Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తప్పు తేలికగా కన్పడు నపుడు

    మనము గొప్ప వెలుగు గల యుగములో జీవించుచున్నాము. కాని వెలుగు కనబడుచున్నదానిలో నెక్కువ సాతాను వివేకమునకు ,నైపుణ్యమునకు మార్గమును తెరుచుచున్నది. సత్యమువలె అగపడు విషయములునేకములు ప్రచారము చేయబడుచున్నవి. కాని వానిని ప్రార్ధన పూర్వకముగాను జాగ్రత్తగాను పరిశీలించవలెను. ఏలయనగా నవి సాతానుని ఆకర్షకములగు తంత్రములేమో. దోష మార్గము సత్యమార్గమునకు సమీపముగా నున్నట్లు తరచుగా అగపడును. పరిశుద్ధతకు, పరలోకమునకు నడుపు మార్గమునకు దీనికి మధ్యగల వ్యత్యాసము కనుగొనుట చాల కష్టము. కాని పరిశుద్ధాత్మచే ఉత్తేజితమైన మనసు అది సత్యమార్గమునకు విరుద్ధముగ నున్నదని గుర్తించును. కొంత సేపు అయిన పిదపఆ రెండును విడిపోయి చాల దూరమున నున్నట్లు ద్యోతకమగును. CChTel 479.5

    దేవుడొక శక్తియై ప్రకృతియంతట వ్యాపించి యున్నాడను సిద్ధాంతము సాతానుని గొప్ప తంత్రములలో నొకటి. ఈ సిద్ధాంతమ దేవుని గూర్చి తప్పుగా వివరించి ఆయన విశిష్టతకును ఠీవికిని అపకీర్తి ఘటించుచున్నది. CChTel 480.1

    అద్వైత సిద్ధాంతములన దైవ వాక్యము సమర్ధించుటలేదు. ఈ సిద్ధాంతముల ఆత్మన నాశనమ చేయు సాధనములని దైవ వాక్యము ఎరుకపర్చుచున్నది. ఈ సిద్ధాంతమలకు చీకటియే ప్రధానాంశము. ఇంద్రియ సుఖమే రంగస్థలి. అస్వాభావిక హృదయమునకు తృప్తి కలిగించి వాంఛలను విచ్చలవిడిగా విడచును. వీని నంగీకరించుట వలన దేవుని నుండి విడిపోవుట సంభవించును. CChTel 480.2

    పాపమువలన మన పరిస్థితి విపరీతముగా మారినది. కనుక మనలను యధాపూర్వ స్థితి తెచ్చు శక్తి అమానుష్యమయినది కాకున్నచో దానికి విలువ లేదు. మానవ హృదయము లందలి పాప ప్రాబల్యమును నాశనమొనరించు శక్తి ఒకటే యున్నది. అది క్రీస్తునందు దేవుని శక్తియే. సిలువ వేయబడిన ఆ ప్రభుని రక్తమే పాపములను కడిగివేయగలదు. మన పతిత స్వభావ దుర్గుణములను ప్రతి ఘటించి అదుపులో నుంచుటకు ఆయన కృపయే మనకు శక్తినీయగలదు. దేవుని గూర్చిన యీ అద్యైత సిద్ధాంతములు, ఈ శక్తిని అంగీకరించ కుండ చేయుచున్నవి. దేవుడు సర్వ సృష్టి యందును ఉండు నొక శక్తి అయినచో ఆయన మానవులందరిలోను వసించును. పరిశుద్ధతను సాధించ వలెనన్నచో మానవడు తనలో నున్న శక్తిని వృద్ధి చేసి కొన్న చాలును. CChTel 480.3

    ఈ సిద్ధాంతములను ఆ మూలాగ్రముగా పరికించినచో తేలునదేమనగా నివి క్రైస్తవమతమును నాశనము చేయునునవి. విమోచన అవసరములేదనుచు విని మానవుడు తనకు తానే రక్షకుడని చెప్పుచున్నవి. దేవుని గూర్చిన యీ సిద్ధాంతమలు దైన వాక్యమును నిష్ప్రయోజన మొనర్చుచున్నవి. వీని నంగీకరించు వారు తుదకు బైబిలు కల్పితమని పరిగణించుటకు కూడ నడిపించబడుదురు. పాపముకన్న సద్గుణము మేలని వారు పరిగణించవచ్చును. కాని దేవునికి తన మహోన్నత స్థానము నీయనివారు మానవ శక్తిపై నాధార పడెదరు. దైవము లేని మానవశక్తి నిరర్థకము. సహాయము లేని మానవ చిత్తమునకు దుర్ణీతిని ప్రతిఘటించుటకు శక్తి యుండదు. ఆత్మకు కాపుదల ఉండదు. పాపమునకు మానవునికి మధ్య అడ్డుగోడ ఉండదు. దైవ వాక్య నిర్భంధనలను ఆయన ఆత్మను ఒక సారి తృణీకరించినచో ఎట్టి నీచస్థితికి మానవుడు దిగజారునో మనము గ్రహించలేము. CChTel 480.4

    ఈ దుర్బోధనలను నమ్మువారు తమ క్రైస్తవానుభవమును తప్పక పోగొట్టుకొని దేవునితో తమకున్న సంబంధమును త్రెంచుకొని నిత్య జీవితమును కోల్పోయెదరు. 28T 290-292;CChTel 481.1