప్పుకున్నారు.DATel 425.1

    రక్షకుడు వారికి ఈ మాటల్లో సమాధానం ఇచ్చాడు. “దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్యకుమారుడు మునుపున్నచోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి.DATel 425.2

    లోకానికి జీవాన్నిచ్చే క్రీస్తు జీవం ఆయన మాటలో ఉంది. యేసు తన మాటతోనే వ్యాధుల్ని నయం చేశాడు. దయ్యాల్ని వెళ్లగొట్టాడు. తన మాటతోనే కల్లోలిత సముద్రాన్ని శాంతింపచేశాడు. మృతుల్నిలేపాడు. ఆయన మాటలో శక్తి ఉందని ప్రజలు కళ్లారా చూసి తెలుసుకున్నారు. ప్రవక్తలు, పాతనిబంధన బోధకుల ద్వారా ఎలా మాట్లాడాడో అలాగే దేవుని వాక్యాన్ని ఆయన మాట్లాడాడు. బైబిలు మొత్తం క్రీస్తుని ప్రదర్శిస్తోంది. తన అనుచరులు ఆ వాక్యం పై విశ్వాసముంచాలన్నది రక్షకుని కోరిక. ఆయన భౌతిక సన్నిధి ఇకలేనప్పుడు ఆయన వాక్యమే వారి శక్తికి మూలం కావాల్సి ఉంది. తమ ప్రభువుమల్లే వారు “దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట” వలన జీవించాల్సి ఉన్నారు. మత్త 4:4.DATel 425.3

    మనభౌతిక జీవాన్ని ఆహారం ఎలా పోషిస్తుందో అలాగే మన ఆధ్యాత్మిక జీవాన్ని దేవుని వాక్యం పోషిస్తుంది. దైవ వాక్యం నుంచి ప్రతీ ఆత్మ జీవాన్ని పొందాలి. పోషణను పొందడానికి మనంతట మనం ఎలా తినాలో అలాగే మనం సొంతంగా వాక్యాన్ని స్వీకరించాలి. ఇంకొకరి మనసు ద్వారా దాన్ని మనం పొందకూడదు. ఆయన వాక్యాన్ని అవగాహన చేసుకోడానికి పరిశుద్ధాత్మ సహాయం కోసం దేవున్ని అర్ధించి జాగ్రత్తగా బైబిలు అద్యయనం చెయ్యాలి. ఒక వచనం తీసుకుని అందులో మన కోసం దేవుడు పెట్టిన భావాన్ని గ్రహించడానికి దానిపై మనసును నిలపాలి. ఆ భావం మన సొంతం అయ్యేవరకు “ప్రభువు అంటున్నదేంటో” మనకు అవగతమయ్యే వరకు దాని మీద మనసు పెట్టాలి.DATel 425.4

    తన వాగ్దానాల్లోను హెచ్చరికల్లోను యేసు నన్ను ఉద్దేశిస్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన్ని నేను విశ్వసించడం ద్వారా నశించక నిత్యజీవం పొందేందుకు ఆయన్ని అనుగ్రహించాడు. దైవ వాక్యంలో దాఖలైన అనుభవాలు నా అనుభవాలు కావాలి. ప్రార్థన, వాగ్దానం, హితవు, హెచ్చరిక, ఇవి నాకు చెందినవే. “నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి యున్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నాకొరకు తన్నుతాను అర్పించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.” గలతీ 2:20. విశ్వాసం సత్యసూత్రాల్ని ఈ తీరుగా అంగీకరించి జీర్ణించుకున్నప్పుడు అవి వ్యక్తిలో ఓ భాగమయ్యి జీవితాన్ని నడిపే శక్తిగా మారాయి. ఆత్మ అందుకున్న దైవ వాక్యం తలంపుల్ని రూపుదిద్ది, ప్రవర్తన అభివృద్ధికి పూనుకుంటుంది.DATel 426.1

