Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఇంటి యజమాని క్రీస్తు ననుకరించవలెను

    కుటుంబ సభ్యులకు తండ్రి శిరసై యున్నాడు. అతడే గుణగణములను కలిగి యుండి గృహశాసనములను రూపొందించ వలెను. శక్తి, యదార్థత, నమ్మకము, ఓర్పు, ధైర్యము, క్రియాపూర్వకమైన ప్రయోజకత్వము. తండ్రి ఒక విధముగా కుటుంబ యాజకుడు. అతడు దేవుని బలిపీఠముపై ఉదయ సాయంకాలపు అర్పణలను పెట్టవలెను. ఈ యర్పణయందు ఏకీభవించుటకును స్తుతి కీర్తన పాడుటకును భార్య, బిడ్డలు ప్రోత్సహించబడవలెను. గృహ యాజకుడయిన తండ్రి ఉదయ సాయంతనములందు ఆ దినమున తానోనరించిన పాపములను, తన బిడ్డలు చేసిన పాపములను ఒప్పుకొనవలెను. తనకు తెలిసిన పాపములు, దేవునికి మాత్రమే తెలిసిన రహస్య పాపములు అతడొప్పుకొనవలెను. తండ్రి ఉన్నపుడు తండ్రి, తండ్రి లేనపుడు తల్లి ఈ కార్యక్రమమును అనుసరించినచో అది కుటుంబమును ఆశీర్వాదకరముగ నుండును. CChTel 298.2

    తండ్రియైన వానికి నేను చెప్పవలసినదేమనగా నీ ఆత్మను పరిశుద్ధమైన. పవిత్రమైన వాతావరణము ఆచరించునట్లు శ్రద్ద తీసుకొనుము. దినదినము నీవు క్రీస్తును గూర్చి నేర్చుకొనవలెను. గృహమునందు నీవెన్నడును కఠిన స్వభావము కనపర్చరాదు. ఇట్లు చేయు వ్యక్తి సైతాను ప్రతినిధులతో పాలిభాగస్థుడై పని చేయుచున్నాడు. నీ చిత్తమును దైవ చిత్తముయొక్క ఆధీనము క్రింద ఉంచుము. నీ భార్యను సంతోషపరుచుటకు నీ శక్తికొలది కృషి చేయుము. దేవ వాక్యమును నీ హితపరిగా ఎన్నుకొనుము. వాక్యబోధల ప్రకారము గృహమందు జీవించుము. అప్పుడు సంఘమునందును ఆ మీదట నీ కార్యకలాపములందును అట్టి జీవితమును జీవించగలవు. పరలోక నియమములు నీ వ్యవహారములన్నింటిని సమున్నత పరచును. క్రీస్తును లోకమునకు కనపర్చుటలో నీకు దేవదూతలు సహాయము చేయుదురు. CChTel 298.3

    పనియందలి విసుగుదల గృహ సంతోషమునకు ప్రతిబంధకము కలిగించనీయకుము. నీ ఇష్టమునకు విరుద్దముగా చిన్న చిన్న సంగతులు జరిగినపుడు నీవు ఓర్పు, దీర్ఘశాంతము, దయ, ప్రేమలను కనపర్చకున్నచో నిన్ను ప్రేమించి నీవు ఆయనతో ఉండుటకు గాను నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రభువును స్నేహితునిగా ఎన్నుకొనలేదని ఇవి సూచించుచున్నవి. CChTel 299.1

    నేను కుటుంబ యజమానుడనను భావమును ప్రదర్శించుట పురుషత్వ లక్షణము కాదు. తన అధికారమును నిలుపుకొనుటకు అతడు లేఖనములను ఉల్లేఖించుట అతని ప్రతిష్టను వృద్ధి చేయజాలదు. తన ఆజ్ఞలు నిర్థుష్టములనియు, వాని భార్య పాలించవలెననియు హఠము పట్టుట యాజమాన్యమునకు గురుతుకాదు. భర్త భార్యకు సంరక్షకుడై యుండవలెనని దేవుడు ఏర్పాటు చేసెనుక్రీస్తు సంఘమునకు కర్తయై మర్మమయిన శరీరమునకు రక్షకుడై యున్నట్లు భర్త కుటుంబ సభ్యులను సమైఖ్యపరుచు వ్యక్తియై యున్నాడు. దేవుని ప్రేమించుచున్నానని చెప్పు ప్రతి భర్తయు అతని స్థితిని గూర్చిన దైవ విధులను జాగ్రత్తగా గుర్తించవలెను. జ్ఞానము నందును, దయ, సాత్వికములయందును క్రీస్తు తన అధికారమును చూపును. కనుక భర్త సంఘనాధుని అనుకరించి తన యధికారమును చూపవలెను. 3AH 212-215;CChTel 299.2