Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆధ్యాయము 9 - క్రీస్తుతో ఐక్యము`సహోదర ప్రేమ

    తన బిడ్డలు సంపూర్ణ ఐకమత్యము కలిగియుండవలెనని దేవుని ఉద్దేశ్యము. వారు ఒకే పరలోకమందు నివసింపగోరుచున్నారా? క్రీస్తులో విభాగములున్నవా? దురాలోచనలు, దుర్గుణములు అను చెత్తను తుడిచివేసికొనక ముందు, పనివారు ఏకాభిప్రాయులై దేవుని దృష్టియందతి పరిశుద్ధమయిన పని కొరకు తమ హృదయ మానసిక బలములను వినియోగించక ముందే దేవుడు తన ప్రజలకు జయమును చేకూర్చునా? ఐకమత్యము బలము, అనైక్యతము బలహీనత. ఒకరితోనొకరు ఏకీభవించినచో మానవుల రక్షణార్థముగా దేవునితో జతపనివారమగుదుము. సమైక్యత కలిగి పనిచేయనివారు దేవుని అగౌరవ పరుచున్నవారగుదురు. ఒకరి యెడల ఒకరు విరోధభావము కలిగి పనిచేయుట చూచి అపవాది ఆనదించును. అట్టివారు సహోదర ప్రేమ, దయాళుత్వము అలవరుచుకొనవలెను. భవితవ్యమును మరుగుపరుచు తెరను ఒత్తిగించి యనైక్యతా ఫలితములను చూడగలిగినచో, నిశ్చయముగా వారికి పశ్చాత్తాపము కలుగును. 18T 240;CChTel 125.1