Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దుర్ణీత ఫలితము

    భక్తి పరులమని చెప్పుకొను కొందరు హస్త ప్రయోగ పాపమును దాని నిశ్చిత ఫలితములను గ్రహించరు. చిరకాలము నుండి యున్న అలవాట్లు వారికి అంధత్వము కలిగించినవి. శరీరమును బలహీనమొనర్చి, మెదడుయొక్కయు నరములయొక్కయు పటుత్వమును తగ్గించు ఈ నీచ పాపము వలని చెడుగును ప్రతిఘటించవలసి వచ్చినపుడు నైతిక సూత్రములు చాల దుర్భలములగును. ఈ నీచ పాపమును ప్రతిఘటించుటకు బలము సంతరించుకొనని హృదయమును పరలోకము నుండి పంపబడు గంభీర వర్తమానములు కూడ మార్చజాలవు. అస్వాభావికి సంభోగాసక్తి సందర్భముగా జనించు ఉద్రిక్తత వలన మెదడుయొక్క సున్నితమయిన నరముల ఆరోగ్యము పాడగును. 132T 347;CChTel 448.1

    మానవ సమాజ క్షీణతకు నితర పాపములకన్న దుర్ణీతి ఎక్కువ తోడ్పడుచున్నది. ఈ పాపము చాల ఉక్కువగా జరుగుచున్వఇ. దీని వలన వివిధ రోగములు వచ్చుచున్నవి. CChTel 448.2

    ఈ పాపమును తమ బిడ్డలెరుడుదురని తల్లిదండ్రులు తలంచనే తలంచరు. అనేక సందర్భములలో తల్లిదండ్రులే దీనికి కారణము. వారు తమ వివాహాధిక్యతలను దుర్వినియోగ పరచి తద్వారా వారి మృగేచ్చలను బలపరచుకొనిరి. ఇవి బలపడగా నైతిక మానసిక శక్తులు బలహీనములైనవి. పశుత్వము ఆధ్యాత్మికతను అణచివైచినది. పెచ్చుపెరిగిన మృగేచ్ఛలతో పిల్లలు పుట్టెదరు. తల్లిదండ్రుల శీలపు ముద్ర వారి యందుండును. ఈ తల్లిదండ్రులకు పుట్టు పిల్లలు స్వాభావికముగా ఈ రహస్య దురభ్యాసములకు దాసులగుదురు. తల్లిదండ్రులు దోషములు పిల్లలమీదికి వచ్చును. ఏలయనగా తల్లిదండ్రులు తమ కామములను పిల్లలకు స్వాస్థముగా నిత్తురు. CChTel 448.3

    శరీరాత్మలకు వినాశము తెచ్చు దురభ్యాసములు స్థిరపడినవారు తాము స్నేహించు వారికి ఆ రహస్య పాపమును నేర్పించు వరకు విశ్రమింపరు. తెలిసికొనవలెనను నాస తక్షణమే చెలరేగును. దీనిని గూర్చిన సమాచారము ఒక యువకుని యొద్ద నుండి మరియొక యువకుని యొద్దకు పోయి తుద కీ నీచ పాపము నెరుగని వారొకరు కూడ నుండుట దుస్తరమగును. 142T 391,392;CChTel 449.1

    రహస్య దురభ్యాసములు శరీర జీవన శక్తులను నాశనము చేయును. ఇంద్రియ స్ఖలనము దౌర్బల్యము కలిగించును. ప్రధాన స్థానమగు మెదడు అలసి పోవుట చిన్న తన మందే యువజనులకు సంభవించు చున్నది. తత్ఫలితముగా బలహీనత, ఆయాసము ఏర్పడు చున్నవి. దీని వలన శరీరము వివిధరోగములకు గురియగు చున్నది. CChTel 449.2

    ఈ యభ్యాసము పదునైదు వత్సరముల ప్రాయము నుండి ప్రారంభమయి కొనసాగుచున్నచో తనకు జరిగిన, జరుగుచున్న అపచారమును ప్రకృతి ప్రతిఘటించి తన చట్టములను మీరినందుకు వారిని శిక్షించును. ముఖ్యముగా ముప్పది వత్సరముల నుండి నలుబది అయిదు వత్సరముల ప్రాయము నందున్న వారికి కాలేయపు వ్యాది, శ్వాసకోశముల రోగములు, నాడీవ్యాది, కీళ్ల జ్వరము, వెన్నెముక వ్యాది, మూత్రపిండముల వ్యాది, కొరుకు పుండు గ్రంథులు మున్నగు వ్యాధులు పలువిధములైన నొప్పులతో ప్రకృతి శిక్షించును. ప్రకృతి సిద్దమయిన సున్నితమయిన అవయములు కొన్ని శిథిలములగును. వాని పని తక్కిన అవయములు చేయవలసి యుండును. ఇది ప్రకృతి ఏర్పాటుకు తారు మారు చేయును. దీని పర్యపసానముగా శరీరము హఠాత్తుగా వ్యాది గ్రస్తమై మరణము సంభవించును. CChTel 449.3

