Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దశమంశము దైవ వ్యవస్థ

    స్వేచ్చార్పణలు, దశమాంశములు సువార్తదాయములు. మానవునికి ఒప్పగించిన ధనములో దేవుడు తిరిగి కొంత బాగమును, అనగా పదియవ బాగమును కోరుచున్నాడు. 75T 149; CChTel 111.1

    మనపై దేవునికిగల హక్కులు మన ఇతర బాధ్యతలకన్న ఉన్నతమైనవని యెల్లరును జ్ఞాపకముంచుకొనవలెను. ఆయన మనకు సమృద్దిగా ఇచ్చును. మనుష్యునితో ఆయన చేసి కొనిన ఒప్పందము`మనుజుడు తన సంపదయందు పదియవ భాగము దేవునికి చెల్లించవలెననునయే. దేవుడు తన గృహనిర్వాహకులకు తన ధనమును కృపతో అప్పగించుచున్నాడు. కాని దశమ భాగమునుగూర్చి “ఇది నాది” అని చేప్పుచున్నడు. దేవుడు తన ఆస్తిని మానవునికిచ్చిన నిష్పత్తి ప్రకారము అతడు దేవునికి తన ఆస్తిలో నమ్మకముగా దశము భాగము చెల్లించవలెను. క్రీస్తు ఈ విశిష్ట సన్నాహము చేసేను. 86T 384;CChTel 111.2

    వర్తమానసత్యము భూకోకపు చీకటి మూలలకు కొనిపనోబడవలసి యున్నది. ఈ కార్యము స్వదేశమునందే ప్రారంభము కావుచ్చును. క్రీస్తు ననుచరులు స్వార్థజీవులు కారాదు. క్రీస్తు ఆత్మతో నిండినవారై ఆయనతో ఏకస్థముగా మీరు పనిచేయవలెను. 93T 381;CChTel 111.3

    యేసు నిర్వహించవచ్చిన మహత్తరకార్యము ఈ భూమిపై ఆయనకుగల అనుచరులకు అప్పగించ బడినది. తన ప్రజలు ధనము నార్జించి పనిని స్వపోషకము చేయునిమత్తము దేవుడు వారికోక పథకము నిచ్చెను. సామాన్యతయందును, సమానతయందును దేవుని దశమాంశపద్దతి మనోహరమైనది. విశ్వాసముతోను ధైర్యముతోను సమస్త జనులు దానిని గైకొనవచ్చును. ఏలయనగా నది దైవనియమము. సారళ్యము ప్రయోజనము అందు ఏకస్థమైనవి. దానిని గ్రహించి ఆచరణలో పెట్టుటకు అధిక విధ్య అక్కరలేదు. ప్రశస్తమగు రక్షణ సేవను పురోగమింజేయాటలో తాముకూడ కొంతభాగము నిర్వహించగలమని అందరు తలంచవచ్చును. ప్రతి పురుషుడు, స్త్రీ, యువకుడు, యువతి ప్రభుని కోశాధిపతి అయి ఆయన దనాగారముపై అయనకుగల హక్కులను నెరవేర్చ ప్రతినిధి కావచ్చును. ఆపొస్తలు డిట్లనుచున్నాడు. “ప్రతి మానవుడును తాను వర్థిల్లిన కొలది తన యొర్ద కొంత సొమ్ము నిలువచేయువలెను ”ఈ పద్దతి వలన మహత్తర లక్ష్యములు సాధించబడుచున్నవి. సమస్త ప్రజలు దీని నంగీకరించినచో ప్రతివాడును దేవునికి శ్రద్ధాభక్తులుగల ధనాధికారి యగును. ప్రపంచములో కడవరి హచ్చరికా వర్తమానమును ప్రకటించు మహత్తర కార్యమును సాధించుటకు ఆర్థికమైన కొరత కలుగదు. ఈ పద్దతి నందరు అవలంబించినచో ధనాగారము నిండియుండును. దాతలు పేదరికమునకు దిగజారరు. విరాళమిచ్చుకొలది ప్రస్తుతకాల సత్యప్రచారముతో వారికి అధికసాన్నిహిత్యము కలుగును. “వారు వాస్తవమైన జీవమును సంపాదించు కొనునిమిత్తము, రాబోవు కాలములకు మంచి పునాది తమ కొరకు వేసికొను” వారగుదురు. CChTel 111.4

    ఓర్పు క్రమబద్ధతగల పనివారు దయాళుత్వయత్నము వలన దేవుని యెడలను, తోడి మానవుల యెడల ప్రేమను పెంపొందజేయుచు తమ వ్యక్తిగత యత్నములు ప్రయోజనకరదమని గుర్తించెదరు. ప్రపంచమును కప్పుచున్న నైతిక అంధకారమును అరికట్టు యుద్దమును కొనసాగించ సుక్షేమ స్థితి నెలకొల్పుటకు తమ సంపాదనలో కొంత దానము చేయుడని దేవుడడుగుచుండగా ఆయన హక్కులను క్రైస్తవ సమాజము ఒక్కుమ్మడిగా నిరాకరించుచున్నది. క్రీస్తు ననుచరులు చురుకుదనము, ఆసక్తిగల పనివారగువరకు దేవుని పని తగు విధముగా ముందుకు సాగజాలదు. 103T 388, 389;CChTel 112.1