Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    87—“నా తండ్రియు మీ తండ్రియు...నైన వాని యొద్దకు”

    క్రీస్తు తన తండ్రి సింహాసనాన్ని అధిష్టించడానికి సమయం వచ్చింది. దివ్య విజేతగా తన విజయ చిహ్నాలతో పరలోక ఆస్థానానికి తిరిగి వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన మరణానికి ముందు తన తండ్రితో ఇలా అన్నాడు. ” చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి”తిని. యోహా 17:4. తన పునరుత్థానానంతరం పునరుత్థానమైన తన మహిమా స్వరూపంతో తన శిష్యులు పరిచయం కలిగి ఉండేందుకు ఆయన భూమిమీద కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు సెలవు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. తాను సజీవ రక్షకుణ్ని అన్న విషయాన్ని ధ్రువపర్చాడు. ఆయన శిష్యులు ఇక ఆయన సమాధిని గురించి ఆలోచించాల్సిపనిలేదు. పరలోక విశ్వం ముందు మహిమ పొందినవానిగా ఆయన్ని గురించి శిష్యులు తలంచవచ్చు.DATel 937.1

    లోకంలో జీవించినప్పుడు తాను తరచు సందర్శించి తన సముఖం ద్వారా పునీతం చేసిన స్థలాన్ని తన ఆరోహణానికి ఆయన ఎంచుకున్నాడు. దావీదు పట్టణమైన సీయోను పర్వతం గాని ఆలయ స్థలమైన మోరీయా గాని ఆ గౌరవాన్ని పొందలేదు. అక్కడ క్రీస్తుని ఎగతాళి చేసి విసర్జించారు. అక్కడ బలీయమైన ప్రేమా ప్రవాహంలో కృపాతరంగాలు ఎగసిపడుతూ వస్తుండగా వాటిని కఠిన హృదయులు అక్కడ వెనక్కినెట్టి వేశారు. యేసు అలసిపోయి బరువెక్కి బద్దలవుతున్న హృదయంతో విశ్రాంతి కోసం అక్కడనుంచి ఒలీవల కొండకు వెళ్లాడు. ఎంపికైన ఆ పట్టణాన్ని విడిచి మొదటి దేవాలయం నుంచి వెళ్ళిపోవడం ఇష్టం లేదన్నట్టు పరిశుద్ధ షెకీన తూర్పు కొండమీద నిలిచింది. అలాగే యేసు యెరుషలేము వంక ఆశగా చూస్తు ఒలీవల కొండమీద నిలబడ్డాడు. ఆయన చేసిన ప్రార్ధనల వల్ల కార్చిన కన్నీళ్ల వల్ల’ ఆ కొండ చెట్ల తోవులు లోయలు పునీతమయ్యాయి. ఆయన్ని రాజుగా ప్రకటిస్తూ కేకలు వేస్తున్న జనసమూహాల విజయ నినాదాలతో ఆ కొండ కోనలు ప్రతిధ్వనించాయి. ఆ కొండకింది ప్రాంతంలో ఉన్న బేతనియలో లాజరు గృహంలో ఆయన విశ్రమించేవాడు. ఆ కొండ పక్కనే ఉన్న గెత్సెమనే తోటలో ఆయన ఒంటరిగా హృదయవేదనతో ప్రార్థన చేశాడు. ఈ కొండ మీద నుంచే ఆయన పరలోకానికి ఆరోహణుడు కావలసి ఉంది. ఆయన తిరిగివచ్చేటప్పుడు ఈ కొండ శిఖరం పైనే ఆయన అడుగు పెట్టనున్నాడు. వ్యసనాక్రాంతుడుగా కాదు, హెబ్రీ హల్లెలూయలు అన్యజన హోసన్నాలతో, రక్షణ పొందిన విస్తార జనసమూహాలు ఆయన్ని అందరికీ ప్రభువుగా కిరీటం ధరింపజెయ్యండి అంటూ చేస్తున్న నినాదాల నడుమ మహిమాన్వితుడు విజయుడు అయిన రాజుగా ఆయన ఒలీవల కొండ మీద నిలుస్తాడు.DATel 937.2

    యేసు ఇప్పుడు తన పదకొండుమంది శిష్యులతో ఆ కొండకు వెళ్తన్నాడు. వారు యెరుషలేము గుమ్మాలు దాటుతుందగా కొన్ని వారాల కిందటే అధికారులు మరణ శిక్ష విధించి ఎవరిని సిలువేసి చంపారో ఆ ప్రభువు తన శిష్యులతో వెళ్లడం అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. ఇదే తమ ప్రభువుతో తమ చివరి కలయిక అని శిష్యులికి తెలియదు. వారికి గతంలో తానిచ్చిన ఉపదేశాన్ని పునరుచ్చరిస్తూ వారితో సంభాషిస్తూ యేసు ఆ సమయాన్ని గడిపాడు. వారు గెత్సెమనే తోటను సమిపంచినప్పుడు హృదయభారంతోను వేదనతోను తాను గడిపిన ఆ రాత్రి తమకు బోధించిన పాఠాలు వారు గుర్తుకు తెచ్చుకునేందుకోసం ఆయన కాసేపు ఆగాడు. తన సంఘం తనతోను తన తండ్రితోను ఎలా ఒకటై ఉన్నదో సూచించడానికి తాను చిహ్నంగా తీసుకున్న ద్రాక్షావల్లి వంక మళ్లీ చూశాడు. అప్పుడు వారికి వివరించిన సత్యాల్ని మళ్లీ చెప్పాడు. నిష్పలమైన తన ప్రేమకు ఆయన . చుట్టూ జ్ఞాపికలున్నాయి. తాను ఎంతో ప్రేమిస్తున్న తన శిష్యులు సయితం తన పరాభవ గడియలో ఆయన్ని నిందించి విడిచి వెళ్ళిపోయాడు.DATel 938.1

    క్రీస్తు ఈ లోకంలో ముప్పయి మూడున్నర సంవత్సరాలు , సంచిరించాడు. లోకం ద్వేషాన్ని పరాభావాన్ని ఎగతాళిన భరించాడు. ఆయన్ని విసర్జించి సిలువవేశారు. ఇప్పుడు తన మహిమా సింహాసనాన్ని అధిష్టించడానికి పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో తన సానుభూతిని ప్రేమను వారి మీదనుంచి తీసివేసుకోడా? ఏ తావులో తనను అక్కడి నివాసులు అభినందిస్తారో, ఎక్కడ పాపరహిత దూతగణాలు తన ఆజ్ఞను ఔదల దాల్చుతారో ఆ రాజ్యంపై ఆయన ఆలోచనలు కేంద్రీకృతం కావా? అలా జరగదు. తాను లోకంలో విడిచి పెడున్న తన ప్రియ శిష్యులికి ఈ వాగ్దానం చేశాడు, “ఇదిగో నేను యుగసమాస్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” మత్త 28:20.DATel 939.1

    ఒలీవల కొండకు చేరినప్పుడు యేసు కొండ శిఖరానికి అందరికన్నా ముందు నడిచివెళ్తున్నాడు. పరిసరాల్లో బేతనియ కనిపిస్తోంది. ఆయన ఆగాడు. శిష్యులు ఆయన చుట్టూ నిలిచారు. ఆయన వారివంక అప్యాయంగా చూస్తున్నప్పుడు ఆయన ముఖం నుంచి వెలుగు ప్రకాస్తోంది. తమ పొరపాట్లు వైఫల్యాలకు ఆయన వారిని నిందించలేదు. తమ ప్రభువు నోటినుంచి వారికి చివరగా వినిపించినవి దయతో ప్రగాఢ ప్రేమతో నిండిన మాటలు. కాపుదలనిచ్చే తన శ్రద్ధాసక్తులకు భరోసా ఇస్తున్నట్టు దీవిస్తూ చేతులు పైకెత్తి నెమ్మదిగా వారి మధ్యనుంచి ఆరోహణుడయ్యాడు. భూమ్యాకర్షణ శక్తికన్నా బలమైన శక్తి ఆయన్ని పరలోకం వైపుకి ఆకర్షించింది. ఆ యన పైకి వెళ్తుండగా ఆశ్చర్యభరితులైన శిష్యులు వెళ్లిపోతున్న తమ ప్రభువుని అఖరిసారిగా చూడడానికి కళ్లు పైకెత్తి నిలబడిపోయారు. ప్రకాశమానమైన మేఘం ఆయన్ని కమ్మగా ఇక ఆయన వీరికి కనిపించలేదు. మేఘరథం పై దేవదూతలు ఆయన్ని వెంబడించి వెళ్తున్నప్పుడు ఈ మాటలు వినిపించాయి, “ఇదిగో నేను యుగ సమిష్తి వరకు సదాకాలము నాతో కూడ ఉన్నాను. ” అదే సమయంలో ఆనందోత్సాహాలతో పరవశిస్తోన్న దూతల మధురగానం నిలిచి ఉన్న శిష్యులికి వినిపించింది.DATel 939.2

