Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సాతానుని నాశనకరమైన పన్నుగబడ

    మానవ కుటుంబమునకు చేయదగినంత కీడును. చేయులకు పన్నాగములను యోచించెను. ఒకదాని వెనుక అనేక ప్రతిపాదనలు చేయబడినవి. చివరికి సాతానుడే ఒక ఉపాయము నాలోచించెను. దేవుడు ఆహారముగా ఇచ్చిన ద్రాక్షపండ్లను, గోదుమలను తదితర ఫలములను తీసికొని వానిని విషముగా మార్చతలచెను. అది మానవుని భౌతిక, మానసిక నైతిక శక్తులను నాశనము చేసి జ్ఞానేంద్రియములను మొద్దు బార జేయును. ఇట్లు సాతానుడు మానవుని వశపరచుకొన దలచెను. మద్యపానముద్వారా మానవుడు వివిధాపరాధములను చేయులకు నడిపించ బడుచున్నాడు. చెడ్డ ఆహార వాంఛద్వారా లోకము అదినీతితో నింపబడుచున్నది. మనుజులును మద్యపానమునకు నడుపుటద్వారా వారు త్రాసులో నానాటికి క్రిందికి దిగిపోవునట్లు సాతానుడు చేయుచున్నాడు. 4Te 12;CChTel 436.1

    సారాయి, పోగాకు, టీ, కాఫీల వాడకము ద్వారా సాతానుడు లోకమును చెరగొనుచున్నాడు. వినిర్మలముగా నుంచుకొనవలసిన దైన దత్త చిత్తము విషపదార్థముల వాడకము ద్వారా చెరచబడుచున్నాది. అది శద్రునియంత్రణము క్రిందనున్నది. మానవుడు వెర్రి తనమును కలిగించు పదార్ధము కొరకు తన విచక్షణ బుద్ధిని తెగనమ్మినాడు. అతనికి న్యాయా న్యాయ విచక్షణ లేనే లేదు. 5Ev529;CChTel 436.2

    ధారాళ హస్తముతో సృష్తికర్త మానవునికి సమృద్ధిగా నిచ్చెను. దేవుడిచ్చిన యీ వరముఉ జ్ఞానయుతముగాను, మితముగిను ఉపయోగించి బడినచో దారిద్య్రము వ్యాది, వ్యధలు లోకములోనుండి దాదాపు మటుమాయమయ్యెడివే. కాని మానవుని దుర్వర్తన వలన దేవుని దీవెనలన్నియు శాపముగా పరిణమిల్లు చున్నట్లు ఎల్లయెడ కాంచ గలుగు చున్నాను. CChTel 436.3

    మత్తును కలిగించు మద్యమును తయారుచేయుటకు భూఫలము ను ఉపయోగించు వారికన్న దేవుని అమూల్య వరములను చెడ్డగా నుపయోగొంచు వర్గము మరియొకటి లేదు. పోషణ పదార్థము కల గింజలు, ఆరోగ్యదాయకమును, మధురమును అగు ఫలములను మత్తు పదార్థములుగా తయారు చేయబడు మన్నవి. ఈ పదార్థములు జ్ఞానేంద్రియములను మొద్దుబారజేసి మెదడుకు వెక్రితనమును కలిగించును. ఈ విషములకు సౌఖ్యములు లేవు సరిగదా జీవితావసర విషయములు కూబ లభ్యమగుట లేదు. బలత్కారములు పెచ్చుపెరుగు చున్నవి. ఈ త్రాగుడు వలన అనేకులు అకాల వ్యాధి మరణములకు గురియగుచున్నారు. 6GW 385’ 386;CChTel 436.4