    విశ్వాస నేత్రంతో నిత్యం యేసు వంక చూస్తుంటే బలం చేకూరుతుంది. ఆకలి దప్పులు గల తన ప్రజలకు దేవుడు మిక్కిలి విలువైన సంగతులు బయలు పర్చుతాడు. క్రీస్తు వ్యక్తిగత రక్షకుడని వారు కనుగొంటారు. ఆయన వాక్యాన్ని భుజిస్తుండగా అది ఆత్మకు జీవం అని వారు కనుగొంటారు. వాక్యం స్వాభావిక, లోక సంబందిత స్వభావాన్ని నాశనం చేసి యేసుక్రీస్తులో నూతన జీవాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఆత్మలోకి వస్తాడు. మార్పుకలిగించే ఆయన కృపద్వారా శిష్యుడిలో దేవుని స్వరూపం పునరుత్పత్తి అవుతుంది. అతడు నూతన వ్యక్తి అవుతాడు. ద్వేషం బదులు ప్రేమ నెలకొంటుంది. హృదయం దేవుని సారూప్యాన్ని సంతరించుకుంటుంది. “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలన” జీవించడమంటే ఇదే. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని తినడమంటే అర్ధం ఇదే.DATel 426.2

    తనకు తన అనుచరులకు మధ్య ఉన్న బాంధవ్యాన్ని గూర్చి క్రీస్తు ఓ పవిత్ర నిత్య సత్యాన్ని పలికాడు. తన శిష్యులమని చెప్పుకునే వారి ప్రవర్తన ఆయనకు తెలుసు. వారి విశ్వాసం ఏపాటిదో ఆయన మాటలు పరిక్షించాయి. వారు తన బోధనని విశ్వసించి ఆచరించాల్సి ఉందని ఆయన పలికాడు. ఆయన్ని అంగీకరించిన వారందరూ ఆయన స్వభావంలో పాలుపంచుకుంటూ ఆయన ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇందు నిమిత్తం వారు తమ ఆశలు కోర్కెలు విడిచిపెట్టడం అవసరం. వారు తమ్మునుతాము సంపూర్తిగా క్రీస్తుకి అంకితం చేసుకోవడం అవసరం. వారు ఆత్మత్యాగం చెయ్యడానికి సాత్వికులుగా దీనమనస్కులుగా ఉండడానికి పిలుపు పొందారు. నిత్యజీవంలో పరలోక మహిమలో పాలుపొందాలంటే, కల్వరి ప్రభువు నడిచిన ఇరుకు మార్గాన వారు నడవాల్సి ఉంది.DATel 427.1

    అది చాలా కఠిన పరీక్ష. ఆయన్ని బలవంతంగా తీసుకువెళ్లి రాజును చెయ్యాలని ప్రయత్నించిన వారి ఉద్రేకం చల్లారింది. సమాజమందిరంలో ఆయన ప్రసంగం తమ కళ్లు తెరిపించిందని వారన్నారు. ఇప్పుడు వారు మోసపోలేదు. తాను మోస్సీయా కాదని ఆయన మాటలే ఒప్పుకుంటున్నట్లు ఆయనతో సంబంధం వల్ల లోక సంబంధమైన ప్రతిఫలాలేమి ఒనగూడనట్లు వారి మనసులికి తట్టింది. వారు ఆయనకున్న అద్భుతకార్యాల శక్తిని స్వాగతించారు. వ్యాధి బాధలనుంచి విముక్తి పొందాలని ఆత్రంగా ఉన్నారు. కాని ఆత్మత్యాగంతో కూడిన ఆయన జీవితం పట్ల వారికి సానుభూతి సుతరాము లేదు. ఆయన ప్రస్తావిస్తోన్న మార్మిక ఆధ్యాత్మిక రాజ్యంపట్ల వారికి ఆసక్తి లేదు. ఆయన చుట్టూ తిరిగిన వంచకులు, స్వార్ధపరులు ఆయన్ని ఇక కలవలేదు. తమను రోమీయుల పాలన నుంచి విమోచించడానికి తన శక్తిని ప్రభావాన్ని వినియోగించడానికి ఆయన ఇష్టపడకపోతే ఆయనతో తమకు ఎలాంటి సంబంధమూ ఉండకూడదనుకున్నారు.DATel 427.2

    యేసు వారితో ఇలా స్పష్టంగా చెప్పాడు, “మిలో విశ్వసించని వారు కొందరున్నారని” ఇంకా “తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని యీ హేతువును బట్టి మీతో చెప్పితిని” అన్నాడు. తాము తనకు ఆకర్షితులు కాకపోతే దానికి హేతువు తాము పరిశుద్దాత్మకు తమహృదయాల్ని తెరవకపోడమేనని వారు గ్రహించాలని ఆయన కోరాడు. “ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మవిషయములను అంగీకరింపడు, అవి అతనికి వెట్టితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” 1 కొరి 2:14. విశ్వాసం ద్వారానే ఆత్మ క్రీస్తు మహిమను చూడగలుగుతుంది. పరిశుద్దాత్మ ద్వారా ఆత్మలో విశ్వాసం రగుల్కొనే వరకూ ఈ మహిమ మరుగుపడి ఉంటుంది.DATel 427.3

