Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పంపూర్ణ సమర్పణావశ్యకత

    సహోదరులారా, మీరు మీ బాధ్యతను గుర్తించవలసినదిగా ప్రభుని నామమందు మిమ్మును హెచ్చరించు చున్నాను. మీ హృదయములను పరిశుద్దాత్మ శక్తి కప్పగించుడి. అవి వాక్య బోధలకు లొంగును. అప్పుడు మీరు దైవ సంబంధమయిన గంభీర విషయములను గ్రహించ సమర్థులయ్యెదరు. CChTel 488.1

    క్రీస్తును గూర్చిన అతి గంభీరమయిన సాక్ష్యము లోకమునకు అందించబడవలసియున్నది. ప్రకటన గ్రంథమంతటి యుందును అతి ప్రశస్తమైన, ఉన్నతములైన వాగ్దానములు కలవు. అతి భయంకరమైన, గంభీర ప్రాముఖ్యత గల హెచ్చరికలు కూడ అందు కలవు. క్రీస్తు యోహాను కిచ్చిన సాక్ష్యమును సత్యజ్ఞానము మాకున్నదని చెప్పుకొను వారు పఠించరా? ఊహాగానములకు, శాస్త్రీయమైన మోసములకు ఇక్కడ వీలులేదు. మన ప్రస్తుత, అనాగత సుక్షేమమునకు సంబంధించిన సత్యములిందు గలవు. గోధుమలకు పొట్టుకు ఏమీ సంబంధము?CChTel 488.2

    ప్రభువు త్వరలో వచ్చుచున్నాడు. సిమోను గోడలపై నున్న కావలివాండ్రు దేవుడు తమపై పెట్టిన బాధ్యతను గుర్తించవలెనని హెచ్చరించబడుచున్నారు. ఆత్మ శక్తితో లోకమునకు అంతమ హెచ్చరికా వర్తమానము నందించుటకు గాను కావలివాండ్రను దేవుడు పిలుచుచున్నాడు. రాత్రి యెంత కడచిపోయెనో మీరు తెలుపవలసి యున్నారు. మరణము నిద్రను నిద్రించకుండ స్త్రీ పురుషులను మైకము నుండి మేల్కొల్పుటకు ఆయన కావలివాండ్రను పిలుచు చున్నాడు. 9 8T 301. 302. 304. CChTel 488.3