Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రీస్తును పోలిన శీలము రూపొందించుట

    క్రైస్తవ మతము నగీకరించు వారికి ఆ మతము అపకీర్తి నాపాదించదు. అది వారిని కరకుగాను, కఠిన హృదయులను గాను చేయదు. అట్లు గాక అది వారి అభిరుచులను సంస్కారము కలిగించి చింతనలను పవిత్రీకరించి, ఆలోచనలను శుద్ధిపరచి ఉదాత్తములొనరించి వారిని క్రీస్తు ఆధిపత్యము క్రిందకి తెచ్చును. మానవ తలంపులూహింపగల ఉన్నత స్థాయి కంటే తన బిడ్డల యెడల దేవుని యాశయములు అధికముగా ఔన్నత్యములై యున్నవి. తన పరిశుద్ధ ధర్మశాస్త్రమందు తన శీలము యొక్క ప్రతిరూపమును ఆయన ఇచ్చియున్నాడు. CChTel 198.5

    క్రైస్తవ శీలమునకు క్రీస్తు పోలికయే పరమావధి. మనమందు నిత్య అభ్యుదయ మార్గము తెరువబడి యున్నది. మనము చేరవలసిన గురి, సాధించ వలసిన ప్రామాణ్యము ఒకటున్నది. దానియందు మేలైన, పవిత్రమైన, ఉదాత్తమైనదంతయు నిమిడియున్నది. ప్రవర్తనా పరిపూర్ణత సాధనకు సర్వదా సర్వతోముఖ కృషి సాగవలెను. 28T 63, 64;CChTel 199.1

    సర్వదా మన అభ్యాసములను బట్టి మన వ్యక్తిత్వము ఏర్పడును. మంచి అలవాటులు కలిగి తమ ధర్మములను నమ్మకముగా నెరవేర్చు వ్యక్తుల జీవితములు ఇతరుల మార్గమందు కాంతిరేఖలను వెదజల్లుచు, నడిరేయిలో తేజరిల్లు వెలుగై యుండును; కాని మోసపు అలవాటులు, నిర్లక్ష్యము, సోమరితనముతో కూడిన అలవాట్లు బలపడినచో జీవితమార్గము అందు అర్థరాత్రికన్న చక్కని వ్యక్తులను ఆవహించి వారికి భవితవ్యము లేకుండా చేయును. 34T 452;CChTel 199.2

    నిత్య జీవపు మాటలకు చెవినిచ్చువాడు ధన్యుడు. “సత్యాత్మ” మార్గదర్శకత్వము వలన నతడు సమస్త సత్యమును గ్రహించును. లోకమతనిని ప్రేమించదు, గౌరవింపదు; మెచ్చుకొనదు కాని దేవుని దృష్టిలో నతడు గొప్ప విలువగల వ్యక్తియగును. “మనము దేవుని పిల్లలమని పిలువబడుటయందు తండ్రి మన మీద యెట్టి ప్రేమను చూపెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా ఆయనను ఎరుగలేదు.” 1 యోహాను 3:145T 439;CChTel 199.3