Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రీస్తుతోను, ఒకరితో నొకరును ఏకస్థమగుటయే మనకు క్షేమకరము

    క్రైస్తవుల యందలి అనైక్యతను లోకము సంతృప్తితో వీక్షించుచున్నది. అవిశ్వాసములు ఆనందించుచున్నారు. తన ప్రజాళిలో మార్పు కలుగవలెనని దేవుడు కోరుచున్నాడు. ఈ కడవరి దినములలో క్రీస్తుతోను ఒకరితో నొకరు అసహించుకొనుచున్నారు. చూడుడి! నా సైన్యములతో యుద్ధము చేయుటకన్న వారు ఒకరితోనొకరు కలహించుకొనుటలో నెక్కువ బలమును వినియోగించినంతసేపు వారిని గూర్చి మేము భయపడనక్కరలేదు.”CChTel 125.2

    పరిశూద్ధాత్మ దిగి వచ్చిన పిమ్మట శిష్యులు పునరుత్థానుడైన రక్షకుని గూర్చి ప్రకటించుటకు బయలుదేరిరి. ఆత్మలను రక్షించుటయే వారి యేకైక వాంఛితము. పరిశుద్ధులతోడి సహవాస మాధుర్యమును గ్రోలుటయందు వారు హర్షించిరి. వారు దయ, యోచన, ఆత్మోపేక్ష, సత్యము కొరకు ఎట్టి సమర్పణనైనను చేయుబుద్ధి ` ఇట్టి సలక్షణములు కలిగి యుండిరి. వారు తమ దైనందిన సహవాసము నందు క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రేమను ప్రదర్శించిరి. స్వార్థరహితమైన మాటల ద్వారాను, క్రియలద్వారాను ఈ ప్రేమను ఇతర హృదయములలో రగులు కొల్పుటకు వారు ప్రయాసపడిరి. CChTel 126.1

    పరిశూద్ధాత్మ దిగి వచ్చిన పిదప అపోస్తులుల హృదయాలను ఆవరించి ప్రేమను విశ్వాసులు ఎల్లప్పుడును ధ్యానించి వృద్ధి పరచవలసి యున్నారు. ఈ క్రొత్త ఆజ్ఞకు విధేయులగుచు వారు పురోగమించవలసి యున్నారు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేహాను 13. 34 ఆయన విధులను నెరవేర్చుటకు సమర్థులై యుండు నిమిత్తము క్రీస్తును వారు అంత సన్నిహితముగా హత్తుకొనవలెను. తన నీతి వలన వారిని నీతిమతులని తీర్చగల రక్షకుని శక్తి విస్తృతి చెందవలసి యున్నది. CChTel 126.2

    కాని పురాతన క్రైస్తవులు ఒకరియందొకరు తప్పులు వెదకయత్నిచెడివారు. తప్పులను గూర్చి చెప్పుకొనుచు నిశిత విమర్శకు తావిచ్చుచు రక్షకుని గూర్చియు పాపులపట్ల ఆయన కనపర్చిన ప్రేమను గూర్చియు వారు మరచిపోయిరి. బాహ్యచారములందు నిష్టాగరిష్టులై విశ్వాస సిద్ధాంతమందు ఎక్కువ పట్టింపును, ఆక్షేపించుటయదు కాఠిన్యమును కలిగియుండిరి. ఇతరుల విమర్శించుట యందాసక్తులై తమ పొరపాట్లును విస్మరించిరి. క్రీస్తు నేర్పిన సహోదర ప్రేమ పాఠములను మరచిపోయిరి. అన్నింటికన్న విచారకరమైనదేమనగా తమ నష్టమును వారు గుర్తింపరైరి. సతోషానదములు తమ జీవితములను విడిచిపోవుచున్న వను సంగతిని వారు గుర్తింపరైరి. దైవప్రేమ ప్రవేశింపకుండ తమ హృదయ ద్వారములను మూసినందున త్వరలో చీకటిందు నడువవలెనని వారు గుర్తింపరైరి. CChTel 126.3

    సంఘమందలి సహోదర ప్రేమ సన్నగిల్లుచున్నట్లు అపొస్తులుడగు యోహాను గుర్తించెను. ఈ విషయమును ఆయన ప్రత్యేకించి వ్రాసెను. ఒకరియందొకరు ప్రేమను కలిగియుండవలసినదిగా తమ మరణ దినము వరకు విశ్వాసులను బ్రతిమాలెను. సంఘములకు ఆయన వ్రాసిన యుత్తరములు ఈ యుద్దేశ్యమునే వ్యక్తము చేసినవి. ఆయన ఇట్లు వ్రాసియున్నాడు. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. CChTel 126.4

    మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్దులమై యున్నాము. 1 యోహాను 4. 7`11CChTel 127.1

    నేడు దైవ సంఘమందు సహోదర ప్రేమ చాలా కొరవడి యున్నది. రక్షకుని ప్రేమించుచున్నామని చెప్పుకొనువారనేకులు క్రైస్తవ సహవాసము వలన తమతో సంయుక్త పర్చబడిన వారిని ప్రేమించుటలో ఆశ్రద్ధ చూపుచున్నారు. మనమొకే విశ్వాసమునకు చెందిన వారము. ఒకే కుటుంబ సభ్యులము. ఒకే పరమ జనకకుని బిడ్డలము. అమర్త్యత్వమును గూర్చి ఒకే శుభప్రదమగు నిరీక్షణ కలవారము. మనలను సమైక్యపరచు సంబంధము ఎంత సన్నిహితముగాను, మృదువుగాను నుండవలెను. మన విశ్వాసము మన హృదయములపై పరిశుద్ధ పరచు ప్రభావమును చూపుచున్నదో లేదో యని ప్రపంచ ప్రజలు జాగ్రత్తగా కనిపెట్టుచున్నారు. మన జీవితములో ప్రతి లోపమును, మన కార్యములలోని చంచలత్వమును, వారు త్వరగా గ్రహింపగలరు. మన విశ్వాసమును నిందించుటకు వారికి ఎడమీయకుందుము గాక28T 240-242;CChTel 127.2