Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    రెండు జీవితముల సమైక్యత

    కష్టములు, క్లిష్ట సమస్యలు, అధైర్యము వచ్చినను భార్యగాని, భర్త గాని తమ వివాహము సరిjైునది కాదనికాని ఆశాభంగము కలిగించునదని కాని తలంచరాదు. ఒకరితో నొకరు శక్తి వంచనలేకుండ సహకరించవలెను. మొదటి ప్రేమను విడువకుడి జీవిత సాధక బాధకములలో ఒకరినొకరు సర్వ విధముల అండదండగా నుండుడి. అన్యోన్యానందమును పెంపొందించుకొనుటకు కృషి చేయుడి. అన్యోన్య ప్రేమ, దీర్ఘశాంతములను కలిగి యుండుడి. అప్పుడు వివాహము ప్రేమకు అంతముకాక ఆరంభమయి యుండును. యదార్ధ స్నేహము యొక్క ఆనందము`హృదయమును హృదయమును ఏకస్థము చేయు ప్రేమ`పరలోకా నందమునకు తొలి రుచి (ఛాయ) యే యున్నది. CChTel 277.2

    అందరును అభ్యాసము ద్వారా ఓర్పును అలవరచుకొనవలెను. దయగాను దీర్ఘశాంతముగాను ఉండుట ద్వారా హృదయమందు నిజమైన ప్రేమ వర్థిల్లును. అప్పుడు దేవునికి ఆనందము గొల్పు సుగుణ సంపద పెంపొందును. CChTel 277.3

    భేధాభిప్రాయము కలిగినపుడు దానిని పురస్కరించుకొని చెరువు చేయుటకు సాతానుడు సర్వదా సిద్ధముగానే యుండును. భార్యలోని లేక భర్తలోని పారంపర్య దుర్గుణములను కదిపి దేవునిముందు పవిత్ర నిబంధన ద్వారా జతపడిన దంపతుల సన్నిహిత త్వమును పోగొట్టును. సమైక్యతతో జీవింతుమని వివాహ వాగ్దానమునందు వారు ఖరారు పడిరి. తన భర్తను ప్రేమించి అతనికి విధేయత చూపెదనని భార్యయు, తన భార్యను ప్రేమించి ఆమెను హత్తుకొనెదనని భర్తయు వాగ్దానము చేసిరి. దైవ ధర్మశాస్త్రము ననుసరించినచో కలహ పిశాచి కుటుంబమునకు దూరముగా నుంచబడును. వారి ఆశలు అభిరుచులు విభిన్నములుగా నుండవు. వారి ప్రేమలకు ఎడబాటుండదు. CChTel 277.4

    తమ ఆస్తులకు, సానుభూతి, ప్రేమ కృషి`పినిని ఆత్మల రక్షణ సేవచందే మిళితము చేయుటకు మీ ఎదుట నిలిచియున్న వారి చరిత్రలో ఇదియొక ప్రాముఖ్యమైన సమయం. వివాహ సంబంధమునందు ఒక ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించబడుచున్నది. అది ఇద్దరి జీవితములను ఒకటిగా సమైక్యము చేయుట, పురుషుడును అతని భార్యయు కలిసి పరిశుద్ధతతోను సంపూర్ణతతోను ఆయన సేవను వృద్ధి చేయవలెననుట దైవ చిత్తము. వారు దీనిని చేయగలరు. CChTel 278.1

    ఇట్టి దాంపత్యమున్న గృహమునందు దైవాశీర్వాదము పరలోక సూర్యరశ్మివలె నుండును. కారణమేమనగా యేసుక్రీస్తు అదుపాజ్ఞలలోబడి ఆయన ఆత్మ నడుపుదల క్రింద స్త్రీ పురుషులు పరిశుద్ధముగా జతపర్చబడుట దైవ నిర్ణయమే. CChTel 278.2

    లోకమంతటిలో గృహము అత్యానందరముగా నుండవలెనని దేవుడు వాంచించుచున్నాడు. ఇహలోక గృహము పరలోక గృహమునకొక సూచనjైు యున్నది. గృహమునందు వివాహ బాధ్యతలను నిర్వహించుచు తమ ఆశలను ఆసక్తులను క్రీస్తుతో జతపరచి ఆయన బాహువుపైని, వాగ్దత్తముపైని ఒరిగినచో అట్టి దాంపత్యమునందు వారు దేవదూతల మెప్పును పొందు ఆనందమును అనుభవించెదరు. 1AH 101-107;CChTel 278.3