Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వాక్య జ్ఞానమందలి ప్రేమయే మన నిశ్చయత

    సత్యమునదు దీర్ఘకాలమున్న వారి హృదయములలోనికి కఠినమైన శాస్త్రబద్ద మైన స్వభావము చొరబడినది. వారు నిశితముగన, నిమర్శాత్మకముగన నుండి తప్పుల వెదకుచుందురు. తమ ఉద్ధేశ్యములతో నేకీభవించని వారిని విమర్శించుటకు వార తీర్పుస్థానము నదిష్టించెదరు. అట్టి వారు ఆ స్థానము నుండి దిగివచ్చి ఆయన ముందు వంగి పశ్చాత్తాపబడి తమ పాపములను ఒప్పుకొనవలెనని దేవుడు కోరుచున్నాడు. వారి కాయన ఇట్లు చెప్పుచున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి యన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలన చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్థంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రకటన 2. 4,5 వారు ప్రధమ స్థానము కొరకు ప్రయాసపడు చున్నారు. తమ మాటల ద్వారాను, క్రియల ద్వారాను వారు అనేక హృదయములను గాయపరచు చున్నాడు. CChTel 486.4

    తన వాక్యమును నమ్మి దాని ప్రకారము జీవించ వలెనని క్రీస్తు తన ప్రజలు కోరు చున్నాడు. ఈ వాక్యమును అంగీకరించి జీర్ణించుకొని తమ ప్రతి కార్యమునందును ప్రతి గుణమునందును దీని నొక భాగముగా చేసికొన్నచో వారు దైవ బలమునందు బలడ్యులగుదురు. వారి విశ్వాసము పర సబంధమయినదని తేటపడున. వారు అన్యమార్గములో సంచరించరు. వారి మతము శృంగార రసభావోద్రేకములపై నాధారపడి యుండదు. వారు దేవదూతల ముందును మానవులముందును బలీయమయిన, నిలకడగల క్రైస్తవ శీలమును కలిగి నిలతురు. CChTel 487.1

    క్రీస్తు బోధనలలో కనపర్చబడినట్లు సత్యదూపార్తి యందు దోషజ్ఞానము కలిగించి ఆత్మలను మార్చునది మనకు లభించును. క్రీస్తు ఈ లోకమునకు బోధింపనేగుదెంచిన సత్యములను ఆయనవలె సులభగ్రాహ్యములుగా బోధించుడి. మీ వర్తమాన శక్తి తనంతట తానే పనిచేయును. క్రీస్తెన్నడును చెప్పి యెరుగని సిద్ధాంతములను, వేద గ్రంథమందు లేని బోధలను బోధించకుడి. మనము ప్రకటించవలసిన ఉత్తమ గంభీర సత్యములున్నవి. ప్రతి ఆత్మకు వ్యక్తము చేయవలసిన పరీక్ష ‘అని వ్రాయబడి యున్నది’ అను నదియే. CChTel 487.2

    నడుపుదల కొరకు మనము దైవ వాక్యమున ఆశ్రయింతును. మనకు చాలా మానవ పద్ధతులున్నవి. లోకజ్ఞానము నందే శిక్షణ పొందిన మనస్సు దైవ సంగతులను గ్రహింప జాలదు. కాని అదే మనస్సు మార్పుచెంది పరిశుద్ధ పరచబడినచో వాక్యమందు దైవశక్తిని చూచుట తథ్యము. పరిశుద్దాత్మ శుద్ధీకరణద్వారా కడుగబడిన మనస్సు, హృదయములే దైవ సంగతులను గ్రహించగలవు. 88T 298-301;CChTel 487.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents