Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సబ్బాతు దినమున బడికి హాజరగుట

    నాల్గవ యాజ్ఞను గైకొనువాడు తనకును లోకమునకును మధ్య వేరుపాటు ఉన్నట్లు కనుగొనును. సబ్బాతు ఒక పరీక్ష. అది మానవుని ఏర్పాటుకాక దైవ పరీక్షయై యున్నది. దేవుని సేవించువారి నుండి సేవించని వారిని వేరుపరుచునది యిదే; సత్యమునకును అసత్యమునకును మధ్య అంతిమ సంఘర్షణ ఈ విషయము పైనే వచ్చును. CChTel 78.1

    మనలో కొందరు తమ బిడ్డలను సబ్బాతుదినమున పాఠశాలకు పంపిరి. ఇది చేయుటకు వారిని ఎవరును బలత్కారము చేయలేదు, గాని ఆరు దినములు హాజరుగాని పిల్లలను బడికి చేర్చుకొనమని పాఠశాలాధికారులు అభ్యంతరము చెప్పినందున అట్లు చేసిరి. ఈ పాఠశాలలో కొన్నింటియందు విద్యార్థులకు మామూలు విద్యలు నేర్పబడుటయేగాక వేర్వేరు పనులు కూడా నేర్పబడును. సబ్బాతు దినమున ఇక్కడకు ఆజ్ఞలు గైకొనుచున్నామని చెప్పుకొను వారి పిల్లలు పంపబడుదురు. “సబ్బాతు దినమున మేలు చేయుట ధర్మ” మను క్రీస్తు మాటలను ఎత్తి చెప్పుట ద్వారా కొందరు తల్లిదండ్రులు తమ కార్యమును సమర్థింప జూతురు మనుజులు తమ బిడ్డలకు ఆహారము సంపాదించు నిమిత్తము సబ్బాతు దినమున కాయకష్టము చేయవచ్చుననియు, ఏమి చేయనగునో ఏమి చేయరాదో స్పష్టము చేయుటకు ఒక హద్దులేక ఆనవాలు లేదనియు అదే హేతువాదము వలన రుజువు చేయ జూతురు. CChTel 78.2

    నాల్గవ యాజ్ఞను గైకొనుటకు సాధ్యముకాని స్థలమందు తమ బిడ్డలనుంచి మన సహోదరులు దైవ ఆమోదమును పొందజూడరాదు. ఏడవ దినమున పాఠశాలకు హాజరు కాకుండ తమ బిడ్డలుండుటకు పాఠశాలాధికారులతో ఏదో యొక ఏర్పాటు చేయుటకు వారు ప్రయత్నించవలెను. ఇది ఫలభరితముగాని పక్షమునఏమి సభవించినను దైవ విధులను కాపాడుటకు తమ విధియని విశదమగుచ్నుది. CChTel 78.3

    దేవుడు తన విధులపట్ల నిక్కచ్చిగా ఉండడని కొందరు చెప్పెదరు. అంత గొప్ప నష్టముతో సబ్బాతును నిష్కర్షగా కాపాడుటగాని దేశ శాసనములకు విరుద్ధముగా ప్రవర్తించుటగాని తమ విధిగాదని వారనెదరు. మానవ శాసనములకన్నా ధర్మ శాస్త్రమును ఎక్కువ సన్మానింతుమో లేదో అనునదియే ఇక్కడ పరీక్ష. దేవుని గౌరవించువారికిని అగౌరపరచువారికిని మధ్య గల బేధమిదే. మనస్వామి భక్తిని నిరూపించుకొనవలసిన స్థలమిదే. దేవుడు సంపూర్ణ విధేయతను కోరునని అన్నియుగములందును తన ప్రజలతో ఆయన వ్యవహరించిన విధమును గూర్చిన భోగట్టా తెలియపరచుచున్నది. CChTel 79.1

    లోకవిద్య నభ్యసించు నిమిత్తము సబ్బాతును సామాన్య దినముగా చేయుటకు తల్లిదండ్రులు తమ బిడ్డలనువిడిచి పెట్టినచో వారిపై దేవుని ముద్ర వేయబడజాలదు. లోకముతోనే వారు నాశనము పొందెదరు; వారి రక్తము తల్లిదండ్రులపై నుండదా? కాని మనము నమ్మకముగా మన పిల్లలకు దైవాజ్ఞలను నేర్పి తద్వారా తల్లిదండ్రుల అధికారమునకు లొంగునట్లు చేసి దరిమిల విశ్వాసముతోను ప్రార్థనతోను వారిని దేవుని కప్పగించుచో మనతోపాటు ఆయన పని చేయును; అట్లు చేతునని ఆయన వాగ్దానము చేసెను. ప్రవాహము వలె ఉపద్రవములు లోకమును ముంచిపనుడు వారు ప్రభుని గుడారపు మాటున దాచబడవచ్చు. 142TT 180-184;CChTel 79.2