Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    జాతీయతపట్ల క్రీస్తు వైఖరి

    జాతి, హోదా, మత తత్వములను గూర్చిన వేరుపాటును క్రీస్తు గుర్తించలేదు. శాస్త్రులు, పరిసయ్యలు దైవపర దానములను తమ స్థానిక ప్రజలకు, తమ జాతివారికి వినియోగించి లోకమందుగల తక్కినదైన కుటుంబమును వేరుచేయజూచిరి. అడ్డుగోడలను విరుగగొట్టుటకు క్రీస్తు వచ్చెను. ప్రపంచమును ఉత్తేజపరచు గాలి, వెలుగు వర్షబిందు వుల వలె తన వరములగు కృపా ప్రేమలు సార్వత్రికమైనవని చూపుటకాయన వచ్చెను. CChTel 188.3

    క్రీస్తు జీవితము కులమునకు తావు లేని ఒక సంస్థను ఒక దానిని స్థాపించెను. ఈ మతము ద్వారా యూదుడు,అన్యుడు స్వతంత్రుడు బానిస దేవునిముందు సమానులుగా, సర్వమానవ సహోదర్వపు అనుబంధముతో ఏకస్థము చేయబడు చున్నారు. CChTel 189.1

    ఆయన వ్యవహారములలో రాజనీతికి తావేలేదు. ఆయనకు పరులు, పరదేశులు, మిత్రులు, శత్రువులు ఒకటే. జీవ జాలము కొరకు దప్పిగొన్న ఆత్మయే ఆయన హృదయమును ఆకర్షించెను. ఏ మానవుని అయోగ్యుడని విసర్జించక ప్రతి పాపిని శుద్ధి చేయుటకు ప్రయత్నించెను. ఆయన ఎవరితో కలిసి ఉన్నను ఆ సమయమునకు పరిస్థితులకును సరిపడు పాఠములను అందజేయవలెను. మానవులు తమ సహమానవుల పట్ల చూపు నిర్లక్ష్యము తిరస్కారము, ఆయన దేవ మానవ కారుణ్యము మానవుల కెక్కువ అవసరమని తెలియజేసినది. CChTel 189.2

    అతి మూర్ఖులును, నిష్ప్రయోజకులును అగువారు సహితము నిందారహితులు, నిరపాయులు అగు దేవుని పిల్లలగుటకుCChTel 189.3

    వీలున్నదనియు నిరీక్షణను ఆయన వారికిచ్చెను. 29T 190, 191;CChTel 189.4

    దేవుని పిల్లలు క్రీస్తునందు ఒకటేగనుక, వర్ణమును, సామాజిక వ్యత్యాసములును, జాతి, హోదా, భాగ్యము, అభిజాత్యము, విద్యాధికము మానవుని నుండి మానవులను వేరు చేయు ఇత్యాది సాంఘిక వ్యత్యాసములను గూర్చి తలంచును? ఐక్యతామర్మము క్రీస్తు విశ్వాసుల యొక్క అన్యోన్యతపై ఆధారపడి యున్నది. 3R. H. Dec. 22, 1891;CChTel 189.5