    అవిశ్వాసాన్ని గురించిన బహిరంగ మందలింపు శిష్యుల్ని యేసుకి మరింత దూరం చేసింది. వారికి చాలా అంసతృప్తి కలిగించింది. రక్షకుణ్ని బాధపర్చడానికి పరిసయ్యుల ద్వేషాన్ని తృప్తిపర్చడానికి ఉద్దేశించి వారు ఆయన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. వారు ఎంపిక చేసుకున్నారు. ఊపిరిలేని ఆకారాన్ని గింజలేని ధాన్యాన్ని ఎంపిక చేసుకున్నారు. అనంతరం వారి తీర్మానం ఎన్నడూ మారలేదు. ఎందుకంటే వారు ఇక యేసుతో నడవలేదు.DATel 428.1

    “ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని ఆగ్నితో పొట్టును కాల్చివేయును” మత్త 3:12. ఇది శుద్ధి చేసే సమయం. సత్యం ద్వారా గోధుమలనుంచి పొట్టును వేరుచెయ్యడం జరుగుతోంది. మందలింపును అంగీకరించలేనంత వ్యర్ధులు, స్వనీతి పరులు, వినయజీవితాన్ని అంగీకరించలేనంత లోక ప్రియులు కనుక అనేకులు యేసుని విడిచి పెట్టి వెళ్లిపోయారు. అనేకులు ఇంకా ఆపనే చేస్తోన్నారు. కపెర్నహోములోని సమాజమందిరంలోని శిష్యుల్లాగ నేడు ఆత్మలు పరీక్షించబడ్తోన్నాయి. హృదయానికి సత్యం బోధపడినప్పుడు తమ జీవితాలు దేవుని చిత్తానికి అనుగుణంగా లేవని వారు గుర్తిస్తారు. తమలో మార్పు అవసరమని గుర్తిస్తారు. కాని ఆత్మోపేక్ష కార్యాన్ని చేపట్టరు. కనుక తమ పాపాలు బయటపడినప్పుడు ఆగ్రహిస్తారు. యేసు శిష్యులు సణుగుకుంటూ వెళ్లిపోయినట్లు వారు అభ్యంతరపడి వెళ్లిపోతారు. “ఇది కఠినమైన మాట, యిది ఎవరు వినగలడు.”DATel 428.2

    ప్రశంస పొగడ్త వారి చెవులకి ఇంపుగా ఉంటుంది. సత్యం వారికి వద్దు. దాన్ని వారు వినలేరు. ప్రజలు వెంబడించినప్పుడు, జనసమూహానికి ఆహారం పెట్టినప్పుడు, విజయనినాదాలు వినిపించినప్పుడు వారు గట్టిగా అరుస్తూ ప్రశంసలు కుమ్మరించారు. కాగా దేవుని ఆత్మ వారి పాపాల్ని వెదకి వెల్లడించి వాటిని విడిచిపెట్టమని ఆదేశించినప్పుడు వారు సత్యాన్ని విడిచి పెట్టి ఇక క్రీస్తుతో నడువరు.DATel 429.1

    అసంతుష్టులైన శిష్యులు క్రీస్తుని విడిచి పెట్టి వెళ్లిపోయినప్పుడు వేరే ఆత్మ వారిని నియంత్రించింది. ఒకప్పుడు ఎవరు తమను ఎంతగానో ఆకట్టుకున్నారో ఆయనలో వారికి ఏ ఆకర్షణ కనిపించలేదు. ఆయన విరోధులతో జతకట్టారు. ఎందుకంటే వీరు వారు ఒకే స్వభావం కలిగి పని చేస్తున్నవారు. వారు ఆయన మాటలకి అపార్ధాలు చెప్పారు. వాటిని తప్పుగా ఉటంకించారు. ఆయన ఉద్దేశాన్ని వక్రీరించారు. ఆయనకి వ్యతిరేకంగా ప్రతీ అంశాన్ని సేకరించడం ద్వారా వారు తమ పనిని కొనసాగించారు. ఆ తప్పుడు సమాచారం వల్ల ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. ఆయనకి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.DATel 429.2

    నజరేయుడైన యేసు తాను మెస్సీయాను కానని తన నోటితోనే ఒప్పుకున్నాడన్న వార్త అంతటా వ్యాపించింది. ఇలా గలిలయలో ఆయన పట్ల ప్రజావ్యతిరేకత చాపకింద నీరులా వ్యాపించింది. కిందటేడాది యూదయలో వ్యాపించినట్లు అయ్యో ఇశ్రాయేలుకి ఏ గతి పట్టింది! వారు రాజకీయాధికారాన్ని వనకూర్చే రాజుకోసం ఎదురుచూశారు గనుక రక్షకుణ్ని విసర్జించారు. వారు నశించే ఆహారాన్ని ఆశించారు. నిత్యజీవం వరకూ నిలిచేదాన్ని కాదు.DATel 429.3

    తన శిష్యులుగా ఉన్న వారు మానవులికి జీవం వెలుగు అయిన తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం చూసి యేసు దుఃఖించాడు. తన దయను ఎవరూ అభినందించలేదు. తన ప్రేమకు స్పందన లేదు. తన కృపను తృణీకరించారు, తన రక్షణను నిరాకరించారు అన్న స్పృహ ఆయన హృదయం నిండా దుఃఖాన్ని నింపింది. ఇలాంటి పరిణామాలే ఆయన్ని వ్యసనాక్రాంతుడుగా వ్యాధిననుభవించినవానిగా చేశాయి.DATel 429.4

    తనను విడిచి వెళుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చెయ్యకుండా యేసు తన పన్నెండుమంది తట్టు తిరిగి, “మీరు కూడ వెళ్లి పోవలెనని యున్నారా?” అన్నాడు.DATel 430.1

    పేతురు సమాధానమిస్తూ ఈ మాటలన్నాడు, “ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము?” “నీవే నిత్యజీవపుమాటలు గలవాడవు.” “నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము.”DATel 430.2

    “ఎవని యొద్దకు వెళ్లుదుము? ” ఇశ్రాయేలు బోధకులు లాంఛనాలకి ఆచారాలకి బానిసలు. పరిసయ్యులికి సదూకయ్యులికి మధ్య నిత్యమూ వివాదాలే. యేసుని విడిచిపెట్టడమంటే ఆచారాలు, కర్మలూ నిష్ఠగా ఆచరించే వారి మధ్య, స్వీయ మహిమకు పాకులాడే పెద్దమనుషుల మధ్య పడడమే. తమ గత జీవితాల్లో కన్నా అధిక శాంతి సంతోషానందాలు క్రీస్తుని అంగీకరించిన నాటి నుంచి శిష్యుల అనుభవంలోకి వచ్చాయి. పాపుల మిత్రుడు యేసుని ద్వేషించి హింసించిన వారి వద్దకు వారు ఎలా తిరిగి వెళ్లగలరు? వారు చాలా కాలంగా మెస్సీయా కోసం ఎదురుచూస్తోన్నారు. ఇప్పుడు ఆయన వచ్చాడు. ఆయన్ని విడిచి పెట్టి ఆయన్ని వేటాడుతోన్న వారి వద్దకు ఆయన శిష్యులైనందుకు తమను హింసిస్తోన్న వారి వద్దకు వారు వెళ్లలేరు.DATel 430.3

    “ఎవని యొద్దకు వెళ్లుదుము?” క్రీస్తు బోధన నుంచి, ఆయన ప్రేమ దయ పాఠాలనుంచి, లోక సంబంధమైన అపనమ్మకపు చీకటిలోకి, దుర్గాతలోకి కాదు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన అనేకులు రక్షకుణ్ని విడిచి పెట్టి వెళ్లిపోగా శిష్యుల విశ్వాసాన్ని పేతురు వెలిబుచ్చాడు. - “నీవే దేవుని పరిశుద్ధుడవు” అని. తమ ఆత్మలు నిలిచిన ఈ లంగరును పోగొట్టుకోడమన్న తలంపే వారికి భయమూ వణుకు పుట్టించింది. రక్షకుణ్ని లేకుండా చేసుకోడం తుపానులో నల్లని సముద్రంలో కొట్టుకుపోవడంలా ఉంటుంది.DATel 430.4

    యేసు మాటలు చర్యలు చాలమట్టుకు మానవుల మనసులికి విచిత్రంగా మార్మికంగా కనిపిస్తాయి. కాని ప్రతీ మాటకూ ప్రతీ చర్యకు మన విమోచన కృషిలో నిర్దిష్టమైన పాత్ర ఉంది. ప్రతీది దాని దాని ఫలితాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఆయన సంకల్పాన్ని అవగతం చేసుకునే సామర్థ్యం మనకుంటే అంతా ముఖ్యమైంది లాగ సంపూర్ణమయ్యిందిలాగ ఆయన కర్తవ్యానికి సానుకూలమైందిలాగ కనిపిస్తుంది.DATel 430.5

    ఇప్పుడు మనం దేవుని కార్యాల్ని మార్గాల్ని గ్రహించలేకపోగా, మనుషులతో ఆయన వ్యవహరణలకు పునాది అయిన ఆయన మహా ప్రేమను గ్రహించగలుగతాం. యేసుకి దగ్గరగా ఏ వ్యక్తి నివసిస్తాడో అతడు దేవత్వానికి సంబంధించిన మర్మాన్ని గ్రహించగలుగుతాడు. మందలింపును నిర్వహించి ప్రవర్తనను పరీక్షించి, హృదయంలోని ఉద్దేశాన్ని వెలుగులోకి తెచ్చే కృపను అతడు గుర్తిస్తాడు.DATel 431.1

    తన శిష్యుల్లో చాలామంది వెనుదిరిగి పోవడానికి హేతువైన కీలక సత్యాన్ని యేసు బోధించినప్పుడు తన మాటల ఫలితం ఎలా ఉండబోతోందో ఆయనకు బాగా తెలుసు. అయితే అది ఆయన నెరవేర్చాల్సి ఉన్న కృపాకార్యం . శోధన సమయంలో తన ప్రియ శిష్యుల్లో ప్రతీ ఒక్కరూ తీవ్ర పరీక్షకు గురి అవుతారని ఆయన ముందుగానే చూశాడు. గెత్సెమనేలో ఆయన హృదయ వేదన, ఆయన అప్పగింత, సిలువవేత వారికి అగ్ని పరీక్ష కాబోతోంది. ఇంతకు ముందు ఎలాంటి పరీక్షా పెట్టకుండా ఉండి ఉంటే కేవలం స్వారా పేక్షతో వచ్చివారిలో అనేకులు వారితో ఇంకా కలిసి ఉండేవారు. తమ ప్రభువుకి తీర్పుగదిలో శిక్ష విధించినప్పుడు ఆయన్ని రాజుగా సంబోధించిన ప్రజలు ఆయన్ని చూసి ఎగతాళిగా శబ్దంచేసి దుర్భాషలాడినప్పుడు; గేలి చేస్తూ జనమూహం “ఆయనను సిలువవేయుము” అని కేకలు వేసినప్పుడు - వారి లౌకికి ఆశలు ఆకాంక్షలు కుప్పకూలినప్పుడు ఈ స్వార్థపరులు యేసు పట్ల ప్రభుభక్తిని త్వజించి తమ ఆశలు ఆశయాల వైఫల్యం నిమిత్తం తమ దుఃఖానికి అదనంగా శిష్యులికి భారమైన దుఃఖాన్ని కలిగించేవారు. ఆ చీకటి గడియలో ఆయన నుంచి వెనుదిరిగిన వారి ఆదర్శం తమతో ఇతరుల్ని తీసుకుని వెళ్లేది. ఈ పరిస్థితిని యేసే సృష్టించాడు. అయినా తన వ్యక్తిగత సన్నిధి ద్వారా తన యధార్ధ అనుచరుల విశ్వాసాన్ని బలపర్చుగలిగాడు.DATel 431.2

    తనకు రానున్న మరణాన్ని గూర్చి పూర్తిగా ఎరిగిన కారుణ్యమూర్తి తన శిష్యుల మార్గాన్ని సుగమం చేశాడు. వారిని తమ ముందున్న కఠోర శ్రమకు సిద్ధపర్చాడు. తమ చివరి పరీక్షకు వారిని బలో పేతం చేశాడు.DATel 431.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents