Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అంతము వరకు పరిశుద్ధాత్ముడు ఉండును

    పరిశుద్ధాత్మయొక్క ప్రభావము తన శిష్యులతో లోకాంతము పర్యంతముండునని, క్రీస్తు ఉద్ఘాటించెను. కాని ఈ వాగ్దాత్తము తగురీతిగా అభినందింపబడలేదు. ఆ కారణముగా ఉద్దేశింపబడినంతగా అది సిద్ధిపొందుటలేదు. పరిశుద్ధాత్మ వాగ్దానమునుగూర్చి ఎక్కువ తలంచుటలేదు. దీని పర్యవసానముగా ఆధ్యాత్మిక అనావృష్టి, ఆధ్యాత్మిక అంధకారము, ఆధ్యాత్మిక శిథిలము, మరణము సంభవించును. అల్ప విషయములయందు ధ్యాసహెచ్చరిల్లుచున్నది. సంఘము యొక్క పెరుగుదలకును అభ్యుదయమునకు ఆవశ్యకమైన దైవశక్తి, ఇతర ఆశీర్వాదములన్నింటిని ప్రసాదించు దైవశక్తి, సమృద్ధిగా వాగ్దానము చేయబడినను అది వారిలో కొరవడుచున్నది. CChTel 230.2

    సువార్త సేవ యెక్కువ జయప్రదముగా సాగక పోవుటకు కారణము ఆత్మ కొరవడుటయే. విజ్ఞానము, సామర్థ్య ము, వాగ్ధాటి, స్వతసిద్ధముగాగాని కృషివలన గలిగిన ప్రతి వరము వీనిని కలిగియున్నను, దేవుని ఆత్మ ప్రత్యేకతలేకున్నచో ఏ ఆత్మను ఆకర్షింపలేరు. ఏ పాపిని క్రీస్తు చెంతకు చేర్చలేరు. ఇట్లుగాక వారు క్రీస్తుతో జతపడినచో, ఆత్మ ఫలములను వారు పొందినచో, ఆయన శిష్యులలో నతి పేదలు, అజ్ఞానులు సహా హృదయాకర్షణశక్తిని పొందవచ్చును. విశ్వమందు శ్రేష్టమైన పలుకుబడిని వ్యాపింపజేయు సాధనములుగా దేవుడు వారిని చేయును. CChTel 230.3

    శిష్యులు మహత్తర శక్తితో సత్యమును ప్రకటించునట్లు దేవునియందుగల ఆసక్తి వారికి చైతన్యము కలిగించినది. సిలువ వేయబడిన క్రీస్తుని విమోచక ప్రేమా వృత్తాంతమును చాటుటకు ఇట్టి ఆసక్తి మన హృదయములలో ఒక తీర్మాన మును రేకెత్తించవలదా? యధార్థమైన పట్టుదలతో కూడిన, ప్రార్థనకు ఫలితముగా నేడు దేవుని ఆత్మ వచ్చి సేవకొరకు మానవులను శక్తితో నింపవలసిన అగత్యము లేదా? అయితే సంఘము బలహీనముగను, నిరుత్సాహముగను ఎందుకు ఉన్నది?48T 21, 22;CChTel 230.4

    సంఘసభ్యులు పరిశుద్ధాత్మ స్వాధీనములో నున్నపుడు మన సంఘములలో ఉపన్యాస ప్రమాణము సేవా ప్రమాణము, ఆధ్యాత్మిక ప్రమాణము ఇతోధికముగా వృద్ధియగును. సంఘసభ్యుల జీవజలము గ్రోలి తెప్పరిల్లెదరు. పనివారు CChTel 231.1

    క్రీస్తు ఆధ్వర్యము క్రింద పనిచేసి ఆత్మయందును, మాటయందును, క్రియయందును ప్రభువును కనపరచి మనము నిర్వహించుచున్న మహత్తర కార్యసిద్ధికి పురోగమించుటకు ఒకరినొకరు ప్రోత్సాహించు కొనెదరు. ప్రేమ, ఐకమత్యములు, అధికరించి పాపులను రక్షించుటకు దేవుడు తన కుమారుని పంపెనని లోకమునకు సాక్ష్యమిచ్చును. దైవ సత్యము హెచ్చించబడును; మండుచున్న దీపము వలె నది ప్రకాశించు కొలది దానిని మనము స్పష్టతరముగాను, స్పష్టతమముగాను గ్రహించెదము. 58T 211;CChTel 231.2

    దైవ జనులు తమ భాగమును తాము నిర్వహించక దైవాత్మ తమపైకి వచ్చి తమ దోషములను తప్పిదములను సంస్కరించవలెనని వేచియున్నచో, శరీరాత్మల మాలిన్యమును శుభ్రపరచి మూడవ దూత వర్తమానమును ప్రకటించుటకు, తమను యోగ్యులుగా చేయుటకు వారు దానిపై నాధారపడియున్నచో వారు లోపములతో నిండియుందురు. దేవుడాజ్ఞాపించిన పని చేయుట వలన తమ్మునుతాము సన్నిధ పరచుకొన్నవారి మీదికే దైవాత్మ లేక దేవుని శక్తి వచ్చును. ఆ పని ఏదనగా, శరీరాత్మల సకల మాలిన్యమునుండి తమ్మును పవిత్రపర్చుకొని దైవభీతియందు పరిశుద్ధతా సంపూర్ణతను సాధించుటయే. 6IT 619. CChTel 231.3