    దేవుని దృష్టిలో ఒకని జీవమును హఠాత్తుగా తీయుట ఎంత ఘోరమో దానిని క్రమేపి చంపుట కూడ అంత ఘోరమయినది. దుశ్చేష్టలచే క్షీనత తెచ్చుకొను వ్యక్తులు ఇక్కడ శిక్ష ననుభవింతురు. సంపూర్ణముగా పశ్చాత్తాపపడకున్నచో హఠాత్తుగా ప్రాణము తీసిన హంతకును పోలి వారు పరలోకమందు చేర్చుకొనబడరు. దేవుని చిత్తము ననుసరించి కార్యమునకు తగిన ఫలితము ఏర్పడును. CChTel 449.4

    బలహీనముగానున్న యువజనులెల్లరు దుభ్యాసములలో నున్నారని చెప్పలేము. పవిత్ర మనస్సు, మనస్సాక్షి కలవారు కొందరున్నారు. వారు గురియై ర బాధలకు వారు బాధ్యులు కారు. CChTel 449.5

    రహస్య దురభ్యాసము భక్తి శీలసాధనకైన తీర్మానమును, ప్రయత్నమును, చిత్తబలమును నాశమును చేయును. క్రైస్తవునిగా నుండుట యనినేమో నిజముగా గ్రహించు వారెల్లరు క్రీస్తు అనుచరులు తమ శరీరేచ్ఛలను, భౌతిక మానసిక శక్తులను ఆయన చిత్తమునకు సంపూర్ణముగా తొలగియుండునట్లు చేయుదురిని యెరుగుదురు. శరీరేచ్ఛలకు లొంగువారందరు క్రీస్తు అనుచరులు కారు. వారు పాపములకు ప్రభువగు సాతాను సేవయందు నిమగ్నులై యుందురు. కనుక తమ దురభ్యాసములను వీడి క్రీస్తు సేవ చేయుటకు వారు ముందుకు రారు. 15CG 444-446;CChTel 450.1

    చిన్నతనమందే యువజనులు దురభ్యాసములకు లోనైనచో వారు భౌతిక మానసిక నైతిక శీలములను సంపూర్ణముగాను, నిర్దుష్టముగాను స్థాపించుకొనుటకు శక్తి పోందరు. 162T 351;CChTel 450.2

    ఇక్కడ ఆరోగ్యము, ఆమీదట రకర్షణ కావలెనని కోరినచో దురభ్యాసములందు నిమగ్నులైయున్నారు వానిని విడచుటయే శ్రేయస్కరము. ఈ యభ్యాసములు దీర్ఘ కాలము నుండి యున్నచో శోధనను ప్రతిఘటించి దురభ్యాసమును విడచుటకు బలవత్తరమైన కృషి అవసరము. 17CG 464;CChTel 450.3

    ప్రతి దురభ్యాసము నుండి మన బిడ్డలను కాపాడుటకు వారిని క్రీస్తు ఆధీనమం దుంచి నమ్మకమైన, యధార్థమైన కాపరి కాపుదలను పొందుటయే క్షేమకరము. వారాయన స్వరము నాకించినచో వారిని దుర్మార్గము నుండియే అపాయము నుండియు కాపాడును. “నా గొర్రెలు నా శబ్దము వినును. .. అవి నన్ను వెంబడిరచును” అని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తునందు వారికి పచ్చిక బయళ్లు కలవు. వారికాయనయందు బలము చేకూరును. హృదయ సంతుష్టి కొరకు మనస్సును చంచలము చేయు కోర్కెలతో వారు సతమతముకారు. వారు అమూల్యమయిన ముత్యమును కనుగొనిరి కనుక వారి మనస్సురు విశ్రాంతి చేకూరినది. వారి యానందము పవిత్రమయిన, శాంతికరమయిన, సమున్నతమయిన, పారలౌకికమయిన స్థాయి కలిగి యుండును. అది వారికి బాధను దు:ఖమును కలిగించదు. అట్టి యానందము ఆరోగ్యమును పాడుచేయదు లేక మనస్సును శిథిల పరచదు. అది ఆరోగ్యమును దోహదకరముగ నుండును. 18CG 467. CChTel 450.4