Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పంది.. . మీకు హేయము

    పంది యొక్క స్నాయువులు పురుగులతో నిండి యుండును. పందిని గూర్చి దేవుడిట్లు సెలవిచ్చెను “అది మీకు హేయము. వాటి మాంసము తిన కూడదు. వాటి కశేబరమును ముట్ట కూడదు.” ద్వితి 14:8 పంది మాంసము తినుటకు తగినది కాదు గనుక ఈ ఆజ్ఞ ఇయ్యబడినది. పందులు పాకీ పనిచేయు జంతువులు. ఈ పనికే అవి ఉద్దేశించ బడినవి. వాని మాంసములు మానవులు ఎన్నడును భుజించరాదు. మలినము తమ శరీరములో నొక భాగముగ నుండి హేయమైన పదార్థమును తిను ఏ జంతువు నందైనను ఆరోగ్యదాయకమగు మాంసముండ జాలదు. 7MH 313, 314;CChTel 420.6

    పంది మాంసము సాధారణముగా భుజింపబడు చున్నది. అయినను అది చాల హానికరమైనది. హెబ్రీయులను పంది మాంసము తినవద్ధని దేవుడు తన అధికారమును చూపుటకు ఆజ్ఞాపించలేదు. అది మానవులకు మంచిది కాదు గనుక ఆయన దానిని నిషేధించెను. అది శరీరములోనికి గండమాల, మెడ లేక కీళ్లవాయు వ్యాధిని ప్రవేశపెట్టును. ముఖ్యంగా వేడి ప్రదేశములలో కుష్టురోగమును తదితర వ్యాధులను కలిగించును. ఈ మాంసమును ఉపయోగించుట వలన చలి ప్రదేశములలోకన్న వేడి ప్రదేశముల యందు శరీరములనకెక్కువ హిని కలుగును.. .. . అన్ని మాంసములకన్న పంది మాంసము రక్తమును ఎక్కువ చెరచును. పంది మాంసమును తరుచుగా తినువారు వ్యాది గ్రస్తులగుట తధ్యము. 8CD 392, 393; CChTel 421.1

    ముఖ్యముగా మెదడుయొక్క అధిక స్పర్శజ్ఞానముగల నరములు బలహీనములగును. అందుచేత మనస్సు మొద్తుబారి ఆధ్యాత్మిక సంగతులను గ్రహించలేదు. అతి సికృష్టస్థితికి దిగజారి సామాన్యవిషయములందా సక్తి గొనును. 92T 96;CChTel 421.2

    పంది మాంసము భక్షించుట వలన కలుగు దుష్పలితములు కూర్చొని మెదడుతో పనిచేయుచు ఎక్కువ కాలము కార్యాలయములందు గడువు వారి యందు కనబడినట్లు ఆరు బయట కష్టపడి పనిచేయువారి యందగపడదు. 10CD 393;CChTel 421.3