    శిష్యులు ఇంకా పైకి చూస్తుండగానే సంగీతంలా మధురమైన స్వరాలు వినిపించాయి. వారు తిరిగి చూడగా మనుషుల రూపంలో ఉన్న ఇద్దరు దూతలు వారితో ఇలా అన్నారు, “గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిరో ఆ రీతిగానే తిరిగి వచ్చును.”DATel 939.3

    యేసుని పరలోకానికి తీసుకువెళ్ళడానికి మేఘంలో వేచి ఉన్న వెలుగుతో ప్రకాశిస్తోన్న దూతల సమూహంలో ఉన్నవారే ఈ ఇద్దరు దూతలు. వీరు దూతల్లో మిక్కిలి ఉన్నత స్థాయి గల వారు. క్రీస్తు పునరుత్థానమప్పుడు సమాధి వద్దకు వచ్చిన ఇద్దరూ వీరే. యేసు లోకంలో ఉన్న కాలమంతా వీరు ఆయనతో ఉన్నారు. పాపం వల్ల వికృత రూపం ధరించిన ఈ లోకంలో ఆయన ఉండాల్సిన కాలం అంతమొందడానికి పరలోకమంతా ఆశగా కనిపెట్టింది. పరలోక విశ్వం తన రాజుని స్వీకరించడానికి సమయం వచ్చింది. యేసుకి స్వాగతం పలికే దూత సమూహాల్లో ఈ ఇద్దరు దూతలు ఉండాలని ఆశించలేదా? కాని ఆయన ఎంతో ప్రేమించిన శిష్యుల్ని ఆయన విడిచిపెట్టి వస్తుండగా వారిపై సానుభూతి కొద్దీ వారిని ఓదార్చడానికి వారు ఆగారు. “వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచర్య చేయుటకై పంపబడిన ఆత్మలు కారా?” హెబ్రీ 1:14.DATel 940.1

    క్రీస్తు మానవ రూపంలోనే పరలోకానికి వెళ్లాడు. మేఘం ఆయన్ని తీసుకోడం శిష్యులు చూశారు. తమతో నడిచిన, మాట్లాడిన ప్రార్థించిన యేసే; తమతో రొట్టె విరిచిన, సముద్రం పై తమతో పడవలో ఉన్న యేసే; ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమయ్యేంత వరకు తమతో కలిసి పనిచేసిన యేసే - ఆయనే ఇప్పుడు తండ్రితో సింహాసనంపై కూర్చోడానికి వెళ్ళాడు. ఆకాశంలోకి వెళ్లడం తాము చూస్తున్న ఆయన పైకి వెళ్లినట్టుగానే తిరిగిరావడం తాము చూస్తారని దూతలు వారికి హామీ ఇచ్చారు. ఆయన “మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును.” “ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును; క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు” “తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును.” ప్రవ 1:7; 1 థెస్స 4:16; మత్త 25:31. ప్రభువు తన శిష్యులికిచ్చిన వాగ్దానం ఈ విధంగా నెరవేర్తుంది. “నేను వెళ్లి నాకు స్థలం సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలవచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.” యోహా 14:3. శిష్యులు తమ ప్రభువు తిరిగి రాకకోసం ఎదురుచుస్తూ ఆనందించవచ్చు.DATel 940.2

    శిష్యులు తిరిగి యెరుషలేముకి వెళ్లినప్పుడు ప్రజలు వారి వంక ఆశ్చర్యంగా చూశారు. క్రీస్తు తీర్పు, సిలువ మరణం దరిమిల శిష్యులు అధైర్యం చెంది సిగ్గుతో తలలు వంచుకుని తిరుగుతారని ప్రజలు భావించారు. వారి ముఖాల్లో దుఃఖం పరాజయం వ్యక్తమవుతాయని వారి ప్రత్యర్థులు కనిపెట్టారు. దీనికి బదులు వారి ముఖాలపై సంతోషం విజయం తాండవిస్తోన్నాయి. వారి ముఖాలు పరలోకానందంతో ప్రకాశిస్తోన్నాయి. వారు ఫలించని ఆశల గురించి దుఃఖించడం లేదు. కాని వారు స్తోత్ర గానంతో కృతజ్ఞతార్పణతో దేవున్ని కొనియాడున్నారు. క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఆయన పరలో కానకి ఆరోహణ మవ్వడం గురించి ఆనందోత్సాహాలతో చాటించారు. అనేకులు వారి సాక్ష్యాన్ని విని క్రీస్తును అంగీకరించారు.DATel 941.1

    తమ భవిష్యత్తు గురించి శిష్యులికి ఇక ఎలాంటి సందేహాలు లేవు. యేసు పరలోకంలో ఉన్నాడని తమ పట్ల ఆయనకు ఇంకా సానుభూతి ఉన్నదని వారికి తెలుసు. దైవ సింహాసనం వద్ద తమకో స్నేహితుడున్నాడని వారకి తెలుసు. వారు తమ మనవుల్ని క్రీస్తు ద్వారా తండ్రి కి సమర్పించుకోడానికి ఆతురతగా ఉన్నారు. గంభీర భయభీతితో వంగి ఈ నిశ్చితితో ప్రార్ధన చేశారు, “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన నాకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణముగునట్లు అడుగుడి మీకు దొరకును” యోహా 16:23, 24. బలమైన ఈ వాదనతో వారు తమ విశ్వాస హస్తాన్ని పైకి ఇంకా పైకి ఎత్తారు, “శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే; అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడు ఆయనే” రోమా 8:34. క్రీస్తు వాగ్దానం చేసినట్లు ఆదరణకర్త సమక్షంలో పెంతెకొస్తు వారికి సంపూర్ణ ఆనందం తెచ్చింది.DATel 941.2

    రక్షకుణ్ని పరలోక ఆస్థానంలోకి స్వాగతించడానికి పరలోకమంతా వేచి ఉంది. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయనే ముందు వెళ్తున్నాడు. తన పునరుత్థాన సమయంలో సమాధి చెరనుంచి ఆయన విడిపించిన వేలాది బానిసలు ఆయన వెంట వెళ్లారు. పరలోక జనసమూహాలు స్తుతిగీతాలు పాడుతూ ఆ సమూహంలో కలిసి వెళ్లారు.DATel 942.1

    వారు దేవుని పట్టణాన్ని సమీపించేటప్పుడు ఆయన వెంటవస్తున్న దూతలు ఈ సవాలు విసిరారు:DATel 942.2

    “గుమ్మములారా మితలలు పైకెత్తుకొనుడి
    మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన
    తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి.”
    DATel 942.3

    వేచి ఉన్న కావలి వారు ఉత్సాహంగా ఇలా స్పందించారు “మహిమ గల యీ రాజు ఎవడు?DATel 942.4

    వారిలా అనడం ఆయనవెరో తెలియక కాదు, కాని వారి జవాబును ఉన్నత స్తుతి రూపంలో వినాలని ఇలా అడుగుతున్నారు,DATel 942.5

    “బలశౌర్యములు గల యెహోవా యుద్ధ శూరుడైన యెహోవా
    గుమ్మములారా,
    మిమ్మును లేవనెత్తికొనుడి”
    DATel 942.6

    సవాలు మళ్ళీ వినిపించింది. “మహిమ గల యీ రాజు ఎవడు? ఎందుకంటే ఈ నామం హెచ్చించబడడం వినడం దూతలికి విసుగు కాదు. ఆయన వెంట వెళ్తున్న దూతలు ఇలా బదులిచ్చారు,DATel 942.7

    సైన్యముల కధిపతియగు యెహోవాయే ఆయనే యీ మహిమగల రాజు ” కీర్త 24:7-10DATel 942.8

    అప్పుడు దేవుని పట్టణ ద్వారాలు బహాటంగా తెరిచారు. శ్రావ్యమైన సంగీం నడుమ దేవతదూతల సమూహం ఆ గుమ్మాల గుండా వెళ్ళారు.DATel 942.9

    అక్కడ సింహాసనం ఉంది. దాని చుట్టూ వాగ్దానపు ధనస్సు ఉంది. అక్కడ కెరూబులు నెరాపులు ఉన్నారు. దూతల సైన్యాల సేవాధిపతులు, దైవ కుమారులు, అనగా పాపరహిత లోకాల ప్రతినిధులు అక్కడ సమావేశమయ్యారు. దేవుని మీద ఆయన కుమారుని మీద లూసీఫర్ ఏ పరలోక సభముందు ఆరోపణలు చేశాడో ఆ సభ, ఏ పాపరహిత లోకాలపై తన రాజ్యాన్ని స్థాపించాలని సాతాను కలలు కన్నాడో ఆ లోకాల ప్రతినిధులు అందరూ విమోచకుడికి స్వాగతం పలకడానికి సమావేశమయ్యారు. ఆయన విజయాన్ని పండుగగా జరుపుకోడానికి ఆయన్ని తమ రాజుగా మహిమపర్చడానికి వారు అతురతగా ఉన్నారు.DATel 942.10

    అయితే ఆయన వారిని వెనక్కినెట్టుతున్నాడు. ఇంకాకాదు. ఇప్పుడు మహిమ కిరీటాన్ని రాజ దుస్తుల్ని ఆయన స్వీకరించలేడు. ఆయన తండ్రి సముఖంలోకి ప్రవేశించి గాయపడ్డ తన తలను, ఈటె పోటుతిన్న తన పక్కను, మేకుల గాయాలతో వికృతంగా ఉన్న తన పాదాల్ని చూపించాడు. మేకుల గుర్తులున్న తన చేతులు పైకెత్తాడు. తన విజయ చిహ్నాల్ని చూపించాడు. దేవునికి తన అల్లండించే పనను సమర్పించాడు - అనగా తన రెండో రాక సమయంలో సమాధుల్లోనుంచి లేవనున్న ప్రజల ప్రతినిధులుగా తన పునరుత్థానమప్పుడు సమాధుల్నుంచి లేచిన వారిని సమర్పించాడు. పశ్చాత్తాపపడే ఒక్క పాపి విషయంలో ఎంతో సంతోషించే తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. అలాంటి ఒక్కడి విషయమై ఆయన సంతోష గానం చేస్తాడు. మానవుడు సాతానుకి లొంగి పాపంలో పడిపోడం సంభవిస్తే అతణ్ని విమోచించడానికి లోకానికి పునాదులు వేయకముందే తండ్రి కుమారులు ఒక నిబంధన చేసుకున్నారు. ఇద్దరూ చేతులు కలుపుకుని మానవ జాతికి క్రీస్తు జామినుగా నిలవాలని నిబంధన చేసుకున్నారు. ఈ హామీని క్రీస్తు నెరవేర్చాడు. “సమాప్తమైనది” అని క్రీస్తు సిలువపై కేక వేసినప్పుడు ఆయన తండ్రిని సంబోధించాడు. నిబంధనను పూర్తిగా నెరవేర్చాడు. ఇప్పుడు తండ్రిని సంబోధించి ఇలా అంటోన్నాడు. తండ్రీ అది సమాప్తమయ్యింది. నా దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చాను. విమోచన కార్యాన్ని పూర్తిచేశాను. నీ న్యాయశీలత తృప్తి పొందితే “తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెనని కోరుచున్నాను.” యోహా 19:30; 17:24.DATel 943.1

    న్యాయపాలిక తృప్తి చెందింది అన్న దేవుని స్వరం వినిపిస్తుంది. సాతాను పరాజితడవుతాడు. భూమి పై కష్టాలనుభవిస్తూ పనిచేస్తోన్న ప్రజలను “క్రీస్తులో... ఏర్పరచుకొనెను.” ఎఫె 1:6; పరలోక దూతల ముందు, పాపరహిత ప్రపంచాల ప్రతినిధుల ముందు వారు నీతిమంతులుగా తీర్పుపొందారు. ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఆయన సంఘం ఉంటుంది “కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి” కీర్త 85:10. తండ్రి కుమారుణ్ని కౌగిలించుకుంటాడు. “దేవుని దూతలందరును ఆయనకు నమస్కారము చేయవలెనని” తండ్రి ఆదేశిస్తాడు. హెబ్రీ 1:6.DATel 943.2

    ప్రధానులు రాజ్యాలు అధికారులు జీవనాధుడు యేసు సర్వాధికారాన్ని అంగీకరిస్తారు. ఆయన ముందు దేవదూతల సమూహాలు సాగిలపడినమరిస్తారు. “వధింపబడిన గొట్టె పిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరము” పరలోకమంతా ప్రతిధ్వనిస్తుంది. ప్రక 5:12.DATel 944.1

    విజయ చిహ్నాలతో, విశాల నుంచి వెలువడే శ్రావ్య సంగీతంతో పరలోకమంతా నిండి ఆనందం స్తుతి వెల్లువెత్తుతాయి. ప్రేమ జయిస్తుంది. తప్పిపోయినది తిరిగి వస్తుంది. పరలోకం గంభీర స్వరాలతో ఇలా ప్రకటిస్తుంది, “సింహాసనాసీనుడైయున్న వానికిని గొట్టిపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక!” ప్రక 5:13.DATel 944.2

    ఆ పరలోకానంద దృశ్యం నుంచి భూమిపై ఉన్న మనకు క్రీస్తు తానే పలికిన ఈ అద్భుతమైన మాటల ప్రతిధ్వని తిరిగి వస్తుంది. “నా తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను.” యోహా 20:17. పరలోక కుటుంబం భూలోకకుటుంబం ఒక్కటే. మన ప్రభవు మన కోసం పరలోకానికి వెళ్లాడు. ఆయన మనకోసం జీవిస్తున్నాడు. “ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు. ” హెబ్రీ 7:25.DATel 944.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents