Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  తొలిపలుకు

  జాతితో జీవనస్థాయితో నిమిత్తం లేకుండా మానవులందరి హృదయాల్లోను తమకు లేని దానికోసం కోరికలుంటుంటాయి. కృపగల దేవుడే వీటిని మానవుడి నైజంలో పెట్టాడు. అవి చెడ్డవే గాని మంచివే గాని లేదా మేలైనవే గాని వాటితో అతడికి తృప్తి కలుగకపోవచ్చు. మానవుడు శ్రేష్ఠమైన దానినే అన్వేషించాలని అది తన ఆత్మకు శ్రేయస్కరంగా ఉన్నట్లు అతడు గ్రహించాలని దేవుడు సంకల్పించాడు.DATel .0

  మానవుడి హృదయంలోని ఈ ఆశలు ఆకాంక్షల్ని సాతాను తన మోసపూరిత పథకాలతో వక్రీకరిస్తాడు. ఈ కోర్కెల్ని వినోదాలు, ధనసంపత్తి, సుఖభోగాలు, పేరు ప్రతిష్ఠల ద్వారా నెరవేర్చుకోవచ్చునని నమ్మడానికి మనుష్యుల్ని నడిపిస్తాడు. అయితే అతడి వల్ల మోసపోయిన వారు (వారి సంఖ్య పెద్దదే) ఇవి అన్నీ పచ్చి మోసాలని గుర్తిస్తారు. వారి ఆత్మకు తృప్తి లభించకపోగా తమకు మిగిలింది క్రితంలోని నిస్సారమైన అసంతృప్తానని గ్రహిస్తారు.DATel .0

  మానవ హృదయంలోని కోరిక దాన్ని నెరవేర్చే సమర్ధత గల తన వద్దకు మాత్రమే మానవుణ్ని నడిపించాలని దేవుడు ఉద్దేశించాడు. అది దేవుడు కావాలన్న ఆకాంక్ష. ఆయన వద్దకు నడిపే కోరిక. ఆయనే ఆ కోరికకు సంపూర్ణమైన సాఫల్యం. సంపూర్ణత నిత్యదేవుని కుమారుడైన యేసుక్రీస్తులోనే ఉంది. ” ఆయన యందు సర్వసంపూర్ణత” నివసించాలన్నది తండ్రి సంకల్పం. “ఏలయనగా దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ” దేవుడు మనిషిలో పెట్టిన, మనిషి సామాన్యంగా అనుసరించే ప్రతి కోరిక సందర్భంగా “ఆయన యందు మీరు సంపూర్ణులు” అన్నది వాస్తవంDATel .0

  హగ్గయి ఆయన్ని “అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువు” అంటోన్నాడు. మనం ఆయన్ని యుగయుగాల ఆకాంక్ష అనవచ్చు. ఆయన “యుగయుగాల రాజు ” కదా.DATel .0

  మానవుల ప్రతీ ఆకాంక్షను నెరవేర్చే ప్రభువుగా యేసుక్రీస్తును సమర్పించడమే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. “క్రీస్తు జీవితం” పై చాలా గ్రంథాలు రాయడం జరిగింది. అవి అన్నీ మంచి గ్రంథాలే. వాటిలో ఎంతో సమాచారం నిక్షిప్తమై ఉంది. కాలక్రమం, సమకాలీన చరిత్ర, ఆచారాలు, సంఘటనలు, నజరేయుడైన యేసు జీవితం వివిధ కోణాలపై వ్యాసాలు కోకొల్లలు. అయిన “సగం కథ ఇంకా చెప్పాల్సి ఉంది” అంటే అతిశయోక్తికాదు.DATel .0

  సువార్తల్ని అన్వయించడం లేక క్రీస్తు జీవితంలోని సంఘటనల్ని గాని అద్భుత పాఠాల్ని గాని క్రమబద్ధంగా సమర్పించడం ఈ పుస్తకం ఉద్దేశం కాదు. తన కుమారునిలో వెల్లడైన రీతిగా దేవుని ప్రేమను ప్రజలకు సమర్పించడమే ఈ పుస్తకం ఉద్దేశం. క్రీస్తు జీవితాన్ని అందరూ అంగీకరించేందుకు ఆయన సుందర జీవితాన్ని వెల్లడి చేయడం దీని ఉద్దేశం. అంతే గాని, వింతలు విశేషాలు తెలుసుకోవాలని చూసేవారిని లేదా విమర్శలు సంధించాలనుకునేవారిని తృప్తిపర్చడం కాదు. యేసు తన ప్రవర్తన సౌందర్యం వల్ల తన శిష్యుల్ని ఆకట్టుకున్నాడు. అలాగే తన వ్యక్తిగత సన్నిధివల్ల, బలహీనతలు అవసరాలతో సతమతమవుతున్న ప్రజల్ని సానుభూతితో స్పృశించడం వల్ల, తన నిత్య సహవాసం వల్ల ప్రజల ప్రవర్తనల్ని మార్చివేశాడు. వాటిని ఐహికాల నుంచి పారలౌకికాలకు, స్వార్దా సక్తులనుంచి ఆత్మ త్యాగశీలతకు, కొద్దిబుద్ధుల దురభిమానం నుంచి విశాల జ్ఞానానికి, సకల జాతుల ప్రజల ఆత్మల పట్ల ప్రగాఢ ప్రేమకు ఆకర్షించాడు. “సంపూర్ణముగా” రక్షించి తన దివ్యస్వరూపంలోకి మార్చగల మహాశక్తిగల యేసు వద్దకు శిష్యులు పూర్వం వ్యక్తిగతంగా వచ్చి ముఖాముఖి నిలిచినట్లు పాఠకుడు వచ్చి నిలవడానికి సహాయమందించడమే ఈ పుస్తకం ఉద్దేశం. అయినా ఆయన జీవితాన్ని అవిష్కరించడం అసాధ్యం. దానికి ప్రయత్నించడం ఇంద్రధనస్సును బట్టపై చిత్రించడానికి పూనుకోవడం, సంగీత మధుర్యాన్ని పియానో తెలుపు నలుపు కీలలో బంధించడానికి ప్రయత్నించడంలా ఉంటుంది.DATel .0

  ఆధ్యాత్మిక విషయాల్లో విశాలమైన లోతైన సుదీర్ఘమైన అనుభవం కలిగిన మహిళ అయిన ఈ గ్రంధకర్త క్రీస్తు జీవితం నుంచి కొత్త సొగసుల్ని ఈ పుస్తకం పుటల్లో ఆవిష్కరిస్తోంది. ఓ ఆమూల్యమైన పెట్టెలోనుంచి ఆమె ఎన్నో ఆణిముత్యాలు వెలికితెచ్చింది. కలలో కూడా ఊహించని సిరులను ఈ అనంత ధనగారంలోనుంచి బయటకు తీసి వాటిని పాఠకుడి ముందు ఉంచుతోంది. తెలిసిన అనేక లేఖన భాగాల నుంచి తానెన్నడో నిశితంగా పరిశీలించాననుకునే వాక్యభాగాల నుంచి కొత్త, మరింత ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశిస్తోంది. దైవత్వం తాలుకు సర్వ సంపూర్ణతగా, పాపుల అనంత దయామయ రక్షకుడుగా, నీతి సూర్యుడుగా, కరుణగల ప్రధాన యాజకుడుగా, మానవుల సకల వ్యాధుల నివారణకర్తగా, సున్నిత మనస్సుగల మిత్రుడుగా, నిత్యం సహాయం అందించే నేస్తంగా, దావీదు వంశపు యువరాజుగా, బయలుదేరివస్తోన్న రాజుగా, యుగయుగాల ఆకాంక్ష నిరీక్షణల పరాకాష్టగా ఆమె యేసుక్రీస్తును మన ముందుంచుతోంది.DATel .0

  ఈ పుస్తకాన్ని దేవుడు తన ఆశీస్సులతో లోకానికి అనుగ్రహిస్తోన్నాడు. తమ ఆశలు కోర్కెలు ఇంకా నెరవేరాల్సి ఉన్న అనేక ఆత్మలకు ఈ పుస్తకంలోని మాటలు తన ఆత్మ మూలంగా జీవపు మాటలుగా ప్రభువు తీర్చిదిద్దాలన్న ప్రార్ధనతోను, వీరు “ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగునిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారగుటయెట్టిదో ఎరుగు నిమిత్తమును” అంతిమంగా నిత్యకాలం పొడవున ఆయన కుడిపార్శ్వాన ఉండి “సంపూర్ణ సంతోషం” లోను “నిత్య సుఖముల”లోను పాలు పంచుకునేటట్లు వారిని అర్హులు చేయల్సిందని చేసిన ప్రార్ధనతోను ఈ పుస్తకం వస్తోంది. ఆయనలో సర్వాధికారినీ “పదివేలమంది పురుషులలో.... గుర్తింప” గలిగిన వానిని “అతి కాంక్షణీ”యుణ్ని చూసి అంగీకరించేవాందరికీ లభించగల ఫలం ఇదే.DATel .0

  - ప్రకాశకులు

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents