Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఒకని మనస్సు మరియొకని ఆధీనమందుంచుట

    గొప్ప మేలు చేయు చున్నానని తలచుచు ఏ వ్యక్తియు మరియొక వ్యక్తి మనస్సును స్వాధీనపరచుకొనరాద. మనోశక్తి ద్వారా స్వస్థపర్చుట మహా భయంకరమయిన మోసములలో నొకటి. తాత్కాలికముగా బాధ తగ్గినట్లునిపించ వచ్చును. కాని ఇట్లు స్వాధీనపరుచుకొన బడు వ్యక్తి మనస్సు మరెన్నడును బలీయమగు విస్వసనీయముగను ఉండనేరదు. క్రీస్తు వస్త్రపు చెంగునంటుకొన్న స్త్రీ యంత బలహీనముగ మనముండవచ్చును. విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చుటయను దైవదత్తమైన తరుణమును మనము వినియోగించుకొన్నచో, విశ్వాసముతో ముట్టిన ఆ స్త్రీకి వలె ఆయన మనక కూడా సత్వర సమాధానము నిచ్చును. CChTel 490.2

    ఏ మానవుడును మరియొక మానవునికి తన మనస్సును అదపు చేయుటకు ఈయ రాదని దేవుని సంకల్పము. పునరుత్థానుడై యిప్పుడు తండ్రి కుడి పార్శమున నున్న క్రీస్తు మహావైద్యడు. స్వస్థపరచు శక్తి కొరకు ఆయన నాశ్రయించుడి. ఆయన ద్వారానే పాపులు ఉన్నత రీతిగా దేవుని చెంతకు రాగలరు. ఏ మానవ మనస్సు ద్వారా ఆయన చెంతకు రాజాలరు. పరలోక సాధనములకును బాధపడుచున్న వారికిని మధ్య మానవమధ్యవర్తి నిలువ రాదు. CChTel 490.3

    ఎల్లరి మనస్సులను దేవుని తట్టు త్రిప్పుటకు ప్రతి వ్యక్తి దేవునితో సహకరించవలెను. మహా వైద్యుడగు ఆయన కృపను శక్తిని గూర్చి చెప్పుడి. CChTel 491.1

    ఏ మానవుని మనస్సుకు మీరు వశంపదులు కావలెనని మేము కోరుట లేదు. ప్రచారము చేయబడిన శాస్త్రములలో మనోశక్తి స్వస్థత అతి భయంకరమైన శాస్త్రము. ప్రతి దష్టుడు తన దుష్ట కార్యములన నెరవేర్చుకొనుటకు దీనిని ఉపయోగించ వచ్చును. అట్టి శాస్త్రములతో మనకు సంబంధము లేదు. దాని విషయము మనము భయపడవెను. అట్టి శాస్త్ర ప్రాధమిక సూత్రములే సంస్థలోను ప్రవేశించరాద. 3MM 115, 116;CChTel 491.2

    ప్రార్థన అలక్ష్యము మానవులు తమ స్వబలముపై ఆధారపడి యుండుటకు దారి తీసి శోధనకు ద్వారము తెరచును. అనేక సదర్భములలో ఊహాశాస్త్ర పరిశోధనమునందాసక్త మగును. తమ జ్ఞానమును బట్టి మానవులు గర్వించెదరు. మానవ మనస్సు సంబంధమైన విజ్ఞాన శాస్త్రములు ఎక్కువ భాగము అతిశయోక్తులే. వాని వాని స్థానములలో నవి మంచివే. కాని మానవులన మోసగించి వారిని నాశనము చేయు బలవత్తర సాధనములుగా వానిని సాతానుడు ఉపయోగించుచున్నాడు. వాని కళలు పరము నుండి వచ్చినవిగా అంగీకరించబడును. ఇట్లు తాను కోరిన గౌరవము అతనికి లభ్యమగుచున్నది. కపాల శాస్త్రము మంత్ర విద్యల వలన మేలు పొందినదని తలచబడచున్న లోకము ఎన్నడును ఇంత అవినీతితో నిండలేద. ఈ శాస్త్రముల ద్వారా సద్గుణము అంతరించుచున్నది. భూత తత్వము నకు పునాదులు వేయబడుచున్నది. 4ST Nov. 6,1884;CChTel 491.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents