Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తల్లిదండ్రులారా మీ బిడ్డలకు క్రీస్తు చెంతకు నడిపించుడి

    మంచి చేయవలెనను నాశ పిల్లలకుండవచ్చును. తమ తల్లిదండ్రులకు గాని పోషకులకు గాని విధేయులయి యుండవలెనని వారు తమ హృదయములలో తీర్మానించుకొని యుండవచ్చును. అయితే వారి యొద్ద నుండి పిల్లలకు సహాయము, అనవసరము. వారి తీర్మానములు మంచివై యుండవచ్చును. అయినను వారి నియమములు మతముచే పటిష్టపర్చబడినవే గాని వారి జీవితములు నూతన పరచు దైవకృపా ప్రభావమును పొందినవే గాని ఆ గురిని వారు చేరజాలరు. CChTel 371.3

    తను బిడ్డల రక్షణ కొరకు తల్లిదండ్రులు ఇతోదికముగా కృషి చేయవలెను. విద్యను సముపార్జించుకొనుకటకు వారి ప్రయత్నములకు వారిని విడిచి పెట్టక తల్లిదండ్రులు వారికి నమ్మకముగా ఉపదేశమీయవలెను. కాలక్రమమున నుంచి నిలిచి చెడుగు మాటుమాయమగునను ఉద్దేశ్యముతో పిల్లలు మంచి చెడ్డలను మూకుమ్మడిగా నేర్చుకొనవలెనని కోరరాదు. మంచికన్న చెడ్డ త్వరితముగా వృద్ధి చెందును. CChTel 371.4

    తల్లిదండ్రులారా, మీ బిడ్డలను క్రైస్తవులను చేయవలెనను సదాశయముతో వారి బాల్యమునందే వారి చిన్నారి మనసులను క్రమపర్చనారంభించుడి. వారి రక్షణయందే మీ సర్వప్రయత్నములను కేంద్రీకరించుడి. దేవుని రాజ్యమందు ప్రశస్తమయిన మణుల వలె ప్రకాశించునట్లు తయారు చేయు నిమిత్తము వారు మీ కప్పగించబడిరో యన్నట్లు ప్రవర్తించుడి. మంచి చెడ్డలను గుర్తించుటకు, తమ పాపములను ఒప్పుకొని క్రీస్తు నంగీకరించుటకు వారికి ఊహ చాలదని యపోహపడి నాశనమను గోతిపై వారిని నిద్రకు జోకొట్టకుండ జాగ్రత్తగా నుండుడి. CChTel 371.5

    పిల్లల లేత మనస్సుకు బోధపడు విధమున తల్లిదండ్రులు రక్షణోపాయమును వారికి సుస్పష్టమొనర్చవలెను. ఎనిమిది పది లేక పండ్రెండు వత్సరములు ప్రాయము గల పిల్లలకు వ్యక్తి గతమతమును గూర్చి చెప్పిన వారు గ్రహించగలరు. వారు పెద్దవారైనపుడు సత్యమును నమ్మవచ్చునను ఉద్దేశమును పిల్లలకు కనుపర్చకుడి. సరిగా ఉపదేశించబడినచో చాల చిన్న పిల్లలు సయితము తమ పాప స్థితిని క్రీస్తు ద్వారా ఏర్పడిన రక్షణ మార్గమును గూర్చి విస్పష్టముగా గ్రహించగలరు. పిల్లల రక్షణ నిమిత్తము బోధకులు చాలా అలక్ష్య స్వభావము కలిగియున్నారు. వారు చేయవలసినంతగా వీరి విషయము వ్యక్తిగత కృషి చేయుటలేదు. పిల్లల మనస్సులలోనికి సత్యమును పంపుటకు స్వర్ణావకాశములు తరచుగా ఉపేక్షచేయబడుచున్నవి. 21IT 396—400;. CChTel 372.1

    తల్లిదండ్రులారా, మీపై పెట్టబడిన బాధ్యత యొక్క ప్రాధాన్యతను మీరు గుర్తించుచున్నారా? మీ పిల్లలు, అలక్ష్యము, అవినీతితో కూడిన అలవాటును అలవరచుకొనకుండా వారిని కాపాడుట అవసరమని మీరు గుర్తించుచున్నారా? తమ శీలములపై మంచి పలుకుబడిని ఉంచగల స్నేహితులతోనే వారిని స్నేహము చేయనీయుడి. వారెక్కడ ఉందురో, ఏమి చేసెదరో తెలిసనవే గాని సాయంకాలమునందు వారిని ఎక్కడకు పోనీయకుడి. నైతిక సావిత్ర సూత్రములను వారికి ఉపదేశించుడి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము కొంత యిచ్చుట కొంత అచ్చట వారికి బోధించుట మీరు అలక్ష్యము చేసినచో వెంటనే యీ పనిని ప్రారంభించుడి. మీ బాధ్యతలను పరిగ్రహించి నిత్యమయిన ఫలితముల కొరకు పనిచేయుడి. మీ పిల్లల పట్ల మీరు చూపిన అలక్ష్యము నిమిత్తము సత్వరముగా వారిన క్షమాపణ అడుగిడి. దేవుడు మీకు నియమించిన పని నుండి చేసెదమని వారికి చెప్పుడి. ఈ సంస్కరణలో మీతో సహకరించుడని వారిని కోరుడి. గతమున మీరు చూపిన అలక్ష్యము వలన లోటును తీర్చుటకు కృషి చేయుడి. లొదోకియా సంఘ స్థితియందుండకుడి. ప్రతి కుటుంబము తన నిజ స్థితిని కనపర్చవలసినదిగా ప్రభువు నామమందు అడుగుచున్నాను. మీ స్వగృహమునందే సంఘము సంస్కరించుడి. 227T 66, 67;CChTel 372.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents